గోగుపూలు
గోగుపూలు
గోంగూర తెనుగువారి ఇష్టదైవం,ఆంధ్రమాత. గోగులో రెండు రకాలు, తెల్లగోగు దీన్నే ధనాసకూర అంటారు. రెండోది ఎర్రగోగు దీన్ని పుల్లగోగు అంటారు. గోంగూర పచ్చడిని ఇష్టపడని తెనుగువాడుండదని నా నిశ్చితాభిప్రాయం :)
ఉమ్మెత్తపూవు.
ఉమ్మెత్తలో రెండు రకాలు, తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త, రెండూ ఆయుర్వేదంలో మతిభ్రమణానికి వాడే మందుల్లో వాడతారట.
మొల్ల పూవు.
మొల్ల కవయిత్రి.
ఈ పూవు పూజకి పనికిరాదు. తలలో పెట్టుకోడానికీ పనికిరాదు. వాసనలేని పూవును తలలో ధరించకూడదంటారు, పెద్దలు.
వాసన లేని పువ్వు, బుధ వర్గము లేని పురంబు, భక్తి వి
శ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడున్, సద
భ్యాసము లేని విద్య, పరిహాసము లేని వచః ప్రసంగముల్,
గ్రాసము లేని కొల్వు, కొఱగానివి పెమ్మయ సింగధీమణీ!
గోంగూర వంటి పచ్చడి
ReplyDeleteవెన్నపూస వంటి నంజుడుయున్
కాచిన నెయ్యియు
ఉల్లిపాయ వంటి కొరుకుడును గలదే।।
ఎలా ఉంది గోంగూర ప్రశస్తి 😎?
(ఛందస్సు గురించి నాకు తెలియదు)
విన్నకోటవారూ, ఓం ప్రథమంగా మీరు ఏకపాదకవివరేణ్యులుగా అవతరించారు. మీ రచనలో మొదటిపాదం చక్కగా కందపద్యంలో మొదటిపాదంగా సరిపోతోంది. పద్యం మాటెలా ఉన్నా గోంగూరప్రశస్తిని నాలుగుపాదాలా చక్కగా చెప్పారు.
Deleteమీ రొక పాదం చెప్పారు. మిగిలిన మూడు పాదాలూ కలిపి కందం ఇదిగో:
Deleteకం. బంగారు వంటి లోహము
శృంగారము వంటి రసము జిహ్వాగ్రమునన్
గోంగూర వంటి పచ్చడి
సంగీతము వంటి హాయి జగతిని గలవే
🙂🙂 ధన్యవాదాలు, శ్యామలరావు గారు 🙏.
Deleteమీరు కట్టిన పద్యం సొగసుగా ఉంది 👏.
విన్నకోట నరసింహా రావు9 October 2023 at 15:30
Deleteపద్యం బాగుందండి. పేరడీ పజ్జంలా ఉంది :) పేరడీ పజ్జాలకి గణాలూ,యతులూ,ప్రాసలూ ఉండవుటండి. :)
వంకాయవంటి కూరయు
పంకజముఖి సీతవంటి భార్యా/భామామణియున్
శంకరునివంటి దైవము
లంకాధిపు వైరివంటి రాజును గలడే?
దీనికి పేరడీ అనిపించెగా! ఏమనుకోవద్దూ! :)
గోంగూర పచ్చడి అందునా పుల్లగోగు పచ్చడి,వెల్లుల్లితో,నువ్వులనూనెతో వాయి కలుపు, నంజుడు ఉల్లిగడ్డ,వెన్నముద్ద,పేరున నెయ్యి. ఇకజెప్పేరా! స్వర్గానికి బెత్తెడే ఎడం :)
ఇప్పుడు పుల్లగోగు పచ్చడి,వెల్లుల్లితో, నువ్వులనూనె మిల్లిగరిటుడు, ఉల్లిగడ్డతో సరి. వెన్నముద్ద,పేరిన నెయ్యి నిషిద్దంగా :)
శ్యామలీయం9 October 2023 at 19:46
Deleteశ్యామలీయం9 October 2023 at 20:20
కందం అందంగా ఉందండీ :)
గణాలూ, య్తులు,ప్రాసలు అంటే మతిపోయె నాకు. ఎప్పుడూ ఎక్కలేదు, బుర్రకి.
// “ దీనికి పేరడీ అనిపించెగా! ఏమనుకోవద్దూ! :)” //
Deleteశర్మ గారు,
ఏమీ అనుకునే ఆస్కారమే లేదు. ఎందుకంటే ఆ “వంకాయ వంటి …” పద్యమే నా కుప్పిగంతుల ప్రయత్నానికి స్ఫూర్తి, సందేహమే లేదు. 🙂🙏
పెమ్మయ సింగ ధీమణి పద్యం అక్షరసత్యం 🙏.
ReplyDeleteజక్కన కవి వ్రాసాడని చెప్పే మరి కొన్ని పెమ్మయ పద్యాలను ఈ క్రింది లింకులోని బ్లాగు పోస్ట్ లో (ఏ.వి.రమణరాజు గారి “సాహితీ నందనం”) చూడవచ్చు. 👇👇
https://sahitinandanam.blogspot.com/2016/08/blog-post_15.html?m=1
విన్నకోట నరసింహా రావు9 October 2023 at 15:37
Deleteఈ శతకం దొరుకుతుందేమో చూడాలండి
లింక్ కి ధన్యవాదాలు
నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊరు పేరుపాలెం లో ఎర్ర గోంగూర పూల పచ్చడి తిన్నట్లు గుర్తు.
ReplyDeletebonagiri9 October 2023 at 20:49
Deleteఎర్రగోంగూర దీన్నే ఒక్కోచోట ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. పుల్లకూర,పుంటి కూర అని కూడా అంటుంటారు. గోగు డిప్పలని కుప్పలుగా పోసి అమ్మ్తారు. ఇవి గోగుపూల నుంచి వచ్చే కాయలపై ఉండే డిప్పలు. పచ్చడి చేసుకుంటే బలే మజాగా ఉంటుంది. గోంగూర పచ్చడిదేం మహభాగ్యం చెప్పండి. వచ్చెయ్యండో సారి, చాలా సార్లు చెప్పకుండా వచ్చేస్తా అన్నారు, ఊరించారంతే! గోంగూర పచ్చడి,వెల్లుల్లితో చేసినది,కారం ఎక్కువుంటుంది, నూనె, వెన్నముద్ద, పేరిన నెయ్యి రెడీ :)
Tempting …. కానీ వెల్లుల్లి కలపని గోంగూర పచ్చడి కూడా వేరే ఓ చిన్న జాడీలో ఉందంటే చెప్పండి, నేనూ వచ్చేస్తా. 😜
Deleteవిన్నకోట నరసింహా రావు10 October 2023 at 09:57
Deleteరండి! రండి!! రండి!!! దయచేయండి.
తమరిరాక మాకెంతో సంతోషం సుమండి!
చాలాకాలంనుంచి మీదగ్గర పెండింగులో ఉండిపోయినదేనండి మా ఆహ్వానం! ఇదే మళ్ళీ ఆహ్వానం.
గోంగూర నిలవపచ్చడి ఉండదండి. ఎప్పటికప్పుడు వారానికోసారి చేస్తుంటుంది, అమ్మ (చిన్నకోడలు)! ప్రతిసారి వెల్లుల్లి వెయ్యదు, అసలే గోంగూర వేడి అంటుంది. ఇక వెన్న,పేరిన నెయ్యి తాజాగానే ఉంటాయి. బళ్ళారి ఉల్లిపాయలుంటాయి, సీజనైతే చిన్న ఉల్లిపాయలుంటాయి (చిన్న ఉల్లి అంటే దేశవాళీ ఉల్లిపాయ. దీన్నే గొల్లప్రోలు ఉల్లి పాయ అంటాం.) కొరికితే కళ్ళనీళ్ళు ఖాయం, కారమెక్కువలెండి. మాకలవాటే.గొల్లప్రోలుదే మరోటి పచ్చమిర్చి (ఎల్లో) పచ్చావకాయని పెడతారు గోజిలలో కమ్మహా ఉంటుంది. అబ్బో! రుచి చెప్పేరా! తరవాణీ అన్నంలో పచ్చావకాయ కలిపి నువ్వులనూని వేసుకుని, ఉప్పూ, వాము కలిపి ముద్దచేస్తే ఇకజెప్పేరా ఆ రుచి బలం...అమృతమే... పుల్లపుల్లగా,కారంకారంగా ఒక్కో ముద్ద తింటుంటే....కృష్ణుడు మాగాయి ముక్కలు వేళ్ళ మధ్య ఉంచుకుని చల్దులారగించనంత వైభవం కదండీ.. :)
అంతా గతకాలపు వైభవమేకదండీ :)
విన్నకోట గారు, పోదాం పదండి.
Delete👍🙂
Deleteఆహ్వానానికి థాంక్స్, శర్మ గారు 🙏.
ReplyDeleteమీరు గతంలోనే ఆహ్వానించినా నేనే బద్ధకస్తూ ఉన్నాను లెండి ప్రయాణాలు చేసే ఓపిక తగ్గడం మూలాన.
అవునవును, మరచితిని గోంగూర పచ్చడి ఎప్పటికప్పుడు చేసుకుంటారు కదా. వంటింటితో పరిచయం తక్కువ వల్ల కొన్ని కొన్ని విషయాలు అంత వెంటనే గుర్తుకు రావు 😒🙂.
గొల్లప్రోలు ఫేమస్ పచ్చావకాయ పరిచయమే.
మా పెదనాన్న గారి కూతురు పిఠాపురంలో ఉంటుంది. ప్రతేడూ తను పెట్టి పంపిస్తుంటుంది. నిజంగా మహత్తరమైన ఊరగాయ 👌.
గోంగూర నిలువపచ్చడి ఉంటుందండీ. గుంటూరు వారి స్పెషాలిటీ అది.
ReplyDeleteశ్యామలీయం10 October 2023 at 21:11
Deleteగోంగూర నిలవపచ్చడి పెట్టడం గోజిలలో అలవాటు లేదండి. :)