Thursday 9 May 2024

ఒక రోజు పెళ్ళికి మొహమంతా కాటుక

 ఒక రోజు పెళ్ళికి మొహమంతా కాటుక


పెళ్ళి ఐదురోజులు నుంచి సమయం తగ్గి మూడు రోజులు,ఒకరోజుకు తగ్గిన కాలం. ఒక పెళ్ళి జరుగుతోంది. బ్రహ్మగారు అగ్నిహోత్రం దగ్గర దంపతుల్ని కూచో బెట్టి హోమం చేయిస్తున్నారు. పొగ కమ్ముతోంది.పెళ్ళి కూతురుకి పొగ బాధగా ఉంది. కళ్ళ నీళ్ళొస్తున్నాయి. కొంగునగాని గుడ్డతోగాని తుడుచుకోలేదు,కారణం పెళ్ళి కూతురు ఏడుస్తోంది,పెళ్ళి ఇష్టం లేదేమో అని గుసగుసలు రావచ్చు. అందుకు కళ్ళు నులుపుకోడం చేస్తూ వచ్చింది. కళ్ళకి కొంచం దండిగానే కాటుక పెట్టడం తో అదికాస్తా మొహాన అలుముకుపోయింది. అందమైన పెళ్ళికూతురు మొహం భయంకరంగా మారింది.అందం కోసం కాటుక పెట్టుకుంటే అదికాస్తా భయంకరంగా మారినట్టు. అదుగో అలాపుట్టిందీ నానుడి. 


ఇప్పుడిదెందుకూ! శంక. ఎండ మలమల మాడబెడుతోంది ఇరవైరోజుల్నించి. చల్లబడితే బాగుణ్ణు అన్నది కోరిక. మొన్న మంగళవారం మధ్యాహ్నం పన్నెండు ఎండ దంచుతోంది, అప్పుడు గాలేసింది, కరంటుపోయింది,మబ్బేసింది,చినుకులు,పెరిగాయి. వర్షం నిలిచి మూడు గంటలు కురిసింది. కరంటు రాలేదు. చల్లబడిందనుకున్నాం కాదు పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడినట్టనిపించింది. ఇప్పటిదాకా లోపల చల్లగా బయట వేడిగా ఉందేది ఇప్పుడు బయటలోపలా కూడా వేడి,ఉక్కపోత దంచుతున్నాయి. ఇదేమని ఆలోచిస్తే చుట్టూ ఉన్న కాంక్రీట్ జంగిల్ నుంచి విడుదలైన వేడి, ఇంటి గోడలు వేడెక్కి ఉన్నవి నీరు పడటంతో వేడి లోపలికి వదలితే పొయ్యిలో ఉన్నట్టే, కుమ్ములో పెట్టన చిలకడదుంపయింది మా పని. అప్పటి నుంచీ బేటరీ మీదనే ఫేన్లు తిరుగుతూనే ఉన్నాయి. కరంటెప్పుడొస్తుందంటే ఆరు గంటల కిస్తామన్నారు. వాళ్ళేం అవస్థపడుతున్నరో అనుకుని మరి అడగ లేదు. (మొన్ననోరోజు సబ్ స్టేషన్ లో ట్రాన్స్ఫార్మర్లు వేడెక్కిపోతే, కాలిపోకుండేందుకుగాను, కరంటు గంట సేపు ఆపి, ఫైర్ ఇంజన్లతో వాటిపై వర్షం కురిపించి, మళ్ళీ కరంటిచ్చారు) మెతుకులు కతికా, బెడ్ మీద పడుకోలేను,వేడి. కింద పడుకుంటే అలవాటు లేదు. ఇలా అవస్థపడి మడతమంచమేసుకుని పడుకుని,కూచుని బాధ పడితే ఒంటిగంటకి కరంటొచ్చిపోయింది. అసలు ఊపిరొచ్చింది గనక బతికే సావకాశం ఉందని సంతసించి ఎదురుచూస్తే రెండు గంటలకి కరంటు స్థిరంగా నిలబడితే ఎ.సి వేసుకు పడుకుంటే నాలుగుకే అలవాటుగా మెలుకువ వచ్చేసింది.

వర్షం పడితే చల్లబడుతుందనుకుంటే ఒకరోజుపెళ్ళికి మొహమంతా కాటుక సామెతయింది. 


8 comments:

  1. ఆసాములు మరీ సొగసు బడినట్టున్నారు :)
    కరెంటు లేకుంటే కాలు కదిలేటట్టులేనట్టుంది :)


    ReplyDelete
    Replies
    1. ఎక్కడో చల్లగా కూర్చుని మాట్లాడడం కాదు.
      మా కోస్తాంధ్రాకు వచ్చి మాట్లాడండి. గాడుపులు, ఉక్కపోతలు, చెమట వరదలు, కరెంటు కోతలు …. అబ్బో not a single dull moment.

      Delete
    2. అబ్బో అబ్బో యేమి‌ ఉక్కయో
      మాంఛి వర్షం‌ వచ్చిందిగా ఇంకేమి మీకు కొరవండీ ?
      ఎప్పుడూ హయ్యో కుర్రో మొర్రో అంటూ కూకుంటే గెట్లా ?

      Delete
    3. I think you shall install solar panel and have continued power supply and enjoy the AC.

      Delete
    4. Zilebi9 May 2024 at 17:15
      దక్షిణ భారత దేశీయులంతా ఆఫ్రికన్లలాన్ ఉంటారని తమలాటి మేధావుల ఉవాచ. మమ్మల్ని మరీ సుకుమారపడకండని తమమాటనుకుంటా! తమలాటి మేధావులంతా ఈ దేశంలో పుట్టి ఈ గ్రామాల్లో చెరువుల్లో పిత్తపరిగిలు పట్టుకున్న జనాభా కాదూ! విదేశంలో ఉండేటప్పటికి తమకళ్ళకి పొరలు కమ్ముతున్నాయా! జాగర్త, కళ్ళు.

      Delete

    5. విన్నకోట నరసింహా రావు9 May 2024 at 18:59
      రోజులో గరిష్టం ముఫైమూడు ఉండి సాయంత్రానికి రోజు జల్లులు పడే చోట చల్లగా ఉండదేమి సార్! బెంగలూరులో తాగు నీటికరువు,మా పల్లెటూరోళ్ళు ముడ్డి కడుక్కోడానికి నీళ్ళు లేవంటుంటారు, వీరు గుద ప్రక్షళనా,ముఖప్రక్షాళనా చేయరనుకుంటా. హైదరబాద్ లో 47 వేడి ఇలాటి మేధావుల చలవేకదు సార్!

      Delete
  2. Zilebi9 May 2024 at 19:21
    అందుకే ఒకరోజు పెళ్ళికి ముఖమంతా కాటుకన్న నానుడి చెప్పింది, అర్ధం కాలా? :)

    ReplyDelete
  3. Rajesh10 May 2024 at 07:50

    Rajesh.
    Very good idea. I am using solar since 2013.
    Co-incidentally my solar engineer is also Rajesh, who installed the solar system,which is working well. He changed the battery in advance, recently, to face the eventualities like this.
    I have three AC units, Studied the project and found that it is more than my capacity, hence dropped the idea.
    Thank you.

    ReplyDelete