కొంతమంది నవ్వితే.....
కొంతమంది నవ్వితే అందం, కొంతమంది నవ్వకుంటేనే అందం,కొంతమంది మూతి ముడిస్తే అందం.కొంతమంది ఏడ్చినా అందమే. ముద్దు పళని నాయిక ముద్దు ముద్దుగా ఏడిస్తే పెద్దనగారి నాయిక బావురుమని ఏడిచిందట, అదీ అందమేనట. కొంతమంది మాటాడితే అందం,కొంతమంది మాటాడకుంటే అందం, కొంతమందితో మాటాడక ఉండడమే అందం. కొంతమంది ఏం చేసినా అందమేట. హసితం మథురం, వదనం మథురం,గమనం మథురం, వచనం మథురం, మథురాధిపతేరఖిలం మథురం అన్నారు ఇంక ప్రత్యేకంగా చెప్పలేను, ఎన్నని చెప్పనని. ఏడ్చే మగాడిని మాటకి ముందు నవ్వేఆడదాన్ని నమ్మొద్దన్నారు పెద్దలు. కొంతమంది నవ్వితే ఏడ్చినట్టుంటుంది.
కొంతమంది మాటాడితే అందం, కొంతమందితో మాటాడితే అందం, కొంతమందితో మాటాడకుంటేనే అందం, ఇది మరో సారీ చెప్పిన మాట. కొంతమందిని తలుచుకుంటేనే అందం, కొంతమందిని తలుచుకోకుంటేనే అందం, ఆనందం .
కొంత మంది మాటాడితే తిట్టినట్టుండే అందం, కొంతమంది మాటాడుతూ తిట్టినా అందమే!అరటాకెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లెళ్ళి అరటాకు మీద పడ్డా, చిరిగేది అరటాకే, అలాగే, అందమొచ్చి మీద పడ్డా, మనమెళ్ళి అందం మీద పడ్డా, కలిగేది ఆనందమన్నాడో కుర్రకవి. అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం అన్నారో పూర్వకాలపు సినీకవి.
ఏంటో వింత లోకంకదా!
విష్ణుమాయ!!!
కొందరు వచ్చి ఆనంద పెడతారు, కొందరు వెళ్ళి ఆనంద పెడతారు, అందరూ ఆనంద పెట్టేవారే …. అన్నారు ముళ్ళపూడి వెంకట రమణ గారు. 🙏🙂
ReplyDeleteవిన్నకోట నరసింహా రావు20 May 2024 at 13:22
Deleteఅంతే కదు సార్! చిన్నమ్మ లోపలికొస్తుంటే ఆనందం,పెద్దమ్మ బయటికి వెళుతుంటే ఆనందం
శర్మ గారు టపావేస్తే ఆందం.
ReplyDeleteదానిని విజ్ఞులు చదివితే ఆనందం.
ఆనందించిన వారు మెచ్చి పలికితే మహానందం.
కొందరు అనవసర ప్రసంగాలతో ఆపేజీని ఖరాబు చేయకపోతే బ్రహ్మానందం. ఆపుడు ఆపేజీకి మరింత అందం.
శ్యామలీయం21 May 2024 at 19:13
Deleteఆనందం,సదానందం,చిదానందం,మహదానందం,బ్రహ్మానందం.
ఆనందం,సదానందం,చిదానందం,మహదానందం,బ్రహ్మానందం.
ఆనందం అర్ణవమైతే
అనురాగం అంబరమైతే
ఆనందపు లోతులు చూద్దాం
అనురాగపుటంచులు చూద్దాం
ఆనందం.
పాతకాలపు సినీకవి మాట.
కొందరు టపా వేస్తే
ReplyDeleteదానికి కొందరు కామెంటు వేస్తే సూరేకారం :)
Zilebi22 May 2024 at 01:06
Deleteనెంబుకున్న మతాబు.
దిష్టి చుక్క.