Wednesday 22 May 2024

దిష్టిచుక్క.

 


దిష్టిచుక్క. 


అంతా ఆనందం కోసమే వెతుకుతారు. ఎక్కడుందీ?

మనిషికి ఐదు జ్ఞానేంద్రియలు,ఐదు కర్మేంద్రియాలు, మనసు, ఇదొక గుత్తి. దీనినే మనోమయకోశం అంటారు. సామాన్యులు ఈ గుత్తి దాటిపోలేరు. ఆనందం వెతుకుతూ ఉంటారు. ఎఖ్ఖడా కనపడదు. ఆనందో బ్రహ్మా అంటే ఆనందమే పరమాత్మ, అదే తురీయావస్థ.  మనోమయకోశం లో, మనసు అధికారి, ఇంద్రియాల ద్వారా అనందం పొదాలని చూస్తుంటాడు. కొందరు చూపుద్వార, కొందరు నోటిద్వారా,కొందరు చెవి ద్వారా, కొందరు నాలుక ద్వారా, మరికొందరు స్పర్శ, ఆలింగనం ద్వారా ఇంద్రియ సుఖం పొంది, ఆనందం పొదాలని తాపత్రయ పడతారు. ఇదే ఇదే బ్రహ్మానందమనుకుంటారు.


ఎక్కడుంది ఆనందం అనే పరబ్రహ్మ (అదే దేవుడు)? అందంలోనే ఉంది ఆనందమన్నారు,చిరకాలంగా. అందమైన ఆడపిల్లని (ఆడవారిదే అందం అని అప్రాచ్యులు దాన్ని పరాయత్తం చేసేసేరు. ఇది మగవారి సొత్తు) అందంగా అలంకరించి,  చివరగా బుగ్గన పెట్టేదే దిష్టిచుక్క. పరమాత్మ ఎక్కడా అని వెతికే, హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే! అని చెప్పేడు. చూసే కన్ను కావాలోయ్!! అన్నాడు.


చూస్తే! పరికిస్తే!! పరిశీలిస్తే!!! అందమైన, అలంకరింపబడ్డ, ఆడపిల్ల మొహంలోని దిష్టి చుక్కలో లేడూ పరబ్రహ్మ? 


అన్నమయ కోశం,ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ మనోమయ కోశం మధ్యలోది. ఇది దాటి ఆనందమయ కోశంలో అడుగిడితే! ఆనందమే ఆనందం, అదే పరబ్రహ్మ!!!!!!!  


4 comments:

  1. చూస్తుంటే శర్మ గారు దీక్షగా సౌందర్యోపాసన చేస్తున్నట్లున్నారే 🙂?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు22 May 2024 at 11:09
      ఉపాసనా మార్గాల్లో సౌందర్యారధన కూడా ఒకటంటున్నారు,ఆధునికులు. అదేదో చూద్దామన్నా ఓపిక లేదండి. :)
      ఇందులో చిక్కుకుంటే, ఇది ఒక విషవలయం.... :)

      Delete
  2. ఈ మనోమయ కోశం మధ్యలోది. ఇది దాటి ఆనందమయ కోశంలో అడుగిడితే....


    వెళ్లొచ్చేరా లేకుంటే పొత్తాల మేతా ?


    ReplyDelete
    Replies
    1. Zilebi22 May 2024 at 11:36
      పొత్తాల రాతకీ
      పొత్తాల అత్తాల మేతకీ
      నేను మేధావిని కాదు
      నీలా ప్రొఫెసర్నీ కాదు. :)

      ఈ కోశం దాకా అందరూ చెప్పేస్తారు. ఇక పైనంతా ముళ్ళదారి,డొంకదారి. దారీ తెన్నూ కనపడదు. ఈ తరవాతదే విజ్ఞానమయ కోశం. అదేమో అర్ధం కానిదే విజ్ఞానం. అంతా ట,ట చెప్పేవాళ్ళే నీలా. నరకం స్వర్గం చూసొచ్చి చెప్పినవాళ్ళు లేరు. అలాగే ఇదిన్నీ

      Delete