Monday 13 May 2024

వోటేసేను.

 వోటేసేను.



 ఈ వేళ పొద్దుటే బూత్ దగ్గరకెళితే లైన్ లో నిలబడమన్నాడు పోలీసు, కర్చుకిచ్చేసేను, ఎనభై ఏళ్ళు దాటినవాడిని లైన్ లో నిలబడక్కరలేదు, తెలియకపోతే తెలుసుకో అంటూ, లోపలకెళ్ళిపోయా, వోటేసేను. 


మొదటిసారి వోటెప్పుడేసేనని ఆలోచిస్తే 67 లో వేసేను. 62 లోనే ఉద్యోగంలో చేరినా అప్పటికి ఇంకా 21 పూర్తికాలేదు కనక, ఒక చోట ఉండకపోవడం కారణాలు.  ఆరోజుల్లో మాకు వోటెయ్యడానికి గంట సమయం ఇచ్చేవారు, శలవు లేనే లేదు, దానికి ప్రతిఫలమూ లేదు, అందరికి శలవున్నా. ఆ తరవాత ఎన్ని సార్లు వేసేను,గుర్తులేదు. వోటెయ్యడం ఇదే ఆఖరు సారి కావచ్చు.


వోటేసిన తరవాత అబ్బాయి అక్కడ తెలిసినవారి ఇంటి దగ్గర కూచోబెట్టేడు, తను వోటేసొస్తాను, అప్పటి దాకా కూచోమని. ఈ లోగా ఒక నాలాటి ఆవిడే వచ్చింది, వేటేసేరా? అంటూ. వేలు చూపించా, ఎవరికేసేరంది, చెప్పేను, మీరెవరికేసేరన్నా? కమ్మోరమ్మాయికి రెడ్డోరబ్బాయికి ఓటేసా అంది. ఇద్దరూ  రెడ్డోరబ్బాయి లేగా అడిగా! అది సీక్రెట్టూ అని క్రాస్ వోటింగ్ జరుగుతుందని నవ్వేసింది, ఈలోగా మరోకరు మాలాటివాడే వస్తూ వోటేసేరా అని అడిగి, కరువొచ్చేలా ఉందండీ అన్నారు నర్మగర్భంగా. మొదటి కరువుకే చచ్చిపోలేదు, వచ్చే కరువులు మనల్ని ఏం చేస్తాయి లెద్దురూ, వయసైపోయినవాళ్ళం, చచ్చిపోతే గొడవేలేదందావిడ. ఈలోగా అబ్బాయొచ్చేడు, నేనొచ్చేసా!

28 comments:

  1. పౌరుడిగా మీ బాధ్యత నిర్వర్తించారన్నమాట, సెహబాసు 🙏.
    నేనూ వేశాలెండి 😎.

    ఏమిటో, పైన మీ ఆఖరి పేరా మాత్రం మాకు “నర్మగర్భంగానే” ఉంది 🤔.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు13 May 2024 at 11:45
      ఉద్యోగం లో ఉన్నపుడు గంట టైమ్ లో వోటెక్కడేసేమండి? లేదనే చెప్పచ్చు. రిటయిర్ అయ్యాకా మాత్రం అశ్రద్ధ ఎప్పుడూ చెయ్యలేదు. ఎండ మెండుగా ఉంది ఆలోచించుకోండన్నారు పిల్లలు, తట్టుకోలేనని. ఇంటి దగ్గరే వోటెయ్యడానికి వయసు బోర్డర్ లో ఉండిపోయిందండి :) అందుకు వెళ్ళక తప్పలేదు. ఇదే ఆఖరుసారి కావచ్చని ఉదయమే బయలుదేరాను, అశ్రద్ధ చేయక. పదిహేను నిమిషాల్లో వోటేసి తిరిగొచ్చేసేను. మీరు యువకులు కదా:)

      గోజిలవాళ్ళ సంభాషణలు ఇలాగే ఉంటాయండి. ఇష్టపడితే అందంగా ఉంటాయి. కమ్మోరమ్మాయంటే పురందరేశ్వరి అంటే బి.జె.పి కి పార్లమెంటుకి వోటేసిందనమాట. రెడ్డోరబ్బాయంటే, అసెంబ్లీకి జగన్ పార్టీ అభ్యర్థి,బి.జెపి అభ్యర్థి ఇద్దరూ రెడ్లే! అందులో ఎవరికేసినట్టూ అన్నది నా ప్రశ్న. దానికి అది సీక్రెట్ అని క్రాస్ వోటింగ్ జరుతుందంటే జగన్ అభ్యర్థికి వోటేసిందనమాట.

      ఆ తరవాత సంభాషణలో పాల్గొన్నవారు, ఎండ అప్పుడే చురచురమంటూ తెర తీస్తోంది. ఆయన వస్తూనే దానిగురించి ప్రస్తావిస్తున్నట్టు కరువొచ్చేలా ఉందన్నారు. అంటే ఎండలు మెండుగా ఉంటే కరువొస్తుందని మావాళ్ళ మాట.బాబొచ్చిన ప్రతిసారి కరువొస్తుందనీ మా వాళ్ళ నమ్మకం. ఆయన తెలుగు దేశం అభిమాని. ఇదండీ ఆ నర్మగర్భం.

      Delete
    2. thanks sharma gaaru, explain chesinanduku.

      Delete
    3. అదా చిదంబరం 🙂? థాంక్యూ శర్మ గారు. పాపం వర్షాభావానికీ చంద్రబాబు గారికీ ఏదో తెలియని సంబంధం.

      Delete
    4. మా బాబు గారి హయాంలో టాపుల్లేచి పోయేటట్లు కోస్తాలో వర్షాలు పడేయే తాతగారి టపా కూడా వుందనుకుంటా ఈ సందర్భంగా :)

      Delete


    5. Rajesh14 May 2024 at 18:24
      ధన్యవాదాలు

      Delete

    6. విన్నకోట నరసింహా రావు14 May 2024 at 21:35
      గోజిల వాళ్ళకిది అలవాటేనండి. ఏమో చెప్పలేనండి ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటూ ఉంటారిలా కరువు గురించి.

      Delete
    7. Zilebi15 May 2024 at 04:10
      ఎండలు కాస్తే మొక్క మొలవక కరువొస్తుంది,ఎంత కాలవ నీరు పెట్టినా! వర్షమెక్కువపడి వరదొస్తే పండినది కొట్టుకుపోయి కరువొస్తుంది. అతి పనికిరాదు, వర్షాలెక్కువ పడ్డాయని చంకలు గుద్దుకోకు, వరదలో కొట్టుకు పోతావ్.

      Delete
  2. అవునూ, మీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు జమిలిగా జరుగుతున్నాయి కదా (అయిద్రాబాదులో ఇప్పుడు జరుగుతున్నవి లోక్ సభ ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆరు నెలల క్రితమే జరిగాయి) ?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు13 May 2024 at 11:52
      మావీ విడి ఎన్నికలేనండి కాని మధ్యలో జమిలిలో చేరినాయి.

      Delete
  3. ఇలాగ పార్లమెంటుకు, అసెంబ్లీకూ ఒకేసారి ఎన్నుకోవాల్సినప్పుడు పోలింగ్ బూత్ లో ఏర్పాటు ఎలా ఉంటుందండి?
    ఒకే రూములో పక్కపక్కన రెండు వేర్వేరు ఓటింగ్ కంపార్ట్మెంట్లు పెడతారా?
    ఒక దాంట్లో ఓటు నొక్కిన తరువాత రెండో కంపార్ట్మెంట్ కు వెళ్ళి అక్కడ కూడా ఓటు నొక్కాలా ఓటరు?
    సిరా రెండు వేళ్ళకు పూస్తారా?
    వివరించ మనవి.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు13 May 2024 at 12:51
      ఒక హాల్ ని తీసుకుంటారు. దానికి రెండు ద్వారాలుండాలి. పొడుగు వెడల్పులెక్కువుండాలి.
      బూత్ లోకి వెళ్ళగానే ఎడమ వైపు గోడకి వరసగా నలగురైదుగురుంటారు. వాళ్ళు ఒకరు వోటర్ స్లిప్ చూసి తమ మేట్రిక్స్ లో గుర్తుపెట్టుకుంటారు. ఆ తరవాత వారు వోటరి ఐ.డి చూసి ఓటర్ లిస్టులో చూస్తారు. ఆతరవాత వారు వేలు మీద మార్క్ పెడతారు,సంతకం వేలిముద్రో తీసుకుని. ఆ తరవాత కుడికి తిరిగితే వరసగా పోలింగ్ ఏజంట్లు గుర్తు పడుతూనే ఉంటారు. ఆతరవాత వారు రెండు స్లిప్పులిస్తారు ఒకటి పార్లమెంటుకూ,మరొకటి అసెంబ్లీకి. ఆ పక్కనే అసిస్టెంటు ప్రిసైడింగ్ ఆఫీసర్ కంట్రోల్ యూనిట్ తో ఉంటారు. మన దగ్గర స్లిప్ తీసుకుని బూత్ లోకి పంపుతారు. అక్కడ మనంఓటేసేకా వెనక్కి రావాలి. మరోదారుండదు. అప్పుడు ముందుకు కదిలితే అక్కడో అసిస్టేంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కంట్రో యూనిట్ తో ఉంటారు. మన దగ్గర స్లిప్ తీసుకుని బూత్ లోకి పంపుతారు. వోటేసిన తరవాత వెనక్కోస్తే బయటకి పోయే మార్గం. ఇక ప్రిసైడింగ్ ఆఫీసరు మనం లోపలికి వెళ్ళేద్వారం కి కుడి పక్క ఉంటారు. ఇది అన్ని పోలింగ్ స్టేషన్లకి కామన్. రెండు వేళ్ళకి మార్క్ పెట్టరు. మార్క కూడా ఎడమ చేతి చూపుడు వేలుకే పెడతారు. ఇది అందరికి అలవాటైపోయింది, కొత్తకాదు. అంతా ఎడమ చేయి చాపడం బాగా లవాటయిందండి. ఇదంతా మీకు తెలియనిదా? నాతో చెప్పించడం కాకపోతే :) మనం వోటేసిన తరవాత పక్కనే ఉన్న దానిలో మనం ఎవరికి ఓటేసేమో కనపడుతూనే ఉంటుంది.

      Delete
    2. చాలా వివరంగా చెప్పారు. అలనాటి రేడియో క్రికెట్ కామెంటరీ లాగా కళ్ళకు కట్టినట్లు వర్ణించారు 🙂. థాంక్యూ 🙏.

      ఓటేసిన ప్రతివాడికీ వచ్చే అనుభవమే అనుకోండి. మీకు అనవసర శ్రమ ఇచ్చినట్లున్నాను.

      నేను ప్రత్యేకించి తెలుసుకోవాలని అడిగినది జమిలి ఎన్నికల్లో ఓటింగ్ విధానం ఎలా ఉంటుందని. రెండు EVM లనూ (MP, MLA) ఒకే కంపార్ట్మెంట్లో ఉంచుతారా లేక వేర్వేరు కంపార్ట్మెంట్లా అని. వేరే వేరే అని ఇప్పుడు మీ వివరణ బట్టి తెలిసింది.

      రెండింటికీ ఓటు వేశాడు అని గుర్తుగా రెండు వేళ్ళకి (అదే ఎడమచేతికే లెండి 🙂) సిరా మార్కు పెడతారా అనీ. ఎందుకంటే ఓటరు MP కు ఓటు వేసి / నొక్కి, MLA కు ఓటులో నేను పాల్గొన దలుచుకోలేదు, ఇంక బయటకు వెళ్ళిపోతాను అంటే వెళ్ళనిస్తారా, ఒకవేళ వెళ్ళనిస్తే మరి సదరు ఓటరు ఒక ఎన్నికలోనే పాల్గొన్నాడు అని ఎలా తెలుస్తుంది (అందుకని రెండు చుక్కలయితే బాగుంటుంది కదా అని నా అభిప్రాయం) ??

      చొప్పదంటు ప్రశ్నల్లా ఉన్నాయంటారా 😟?

      (ఆన్ లైన్ అవకముందు ఎన్నిసార్లు అప్లై చేసినా ఓటరు ఐడి కార్డ్ రాకపోవడం వల్ల / ఓటరు లిస్ట్ లో పేరు ఎక్కకపోవడం వల్ల నేనెప్పుడూ జమిలి ఎన్నికల్లో పాల్గొనలేదు లెండి 😒. కాబట్టి కలిగిన సందేహాలు.)

      Delete
    3. హాశ్చర్యంగా వుంది వినరా వారి వివరణ!
      మా శేషన్ గారు బడుద్దాయిలూ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ పదండర్రా పోలింగ్ డ్యూటీలకని మెడపట్టి తరిమినప్పుడు వినరా వారు ఎలచ్చను డ్యూటీ తప్పించుకునే సారా ?


      Delete
    4. శేషన్ గారి విజృంభణ కాలంలో కాస్త సీనియర్ ఆఫీసర్లకు ఎలచ్చన్ డ్యూటీ వేసేవారు కాదు లెండి.

      Delete
    5. విన్నకోట నరసింహా రావు14 May 2024 at 21:30
      క్రికెట్ కామెంట్రీతో పోల్చేసేరు, ధన్యవాదాలు.

      వోటర్ అవునాకాదా ఆ బూత్ లో అన్నది మొదటి పరిశీలన. ఆ తరవాతది వ్యక్తి పరిశీలన. ఆత్రవాత చుక్క కాదు ఇప్పుడు గీత చూపుడు వేలుకే ఎందుకూ? ఇదివరలో చుక్క పెట్టేవారు దానిని చెరిపేసి నానా రచ్చాఅ చేసి మళ్ళీ వోటేసేందుకు తయారయ్యే ఘనులూ ఉండేవారు, అందుకు దాన్ని గీత చేసేరు, ఇక ఒక వేలుకే ఎందుకూ? రీపోలిగ్ అవసరమైతే మరో వేలుకి గుతు పెడతారు. ఇప్పుడు ఎడమచేతి చూపుడు వేలుకే పెట్టాలని రూలు,మరెక్కడా పెట్టరు.

      పౌర ధర్మంగా, ఎన్నికలు జరుతుంటే అసెంబ్లీ,పార్లమెంటుకి, ఇద్దరికి ఓటెయ్యాలి. నేను ఒకరికి వెయ్యను అని చెప్పడానికే నోటా మీట ఉంది, అదీ ఉపయోగించనంటే మీ ఇష్టం కాదని బలవంతం చెయ్యరు, మీకిచ్చిన స్లిప్ కేన్సిల్ చేసారు, అంతే. రెండు వేళ్ళకి గాని రెండు చుక్కలుగాని పెట్టరు. అదే రూల్.

      Delete
    6. విన్నకోట నరసింహా రావు15 May 2024 at 06:12

      మా క్లెరికల్ స్టాఫ్ ని తీసుకున్నారుగాని మమ్మల్ని రమ్మన లేదు,ఎప్పుడూ. పిలిస్తే వెళ్ళాలని అనుకున్నా,కుదరలేదు. ఇంజినీరింగ్ వాళ్ళకి మన్నా చెప్పేసేరు మా డిపార్ట్ మెంటువాళ్ళే.

      Delete

    7. Zilebi15 May 2024 at 04:01
      నువ్వు దేశంలోకే రాలేదు,ఓటూ వెయ్యలేదు. వేసేనంటే ఎక్కడేసేవు? ఎప్పుడేసేవు? ఏ వూళ్ళో? ఏ బూత్ లో చెప్పు. విదేశంలో కూచుని మేము ఏం చేయాలో,ఎలాచెయ్యాలో కబుర్లు చెప్పకు. దాముంటే నీ వివరాలు చెప్పు.నీది పిరికి గుండెకాయ.

      Delete
    8. // “మా క్లెరికల్ స్టాఫ్ ని తీసుకున్నారుగాని మమ్మల్ని రమ్మన లేదు,ఎప్పుడూ.” //

      డిటో డిటో, శర్మ గారు 😒.

      Delete
    9. శర్మ గారు,
      // “ క్రికెట్ కామెంట్రీతో పోల్చేసేరు, ధన్యవాదాలు.” //

      🙂🙂

      అదే లెండి, నిలువు గీత.
      మా కాలేజీ గ్రూపులో ఒక ఆసామీ నిలువు గీతలున్న రెండు వేళ్ళ ఫొటో పెట్టాడు లెండి. దాంతో నాకనుమానం వచ్చి మిమ్మల్ని అడిగాను. బహుశ: రెండో వేలు వాళ్ళావిడ వేలు అయ్యుండచ్చేమో 🙂? అతనేమీ చెప్పలేదు.

      రీపోలింగ్ జరిగితే రెండో వేలుకు గీత గీస్తారు అని నాకింతవరకు తెలియని విషయం తెలియజేసారు, థాంక్సండీ 🙏.

      Delete
    10. నువ్వు దేశంలోకే రాలేదు,ఓటూ వెయ్యలేదు....


      తుప్పరియం సాంబు :)


      Delete
    11. // “తుప్పరియం సాంబు :)” //

      🤔🤔??
      తిడుతున్నారా?

      Delete
    12. துப்பரியம் சாம்பு :)

      Delete
  4. శభాష్, భారతదేశ పౌరులుగా ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలి

    ReplyDelete
    Replies
    1. ఓటేసారాండీ ? ( మీరు బూతుకి రాలేదేమిటి అని ఎవరో అడిగేరందుకని ప్రశ్న)

      Delete
    2. Dr. Mulla Adam Ali14 May 2024 at 11:07

      ధన్యవాదాలు

      Delete
    3. Zilebi15 May 2024 at 04:03
      బ్రాకెట్లో మాటలు అధిక ప్రసంగం

      Delete
    4. ఓ యబ్బో :)

      Delete