Monday, 6 May 2024

శుభాకాంక్షలు.

 శుభాకాంక్షలు.


దేశ విదేశాల్లో ఉన్న మిత్రులూ,శత్రువులకూ,

ఎల్లరకూ


ఏప్రిల్ రెండో వారంలోనే మొదలైన

మలమాడ్చే ఎండలు (41,42,43,44,45,46,47 డిగ్రీల వేడి)

వడగాలి, ఉక్కపోత 

శుభాకాంక్షలు.


6 comments:

  1. ఇంటర్, ఎమ్సెట్ ర్యాంకుల్ని కార్పొ’రెట్ట’ కాలేజీలు చెప్పే విధంగా ఉంది మీరు టెంపరేచర్ చెబుతున్న పద్ధతి 😃😃.

    Good Friday తో సహా ప్రతిదానికీ శుభాకాంక్షలు చెబుతున్న ఈతరం రోజుల్లో వీటిని మాత్రం (“వడగాలి, ఉక్కపోత”) ఎందుకు వదలాలి అంటారా? అలాక్కానివ్వండి 😃😃.

    కార్పొ’రెట్ట’ లు తమ వ్యాపారం, లాభాల కోసం ఆకుపచ్చదనం లేకుండా పర్యావరణాన్ని కాంక్రీట్ జంగిళ్ళతో నాశనం చేసి, వేలకోట్ల రూపాయలను తమ జేబుల్లో నింపుకుంటున్నారు. నియంత్రించవలసిన వారు చోద్యం చూస్తున్నారు. దారుణమైన ఫలితాలను అనుభవిస్తున్నాం.

    ReplyDelete
    Replies
    1. ఎప్పుడు చూసినా కార్పొరేట్ల పై ఈ కార్పణ్యాలేనా ? వారే లేకుంటే సీ యెస్ ఆర్ ఎక్కడా ? పచ్చదనాల కోసం‌ వాళ్ళు స్పెండించే వరహాల మూటలేదీ ?

      అంతా పాత తరం‌ భావజాలాలు‌. మారండి‌ స్వాములూ


      Delete
    2. ఆహాఁ, ఏమిటో వాళ్ళు చేసిన / చేస్తున్న అంత ఘనత వహించిన CSR ? ఏ కంపెనీ? ఎక్కడ? చెప్పండి, విని తరిస్తాం.

      ముందు చెట్లని కొట్టేసి కాంక్రీట్ హర్మ్యాలు కట్టడం, ఆ తరువాత పేవ్ మెట్ మీద మొక్కలు నాటడం.

      Delete
    3. ఏ కంపెనీ ?

      సేటు బ్యాంకు

      Delete
    4. విన్నకోట నరసింహా రావు6 May 2024 at 09:18
      సారూ!

      వేడి రోజురోజుకీ అలా పెరుగుతోంది సార్!ఒంటి బట్ట బరువైపోయింది, బట్ట వేడెక్కి మంటపెడుతోంది.
      అదేం తెలీదుగాని తద్దినాలకే శుభాకాంక్షలు చెబుతున్న రోజులు సార్! ఇదేమయ్యా అంటే పెద్దోళ్ళు పోవడం పండగేగా లగ్గేజి తగ్గలేదూ!

      నేటి తీరుకి కార్పొరేట్లనే తిట్టుకోక్కరలేదనుకుంటానండి. సామాన్యుడి అత్యాశ ,రాజకీయుల పేరాశ,కార్పొరేట్ల దురాశ కారణాలనుకుంటానండి. వీరెవరూ మారరుగాక మారరు సార్! ఇదింతే!! నీళ్ళ కరువూ వస్తుంది సార్! మనం ఉండమేమో ఆ రోజునాటికి.
      కంపెనీ ముదిరితే కార్పొరేట్ కదుసార్! తొండ ముదిరి ఊసరవెల్లి ఐనట్టు.
      ధన్యవాదాలు.

      Delete
  2. Zilebi6 May 2024 at 09:56
    తమరేది తిన్నగా చెప్పేరు గనక!తల్లిని చంపేసి పిల్లని బతికించేమని చెప్పుకునే మేధావులుగదా!

    ReplyDelete