Saturday 11 May 2024

గవళ్ళగంగమ్మగారి....




 గవళ్ళగంగమ్మగారి....


కల్లు మానండోయ్ బాబూ! కళ్ళు తెరవండని నాటిరోజుల్లో మొత్తుకున్నారు. మానినట్టెఖ్ఖడా కనపడలేదు.నేడు అది కాస్తా పెరిగి పెద్దదిపోయిందంటే అనుమానం లేదు. ఒకప్పుడు పబ్బుల్లోనూ క్లబ్బుల్లోనూ కంపెనీ సరుకే తాగుతారానుకునీ వారు.కాలం మారింది. భూమి గుండ్రంగా ఉంది. ఆడా మగా తేడా లేక నేడు కార్లు పల్లెలకి పరిగెడుతున్నాయి,ఉదయమే. తాడి చెట్టునుంచి దించిన కల్లుకుండ చెట్టు మొదటిలోనే కాళీ ఐపోతోంది. చదువుకున్న ఆడపిల్లలు వయసుతో సంబంధం  లేక కల్లు తాగుతున్నారు. కల్లు తాగుతున్న వీడియోలో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.


తాటికల్లూ సరిపోయేలా లేదు కొబ్బరికల్లు కూడా గీయచ్చు, ఇక ముందు.


గవళ్ళగంగమ్మగారి హస్తోదకం జిందాబాద్!!! 

5 comments:

  1. తాటికల్లు, కొబ్బరికల్లూ సరపోకపోతే ….. ఈతకల్లు కూడా ఉందండోయ్.

    రాబోయే మూడు రోజులూ గవళ్ళ గంగమ్మ గారికి బిగినెస్సే బిగినెస్సు, కుండలు బద్దలవ్వాల్సిందే 😋.

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావు11 May 2024 at 10:54
      ఈతకల్లు తక్కువనుకుంటానండి, దాన్ని మాత్రం ఎవరొదిలేరు సార్! దానికి చాలా పెద్ద డిమాండు.
      మూడు రోజులే కాదండి :)

      Delete
  2. తాత గారండీ

    ఈ మధ్య ఆంధ్రపదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి విభిన్న అభిప్రాయాలు రాజకీయ శంఖారావాలు వినిపిస్తున్నాయి.

    దీనిపై మీ సమగ్ర విశ్లేషణ వ్రాయగలరు ఈ చట్టం‌ నిజంగానే మోసపూరితమైనదా ?



    ReplyDelete
    Replies
    1. Zilebi11 May 2024 at 18:58
      ముఖముంది అద్దముంది, కేంద్రం పంపిన ముసాయిదా ఉంది, ఆం.ప్ర చేసిన చట్టముంది చదువుకో! రేపు తర్వాత ఎవరికి అక్కరలేని సంగతిది.

      Delete
  3. రేపు తర్వాత ఎవరికి అక్కరలేని సంగతిది.

    దీని భావ మేమి ?

    ReplyDelete