Saturday 7 August 2021

టచ్చి మనది సెర్చి మనది

 టచ్చి మనది సెర్చి మనది


ఏం బతుకో!బానిస బతుకైపోయింది!!కుదురులేదు కదా!!!

పుట్టింట ఉన్నకాలంలో అల్లారు ముద్దుగా పెరిగాను. ఒకరి చేతిలో పడ్డ దగ్గరనుంచి నా తిప్పలు మొదలయ్యాయి. ఏమని చెప్పుకోను, ఎన్నని చెప్పుకోను?


కొత్తలో ఈగ మీదవాలకుండా అబ్బో ఎన్ని జాగర్తలు,కొత్త కొత్త డ్రస్సులూ,ఉదయాన్నే నా మొహం చూసిగాని పడక దిగకపోవడాలు.నా గురించి గొప్ప చెప్పుకోడాలూ

 ఆ తరవాత చెయ్యి వదలిన క్షణమేదీ? కడుపు నిండడానికి టైమ్ లేదు, ఒక ముద్ద తినేటప్పటికి ఏదో పని పురమాయింపే! ఏ అర్ధరాత్రికో రెప్పలు మూసుకుపోతుంటే కడుపు కాలిపోతోందని గోల చేస్తుంటే అప్పుడు తినమని కంచం ముందు పెట్టేవాళ్ళే అంతా. ఆ తరవాత కడుపునిండిపోయినా వద్దని మొత్తుకున్నా వినే నాథుడు లేడు. ఒక్కొక్కప్పుడు కడుపు పగిలిపోతుందేమోననిపిస్తుంది. కొంతమందికి నేను కూడా లేకపోతే కాలూ చెయ్యీ ఆడవు, ఆఖరి మాట కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు కూడా కూడా ఉండాలి. అబ్బా మరీ ఘోరం స్నానం చేస్తూ కూడా దూరంగా కనపడకపోతే...వద్దులెండి.ఏ క్షణాలలోనైనా దగ్గరుండాల్సిందే.  ఇంకక్కడనుంచి నా చాకిరీ ఎక్కడేక్కడో తిప్పి తిప్పి చంపుతారు. కడుపు కాలిపోతున్నా వినరే, మొండికేస్తే అప్పుడు రెండు ముద్దలు తిననిచ్చి మళ్ళీ మామూలే. ఇలా తిప్పలు పెడుతుంటే నాకు మాత్రం అనారోగ్యం చెయ్యదా చెప్పండి.నాకు అంటురోగాలే ఎక్కువ,వైరస్లు నెమ్మదిగా చేరిపోతాయి,అరుస్తూనే ఉంటా ఏదో చేరిపోయిందీ అని వింటేనా? ఏదో రోజు మొరాయిస్తే అప్పుడు హాస్పిటల్ పారేస్తారు, ఆ డాక్టరు నన్ను తిప్పి తిప్పి చంపి బతికించచ్చు, లేదా పూర్తిగా చంపెయ్యా వచ్చు.హాస్పిటల్ నుంచి బయటకు రావడం పాపం మళ్ళీ చాకిరీయే కదా! నాకీ బానిసత్వం వదలదా? నాకూ స్వాతంత్ర్యం కావాలి.



 టచ్చిమనది సెర్చి మనది

దొర ఏందిరో వాని పీకుడేందిరో   IIటచ్చి మనదిII


బైతు కాడ మనం రైతుజాడ  మనం

బాసుకాడ మనం బంట్రోతు జాడ మనం

తల్లికాడ మనం సెల్లి జాడ మనం

పెల్లాంకాడ మనం గిల్లాం జాడ మనం 

పోరికాడ మనం పోరని జాడ మనం

దొర ఏందిరో వాని పీకుడేందిరో.    IIటచ్చి మనదిII


ఊసుకాడ మనం కాసుజాడ మనం 

బాసుజాడ మనం గ్లాసుకాడ మనం

బండి జాడ మనం తిండి కాడ మనం

దారిజాడ మనం గోరికాడ మనం

సెల్ఫీ జాడ మనం  ఫోటో కాడ మనం

దొర ఏందిరో వాని పీకుడేందిరో    IIటచ్చి మనదిII


ఆడియో కాడ మనం  వీడియోజాడ మనం 

చీట్లాటజాడ మనం   కొట్లాటకాడమనం

చుక్కకాడ మనం పక్కకాడ మనం

సానికాడ మనం సంసారిజాడ మనం

సావుకాడ మనం బతుకుజాడ మనం

దొర ఏందిరో వాని పీకుడేందిరో

Who am I


10 comments:

  1. సెల్ ఫోన్ జీవిత కథా, శర్మ గారు? హ్హ హ్హ హ్హ, బాగా కుదిరింది 👌👏😁.

    పైన గేయం చూస్తే మీరు ఉద్యమ పోరు పాటలు కూడా వ్రాయగలరని అనిపిస్తోంది సారూ. Keep it up, Sir 👍.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,

      సరదాగా అంతే సార్ :)

      Delete
  2. హస్తసంచారిణి దూరవాణి చరయంత్ర వాక్విశాల లోక ప్రసారిణి.
    ఆంధ్రాయిడ్ టెలింగాణ రాయల సిమ్ ఆఁ వెర్షన్స్:
    బటర్ కప్ (బూంది లడ్డూ)
    కప్ కేక్ (కారప్పూస)
    డోనట్ (డబ్బ బర్ఫి)
    ఇక్లెయిర్ (ఇలాయచి చాయి)
    ఫ్రయో (ఫుల్ క్రీం ఫలూదా)
    జింజర్ బ్రెడ్ (జహాంగిరి)
    హని కోంబ్ (హల్వ)
    ఐస్క్రీం శాండ్విచ్ (ఈతపండు తాండ్ర)
    జెల్లి బీన్ (జిలేబి)
    కిట్ కాట్ (కజ్జికాయి)
    లాలి పాప్ (లస్సి)
    మార్ష్ మెల్లో (మామిడి తాండ్ర)
    నౌగాట్ (నారింజ మిఠాయి)
    ఓరియో (ఓల్డి బుట్ట చింత పిక్క మిరాయి)
    పై (పూతరేకు)
    క్విన్స్ టార్ట్ (కాజా)
    రాస్ప్ బెర్రి రెడ్ వెల్వెట్ రిచ్ కేక్ (రవ్వ కేసరి)
    స్నో కోన్ (సోన్ పాపిడి)
    టాఫీ (తిరంగా ఫిర్ని)

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      జెల్లీ బీన్ ఎక్కడ బాబూ!

      Delete
    2. మీరు అడిగేది బిజిలే అమ్మణ్ గురించి. అదైతే నాకైతే తెలియదాచార్య

      Delete
  3. అవునట , పుట్టే పిల్లల
    చెవులకు సెల్ఫోను గూడ చెలగి జనింపన్
    దవులుపడునట భువిని , యే
    మవునో సెల్ ఫోను గనక మరుగై చనిన్ .




    ReplyDelete
    Replies
    1. నిజం చెప్పారు రాజారావాచార్య.. మాయావిడ పుణ్యాన మా హర్ష "చూచక్క" కైతే "యూటు" లేనిదే ముద్ద దిగదు. ఆక్ తీ.. ఆమ్.. యూటు అంతే గూగుల్ అసిస్టెంట్ యూట్యూబ్ ఓపెన్ సేసేత్తది. కోవిడ్ ధాటికి లోకమెల్ల డిజిటల్ పేమెంట్స్ మొదలెడ్తిరి.. అసలుకి ౨౦౧౭ లౌ ఊపందుకోవలసినది ఈ ఏడాది ముప్పావులో నే బాగా ప్రాచూర్యం పొందింది.. ఇన్‌స్టంట్ యాండ్ సేఫ్ కూడాను..

      Delete
    2. రాజావారు,
      కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్టు ఇక ముందు పిల్లలు సెల్ చేతబట్టుకు పుడతారో లేక పుట్టిన వెంటనే నా సెల్ ఎక్కడ అని అడుగుతారో :)

      Delete
  4. జయహో మా (మీ)'చూచక్క'కు
    రయమున సెల్ఫోను బట్టి రఫ్ఫాడించెన్
    దయగల ఓ తండ్రీ ! ఇక
    భయమేమియు వలదు తాను పైపైకొచ్చున్ .

    ReplyDelete
    Replies
    1. మా హర్ష కు మాత్రమే తాను చూచక్క ఆచార్య.. నా సుపుత్రి.. స్వైప్, స్క్రీన్ షాట్స్ వరకూ తెలిసేన్ తనకి.. సెల్లు లేనిదే ముద్ద దిగదు కదా రాజారావాచార్య..!

      Delete