Monday 2 August 2021

శ్రీ విశ్వనాథ స్మృతి-నివాళి

 

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ మూర్తి గారు

జననం:23.3.1941

మరణం: 30.6.2021.


శ్రీ విశ్వనాథ వారు బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి

 బహుగ్రంధ రచయిత.

శ్రీ విశ్వనాథ వారు 30-6-2021 తేదీని స్వగృహంలో పరమపదించారు,శివైక్యం చెందారు.వారి గురించి ఈ కింది టపాలలో చూడచ్చు.

ఎనిమిదేళ్ళ కితం వారిని కలిసినపుడు మాటల సందర్భంగా ఎనభై సంవత్సరాలు నిండిన తరవాత ఈ శరీరం విడిచిపెడుతున్నానన్నారు.అప్పుడు నాకంతగా అనిపించలేదు.కాని సరిగా ఎనభై సంవత్సరాలు పూర్తి చేసిన 3  నెలలోనే వారు శివైక్యం చెందారు,ఆశ్చర్యకరమైన విషయం.మరో మాట ఆ సందర్భంగానే వారు మరణానంతరం వారి పార్ధివ శరీరాన్ని శ్రీరంగరాయ మెడికల్ కాలేజి వారికి విద్యార్థులకు అనాటమీ పాఠ బోధనకు వినియోగించేందుకు దానం చేశారు. 

ధన్యజీవి
 శ్రీవిశ్వనాథ శివైక్యం చెందారనే విశ్వసిస్తాను,

శ్రీవిశ్వనాథ వారికి నమస్కరిస్తూ

https://kastephale.wordpress.com/2013/05/06/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b6%e0%b1%8d/

https://kastephale.wordpress.com/2013/05/08/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-193/

https://kastephale.wordpress.com/2013/05/10/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b5/

5 comments:

  1. మీ డిపార్ట్-మెంట్‌లో మీ సహోద్యోగులు చాలా మందికి సాహిత్యంలో ప్రవేశం, పట్టూ ఉన్నట్లుందే 🙂👏?

    ఈ విశ్వనాథ వారి గురించి మీరు వ్రాసిన పాత టపాలు మీరిచ్చిన లింకుల ద్వారా చదివాను. బహు ప్రజ్ఞాశాలి యనీ. విశేషమైన కృషి చేసిన వారనీ అర్థమవుతోంది. అటువంటి వారి స్నేహం లభించడం మీ అదృష్టం.

    తన 80వ యేట కాలం చేస్తానని అంత కరక్ట్ గా చెప్పగలిగారే? జ్యోతిష శాస్త్రం కూడా తెలిసిన వారన్నమాట.

    వారి ఆత్మకు సద్గతులు తప్పక ప్రాప్తిస్తాయి 🙏. .

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      అందులో ఒకరిద్దరు అత్తకొడుకులేమోగాని మిగిలిన అందరూ కోడలి కొడుకులేనండి. వారు నాకు మిత్రులు అన్నదే అదృష్టం.
      జ్యోతిషం తెలుసనుకుంటాను ఎప్పుడూ ఎవరికి ఏమీ చెప్పలేదండి, ఆ ప్రసక్తి తెస్తే మాత్రం మిన్నకుండేవారు, ఏమీ చెప్పక. ఆరోజు మాటల సందర్భంలో ఎనభై నిండిన తరవాత ఈ పార్ధివ దేహం వదిలేస్తాను, దీని మెడికల్ కాలేజికి దానం ఇచ్చేశాను, కాగితాల మీద సంతకం చేశానని చెప్పారు. ఆశ్చర్య పోయానంతే.

      పార్ధివదేహం దానమివ్వడం గొప్ప విషయం కదండి.వార్త తెలిసిన గత రెండు రోజులుగా కుదురు లేకపోయింది.

      Delete
  2. తన పార్థివ శరీరాన్ని వైద్య కళాశాలకు దానం చెయ్యాలనే సంకల్పం అధిక శాతం మనుషులకు చాలా కష్టతరమైనది. వారి ఇంటి వారు అంతగా ఇష్టపడనిదిన్నూ.

    అటువంటి నిర్ణయాన్ని తీసుకున్మ విశ్వనాథ వారు మహానుభావులు 🙏.

    ReplyDelete
  3. // “అందులో ఒకరిద్దరు అత్తకొడుకులేమోగాని మిగిలిన అందరూ కోడలి కొడుకులేనండి” //

    భలే చమత్కరించారే 👌👏🙂.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      నమస్కారం

      Delete