Friday, 27 August 2021

పెడితే పెళ్ళి

 పెడితే పెళ్ళి లేకపోతే శ్రార్ధం.


ఇది జన సామాన్యంలో ఉన్నమాట. మనకి ఉపకారం జరిగేటట్టు ప్రవర్తించిన వారికి మంచి జరగాలనీ లేకపోతే చెడు జరగాలనీ అనుకోవడంగా చెబుతారు.అసలేమి?


పెడితే పెళ్ళి:- పెళ్ళి ఇంట పదిమంది చెయికడగాలని అనుకుంటారు. అలా తృప్తిగా భోజనం చేసినవారు వధూ వరులను ఆశీర్వదించాలని పెద్దల కోరిక. అటివంటి చోట ఒక యాచకునికి తినడానికే దొరకదా? అదే పెడితే పెళ్ళి. పెళ్ళిరోజు పెడతారు.


ఇక


పెట్టకపోతే శ్రార్ధం:- ఇది నిజం, సమాజంలో ఉన్నది జరుగుతున్నదిన్నూ. శ్రార్ధం అంటే శ్రద్ధగా చేసేది, అంటే తద్దినం, అంటే తత్+దినం. అనగా ఆరోజు, ఏరోజు, ఆ ఇంట పెద్దలెవరో కాలం చేసినరోజు. ఆ రోజుగనక యాచకుడు ఆ ఇంటికి యాచనకొస్తే,ఏమీ పెట్టరు, పైకెళ్ళమంటారు లేదా మళ్ళీ రమ్మంటారు, లేదా ఈరోజు తద్దినం అని చెబుతారు. అంటే ఇప్పుడు వీలు కుదరదని చెప్పడం. కాలం చేసిన వారికి అర్చన పూర్తి కాకుండా ఇతరులెవరికి ఏమీ పెట్టరు. ఇదీ లోకంలో ఉన్న ఆచారం. తద్దినాన్ని తిథి అని కూడా అంటారు.ఏరోజూ సూర్యోదయానికి ఉన్న తిథిని ఆరోజు  తిథిగా చెబుతారు, కాని తద్దినానికి తిథి ఐతే మాత్రం ఏరోజు అపరాహ్నానికి పోయినవారి తిథి ఉంటుందో ఆరోజే తద్దినం పెట్టాలి.


ఇదీ పెడితే పెళ్ళి పెట్టకపోతే శ్రార్ధం కత.

2 comments:

  1. ఎవరి మంచి వారికి చెడు నుండి కవచ మల్లె కాపాడుతుంది. ఎవరికైనా చెడు తలపెడితే ఆ సెగ తాకిడికి అతలాకుతలమై ఉంటుందనేది నిజం ఆచార్య

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      నిజం!
      మా వూరికోస్లోగనుందండి. "అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి"
      సర్వే జనాః సుఖినో భవంతు.

      Delete