Friday 13 August 2021

మూడంకె వేస్తే


 Courtesy:BAPU

Courtesy:What's app

అలిగి అలివేణి అలకపాన్పుపై మూడంకె వేస్తే 
 (వయసు ముచ్చట)

8 comments:

  1. అమ్మోరు పూనినా తట్టుకోగలరెమో గాని ఆచార్య, అలక పూనితే మహా కష్టం సుమి

    ReplyDelete
  2. ఆవిడ మూడంకె వేస్తే వీడికి పస్తే. అందుకే వీడికి ముప్ఫైమూడు వంకర్లు తిరగక తప్పదు, పూర్ ఫెలో 🙂.

    ReplyDelete
    Replies
    1. అదా ఆచార్య.. పాత పాట.. /*ముక్కు మీద కోనం, మీ ముఖానికే అందం నా బుంగ మూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం.. అడప దడప అలిగితేనే అందం.. అలక తీరి కలిసేదే అందమైన బంధం*/

      "ఏమి సేతురా లింగా ఏమి సేతు.. నైవేద్యం పెడదామని వెండి గిన్నె దెస్తే.. రూపాయిచ్చి పావలా తెస్తావా అంటు విసిరి కొట్టే లింగా.. నాలుగు తులాల వెండి గిన్నె కాస్త సొట్ట బడి పాయే.. ప్చ్.."

      ఏమి సేతురా లింగా ఏమి సేతు.. మెడంత హారం దెచ్చి అలక తీరుద్దామంటే నుటొక్క గ్రాముల పసిడిని ఆఫ్ట్రా లంటు నూటొక్క రాగం అందుకుంది లింగా.. ప్చ్

      ఇవియే.. గ్రెద్దలా అరుపులు అలకల ఉలకపాతాలు నా సతి మూతొంకర్లు నన్నే ఏడిపించే..

      నింగి నేలా కూడే వేళ నీకు నాకు దూరాలేలా..!
      ఆకాశాన తారా తీరం అంతే లే నీ ఎంతో దూరం..!!

      ను అ..క..డ నే ని.. క..డ.. పాట ఇక్కడ పలుక క్కడ అలుక క్కడ చిరా కిక్కడ.. పరాకు ఎ..క..డ.. ఆచార్య

      Delete
    2. శ్రీధరా!

      అడదడప ఇద్దరూ అలిగితేనె అందం. కాని పురాణకాలం నుంచీ అలగడం ఆడవారి సొత్తే ఐపోయింది, బుజ్జగింపులు మగవారి వాటాకి మిగిలిపోయాయి పరిశేష న్యాయంగా :(

      లింగనికీ తప్పలేదండీ ....:)
      త్యాగరాజస్వామివారు తేల్చేశారు ఒక్క మాటతో ఎంతవారలైన కాంత దాసులే అని.

      ఎక్కడా చిరాకులూ లేవు పరాకులూ లేవు ఇవన్నీ అలకలు బుజ్జగింపుల్లో భాగాలు కదా!

      Delete
  3. శ్రీధరా!,విన్నకోటవారు,
    కికురింపులు,అలకలు,బుజ్జగింపులు ఏకాలంలో నూ ఉన్నవే.

    జాయ అలకతో పడకెక్కి మూడంకె వేస్తే బ్రతిమాలుకుని, ఒకటి చేసుకోని, పతి లేడనే అనుకుంటా.

    అలకతీరి కలిసేదే అందమైన బంధం అన్నారో సినీ కవి.

    అయ్యో! శ్రీకృష్ణుడంతవాడికే బతిమాలుకోడం తప్పలేదు కదండీ.సత్యభామ అలక ప్రసిద్ధం కదా!అలాగే రుక్మిణికి కోపం తెప్పించి అలిగితే అలక తీర్చిన సంఘటన కూడా పోతన రమ్యంగా చెప్పేరు.


    అలకలు బుజ్జగింపులు జీవితంలో ఒక భాగం. వయసుమళ్ళినవారు అనుభవాలు నెమరు వేస్తే, అనుభవిస్తున్నవారు ఆస్వాదించాలి, అనుభవం లేనివారు ఎదురు ఛూడాలి. ఇంతే జీవితం కాదు ఇదే జీవితం

    ReplyDelete
    Replies
    1. ఔనౌనాచార్య.. "అలరురు కురియగ నాడెనదే యలకల కులుకుల అలమేలు మంగ" అని అన్నమాచార్య వారే శెలవిచ్చినారు.. జీవిత పరమార్థ మిదే.. అలకతో కొండ మీది కోతినైనా దించేస్తారు పడతులు అని ఎవరో అనగ విన్నా మరి.. నిజమో కాదో తెల్వది.. కొండ మీది కోతి.. కోనలోన భీతి యన్నిట ఇదియే పరిపాటి

      Delete
    2. శ్రీధరా!

      ఏమనుకోవద్దూ! :) చిన్న తెనుగు క్లాసు.
      అలరులు కురియగా ఆడెనదే అలకల కులుకుల అలమేల్ మంగా అన్నారు కదా అన్నమయ్య. ఇక్కడ అలరులు అంటే సంతోషాలనీ అలకలు అంటే ముంగురులు అనీ అనుకుంటున్నాను.

      ఇక అలకలు పద ప్రయోగం పాలకడలి పై శేషతల్పమున పవళించేవా దేవా! బాలుని నను లాలించుటకై చనుదెంచేవ మహాను భావా!!
      అలకలు అల్లలనాడుచు ముసరగ తెలినవ్వులు చిలికించే మోమూ...అదీ సంగతీ

      Delete
    3. విడమర్చి అర్థాన్ని వివరించినందుకు ధన్యవాదాలు శర్మాచార్య

      Delete