Saturday, 17 January 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-కల నిజమౌనా?


ఈ వేళ తెల్లవారుగట్ల ఒక కలొచ్చింది, సాధారణంగా నాకు కలలు రావు. వచ్చినా మరచిపోతానేమో, ఇది మాత్రం గుర్తుంది.కల ఇది

" నా పై ఆఫీసర్ నా గురించి తన పై ఆఫీసర్ కి ఫిర్యాదు చేసేరట. ఏమనీ " ’ఇతను చెప్పినమాట వినటం లేదు, ప్రతిదానికి వ్యతిరేకిస్తున్నాడు, అందుచేత ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసెయ్యమని’ ’ఈ సంగతి ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పేడట, సలహా కూడా ఇచ్చేడు, నువ్వొక సారి పెద్ద ఆఫీసర్ గారిని కలిసి నీ సంగతి చెప్పుకోమనీ"  కల చెదిరింది, కథ మారిందీ, మెలకువ  వచ్చేసింది. ఈ కథకు అర్ధమేమీ? 

నిజ జీవితంలో ఇలా చాలా సార్లే జరిగేయి, నాకిది కొత్తా కాదు. ఇప్పుడు రిటయిర్ అయి కూచున్నవాడికి ట్రాన్స్ఫర్ ఏమి? అసలు కలలెందుకొస్తాయి? తెల్లవారుగట్ల వచ్చిన కలలు నిజమౌతాయంటారు, నిజమా? 

12 comments:

  1. గుండె గల్లంతయ్యింది !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబిగారు,
      అంతేలా ఉంది.
      ధన్యవాదాలు.

      Delete
  2. కల నిజం అవ్వలేదు.
    నిజం కల అయ్యింది.

    ReplyDelete
    Replies
    1. బోనగిరి గారు,
      ఆ మాట చెప్పేను కాని ఏదో మాయలో పడిపోయా సుమా.
      ధన్యవాదాలు.

      Delete
  3. శర్మ గారూ ,

    నమస్తే .

    సహజంగా మన పగటి ఆలోచనలకు ప్రతీకలు ఆ కలలు . ఇలలో చెయ్యలేనివి ఆ కలలలో చేసేసినట్లు అనిపిస్తాయి , గా కనిపిస్తాయి . చాలా వరకు గుర్తున్నట్లు కల చెదరగానే అనిపిస్తాయి . ఆ తదుపరి నిద్దురలో అవి కనుమరుగై పోతుంటాయి .

    అంతగా ఆలోచించకండి . టేక్ యిట్ ఈజీ ప్లీజ్ ,

    ReplyDelete
    Replies
    1. శర్మాజీ,
      నమస్తే. జీవితం లో జరిగిపోయిన సంఘటన క్లరూపం లో ఎందుకు గుర్తొచ్చిందనేదే అసలు ప్రశ్న.
      ధన్యవాదాలు.

      Delete
  4. మనసు కుదుటపడటల్లేదని ఈ మధ్య వేరే సందర్భంలో మీ బ్లాగులో వ్రాసారు కదా మీరు. ఎప్పుడో జరిగిన అన్-ప్లెజంట్ సంఘటన ఇప్పుడు కలలోకి రావటం దానివల్లే అయ్యుంటుంది బహుశా. కలలన్నీ భవిష్యత్తు గురించే కానక్కరలేదుగా (అని నేననుకుంటున్నాను).

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు గారు,
      మనసు బాగోక పాత కాలపు చేదు జ్ఞాపకాలేవో గుర్తొచ్చి ఉంటాయి.
      ధన్యవాదాలు.

      Delete

    2. ఇంతకీ ఆ పై ఆఫీసరు గాడు ఎవడండీ !

      జిలేబి

      Delete
  5. రకరకాల పీడ ముఖాల్లో అదొకటండి.
    ధన్యవాదాలు.

    ReplyDelete
  6. yuor dream has a deeper meanig just relax nd think it nd you will find out the answer for your deream sir

    ReplyDelete
    Replies
    1. @astrojoyd
      Sir,
      As suggested, I v analyzed with a cool mind. Some problem is irritating my mind. Fixed it. unable to elaborate...
      Thank u

      Delete