Thursday, 15 January 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-గంగిరెడ్లు-1880



                                          అందరికి సంక్రాంతి శుభకామనలు.


6 comments:

  1. నాడు గంగిరెద్దుల బూరె నరుడు
    శుభ సూచకముల చెప్పు వాడు
    నేడు మేక్ ఇన్ ఇండియా నరేంద్రుడు
    శుభ సూచకముల నిచ్చు వాడు !!

    -జిలేబి

    నాటి గంగిరెద్దుల బూరె నరుడు ప్రజకు
    శుభము సూచించు మాటల చొప్పు చెప్పె;
    నవ్యభారతనిర్మాత నరుడు మోడి
    శుభము సూచించు చేతలచొప్పు గనెను.

    -శ్రీ కంది శంకరయ్య

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు,
      మీ భావాన్ని శ్రీ శంకరయ్య గారు పద్య రూపం ఇచ్చినట్టుంది. మీకు మాస్టారికి నమస్కారాలు. మంచి జరగాలని ఆలోచించేవాళ్ళే కావాలండి.
      ధన్యవాదాలు.

      Delete
  2. తే. రంగురంగుల బొంతల గంగిరెద్దు
    ముంగిళుల ముందు విన్యాసములను చేయు
    పండువిది వచ్చె తోచిన పగిది రూక
    లిచ్చి పంపుడీ మనసార మెచ్చి మీరు

    తే. చెప్పులైనను నోచరు జీర్ణవస్త్ర
    ధారులీ మేళగాండ్రు మీ దయకు పాత్రు
    లాదరించుడు మనసార నయ్యలార
    అమ్మలార సురవిటపి కొమ్మలార

    ఉ. వండిన పిండివంటలను వారికి పెట్టుడు మానుడమ్మ ఆ
    యెండిన డొక్కలం గనియొ కించుక బువ్వననుగ్రహించరే
    పండువగాదె వారికిని భవ్యమనస్కులు పాతదైననుం
    కండువ నయ్యగారి దయగా నిడరే పరమాత్మ మెచ్చగన్

    -తాడిగడప శ్యామలరావు.

    ReplyDelete
    Replies
    1. మిత్రులు శ్యామలరావు గారు,
      మంచి పద్యాలు రాశారు.
      ధన్యవాదాలు.

      Delete
  3. పైపద్యాలకు కొన్ని అదనంగా చేర్చి శ్యామలీయంలో ప్రకటించాను.

    ReplyDelete
    Replies
    1. మిత్రులు శ్యామలరావు గారు,
      మంచి పద్యాలు రాశారు. మిగిలిన పద్యాలు కూడా చూశాను. మన దేశం లో పేదరికం లేనిదెక్కడ? కొంత మంది బిచ్చగాళ్ళూ ఉన్నారు.
      ధన్యవాదాలు.

      Delete