స్వకుచ మర్దనం, పరకుచ మర్దనం, పరస్పర కుచ మర్దనం అని ఇది మూడు రకాలూ అన్నారు, పూర్వీకులు. దీనికి తెనుగు అర్ధం చెప్పడం అశ్లీలoగా ఉంటుందనుకున్నా, అందుకుగాను దీనిని స్వడబ్బా, పరడబ్బా, పరస్పరడబ్బా అని తెనుగులో చెప్పుకోవచ్చనుకుంటా. ఇది పూర్వకాలం నుంచీ ఉందండి. ఇది చూడండి.
రామో విగ్రహవాన్ ధర్మః
సాధుః సత్యపరాక్రమః
రాజా సర్వస్య లోకేస్య
దేవానామివ వాసవః.
దీని అర్ధం రాముడు మూర్తీభవించిన ధర్మం, సాధు పురుషుడు, సత్యవంతుడు, పరాక్రమవంతుడు, అదీకాక దేవతలకి ఇంద్రునిలాటివాడు అని చెప్పేడు! ఎవరూ? చెప్పినది? మారీచుడు. ఎవరితో? సాక్షాత్తు రావణునితో. శత్రువు గురించి, మంత్రి తన రాజు దగ్గర చెప్పిన మాటలివి. రావణుడేమనుకున్నాడూ మారీచుడు భయపడి రాముడి డబ్బా కొడుతున్నాడనుకున్నాడు తప్పించి, అది నిజమని నమ్మలేకపోయాడు.
అవి సత్య కాలపు రోజులు కదా! భయపడినా నిజమే చెప్పేడు. ఇప్పుడు ఎవరి డబ్బా వారే వాయించుకోవాలి, మరొకరు ఎవరూ వాయించరు, అంత ఖాళీ ఎవరికీ లేదు. అదీగాక ఎదుటివాడి గొప్పతనం అంగీకరించడానికి మనం తెనుగువాళ్ళం కదూ! ఆత్మాభిమానం మెండు. అవసరాన్ని బట్టి పరస్పర డబ్బా ఉంటుందనుకోండీ! దీనికి ఉదాహరణలు కావాలా? నిన్నటిదాకా మన దేశాన్నేలిన పార్టీవారేమన్నారు, గుర్తు తెచ్చుకోండి, మేము తప్పించి ఈ దేశాన్ని పాలించగలవారు ఎవరూ లేరని కదా డబ్బా కొట్టుకున్నది, మరి వారికి తోడు నట్టువగాళ్ళు మరికొంత పరడబ్బా కొట్టేరు కదండీ, వీరికంటే గొప్ప పరిపాలకులు, ధర్మాత్ములు, ఉండబోరని.అసలు పరిపాలనే మరెవరు చేయబోలేరని కూడా చెప్పేరు కదా! ప్రజలా తెలివి తక్కువ వారు? చాలు బాబూ! మీపరిపాలన అని, ముసుగేసి మూల కూచోబెట్టేరు, ఇద్దరినీ. దీనితో నట్టువగాళ్ళకి ఒంటికి కారం రాచుకున్నంత సుఖంగానూ ఉంది. అందుకుగాను తెగ డబ్బా కొట్టేసుకుంటున్నారు,తెగ రెచ్చిపోయి, ఇప్పుడు. ఆఖరిమాట శత్రుదేశంవారు, ’భారతదేశం లో ఇదివరకు సున్నితంగా స్పందించే ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు ప్రభుత్వం మొరటుగా ప్రవర్తిస్తోందని’. శత్రువుతో సున్నితంగా ఎలా ఉంటారు? రాజకీయమేమో! డబ్బా కొట్టుకోడం ఏ స్థాయికి చేరిందో!
ఇక ఈ విషయంలో కవులు కళాకారులదంతా అదో తరహా.ఇక వీరికి డబ్బా కొట్టడం లో పత్రికలది మరోతరహా. గొప్పనటుడు "న ’బూతో’ నభవిష్యతి" వీరు నోరు విప్పితే పలికేవన్నీ బూతులే మరి. ’నవరసభరిత నటుడు, కళ్ళతోనే భావాలు పలికించగలదిట్ట’, ఇది పత్రికలవారు, ఆ నటుడికి కొట్టే డబ్బా. చెక్కపేడు ముఖంతో, ఆ నటుడి ముఖంలో ఏ ఒక్క భావమూ కనపడదు, చివరికి శోకం కూడా. అది మనని ఆవరిస్తే నటుడి దగ్గరెందుకుంటుంది చెప్పండి, కర్మ కాలి సినిమా చూస్తున్నందుకుగాను. మరి సినిమాలెందుకాడుతున్నాయని కదా మీ అనుమానం. అవికాగోర్ లాటి అమ్మాయిని తెచ్చి, హీరోయిన్ ని చేస్తే, ఆ నటి నటిస్తోందా? పాత్రలో జీవిస్తోందా అనిపించేలా ఉంటే సినిమా ఎందుకుపోదూ? మరి ఆ నటికి ఆ డబ్బా మాత్రం ఉండటం లేదు, కలికాలం.
ఇక కవులు, ఛస్తే మరొకరి గొప్ప ఒప్పుకోరుకదా! ఏమైనా అంటే ’ఏ గతి రచించినన్ సమకాలికులెవ్వరు మెచ్చరే కదా’ అని చామకూర వేంకన్న ఎప్పుడో చెప్పేడు, మాకు పార్వతీ దేవి శాపం ఉంది లెండి అంటారు. కాని ఒక చిత్రం గమనించేరో లేదో వీరు మాత్రం ఒకరి వీపు మరొకరు బహు పసందుగా గోక్కుంటారు. తేడాలొస్తే వీధిన కూడా అలాగే పడతారు. సవతుల కయ్యంలా ఉంటుంది. అప్పుడు బహు పసందుగా ఉంటుంది లెండి, చెప్పడం కష్టం, వినాల్సిందే, అవి బూతులు కదా.
ఇంతకీ మీ గోలేమని కదా మీ అనుమానం. నేను ’కష్టేఫలె’https://kastephale.wordpress.com/ అనే ఒక బ్లాగు మొదలు పెట్టి రాశాను. చాలాకాలమే రాశాను. అందులో 750 పైబడిన టపాలూ ఉన్నాయి. ఈ మధ్య కూడలి లో నా బ్లాగు టపాలు కనపడటం లేదు. వారికి చెబితే, ఇబ్బందులున్నాయి, సాంకేతికంగా, సరి చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పేరు. ఈ ఆగ్రిగేటర్ నెమ్మదిగా పని చేసినా, టపాలు చూడటానికి చాలామంది దీనినే ఎంచుకుంటారన్నది బహిరంగ రహస్యం.
ఇక మాలిక ఇందులో కూడా టపాలు కనపడకపోతే చెప్పేను, టపాలు కనపడేలా సరి చేసేరు,వెంటనే. మరి కామెంట్లు ఆక్సిజన్ కదా! అవి కనపడకపోయేయి. మళ్ళీ చెప్పేను, సాంకేతికలోపం సరి చేయడానికే ప్రయత్నిస్తున్నామన్నారు.ఇందులో కామెంట్లూ, టపాలూ కూడా వేగంగా కనపడతాయి. కూడలి తరవాతది ఇదే, ఎక్కువ మంది కామెంట్లనుంచి వచ్చి టపా చదువుతారు.
ఇక మూడవదైన బ్లాగిల్లు లో టపాలూ, కామెంట్లూ కూడా కనపడుతున్నాయి, కాని ఎందుకోగాని ఈ ఆగ్రిగేటర్ నుంచి ఎక్కువమంది క్లిక్ చెయ్యరు, కారణం తెలియదు. ఈ ఆగ్రిగేటర్ కొద్ది నెమ్మది, కామెంట్ల విషయంలో.
ఉన్నమాటనుకోవాలి, ఈ ఆగ్రిగేటర్ల వారిని మా టపా కనపడటం లేదు, మా కామెంట్ కనపడటం లేదు అని అడుగుతున్నాం కాని పని చేసిన కాలంలో వారిచ్చిన సహకారానికిగాను, సేవలకు గాను, వారి డబ్బా కొట్టవలసిన అవసరం మనమీద ఉందా లెదా? మరి మనమెందుకు ఆ పని చెయ్యటం లేదు? భాష మీది పిచ్చి ప్రేమతో వారీ పని చేస్తున్నారు తప్పించి మరొకటి కాదని మనం గుర్తించాలా వద్దా? పక్క రాష్ట్రం లో ఆగ్రిగేటర్లు డబ్బులు వసూలు చేస్తున్నాయి, బ్లాగర్ నుంచి, డబ్బులు వసూలు చేస్తే మనలో ఎంత మంది కట్టడానికి సిద్ధంగా ఉన్నమో చెప్పండి. మనమేమో కామెంట్ కనపడలేదని ఎగురుతున్నాం కాని, వారు ఇంత చేస్తున్నందుకు వారికి ఒక సారి జే జే లు చెబుతున్నామా? వారూ మనలాటివారే కదా! మనకి ఒకరు ప్రోత్సాహం ఇస్తే సంతసిస్తున్న మనం, సేవలందించేవారికి జేజేలు పలకాలా? వద్దా?, అందరమూ, మాట కలపండి, జేజే లు చెప్పండి. ఆగ్రిగేటర్ల ఆర్ధిక పరిపుష్టికి మనం చేయగలదేమైనా ఉందా? ఆలోచించండి, ఆగ్రిగేటర్ల వారికీ ఒక మనవి, ఏడ్ లు తీసుకుంటే కొంత సౌకర్యం ఉంటుందికాదా, ఆలోచించండి.
ఈ సందర్భంగా నాకున్న రెండవ బ్లాగు ఇదే, దీనిలో రాద్దామని సంకల్పించా, అదీ తిరకాసు. ఇందులో ఫోటో లు మాత్రం పెట్టేవాడిని. ఇప్పుడు రాతలకి ఉపయోగిద్దామని ప్రయత్నం, అదనమాట సంగతి,నాలుగురోజులాగచ్చుగా? ప్రశ్న. అరవై ఏళ్ళ కితం చూసి, ఆ తరవాత కను మరుగైపోయిన ఒక కళా రూపాన్నిచూశా, దాని గురించి చెప్పెయ్యాలని, కడుపు ఉబ్బిపోతోంది, అదీ సంగతి. మరి దీన్నేమంటారు? స్వడబా కదా!
ఇక https://kastephale.wordpress.com/,ఆ బ్లాగును ప్రైవేట్ బ్లాగ్ చేశాను, పాత టపాలు చదువుకోవాలనుకుంటే అందులోకి ప్రవేశించాలి. మెయిల్లో టపా అందుకునేవారు మరల ఇక్కడ కూడా రిజిస్టర్ చేసుకోవాలి, మంచిరోజులొస్తే మళ్ళీ అందులోకి మారిపోదాం. ఇబ్బంది కలగ చేసినందులకు క్షంతవ్యుడిని.
శర్మ గారు. మీ బ్లాగర్ బ్లాగును కూడా పల్లెప్రపంచం లో జత చేశాను.
ReplyDeleteమిత్రులు కొండలరావుగారు,
Deleteధన్యవాదాలు.
స్వడబ్బా అనునది దుష్ట సమాసమా ! వివరించుడీ !
ReplyDeleteజిలేబి
జిలేబి గారు,
Deleteఅది దుష్ట సమాసమే. స్వంత డబ్బా అనాలి, అబద్ధంవా సుబద్ధంవా కుంతీ పుత్రా వినాయకా అంటే కదా పదిమంది దృష్టిలో పడేదీ, అదనమాట సం గతి.
ధన్యవాదాలు.
Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
ReplyDeleteValentines Day Images
Valentines Day Wallpapers
valentines day 2015
Valentines Day pictures
Valentines Day photos
Valentines Day sms
Valentines Day gifts
Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
Valentines Day Images
Valentines Day Wallpapers
valentines day 2015
Valentines Day pictures
Valentines Day photos
Valentines Day sms
Valentines Day gifts
Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
Valentines Day Images
Valentines Day Wallpapers
valentines day 2015
Valentines Day pictures
Valentines Day photos
valentines Day sms
Valentines Day gifts
Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
happy new year images, Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
Bollywood 2015
Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
College Roadies
The News Readers , Speaking News Paper , e-news paper
Independence Day Images and wallpapers
Hyderabad Shops , Shops in Hyderabad , HYD SHOPS, All Hyd Shops"
" Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
Valentines Day Images
Valentines Day Wallpapers
valentines day 2015
Valentines Day pictures
Valentines Day photos
Valentines Day sms
Valentines Day gifts
Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
Valentines Day Images
Valentines Day Wallpapers
valentines day 2015
Valentines Day pictures
Valentines Day photos
Valentines Day sms
Valentines Day gifts
Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
Valentines Day Images
Valentines Day Wallpapers
valentines day 2015
Valentines Day pictures
Valentines Day photos
valentines Day sms
Valentines Day gifts
Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
happy new year images, Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
Bollywood 2015
Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
College Roadies
The News Readers , Speaking News Paper , e-news paper
Independence Day Images and wallpapers
Hyderabad Shops , Shops in Hyderabad , HYD SHOPS, All Hyd Shops"
" Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
Valentines Day Images
Valentines Day Wallpapers
valentines day 2015
Valentines Day pictures
Valentines Day photos
Valentines Day sms
Valentines Day gifts
Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
Valentines Day Images
Valentines Day Wallpapers
valentines day 2015
Valentines Day pictures
Valentines Day photos
Valentines Day sms
Valentines Day gifts
Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
Valentines Day Images
Valentines Day Wallpapers
valentines day 2015
Valentines Day pictures
Valentines Day photos
valentines Day sms
Valentines Day gifts
Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
happy new year images, Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
Bollywood 2015
Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
Valentines Day Images, Valentines Day Wallpapers valentines day 2015
College Roadies
The News Readers , Speaking News Paper , e-news paper
Independence Day Images and wallpapers
Hyderabad Shops , Shops in Hyderabad , HYD SHOPS, All Hyd Shops""
బాబూ అజ్ఞాతా!
Deleteనాదగ్గర నీ పప్పులుడకవ్. ఇవన్నీ నాకెందుకయ్యా! ముసలాడిని పట్టుకుని సరసమాడితే ఉపయఓగం లేదు, మరెవరినైనా చూసుకో! ఇలా పనికిమాలిన పనులు చెయ్యకూ! పేరే చెప్పుకోలేకపోయావంటే నువు చేస్తున్నది తప్పని నీకు తెలుసు కదూ! ఒక సారా మూడు సార్లు నొక్కిపారేశావు, రెండు తీసేశాను, ఒకటుంచా నీ ఆత్మ శాంతికి :) నువు రెచ్చిపోతే నీ కామెంట్లు మొత్తానికి తీసేస్తా.
ధన్యవాదాలు.
సార్ ఈయన ఎవరో కానీ నా బ్లాగులో కూడా ఇదే వ్యాఖ్య పెట్టాడు. స్పామ్ ఫిల్టర్ దాన్ని పట్టేసింది.
DeleteJai Gottimukkala గారు,
Deleteసభ్యత తెలియనివానికేం చెబుతాం చెప్పండి, వ్యాపారం చేసుకోడానికి ఇది స్థలం కాదని తెలియదా? ఏదో ఒక రకంగా పది మందిలో పడాలనే ఈ పనులు :)
ధన్యవాదాలు.
శర్మ గారూ ,
ReplyDeleteనమస్కారములు .
నేనూ మీలాగే నా జనకపితరం పినతండ్రి గారికి దత్తు పోయినాను . అక్కడ ఆస్తుల విషయంలో చాలా బిజీగా వుండటం వలన యివేవీ చూడటం లేదు . నేను ప్రస్తుతం హైదరాబాద్ లో వున్నాను . హైదరాబాద్ లో వుండటం లేదు . పూర్తిగా పల్లెటూర్లో వుంటున్నాను .
మీరు చెప్పిన అంశాలు బాగున్నాయి .
మీ వాళ్ళు ఎలా వున్నారు ? అందరూ కుశలమే కదా !
అందరినీ కుశల సమాచారాలు అడిగానని చెప్పండి .
శర్మాజీ,
Deleteఆ పనులు ముందు చూడండి, ఇది ఎప్పుడూ ఉండేదే!
ధన్యవాదాలు.
>స్వడబ్బా, పరడబ్బా, పరస్పరడబ్బా
ReplyDeleteనండూరిపార్థసారథి గారు 'సాహిత్యహింసావలోకనం' అన్న పుస్తకం వ్రాసారు. చాలా యేళ్ళ క్రిందటే. అందులో 'సొంతడబ్బా, పరడబ్బా, పరస్పరడబ్బా' అని చెప్పి బాగా వివరించారు. ఆ పుస్తకం చాలా మంచి హాస్యరచన. మంచి వ్యంగ్యధోరణిలో నడిపిస్తారు హాస్యాన్ని. (కొన్నాళ్ళ క్రిందట ఇది యర్రంశెట్టి సాయిగారి రచన అని పొరబాటున రమణగారి బ్లాగులో వ్రాసాను.)
శ్యామలీయం గారు,
Deleteపుస్తకం దొరికితే చదవాలండి.
ధన్యవాదాలు.
ఈ పుస్తకం The Universal Digital Library లో కనిపిస్తోందండీ. టైటిల్ సెర్చ్ కోసం తమాషాగా Saahitya Hin'saavalookanan' అని టైప్ చేయాలండి, అ సింగిల్ కోట్స్ సహా.
Deleteశ్యామలరావుగారు,
Deleteమంచి లింక్ ఇచ్చేరు. దరిద్రుడు తలకడిగితే వడగళ్ళవాన ఎదురొచ్చిందట. ఇదిగో ఇలా పలకరించింది, పుస్తకం కనపడలేదు. మళ్ళీ వెతుక్కుంటాలెండి.
"We are currently performing system maintenance at our partner site at IIIT, Hyderabad, India. Some of the books hosted at this site may not be accessible online during this maintenance. Please try back in a few hours."
ధన్యవాదాలు.
నాది కూడ ఇంచుమించు మీ సమస్య లాంటిదే.
ReplyDeleteనా బ్లాగు కూడలి, మాలికలలో కనపడడంలేదు. దానితో ఈ మధ్య వ్రాసిన రెండు టపాలని పది మంది కూడా చదవలేదు.కూడలి, మాలికలకి మెయిల్ ఇస్తే మాలిక వారు బదులిచ్చి సలహా చెప్పారు. కాని పని చేయలేదు. మొత్తం మాలికని సంస్కరిస్తామని అంటున్నారు కాబట్టి వెయిట్ చెయ్యాలి. కూడలి వారు ఎప్పుడు బదులిస్తారో తెలియదు.
ఈ మధ్య ఒక సినిమా బ్లాగ్ మొదలుపెట్టి దానిని అగ్రిగేటర్లతో కలిపాను. అది కూడలి తప్ప మిగతా చోట్ల కనపడుతోంది. ఆ బ్లాగుని కూడలిలో జతపరిచామని వాళ్ళు జవాబిచ్చారు కాని కనపడడంలేదు. మళ్ళీ మెయిల్ ఇస్తే జవాబు లేదు. ఇప్పటికీ సగానికి పైగా బ్లాగు హిట్లు కూడలినుండే అందరికీ వస్తున్నాయని నా అభిప్రాయం. మరి కూడలిని ఎప్పుడు సంస్కరిస్తారో, లేక ఇది వర్డ్‌ప్రెస్ బ్లాగుల సమస్యేనా అన్నది ఎవరైనా చెప్పాలి. బ్లాగిల్లు చక్కగానే ఉన్నా, ఇంకా ఎక్కువమందికి అలవాటవ్వలేదు అనుకుంటున్నాను.
బోనగిరి గారు,
Deleteఆగ్రిగేటర్ల వారు ఈ వర్డ్ ప్రెస్ బ్లాగులతో ఇబ్బంది పడుతున్నట్టేఉంది. ఒక పక్క మన ఒత్తిడి, మరో పక్క బాగుచేయలేకపోయామన్న బాధ, మరో పక్క శలవులు అన్నీ ఒక్క సారి వచ్చెయ్యడం తో పాపం వారు కూడా ఇబ్బందిలో పడినట్టుంది. తొందరలోనే దీనిని సరి చేయగరనుకుంటున్నాను. కూడలి కున్న ఒకే ఒక ప్రత్యేకత "బ్లాగులు జాబితాల్లో కనపడటం" మాలిక చురుకు, బ్లాగులో ప్రచురించిన వెంటనే కనపడుతుంది, టపా, కామెంట్ కూడా. బ్లాగిల్లు లో రెండూ కనపడతాయి, కొద్ది ఆలస్యం మాలికకంటే. మిగిలిన చిన్న ఆగ్రిగేటర్లు వారి పని వారు చేస్తూనే ఉన్నారు. కొంత కాలం ఓపిక పట్టకా తప్పదు. ఈ లోగా నేను మాత్రం ఇదిగో ఈ బ్లాగర్ బ్లాగుకు మారిపోయాననమాట. అందరం మెయిళ్ళిస్తున్నాము, జవాబిచ్చేందుకు కూడా సిబ్బంది కావాలి కదా! శలవులొకటి వచ్చేయి, వారి ఇబ్బందులు వారికున్నాయి. ఆగ్రిగేటర్లు చేస్తున్నది భాష మీదున్న అభిమానం తో సేవ తప్పించి వారికేమీ మిగిలేది లేదు కదా!
ధన్యవాదాలు.
బ్లాగిల్లు శ్రీనివాస్ గారికి,
ReplyDeleteమీరు దయతో కష్టేఫలే బ్లాగులో పెట్టిన రెండు కామెంట్లు స్పాం లోకి వెళిపోయాయి. నిన్న సాయంత్రం చూశాను. ఆ బ్లాగును ప్రయివేట్ బ్లాగుగా చేసేశాను. ఇక్కడి పరిస్థితులలో మార్పొచ్చిన తరవాత ఆ బ్లాగులోనే రాయాలన్నది నాకోరిక కూడా. నాకు ఆ బ్లాగ్ అంటే అభిమానం ఎక్కువ. అందులో సౌకర్యాలు కూడా ఎక్కువ. కొద్ది కాలం రాయడమే మానేద్దామనుకున్నా! తిరిగే కాలూ తిట్టే నోరూ ఊరుకోవని సామెత కదా! అదీ కాక ఒక కళా రూపాన్ని చూశా అరవై సంవత్సరాల కితం చూసినది. దాని గురించి చెబుతానని ఆ కళా కారులకు మాటిచ్చాను. కొన్ని కాగితాలు స్కేన్ కోసం ఆగాను. తొందరలో ఆ టపా రాస్తే వారికిచ్చిన మాట్ పూర్తవుతుందని ఆస.
ధన్యవాదాలు.