చెత్త బ్లాగులు-వాసన లేని పువ్వు
వాసన లేని పువ్వు
వాసన లేని పువ్వు, బుధ వర్గము లేని పురంబు, భక్తి వి
శ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడున్,సద
భ్యాసము లేని విద్య, పరిహాసము లేని వచః ప్రసంగముల్,
గ్రాసము లేని కొల్వు, కొఱగానివి పెమ్మయ సింగధీమణీ!
వాసనలేని పువ్వు నాకు తెలిసి మొల్ల,తెల్లగా ఉంటుంది,వాసనుండదు.బుధవర్గము లేని పురంబు,తెలివైనవారు లేని పట్టణం.నేటి కాలంలో అన్ని పట్టణాల్లోనూ మేధావులే ఉన్నారు కదా! భక్తి విశ్వాసములేని భార్య, పెళ్ళి తగులాటం ఎందుకు? ఉద్రేకం కలిగిందా మగ ఆడ ఆ రాత్రికి దాన్ని చల్లర్చుకుంటే సరి,ఇటువంటి జంటలే పెరుగుతున్నకాలం. ఇక భక్తి విశ్వాసం కతలేం లేవు. గుణవంతుడు కాని కుమారుడున్,అందరూ గుణవంతులే, కాని ఆశ్రమంలో చేర్చేస్తారు,చాకిరీ చెయ్యద్దూ! నిత్యమూ మననం చేసుకోని విద్య,ఆచరణలో లేని విద్య,నిత్యం పుస్తకాలన్నీ చదువుతామా!కావలసివచ్చినప్పుడు రిఫర్ చేస్తాం ఇదీ నేటి విద్య,ఎవరిని తప్పు పడతాం.నోటి లెక్కకి కూడా కేల్కులేటర్ వాడే రోజులుగా! పరిహాసము లేని వచః ప్రసంగముల్, సంభాషణలో చిన్నపాటి హాస్యం ఉండాలిట,నేడు అది అపహాస్యమే, హాస్యం కాదు. గ్రాసములేని కొల్వు, జీతం లేని ఉద్యోగం నేడు ఎవరూ చేయటం లేదు. ఇవన్నీ కొఱగానివి, పనికిరానివన్నారు,కవిగారు. కాని నేటికాలంలో అవే ఉన్నపుడు ఏం చేయగలమన్నదే కొచ్చను????
వాసనలేని పూవు పద్యం చదివినతరవాత ఈ కింది పద్యం గుర్తొచ్చింది శ్యామలీయం వారిది,జిలేబి బ్లాగులో కామెంటుగా.
చెత్త బ్లాగులు చెత్త పోష్టులు చెత్త వ్యాఖ్యలు గుంపులే
ఎత్తి పోతలు వింత భాషల చెత్త కైతలు పోగులే
మొత్తుకోళ్ళులు నెత్తిపొడ్పులు సుత్తిమాటలు రాశులే
వత్తురా యిక పాఠకుల్ మన బ్లాగులోకపు జోలికిన్
శ్యామలీయం గారు,
వందనం. 🙏
మీరు జిలేబి మీదకు తోలినది పెద్దపులో,ఏనుగో తేల్చుకోలేకపోయాను,నా వల్ల కాలేదు. పద్దెం మాత్రం బహు సొగసుగా ఉంది. నడక అద్భుతం, పంచకళ్యాణి నడకలా ఉంది. గణవిభజన చేయలేకపోయా,మన్నించి ఏ వృత్తమో చెప్పగోర్తాను.
ఇది మీరు జిలేబి మెడలో వేసిన అభినందన మందారమాలగా తలుస్తున్నాను. 'పగున్నచోట తిడితే భక్తున్నచోట తగిలిందనీ' నానుడి.
ఇకపద్యంలో కెళితే చెత్తపోస్టులు,చెత్త వ్యాఖ్యలు గుంపులే,ముమ్మటికిన్నీ నిజం. నా బ్లాగుల్లో ఉన్నవన్నీ చెత్తపోస్టులే,నాకుతోచిన గాలిమాటలు రాసుకున్నాను. "శర్మ కాలక్షేపం కబుర్లు" అని మకుటం పెట్టి మరీ రాసుకున్నా కదుసార్! ఎవరినీ నా బ్లాగుకు రమ్మని పిలవలేదు.వచ్చినవారిని పలకరించక మానలేదు. సరే ఇక నా వ్యాఖ్యలు కూడా చెత్తవే. నిజంగానే పోస్టులు,వ్యాఖ్యలు గుంపులే కాదు రాశులే.నా మీద అభిమానం కొద్దీ గుంపులనేసేరు,అంతే! తరవాత సత్యం చెప్పేరు సార్! అవన్నీ జిలేబి ప్రత్యేకతలని చెప్పక చెప్పేరు కదు సార్! ఎంతేని జిలేబి మీద అభిమానంకదా! మీ జిలేబి శతకాలకి కృతిభర్త కూడా కదా,జిలేబి. అభిమానాన్ని ఈ రకంగా కూడా వ్యక్తం చేయచ్చన్నమాట. కొత్త సంగతి తెలుసుకున్నా సార్!
నేను వ్రాసినది మత్తకోకిల విశేషం. (విశేషం అనటం ఎందుకంటే శాస్త్రీయంగా ఐతే సంస్కృతవృత్తంలో ప్రాసయతికి చోటులేదు. ఇందులో తరచుగా ప్రాసయతిని చెల్లించాను.) లయప్రధానమైన పద్యం కాబట్టి ప్రాసయతి అందగించింది లాక్షణికం కాకపోయినా.
రిప్లయితొలగించండిశ్యామలీయం వారు,
రిప్లయితొలగించండివందనం,🙏అభినందనం.
కాలుకదపలేని స్థితిలో కూడా నా చెత్త టపాకి జవాబిచ్చారు.సంతసం.ఆరోగ్యం ముందు,ఆ తరవాతే ఏదైనా. శరీరమాద్యం ఖలు ధర్మసాధనం,తెలియనివారు కాదు,ఏదో ఇలా చెత్త సలహాలిచ్చేస్తూ ఉంటాను,ఉబోస కదండీ!.😜అంతే! ఇది మీకు తెలియనిదీ కాదు.
ఇది మత్తకోకిల విశేషం అని గుర్తించలేకపోయాను.పులో,ఏనుగో అనుకుని భ్రమ పడ్డాను. 🤣మిమ్మల్ని శ్రమ పెట్టాను. రాగ వరసను చదువుకోడానికి బలే బాగుంది,కాని మూడో పాదంలో మొత్తుకోళ్ళులు శబ్దం మంచి పులిహారలో కొద్దిగానానిన శనగబద్ద అనుకుని కొరికితే పలుగురాయిలా తగిలింది. మొత్తుకోలు ఏకవచనం,మొత్తుకోళ్ళు బహువచనం,మొత్తుకోళ్ళులు విన్నట్టులేదు. ఇది సంస్కృతబాణీలో అనేకవచనమా? బోధపడలేదు.మొత్తుకోలులు అంటే గణభంగం జరుగుతుందేమో! మొదటిపాదంలో గుంపులే బదులుగా రాశులే అన్నా గణభంగం జరగదనుకుంటాను. మొదటిపాదంలో చెత్త,చెత్త,చెత్త అని ముమ్మారు నొక్కి వక్కాణించారు.శ్రావణమాసపు జడివానలా అక్షతలు జోరున జల్లేసేరు నా మీద. 😜🙏 రెండో పాదం దగ్గరకొచ్చేసరికి చెత్త ఒక సారికే పరిమితమైపోయింది అక్షతలు స్వాతి చినుకుల్లా రాలాయి. 🤣ఎంతైనా అల్లుడు అభిమానం చూపించుకున్నారు లెండి. ఆ తరవాతనుంచి దోషాలు గుణాల్లా పరుగులు పెట్టేయి. ఇదేమి,పులో,ఏనుగో అనుకున్నానే,ఇంతాచేస్తే కోకిలా అదీ మత్తకోకిల. వసంతాగమనాన్ని గొంతెత్తి కూసే మత్తకోకిల,ఇక్కడా అభిమానం చూపుకున్నారు లెద్దురూ! గాండ్రింపులు,ఘీంకారాలూ లేక,కోకిల కూతలే వినిపించేరు.. 😂
మేమూ బతకాలి కదుసార్! 🙏
ఏమైనాగాని పద్యం సూపర్ సార్! 👍
ఆరోగ్యం జాగర్తా!
ఏదో అనేసేననుకుని ఇబ్బంది పడకండి సార్!. 🙏
మొత్తుకోలులు లేదా మొత్తుకోళులు అని వ్రాయటమే అభిమతం అండీ. కాని స్వాధీనంలో ఆట్టే లేని కుడిచేతికి తోడు మొబైల్ మీద టైపింగు సర్కసు ఒకటి కావటంతో మొత్తుకోళ్ళులు అని పడింది. గణభంగం ఐతే కాలేదు. మీరన్నట్లు పులిహోరలో పలుగురాయే ఐనది కదా.
రిప్లయితొలగించండిరాబోయే పరాభవ సంవత్సరానికి మీ అల్లుడు జిలేబికి మంచి కానుకే ఇచ్చారు.
తొలగించండిఅనుమానం తీర్చినందుకు శత ధన్యవాదాలు.
ఓ హో శ్యామలీయంవారి ఈ మత్తు కోక్ ( ఇలా) మీ పైన వ్రాసినదా తాతగారండీ
రిప్లయితొలగించండిఎవరి పైన విసురో అనుకుంటా వుంటిని
ఇప్పటికి తెలిసేను తాతగారి పైన అని
ఎంతైనా మన శ్యామలీయంవారే కదా మన్నించేడి తాతగారూ
జిలేబి,
తొలగించండినీకోచిన్నకత చెబుతా విను,
పూటకూళ్ళమ్మతో, తనుంచుకున్న సాని ఎదురుగా చీపురు దెబ్బలు తిన్న గిరీశం బయటకొచ్చి గోతాలు కోసినట్టు అనిపిస్తోదనుకుంటున్నారు,జనం.కిందపడ్డా నాదే పైచేయి అనే నీలా. నానుడిలా.
నీలాటివాడిని మావగారు పండక్కి పిలిచాట్ట. పండక్కెళితే పాత చెప్పులదండ మెళ్ళో వేసాట్ట మావగారు,పండగ బహుమతిగా.. లోపల మావగారి మీద కుసకుసలాడి బయటికొచ్చిన జిలేబికి నాలాటివాడు ఎదురయ్యాట్ట. "ఏంటీ పండక్కి మావగారు నీకు సన్మానం చేసాట్ట",అడిగాడు. "చేసార్లే" అన్నాడు జిలేబి,మొహం తిప్పుకుంటూ. "చెప్పులదండేసేట్టుగా?" అడిగాడు నాలాటోడు. "ఎవడు చెప్పేడు నీకిది,జోడుగుళ్ళబారు పిస్తోలుతో టపటపా కాల్చేస్తాను వాణ్ణి" అని వెంకటేశం దగ్గర గొప్పలుపోయిన గిరీశంలా చెప్పేడు,జిలేబి. ఇంకా కోతలు కోస్తూ అవును "అది చెప్పులదండే ఏచెప్పులో తెలుసా! అవి ఎంకన్నబాబు పాదముద్రలు బంగారంలో చేయించి నా మెళ్ళో వేసేడని" గొప్పపోయాట్ట,జిలేబి. "ఏదీ నన్ను చూడనీ" అడిగేట్ట వదిలిపెట్టని నాలాటివాడు. "అబ్బే !!!అది అప్పుడే మాయావిడ దాచేసుకుందని" మరో గోతం కోసేట్ట జిలేబి. అలా ఉంది నీ వ్యవహారం.
దినికేం! మావా అల్లుళ్ళ మధ్య సరసం, నాకెందు కొచ్చిన తలనొప్పి,చెప్పు. సరసం పర్లేదు కాని అది చెయిముట్టుసరసం ఐతేనే బావోదు,మావా అల్లుళ్ళకి,మాకూ కూడా.తెరియమా!
కమేతో చాలా తెల్లకాలరు ఉజ్జోగాలు పోతాయని మేధావులంతా తలలూ పట్టుకుంటున్నారుట. ఏం ఉజ్జోగాలుంటాయని ఊహిస్తున్నరంతా! మన వెంబు ఈ ఉజ్జోగాలుంటాయంటున్నాడు,చూడు
Zoho founder Sridhar Vembu reveals list of 10 jobs that are safe from AI and pay well https://www.indiatoday.in/jobs/story/zoho-founder-sridhar-vembu-reveals-list-of-10-jobs-that-are-safe-from-ai-and-pay-well-tchc-2875448-2026-02-27?utm_source=washare&utm_medium=socialicons&utm_campaign=shareurltracking
లింకులో.
నేనకునీదీ చెప్పేస్తా విను.
పురాతనకాలం నుంచీ ఉన్న వేశ్యా వృత్తి కొనసాగుతుంది.సహజంగా తెలివైన పిల్లల్ని పుట్టించే వృత్తి ఉంటుంది. పిల్లని కనే వృత్తీ ఉంటుంది. పెంచే వృత్తి వుంటుంది. కమ్మగా వంట చేయగల వృత్తి కొనసాగుతుంది.ముసలోళ్ళని చూసుకునే వృత్తీ ఉంటది. గుళ్ళో గంటకొట్టే వృత్తి వుంటది.నేలని నమ్ముకు బతికేనాలాటోడికి ఢోకాలేదు తెలివైన,బలమున్నోళ్ళే బతుకుతారు. నువ్వు ఎందులో జేరిపోతావో,లేదా జారిపోతావో చూసుకో!
నేలను నమ్ముకునే వాళ్లకు ఢోకా రాకుండా వాళ్లు పండించే వాటికి మార్కెట్టు క్రియేట్ చేసే బువ్వ తినేవాళ్ల వృత్తికి సెటిల్ అయిపోదామని అనుకుంటున్నానండీ తాతగారూ
తొలగించండిచూడండి మీలాంటివారికి ఎంత మేలు చేస్తున్నానో ఆయ్
బ్రోకరు ఉద్యోగాలుండవ్,బువ్వకావాలంటే మా దగ్గరకి రావాల్సిందే!!! లేదా మాడి చావాల్సిందే!!!!!!
తొలగించండిమమ్మల్ని పస్తు బెట్టి మీరేమి చేస్తారండీ పంటలు ? అన్నీ కుళ్లి పోతాయిసుమా
తొలగించండికాబట్టి బుద్ధిగా ఒకరికి ఇంకొకరు వత్తాసనుకొని నేలను నమ్ముకొనుడీ :)
దేహీ అని వచ్చినవాళ్ళని నాస్తి అని ఎప్పుడూ పంపం.అది రక్తంలో నిండి ఉన్న మా అలవాటు.
తొలగించండిమమ్మల్ని నమ్ముకున్నవాళ్ళకి పెట్టడంకోసం ఒక ముద్ద తక్కువ తినడానికిన్నీ వెరవం. ఈ రోజువరకు మమ్మల్ని అమ్ముకున్నవాళ్ళుకూడా నీలా, మా మీద జలగల్లా బతికేసేరు. ఇక ముందు జలగలకి పెట్టలేమేమో అన్నదే సందేహం.