19, ఫిబ్రవరి 2026, గురువారం

ఊసుపోకపోతే ......

  ఊసుపోకపోతే .......


ఊసుపోకపోతే ఊళ్ళో చుట్టరికం!

ఏమీ తోచుబాటు కాకపోతే,అంటే కాలక్షేపం కాకపోతే, ఊళ్ళో వియ్యమందమని ఈ నానుడి భావన. దెబ్బలాటకి కావలసినంత సావకాశం,కావలసినంత తోచుబాటున్నూ...


ఏ ముడ్డిలో వేలెట్టినా పీతికంపే!

పల్లెలలో చెప్పుకునే నానుడులు ఇలాగే ఉంటాయి. మానవులు ఎంతటివారైనా అందరి మనస్తత్వం ఒకటే మార్పు ఉండదు. ఎలాగంటే అందరూ తినేది ఆ ఆహారమే విసర్జించేదీ అదే! ఆహారం శరీరంలో శోషించినపుడు జరిగే ప్రక్రియలో ఎమినో ఆసిడ్స్ పీతికంపు కొడతాయి. అందుకే ఎవరు విసర్జించినదైనా ఒకటే వాసన,మసస్తత్వం లాగా!


పెరటి చెట్టు మందుకు పనికిరాదు.

పెరటిలో పెరిగిన చెట్టు మందుకు పనికిరాదంటే సంరక్షణ జరిగినది కనక ఔషధ గుణాలు కోల్పోతుందని చెప్పడం. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి