కార్లు బాబోయ్ కార్లు.
ఒకప్పుడు ఊరికో కారుంటే గొప్ప. అదిన్నీ అంబాసిడరే. కారంటే అంబాసిడర్ మాత్రమే అనుకున్నరోజులూ ఉన్నాయి. ఆ తరవాత పడవంత కారు ప్లిమత్ చూడ్డం జరిగింది. ఆ తరవాత బుల్లికారున్న షోకిలా అబ్బాయి అన్నట్టు ఫియట్ చూసాను. ఎప్పుడూ కార్లు నాచుట్టూ ఉన్నాయిగాని కారెక్కిందే బహు తక్కువ. ఇప్పుడు చెప్పెదేలేదు ఇంటి చుట్టూ కార్లే. ఇంటి ముందు మూడు కార్లు ఎప్పుడూ నిలబడి ఉంటాయి. బయటికి లోపలికి తిరిగేందుకు జాగా ఉండదు ఒక్కో సారి.ఇంటి ముందు, ఒక కార్ పార్క్ స్థలం ఖాళీ చేయించుకోడానికి కష్టపడ్డాము.
మాది పెద్దపల్లెటూరనే చెప్పాలి.మా చుట్టూ 20 దాకా గేటెడ్ కమ్యూనిటీ లు ఉన్నాయి. అంటే తక్కువలో తక్కువ 400 కార్లు లెక్క. ఇక బయటవాటితో లెక్కేస్తే 500 ఉండచ్చు,మా ఏరియాలోనే . ఊరు మొత్తం మీద 100 పైన గేటెడ్ కమ్యూనిటీ లున్నాయి. ఎన్ని కార్లున్నట్టు? ఏ గేటెడ్లో కూడా కార్ పార్క్లు ఖాళీగా ఉండవు.ఒంటరి ఇళ్ళలో కార్లు లెక్కేయ లేదు. ఊళ్ళో అద్దెకు కార్ పార్కులు వెలిసాయి. నెలకు 3000 అద్దె ఒక కార్ పార్క్ కి. మల్టీ స్టోరీ కార్ పార్క్ లు తొందరలోనే వచ్చే సావకాశం ఉందనుకుంటున్నాను. ఒక్కొక ఇంట్లో మనుషులకంటే కార్ల సంఖ్య ఎక్కువున్నటే ఉంది. ఒకాయన పక్క కాళీ స్థలంలో కార్ పార్క్ కట్టరాదా అని అడిగితే వేసిన లెక్కిది.
1. 50 లక్షల విలువైన 400చ.గ స్థలంలో మరో 50 లక్షలు ఖర్చుచేసి ఇల్లు కట్టి అద్దెకిస్తే నెలకు వచ్చే అద్దె 10వేలు మించదు.
2. 50 లక్షల విలువైన 400 చ.గ ల స్థలంలో ఒక కార్ పార్క్ కడితే అయే కర్చు 3నుంచి 4 లక్షలు. ఒక తాళం వేసే కార్ పార్క్ లో 8 కార్లు నిలపచ్చు.కరంటు ఖర్చు నెలకు 500.పంచాయతి పన్ను సం.కి 5 వేలు మించదు.
3. పై స్థలంలో,రెండంగుళాల బోర్ కొట్టి, (300 అడుగుల్లోగాని నీరు దొరకదు,నాలుగు లక్షలవుతుంది). కార్ వాష్ షెడ్ కు,ఉన్న చెట్లు వగైరా కదల్చకుండా ఉంచి, సంవత్సరానికి 12వేలు అద్దె ఇస్తూ, నాలుగేళ్ళ తరవాత బోర్,సబ్మెరిస్బుల్ మోటార్లను పనిచేసే స్థితిలో వదిలేసి వెళ్ళడానికి అద్దెకివ్వడం. 3ఫేస్ కరంటు ఇవ్వాలి,బిల్లులు కట్టుకుంటాడు. పై షరతులతో అద్దెకివ్వడం.
ఏది తెలివైన పెట్టుబడి?
తాతగారి కారు మ్యాథ్సు అమోఘము
రిప్లయితొలగించండిఇది కూడా ఇతరుల కడ్వైజ్ మాత్రమేనా
లేక సొంత బిజీ నెస్సు పెడతారాండీ ?
నాకు యాపారం చేసే ఓపికెక్కడబ్బా! నాకు డబ్బు వద్దని చెప్పేనుకదా!
తొలగించండిలెక్కలెక్కే! చూసుకోకుండా దూకితే ములిగిపోవడం ఖాయం,ఎవరికైనా!ఇదీ సలహా కోసం వచ్చిందే. ఏదో ఒకటి ఒప్పించమని నాపై ఒత్తిడి. ఇంతకీ స్థలమూ నాది కాదు.
1.మొదటిది శుద్ధ దండగ పెట్టుబడి. Dead asset
2.రెండవదానికి కొంచం చాకిరీ ఉంటుంది,ఓపికుండి చేసుకుంటే మంచిదే . Good return.
3.మూడవదాంట్లో చూసుకోకపోతే అనవసర చిక్కుల్లో పడతాo. అది చూడ్డానికి బాగుంది. లెస్సీ మనదగ్గర అగ్రిమెంట్ రిజిస్టర్ చేయించుకుని అప్పుకి బాంకుకు వెళతాడు. బేంక్ లోన్ ఇస్తాం వయబుల్ ప్రాజక్ట్ ఓనర్ చేత గారెంటార్ సంతకం చేయించమంటుంది. అసలు తిరకాసు ఇక్కడ మొదలవుతుంది. లెస్సీ వ్యాపారం నడిస్తే సరే, కిస్తులు కట్టక చేతులెత్తిపోతే ఓనర్ కి తగులుకుంటుంది,అప్పు. ఇది పనికిరానిది. అప్పు తగిలించుకోవడం అవుతుంది.
ఇచ్చోట ఉచిత సలహాలివ్వ బడున్ :)
రిప్లయితొలగించండియాపారమునకు లేదోయ్
ఓపిక ! మిత్రులడుగంగ నుచితము గా నే
నో పారి లెక్క వేసితి
ఆ పెరుమాళ్లకెరుక సరి యగునో కాదో!
ఓయ్! జిలేబి.
తొలగించండిసలహాలు చెప్పబడును అని బోర్డ్ పెట్టుకుకూచుని సంపాదించటం లేదు. నా దగ్గరకొచ్చి అడిగినవారికే సలహాలివ్వబడున్. నీకూ చాలా సార్లే ఇచ్చా,సలహా ,నా బ్లాగు దగ్గరకొస్తేనే,అదీ ఉ.స యే.. నీ దగ్గరకొచ్చి చెప్పలేదెప్పుడూ. అది నా అలవాటూ కాదు. మొన్ననే గోల్డ్ కొనకని చెప్పేనుగా,చెయ్యి కాల్చుకున్నావో,కాలేకా చెయ్యి ఊదుకున్నావో,నీకే తెలియాలి.🤣
పద్యమో గిద్యమో ఏదో రాసిపారేసేవుగా అందులో మూడో పాదంలో పారి అనే పదం ఉపయోగించావు. అక్కడ పారి అంటే అర్ధమేమోంటో తెలియలేదు. దానికంటే తూరి/సారి పదాలు వాడుకుంటే అందంగా ఉంటుంది,చూసుకో!!!🤣
గోల్డు ఎక్కడికి దాకా పడి పోవచ్చండి ?
తొలగించండిబంగారం తగ్గే సూచనలు తక్కువ,యుద్ధంలో పెరిగే సూచనలే ఎక్కువ. సెప్టెంబర్ దాకా అస్థిరం, దూకే ముందు చూసుకు దూకు. Look before you leap
తొలగించండి:)
తొలగించండిఈ పాటి దానికి ఇంత బిల్డప్పాండి తాతగారూ ? ఒక చేత్తో కొని ఇంకో చేత్తో అమ్మేయండి సరిపోతుంది :)
ఓహో!చిల్లరబేరమా!! కానీ. చెయ్యిమారడంలో తేడా వస్తే ములుగు ఖాయం. అస్తు.🤣
తొలగించండిచిల్లర బేరంలోనే దస్కం పుష్కలమండి తాతగారు ఐదు నిమిషాల తేడాలో మీరు కొన్న బంగారం ధర ఆవిరి మరో ఐదు నిముషాలలో ఆకాశమే హద్దు ఇల్లాంటి మార్కెట్టులో చేయి ఖాళీ గా వుంటేనే గిట్టుబాటు అయ్యో నాబంగారమ్మే అని అట్టేసుకుంటే చివరకు మిగిలేది .....:)
తొలగించండిచిల్లర శ్రీమహాలక్ష్మి నానుడి కదా! అలాగే చినుకు చినుకు కలిస్తే సముద్రం మరో నానుడి. కాని ఇక్కడ అలా జరిగేది తక్కువ. ట్రాన్సేక్షన్ టెక్సులు,చివరకు ఐ.టి లెక్కేసుకుంటే కుంచమ్మ కూడబెడితే మంచమ్మ మాయం చేసిందన్న నానుడైపోగలదు. ఆపై నీచిత్తం. మరో మోటు సామెత చెబితే బాగోదులే ఇక్కడికి చాలు. 🤣
రిప్లయితొలగించండి-
తొలగించండిఎంత సింపుల్ గా చిల్లర మాలచ్చి కరుణ, నిర్మలమ్మ కటాక్షమ్ - "కట్ టాక్స్ క్షమ్" జీవిత విషాదాన్ని అక్షరాల్లోకి వొంపారో… గ్రేట్!
ఎంత దగ్గరయ్యారండి ! సొంత మను
రిప్లయితొలగించండిషులు కదా ! యిద్ద రొక్కరే ? చూడగ , నని
పించి , బ్రమ పడంగ వలసె , ప్రేమ లొలక
నొకరి కొకరుగ చర్చించ , నొడ బడితిర ?
400 గజాల్లో పూలు, కూరగాయలు పెంచుకుంటే ఆరోగ్యం, ఆనందం, కొంచెం ఆదాయం.
రిప్లయితొలగించండి