కార్లు బాబోయ్ కార్లు.
ఒకప్పుడు ఊరికో కారుంటే గొప్ప. అదిన్నీ అంబాసిడరే. కారంటే అంబాసిడర్ మాత్రమే అనుకున్నరోజులూ ఉన్నాయి. ఆ తరవాత పడవంత కారు ప్లిమత్ చూడ్డం జరిగింది. ఆ తరవాత బుల్లికారున్న షోకిలా అబ్బాయి అన్నట్టు ఫియట్ చూసాను. ఎప్పుడూ కార్లు నాచుట్టూ ఉన్నాయిగాని కారెక్కిందే బహు తక్కువ. ఇప్పుడు చెప్పెదేలేదు ఇంటి చుట్టూ కార్లే. ఇంటి ముందు మూడు కార్లు ఎప్పుడూ నిలబడి ఉంటాయి. బయటికి లోపలికి తిరిగేందుకు జాగా ఉండదు ఒక్కో సారి.ఇంటి ముందు, ఒక కార్ పార్క్ స్థలం ఖాళీ చేయించుకోడానికి కష్టపడ్డాము.
మాది పెద్దపల్లెటూరనే చెప్పాలి.మా చుట్టూ 20 దాకా గేటెడ్ కమ్యూనిటీ లు ఉన్నాయి. అంటే తక్కువలో తక్కువ 400 కార్లు లెక్క. ఇక బయటవాటితో లెక్కేస్తే 500 ఉండచ్చు,మా ఏరియాలోనే . ఊరు మొత్తం మీద 100 పైన గేటెడ్ కమ్యూనిటీ లున్నాయి. ఎన్ని కార్లున్నట్టు? ఏ గేటెడ్‌లో కూడా కార్ పార్క్‌లు ఖాళీగా ఉండవు.ఒంటరి ఇళ్ళలో కార్లు లెక్కేయ లేదు. ఊళ్ళో అద్దెకు కార్ పార్కులు వెలిసాయి. నెలకు 3000 అద్దె ఒక కార్ పార్క్ కి. మల్టీ స్టోరీ కార్ పార్క్ లు తొందరలోనే వచ్చే సావకాశం ఉందనుకుంటున్నాను. ఒక్కొక ఇంట్లో మనుషులకంటే కార్ల సంఖ్య ఎక్కువున్నటే ఉంది. ఒకాయన పక్క కాళీ స్థలంలో కార్ పార్క్ కట్టరాదా అని అడిగితే వేసిన లెక్కిది.
1. 50 లక్షల విలువైన 400చ.గ స్థలంలో మరో 50 లక్షలు ఖర్చుచేసి ఇల్లు కట్టి అద్దెకిస్తే నెలకు వచ్చే అద్దె 10వేలు మించదు.
2. 50 లక్షల విలువైన 400 చ.గ ల స్థలంలో ఒక కార్ పార్క్ కడితే అయే కర్చు 3నుంచి 4 లక్షలు. ఒక తాళం వేసే కార్ పార్క్ లో 8 కార్లు నిలపచ్చు.కరంటు ఖర్చు నెలకు 500.పంచాయతి పన్ను సం.కి 5 వేలు మించదు.
3. పై స్థలంలో,రెండంగుళాల బోర్ కొట్టి, (300 అడుగుల్లోగాని నీరు దొరకదు,నాలుగు లక్షలవుతుంది). కార్ వాష్ షెడ్ కు,ఉన్న చెట్లు వగైరా కదల్చకుండా ఉంచి, సంవత్సరానికి 12వేలు అద్దె ఇస్తూ, నాలుగేళ్ళ తరవాత బోర్,సబ్మెరిస్బుల్ మోటార్లను పనిచేసే స్థితిలో వదిలేసి వెళ్ళడానికి అద్దెకివ్వడం. 3ఫేస్ కరంటు ఇవ్వాలి,బిల్లులు కట్టుకుంటాడు. పై షరతులతో అద్దెకివ్వడం.
ఏది తెలివైన పెట్టుబడి?
తాతగారి కారు మ్యాథ్సు అమోఘము
రిప్లయితొలగించండిఇది కూడా ఇతరుల కడ్వైజ్ మాత్రమేనా
లేక సొంత బిజీ నెస్సు పెడతారాండీ ?
నాకు యాపారం చేసే ఓపికెక్కడబ్బా! నాకు డబ్బు వద్దని చెప్పేనుకదా!
తొలగించండిలెక్కలెక్కే! చూసుకోకుండా దూకితే ములిగిపోవడం ఖాయం,ఎవరికైనా!ఇదీ సలహా కోసం వచ్చిందే. ఏదో ఒకటి ఒప్పించమని నాపై ఒత్తిడి. ఇంతకీ స్థలమూ నాది కాదు.
1.మొదటిది శుద్ధ దండగ పెట్టుబడి. Dead asset
2.రెండవదానికి కొంచం చాకిరీ ఉంటుంది,ఓపికుండి చేసుకుంటే మంచిదే . Good return.
3.మూడవదాంట్లో చూసుకోకపోతే అనవసర చిక్కుల్లో పడతాo. అది చూడ్డానికి బాగుంది. లెస్సీ మనదగ్గర అగ్రిమెంట్ రిజిస్టర్ చేయించుకుని అప్పుకి బాంకుకు వెళతాడు. బేంక్ లోన్ ఇస్తాం వయబుల్ ప్రాజక్ట్ ఓనర్ చేత గారెంటార్ సంతకం చేయించమంటుంది. అసలు తిరకాసు ఇక్కడ మొదలవుతుంది. లెస్సీ వ్యాపారం నడిస్తే సరే, కిస్తులు కట్టక చేతులెత్తిపోతే ఓనర్ కి తగులుకుంటుంది,అప్పు. ఇది పనికిరానిది. అప్పు తగిలించుకోవడం అవుతుంది.
ఇచ్చోట ఉచిత సలహాలివ్వ బడున్ :)
రిప్లయితొలగించండియాపారమునకు లేదోయ్
ఓపిక ! మిత్రులడుగంగ నుచితము గా నే
నో పారి లెక్క వేసితి
ఆ పెరుమాళ్లకెరుక సరి యగునో కాదో!
ఓయ్! జిలేబి.
తొలగించండిసలహాలు చెప్పబడును అని బోర్డ్ పెట్టుకుకూచుని సంపాదించటం లేదు. నా దగ్గరకొచ్చి అడిగినవారికే సలహాలివ్వబడున్. నీకూ చాలా సార్లే ఇచ్చా,సలహా ,నా బ్లాగు దగ్గరకొస్తేనే,అదీ ఉ.స యే.. నీ దగ్గరకొచ్చి చెప్పలేదెప్పుడూ. అది నా అలవాటూ కాదు. మొన్ననే గోల్డ్ కొనకని చెప్పేనుగా,చెయ్యి కాల్చుకున్నావో,కాలేకా చెయ్యి ఊదుకున్నావో,నీకే తెలియాలి.🤣
పద్యమో గిద్యమో ఏదో రాసిపారేసేవుగా అందులో మూడో పాదంలో పారి అనే పదం ఉపయోగించావు. అక్కడ పారి అంటే అర్ధమేమోంటో తెలియలేదు. దానికంటే తూరి/సారి పదాలు వాడుకుంటే అందంగా ఉంటుంది,చూసుకో!!!🤣
గోల్డు ఎక్కడికి దాకా పడి పోవచ్చండి ?
తొలగించండిబంగారం తగ్గే సూచనలు తక్కువ,యుద్ధంలో పెరిగే సూచనలే ఎక్కువ. సెప్టెంబర్ దాకా అస్థిరం, దూకే ముందు చూసుకు దూకు. Look before you leap
తొలగించండి:)
తొలగించండిఈ పాటి దానికి ఇంత బిల్డప్పాండి తాతగారూ ? ఒక చేత్తో కొని ఇంకో చేత్తో అమ్మేయండి సరిపోతుంది :)
ఓహో!చిల్లరబేరమా!! కానీ. చెయ్యిమారడంలో తేడా వస్తే ములుగు ఖాయం. అస్తు.🤣
తొలగించండిచిల్లర బేరంలోనే దస్కం పుష్కలమండి తాతగారు ఐదు నిమిషాల తేడాలో మీరు కొన్న బంగారం ధర ఆవిరి మరో ఐదు నిముషాలలో ఆకాశమే హద్దు ఇల్లాంటి మార్కెట్టులో చేయి ఖాళీ గా వుంటేనే గిట్టుబాటు అయ్యో నాబంగారమ్మే అని అట్టేసుకుంటే చివరకు మిగిలేది .....:)
తొలగించండిచిల్లర శ్రీమహాలక్ష్మి నానుడి కదా! అలాగే చినుకు చినుకు కలిస్తే సముద్రం మరో నానుడి. కాని ఇక్కడ అలా జరిగేది తక్కువ. ట్రాన్సేక్షన్ టెక్సులు,చివరకు ఐ.టి లెక్కేసుకుంటే కుంచమ్మ కూడబెడితే మంచమ్మ మాయం చేసిందన్న నానుడైపోగలదు. ఆపై నీచిత్తం. మరో మోటు సామెత చెబితే బాగోదులే ఇక్కడికి చాలు. 🤣
రిప్లయితొలగించండి-
తొలగించండిఎంత సింపుల్ గా చిల్లర మాలచ్చి కరుణ, నిర్మలమ్మ కటాక్షమ్ - "కట్ టాక్స్ క్షమ్" జీవిత విషాదాన్ని అక్షరాల్లోకి వొంపారో… గ్రేట్!
జిలేబి,
తొలగించండిచిల్లర శ్రీమహాలక్ష్మి నిజమే కాని చూస్తుండగా వేళ్ళలోంచి జారిపోతుంటే, చూస్తూ బాధపడతం,శ్రమ మిగులుతుంది. ఆపై నీ ఇష్టం.
ఎంత దగ్గరయ్యారండి ! సొంత మను
రిప్లయితొలగించండిషులు కదా ! యిద్ద రొక్కరే ? చూడగ , నని
పించి , బ్రమ పడంగ వలసె , ప్రేమ లొలక
నొకరి కొకరుగ చర్చించ , నొడ బడితిర ?
రాజావారు,
తొలగించండిజిలేబి గురించినమాట నా బ్లాగులో చెప్పి,చెప్పి అలసిపోయాను. నేను జిలేబి ఒకటే అనుకున్నా,నేను జిలేబి విడతీయలేని దోస్తులమనుకున్నా,ఎవరేమనుకున్నా, నా అభ్యంతరమేం లేదు.
నాపేరు భాస్కరుడు. సూర్యనమస్కారాలలో మొదటినామం మిత్రుడు,చివరిది భాస్కరుడు. అలాగే ఈ భాస్కరునికి కూడా అందరూ మిత్రులే. తమరే ఒకప్పుడు బ్లాగులోకాన వెలసిన భాస్కరుండు అని శలవిచ్చారు. 🙏 దానిని జమకాతాలో రాసుకున్నాను.మీరు ఇప్పుడేమనుకున్నా,సంతసమే.🙏 ఇక నన్ను శత్రువుగా పరిగణించుకున్నవారు ఉంటే అదివారి భావదారిద్ర్యానికి గుర్తు.
ఇక జిలేబి గురించి బ్లాగుల్లో ఉన్న అందరికీ ఎరుకే. 🙏
చెప్పి చెప్పి యలసి , శ్రీమహాలచ్చిమి
తొలగించండి'ఊరు , పేరు' చెప్ప నొప్పరైరి
రాజసాన తాను రైరైయని బ్లాగు
జనుల మీద పడెడు జడుపులేక .
ఎంతైనా మా తాతగారండీ
తొలగించండిఅలా అప్పనంగా వదిలేస్తారా వారు మమ్మల్ని రాజావారూ :)
రాజావారు,
తొలగించండినాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి.🤣 సారూ! బ్లాగుల్లో నాకంటే మీరంతా సీనియర్లు,నేను బ్లాగుల్లో కొచ్చేనాటికే జిలేబి ముదిరిపోయింది,మీరంతా కలసి గొప్పచేసేసేరు. మొక్కై వంగనిది మానై వంగునా? నానుడిలా ఇలా ముదిరిపోయి అందరి మీదా అసిరమ్మలా నోరెట్టుకు పడిపోతోంది. బాబోయ్! నన్ను వేధిస్తోందన్నరోజు ఎవరు మాటాడేరూ? ఒక్క శ్యామలీయం తప్ప. ఇప్పుడు పిల్లి మెడలో గంట కట్టే ఆలోచన చందమైయిందిగదా! ఒక వారంలో అమాస రానుంది. యుద్ధం ప్రకటించండి జిలేబి మీద,( మహాభారత యుద్ధం అమాసరోజే మొదలయింది,ముహూర్తం మంచిది.) నేనూ వస్తా! ముందుండిపోరాడలేను,వయసైపోయిందిగా! మీరంతా యువకులు,ఆలస్యం వద్దు, ఊరకచూచుచు నుండువాడ,తోచిన సాయము చేయువాడ,ఆయుధమున్ ధరింప. మీదే ఆలస్యం. 🙏
జిలేబి,
తొలగించండినిన్నెక్కడ వదులుతాను. ఒక సారి నా పరిధిలోకి రాకపోవాలి,వచ్చినవారెవరూ వదలిపోలేరు. అదంత తేలిక కాదు,నేను వదలా. బొమ్మాళీ నిన్నొదలా!
ఊరక చూచుచుండుటలు ' ఉత్తిదె ' , ఆ పరమాత్మ తానెయై
తొలగించండిభారత యుధ్ధమంతటిని పర్వము జేసె , మహోగ్ర భాస్కరుల్
' పోర ' జిలేబి ధీ మతుల పోడిమి దేల్తురు గాక ! శౌరియై ,
పోరగ వారితోడ మము బోటులు చాలరు , మీరె చాలుదుర్ .
వెంకట రాజారావు . లక్కాకుల13 మార్చి, 2026 10:16 AMకి
తొలగించండినిజం సార్! ఓపిక లేదు, పోరాడే శక్తి నశించింది. యువకులు మీరు ముందుకు దూకాలి.
తెలుగు వీర లేవరా! దీక్ష బూని సాగరా! దుష్టజిలేబీని ఖండించరా!
చూచుచునుండువాడ! తోచిన సాయము చేయువాడ!! ఆయుధమున్ ధరింప!!!( ఓపిక నశించింది కదు సార్!)🙏
డెబ్బై అయిదున గల నే
తొలగించండినబ్బో ! తెగ కుర్రవాణ్ణి , అందున నెన్నేన్
జబ్బులతో సతమతమై
నిబ్బర మొకయింత లేక నెమకుచు నుంటిన్ .
వారు కుశాగ్రబుధ్ధి , తగవా , గురువా ! బలమైన వారితో
తొలగించండిపోరు , భవాదృశుల్ మినహ పోలరు నా సములైనవారు, ఓ
సారు ! జిలేబి సారు గని సైడయి పోదును నేను , భీతితో
వారికి చేతులెత్తి తలవంచి నమస్కృతి జేతు , నెంతయున్
వెంకట రాజారావు . లక్కాకుల13 మార్చి, 2026 1:06 PMకి
తొలగించండితమలాటి ధీశాలురు,భుజశాలురే జిలేబి అసిరెమ్మకి లొంగిపోతున్నామంటే, నాలాటి బక్కోళ్ళు "సుడిగాలికి బండరాళ్ళు కొట్టుకుపోతుంటే,పుల్లాకు నా గతేమి?" అనే నానుడి చందం కాదు సార్! మాలాటి బక్కోళ్ళకి బతుకులేదని తేల్చి చెప్పేసేరు కదు సార్! 🙏
వెంకట రాజారావు . లక్కాకుల13 మార్చి, 2026 12:11 PMకి
తొలగించండి75 కే ముసలిటండీ! డాక్టర్ కూడా నన్నుచూసి వయసైపోయింది కదూ అంటున్నారు,ఏమడిగినా. అంటే కర్చు రాసినట్టే కదు సార్! మా బతుకు. ఇంకా ఏంపీకుదామని బతికుండి అన్నట్టు కాదంటారా?
ఈ అసి రెమ్మ అసి రెమ్మ అంటే ఏ చెట్టు కొమ్మ రెమ్మండి తాతగారు ?
తొలగించండిఅసి రెమ్మంటే తమరే
తొలగించండిఅసహాయ సమర ప్రవీణ ! అంజలి విబుధా !
కస బిస పిడిబాకువు గద ,
మసిజేయుదు వెవరినైన మసజస తతగా !
Zilebi13 మార్చి, 2026 6:08 PMకి
తొలగించండిజిలేబి,
అసిరెమ్మ,అనుములమ్మ,మినుములమ్మ,జిలేబమ్మ,గంగానమ్మ/గంగారమ్మ ఇలా ఉంటాయి గ్రామదేవతల పేర్లు. 'నోరెట్టుకు బతకవే ఊర గంగానమ్మా' అన్నది ఒక నానుడి.
400 గజాల్లో పూలు, కూరగాయలు పెంచుకుంటే ఆరోగ్యం, ఆనందం, కొంచెం ఆదాయం.
రిప్లయితొలగించండిబోనగిరిగారు,
తొలగించండిమీరు చెప్పినది నిజం,కాని
1.వయసు 60 మొదలు 70 దాకా మాత్రమే కొద్ది శ్రమకు ఓర్చుకోగలదు.ఆపై కష్టం అంతేకాదు,ఏచిన్న దెబ్బతగిలినా సుగర్ మూలంగా కోతిపుండు బ్రహ్మరాక్షసి లా తయారు కావచ్చు. అన్న వస్త్రాలకుపోతే ఉన్నవస్త్రాలు ఊడిన చందం అన్న నానుడిలా.
2.నీరు లభ్యత ఇబ్బంది. ఎత్తి మోసుకొచ్చి పోయలేము.
3.పల్లెలలో ముఖ్యంగా మా ఊరిలో వరాహరాజాల విహారం ఎక్కువ. వేసిన మొక్క ఏదీ బతకనివ్వవు.
మంచిమాటకు ధన్యవాదాలు.
అంతా ముదుసలుల యవ్వారము లా గున్నది ఇక్కడ.
రిప్లయితొలగించండిఎక్కడైనా యంగ్ అండ్ ఎనర్జిటిక్ లోకము పోయి వచ్చెదము.
అంతలో రాజా వారా లేక తాతాశ్రీ గారా ఎవరు ఎక్కువ యంగో తేల్చుకొని రెడీ గా వుండండీ
Zilebi14 మార్చి, 2026 5:23 AMకి
తొలగించండిపో,పోర పొమ్మికన్
నా గృహమ్మునకు భోజనమ్మునకు
రావలదు,రా తగదు
పో పోర పొమ్మికన్
అని మావగారు తిట్టినంతలో పోతే నష్టం ఎవరికి?
పట్టు,బెట్టు వదలి గుట్టుగా గట్టిగా కాళ్ళు పట్టి
తగునా ఇది మామా
తమరే ఇటుపలుకనగున
తగునా ఇది మామా
అని బతిమాలుకో లేకపోతే ఫుడ్డూ,బెడ్డు కట్టే
అలిగితే పెళ్ళం
చెరువుమీద అలకైతే చెడేదెవ్వరు?
ఫలహారం మాని బాధపడేదెవ్వరు
అంటది
ఎంత ఇల్లరికపుటల్లుడివైనా
"అంతా ముదుసలుల యవ్వారము లా గున్నది" కాబట్టే నేను ఏమీ మాట్లాడటం లేదు.
తొలగించండిశ్యామలీయం14 మార్చి, 2026 5:00 PMకి
తొలగించండియవ్వారంతా ముసలళ్ళదగ్గరేకదండీ ఉన్నది. కుర్రోళ్ళదంతా 'జివతక్కువ బెమెక్కువా' నానుడిలాటిది కదా!
' ముదుసలు ' లింటి దీపముల ముద్దిడు వారలుగారు , కో
తొలగించండివిదులెదురాడ నోడుదురు , భీషణ వాగ్విభవాభి శోభితుల్
చదురులు నేర్పులున్ గలవు , చాల వివేకము గల్గు , జీవితం
బెదిరి రణంబు జేసి , గెలుపించిరి జీవన నావ నెంతయేన్ .
వెంకట రాజారావు . లక్కాకుల15 మార్చి, 2026 5:37 PMకి
తొలగించండిరాజావారు,
పాతకాలం వాళ్ళ మాట సార్! కుర్రకారొప్పుకోరు 🤣
వెంకట రాజారావు . లక్కాకుల13 మార్చి, 2026 6:57 PMకి
రిప్లయితొలగించండిరాజావారు,
అసహాయసమర ప్రవీణ ఎoత గొప్ప బిరుదిచ్చేసేరు సార్! గoగానమ్మకి,దానికి తోడు అంజలి,మరోటి అదేంటో బోధపడని మసజసతతతగ🤣 చురకత్తి,వీరకత్తి, పనసకాయ కత్తి ఇలా ఎంతనుతించినా మీరెన్ని నమములు చేసినా అటు వమనములాగవు.మీచిత్తం,మీదే భాగ్యం! 🤣🙏
కాళ్ళూ గజ్జా గంగానమ్మా
రిప్లయితొలగించండివేగుచుక్కా వెలగా పండూ
గూట్లో రూపాయ్ నీమొగుడు సిపాయ్
నీ పేరేమిటే చింతకాయ్ ?
నీ ఊరేమిటే ఊరగాయ్ ?
చెబుతుందంటారా శర్మగారూ ,
పట్టపగలు చెయి పట్టుకు లాగితే రానిదానికి అమావాస్యరోజు,అర్ధరాత్రి కన్ను కొట్టేడని ఒక నానుడి. ఇనపగుగ్గిళ్ళు ఉడుకుతాయా సార్!
తొలగించండిఎంత వొగిడినా , అసిరమ్మ , సుంతయేని
రిప్లయితొలగించండికరుణ జూపదు నామీద , కనికరించ
నోరు రాదేమి , యెందుకీ ఊరు పేరు
లేని కంచిగరుడసేవ , మానుకొందు .
తొలగించండివెంకట రాజారావు . లక్కాకుల15 మార్చి, 2026 11:28 AMకి
రాజావారు,
బలవంతులైన మీరంటే జిలేబికి భయమే తెల్లజండా ఊపేసినట్టుంది,ఎస్,ఎస్స్ అని తలూపెయ్యాలి అంటోంది. ఏమైనా మీ లెక్కే వేరు సార్!🤣🙏
అసిరమ్మ లా సిరమ్మల
రిప్లయితొలగించండినుసిజేయంగ తరమగు ? కనుక తగ్గుచు యెస్
యెసనుచు తలయాడించుట
యె సబబు రాజన్నవారు యెవ్వరి కైనన్
శ్యామలీయం వారు మామల్లే తను ముదుసలి కాదుపొమ్మని చెప్పి ఉడాయించేరు
ముదుసలి నందురు కొందరు
తొలగించండినది యొప్పని మాట యందు రధికులు పోనిం
డది యెట్లైనను స్వాస్థ్యము
కొదువై యున్నట్టు లొప్పుకొన వలసినదే
తొలగించండిశ్యామలీయం15 మార్చి, 2026 3:06 PMకి
ఏంటో అర్ధంగాలా! శ్యామలీయం ముసలి కోటాలో ఉన్నట్టా? లేనట్టా?
Zilebi15 మార్చి, 2026 2:43 PMకి
తొలగించండిజిలేబి,
ఏదో శ్లేషించేవుగాని ఈ పద్యానికి అర్ధం చెప్పు
చవిగొని పండ్లుగొననా?
చవిజూచిన పండ్లురాలు చక్కగ బొమ్మా!
కవినేను కనులగనవా?
కవివైనచొ చంకనాకు ఘంటంబేదీ?
అబ్బే ! అంత తెలివిడి లేదండి మాకు
తొలగించండిమీరోపారి విశ ఢీ కరి చినచో నేర్చు కొనెదము
అరటి గెల చూపించి కవి ' తిని చూచి బాగుంటే కొంటా ' నంటాడు .
తొలగించండికొట్టువాడు చెయ్యి వేశావంటే పళ్ళు రాల్తాయి . అని వ్యంగ్యంగా చెప్తాడు .
కవి ' నేను కవిని , గౌరవం లేదా ' అంటాడు.
కొట్టువాడు ' ఐతే , చంకనాకు ' అని ,
' ఘంటంబేదీ ' అని సమర్థించుకుంటాడు .
పూర్వం కవులకు చంకన ఆకులు ( తాటాకులూ) ఘంటమూ ఉండేవట .
ఉన్నట్టా లేనట్టా అంటే ఏమని చెప్పగలను?
తొలగించండిముద్దుగ మీ రెట నుంచిన
వద్దని యవినయము జూపవచ్చునె నాకున్
పెద్దలు మీచిత్త మ్మిక
నొద్దికపడు చోట నుంచ నొప్పుగ దలతున్
బిఫిట్టింగ్ రెప్లై :)
తొలగించండిశ్యామలీయం15 మార్చి, 2026 10:35 PMకి
తొలగించండిశ్యామలీయం,
మరీ ఇంత మొహమాటమా?🤣
మీ అల్లుణ్ణి చిరుజీవిగా కుర్రకారులో చేరేసేం లెండి.🤣
తొలగించండివెంకట రాజారావు . లక్కాకుల15 మార్చి, 2026 9:21 PMకి
రాజావారు,
కొంచం మొహమాట పడ్డారా?మోటుగా ఉంటుందనుకున్నారా?🤣
చతురత సంభాషణా తెలుగువారి సొత్తు.🙏
సంభాషణా చతురతకు గోజీ లు నెలవు.😜
మసజసతతగ మళ్ళీ వచ్చింది మమ్మల్ని వదల్లేక. కిందటి నెలస్తో పంపేసేరు వెనక్కి. ఇప్పుడు మళ్ళీ వచ్చి అన్నవరం ప్రాంతంలో తిరుగుతున్నట్టు వార్త. 🤣😂
మీ అల్లుణ్ణి చిరుజీవిగా కుర్రకారులో చేరేసేం లెండి అంటున్నా రేమిటండోయ్!
తొలగించండిచల్లగ జారు కొనెను నా
యిల్లా లిపు డొంటి నైతినే నను సాకన్
పిల్లాపాపలు లేరే
యల్లుడు నా కెచటనుండి యరుదెంచె భళా
పోయి వత్తును , అడ్రసు వ్రాయ రాదె ,
తొలగించండిసార్ను తనివార గాంచి , ప్రసన్నతా వి
దాన మెరిగి , ఆ యరుదైన దయకు పాత్రు
డనయి , నమము లర్పించి వత్తును ఘనముగ .
శ్యామలీయం16 మార్చి, 2026 9:15 AMకి
తొలగించండిశ్యామలీయం,
సప్తసంతానం మీరెరుగనిదా?🙏
వెంకట రాజారావు . లక్కాకుల16 మార్చి, 2026 9:59 AMకి
తొలగించండిరాజావారు,
అడ్రస్ తెలియక, దొరక్కనేకదా!🙏
అంతటి ' గిల్లుడు ' దొరుకగ
తొలగించండిచింతించుట లేల , సంతసించక , విబుధా !
సొంతగ ' మామల్లే ' యనె ,
పొంతన వెదుకంగ వలదు , బుధజన వినుతా !
చాలా అద్భుతంగా వ్రాశారు. నేను ఇంతవరకు చదివిన పద్యాల లో అత్యుత్తమమైన ఒకటి.
తొలగించండికామెంట్లు కొట్టుకురాకు😜
తొలగించండితాతగారూ
తొలగించండితమచలవే🤣 🙏
Zilebi17 మార్చి, 2026 3:36 AMకి
తొలగించండివాసనలేని పువ్వు ఏడవలేని నవ్వు😜
మంచి చాటు పురాణం
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉగాది శుభాకాంక్షలు
రిప్లయితొలగించండి---------------------------
ధరణికి శుభప్రద ' రాక్షస
పరాభవోగాది ' నామ పర్వము వచ్చెన్ ,
అరయగ నా వెను వెంటనె
పరాత్పరుని ' రామనవమి ' పర్వము వచ్చెన్ .
తెలుగు పూదోట తేనియల్ దిగగ ద్రావి
రమణ యెలకవి కోకిలల్ ' రామ కీర్త
నా రసాబ్ధిని ' శుభ యోగమందు మునిగె
రార మముజేర , జయము , భద్రాద్రి రామ !
తొలగించండివెంకట రాజారావు . లక్కాకుల15 మార్చి, 2026 5:04 PMకి
రాజావారు,
సార్! చిన్న డౌట్ అనుమానం,రాక్షస పరాభవ వినలేదు సార్!
నూటన వత్సరమప్పుడే చొరబడినట్టుందే! 🤣
ధన్యవాదాలు.
బ్లాగ్ లోకం లో ౨౦౨౬ లో అర్ధ వంద కామెంట్లు పడ్డ ఏ కైక బ్లాగ్ కష్ టే ఫలి !
రిప్లయితొలగించండిచీర్సు
Zilebi15 మార్చి, 2026 6:58 PMకి
తొలగించండిజిలేబి,
తమచలవే🤣 🙏
నేనూ వినలేదండీ !
రిప్లయితొలగించండికాని , ' పరాభవ ' మనుటకు కాదు మనసు , అం
చే , నే నటు వలికితి , ' రా
మో ' నామ జయంతికి , తగు మోదం బొప్పన్ .
వెంకట రాజారావు . లక్కాకుల16 మార్చి, 2026 9:44 AMకి
తొలగించండిరాజావారు,
పొరపాటు పడ్డానేమో అని అడిగాను సార్! అంతే🙏
సప్తసంతానం. బాగా గుర్తుచేసారు. సప్తసంతానాలలో కావ్యకన్యక(లూ) ముఖ్యమైనవే.
రిప్లయితొలగించండినాబ్లాగులో ఉన్న రామసంకీర్తనా సాహిత్యాన్ని పుస్తకరూపంలో వెలువరించాలని ప్రయత్నం చేస్తున్నాను.
ఇదిగో ఇక డెస్కుటాప్ ముందు కూర్చోవచ్చును ఆన్న క్లియరెన్సు రాగానే ఆపని జోరుచేస్తాను. పెద్దల ఆశీస్సులు ఉంటే ప్రయత్నం త్వరలోనే ఫలవంతం అవుతుందని ఆశిస్తున్నాను.
శుభంభూయాత్!🙏
తొలగించండి