17, జనవరి 2018, బుధవారం

మా ఊళ్ళో తీర్థం

అమ్మలగన్నయమ్మ
కనుమనాటి అమ్మవారి నైవేద్యం


 కూరగాయలు కాదు మట్టి బొమ్మలు
ప్లాస్టిక్ పువ్వులు


వంటింటి ఉపకరణాలు










కప్పులు సాసర్లు ప్లేట్లు మంచివే వచ్చాయి అమ్మకానికి



ఈ సారి తీర్థంలో ఎక్కువగా బొమ్మల కొట్లే కనపడ్డాయి


 సోలార్ దీపాలు తీర్థానికే దిగొచ్చాయి. ఒక్కోదాని ఖరీదు మూడు వందలు. చిన్న సోలర్ చార్జర్ పైన ఒక ఎల్.ఇ.డి 5వాట్ లేంప్, ఒక cell చార్జర్ పాయింట్. పెద్దగా అమ్ముడైనట్టు లేదు. మనదేశం కంపెనీదే వస్తువు. రాజపుట్ అండ్ కో


ఇవి చైనా బొమ్మలు కావచ్చు


 ఒక సాహెబ్ గారి సెంట్ల దుకాణం. మొత్తం లో నాలుగైదు దుకాణాలు కనపడ్డాయి. ఇదివరకెపుడూ ఈ ఒక్కటే కనపడేది.
Cattle pult  పంగల కర్ర

చెప్పుల దుకాణాలూ బాగానే కనిపించాయి.


 luggage bags

Ladies purses

Game

ముగ్గులు వేసుకునేందుకు చక్రాలు, బలే బలే డిజైన్లు. ఒక్కోటి ఇరవి రూపాయలన్నాడు. రెండిమ్మన్నా! తీరా చూస్తే జేబులో డబ్బులు లేవు,అయ్యో! జేబులో వేసుకొచ్చిన డబ్బులు సెల్ ఫోన్ తీసేటపుడు పడిపోయాయనుకున్నా! ఇంటికొచ్చాకా చెప్పేను డబ్బులు పడిపోయాయని. ఇంట్లోనే పడిపోయాయి చూసుకోకుండా వెళ్ళేరన్నారు. ఇంటి దగ్గరే పడిపోయాయి.

ఇదెప్పుడూ చూడలేదు తీర్థంలో మొదటి సారి.



 మిరపకాయ బజ్జీలు.నోరూరిస్తున్నాయి. డబ్బులూ లేవు,పళ్ళూ లేవు. :)


దిష్టి బొమ్మలు.

ఈ సంవత్సరం తీర్థం కొంచం కళ తప్పినట్టనిపించింది, ఏంటబ్బా అని పరికిస్తే ఏల్.ఇ.డి దీపాలు :) కరంట్ ఖర్చు చాలా తగ్గి ఉంటుంది. 

సరదాగా తీసిన వీడియో సరిగా రాలేదు

5, జనవరి 2018, శుక్రవారం

5 రూపాయల నాణాలలో చరిత్ర

Mata Vaishnodevi shrine board

Income tax 100 years of building of India
Chanukya

Mahatma Basveshvara

100 Civil aviation India 1911-2011

Dr.Rajendra prasad 1884-2009
125 Birth anniversary

ILO
World of Work 1919-1994

60 Years of the parliament of India


Food and Agriculture Organisation

12, నవంబర్ 2017, ఆదివారం

కార్తీక దీపం


సనాతన ధర్మం పాటించేవారు నిత్యమూ దేవుని దగ్గర దీపం వెలిగించడం ఆచారం. ఏ కారణాలైతేనేమి దేవుని దగ్గర దీపం కొన్నిరోజులుగాని అన్నిరోజులుగాని వెలిగించనివారు,వెలిగించడం కుదరనివారు, సంవత్సరానికొకసారైనా మూడువందల అరవై వత్తులు ఆవునేతిలో తడిపినవి వెలిగించడం ఆచారం, కార్తీక పున్నమి రోజు.

8, నవంబర్ 2017, బుధవారం

కార్తీక వన సమారాధన


అభిషేకానికి సిద్ధమైన పార్ధివలింగం





అభిషేకానంతర పార్ధివ లింగం


వంట ప్రయత్నం

మా పెద్ద దిక్కు నరసింహం మాస్టారు. యువకులంతా వీరి శిష్యులే! అందరిని ఒరే అనగలిగినంత చనువు. మాస్టారు సూచన చేస్తారంతే,యువకులు నిర్వహిస్తారు.
బూరెల పిండివంటకి సాయం చేస్తున్న స్త్రీలు



లక్కీ డిప్ కోసం సాయంత్రం దాకా ఉన్న యువతీ యువకులు. ఈ సంవత్సరం పిల్లౌ ఎక్కువమంది వచ్చారు, సమారాధనలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

5, నవంబర్ 2017, ఆదివారం

మానులేని దేశమునందు


మానులేని దేశమునందు ఆముదపు చెట్టు మహా వృక్షము కాదా?

30, అక్టోబర్ 2017, సోమవారం

పెద్ద చెఱువు నీళ్ళు



శoకరమ్మత్తా! ఎక్కడినించి తెస్తున్నావు నీళ్ళూ అడిగింది నరసమ్మ.

పెద్ద చెఱువునుంచే! ఏం అలా అడిగావూ?

చెఱువునీళ్ళని కుక్క ముట్టుకుందిట, పనికొస్తాయా అని....

పెద్ద చెఱువునీళ్ళు కుక్కముట్టుకున్నా తప్పులేదని సామెతే ఉందే నరసమ్మా, అని నీళ్ళ బిందితో లోపలకెళ్ళిపోయింది శంకరమ్మ

12, అక్టోబర్ 2017, గురువారం

చక్కిలాలు


చక్కిలాలు.
http://sabdhaskitchen.blogspot.in


మురుకులు
Courtesy:http://www.gayatrivantillu.com/

చల్లగుత్తులు లేక గులాబీ పూలు

జంతిక చక్కిలాన్ని ఎక్కిరించిందిట. నానుడి

5, అక్టోబర్ 2017, గురువారం

చిమడకే చిమడకే



చిమడకే చిమడకే ఓ చింతకాయా
నీవెంత చిమిడినా నీ పులుపుపోదూ
ఉడకవే ఉడకవే ఓ ఉల్లిపాయా
నీవెంత ఉడికినా నీ కంపు పోదూ

ఉల్లిపాయి మెరపకాయి ఊసులాడుకున్నాయి
మద్దెనొచ్చిన కరేపాకు కయ్యం పెట్టింది.

3, అక్టోబర్ 2017, మంగళవారం

జో! జో!!




ఏడవకు ఏడవకు వెఱ్ఱి నాతండ్రీ
ఏడిస్తె నీకళ్ళు నీలాలుగారూ
నీలాలుగారితే నే చూడలేనూ
     పాలైనగారవే బంగారు కళ్ళూ...... జో! జో!! 

30, సెప్టెంబర్ 2017, శనివారం

దిక్కులేనివారికి



విజయదశమి శుభకామనలు

దిక్కులేనివారికి దేవుడే దిక్కు
సంతోషము సగము బలము.
ఎంతచెట్టుకు అంత గాలి.
ఊరుకున్నంత ఉత్తమం బోడి గుండంత సుఖం లేదు

27, సెప్టెంబర్ 2017, బుధవారం

నాకాయుష్షు



నాకాయుష్షు, నాకారోగ్యం, నాకు ధనం, నీకు ఋణం..... లోక రీతి.


ఉన్నమాటంటే ఉలుకెక్కువని సామెత 

ఒగిచినట్టూ ఉంది వాతెట్టినట్టూ ఉంది. లోక రీతి.

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నానుడి.

25, సెప్టెంబర్ 2017, సోమవారం

ప్రశంసనీయం.





రాగల 40 నిమిషాలలో  మీ గ్రామ పరిధిలో/ పరిసర ప్రాంతంలో పిడుగుపడే అవకాశం  ఉంది. సురక్షిత భవనాలలో ఆశ్రయంపొందండి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.


Any time within the next 40 minutes ,there is a chance of lightning strike in the vicinity of your village /habitation. Please take shelter in a safe building.

From:
BA-APSDMA
23/09/2017
06.08PM

మొన్న సాయంత్రం కొద్దిగా చినుకులొస్తున్నాయి, వాతావరణం మబ్బు,చినుకు,ఉరుము, మెరుపుగా ఉంది. పిల్లలు ఎక్కడికో బయలుదేరారు, బైక్ మీద. వెళ్ళేముందో సారి నాకు చెప్పి వెళ్ళడం ఇంటిలో వారందరికి అలవాటు. నా దగ్గర కొచ్చి వెళ్ళొస్తామని చెబుతుండగా ఈ మెసేజ్ వచ్చింది, అందరి సెల్ ఫోన్ లకి వచ్చింది. అంతా చూసుకున్నారు. బయలు దేరుతున్నామని చెప్పేవారికి 'వాతావరణం బాగోలేదు వెళ్ళద్దు' అని చెప్పడం ఎలా అని మథనపడుతున్న నాకు ఈ మెసేజ్ ఆనందం కలగ జేసింది. పిల్లలే ఈ మెసేజ్ చూసుకుని వెళ్ళడం మానేశారు. వాతావరణం మెరుగు పడలేదు.ఒక గంట తరవాత మళ్ళీ మెసేజ్ వచ్చింది, అప్పటికి వాతావరణం మెరుగుపడలేదు. నిజంగానే ఎక్కడో పిడుగూ పడింది. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంవారు చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతేని ప్రశంసనీయం.

14, సెప్టెంబర్ 2017, గురువారం

తుమ్మి పూలు


తుమ్మి పూవులు తెచ్చి నీకు

 తుష్టుగా పూచ్చేదమంటే  

కొమ్మకొమ్మకు కోటి తుమ్మెద 
                                                           ఎంగిలంటున్నాయి లింగా!