Monday 25 September 2017

ప్రశంసనీయం.





రాగల 40 నిమిషాలలో  మీ గ్రామ పరిధిలో/ పరిసర ప్రాంతంలో పిడుగుపడే అవకాశం  ఉంది. సురక్షిత భవనాలలో ఆశ్రయంపొందండి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.


Any time within the next 40 minutes ,there is a chance of lightning strike in the vicinity of your village /habitation. Please take shelter in a safe building.

From:
BA-APSDMA
23/09/2017
06.08PM

మొన్న సాయంత్రం కొద్దిగా చినుకులొస్తున్నాయి, వాతావరణం మబ్బు,చినుకు,ఉరుము, మెరుపుగా ఉంది. పిల్లలు ఎక్కడికో బయలుదేరారు, బైక్ మీద. వెళ్ళేముందో సారి నాకు చెప్పి వెళ్ళడం ఇంటిలో వారందరికి అలవాటు. నా దగ్గర కొచ్చి వెళ్ళొస్తామని చెబుతుండగా ఈ మెసేజ్ వచ్చింది, అందరి సెల్ ఫోన్ లకి వచ్చింది. అంతా చూసుకున్నారు. బయలు దేరుతున్నామని చెప్పేవారికి 'వాతావరణం బాగోలేదు వెళ్ళద్దు' అని చెప్పడం ఎలా అని మథనపడుతున్న నాకు ఈ మెసేజ్ ఆనందం కలగ జేసింది. పిల్లలే ఈ మెసేజ్ చూసుకుని వెళ్ళడం మానేశారు. వాతావరణం మెరుగు పడలేదు.ఒక గంట తరవాత మళ్ళీ మెసేజ్ వచ్చింది, అప్పటికి వాతావరణం మెరుగుపడలేదు. నిజంగానే ఎక్కడో పిడుగూ పడింది. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంవారు చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతేని ప్రశంసనీయం.

6 comments:

  1. తెలంగాణాలో కూడా ఇలాంటిది ఉంటే బాగుంటుంది. కాని కేసీయార్ అనుమతి లేకుండా పిడుగులు పడటమా? నో వే. అందుకనే అలాంటి మెసేజ్‌ల అవసరం లేదేమో మరి.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయంగారు,

      మీరదృష్టవ్చంతులు. ప్రకృతిని శాశించిన రావణునిలాటి ముఖ్యమంత్రి ఉన్నందుకు :) అందుకే అక్కడ ప్రవేశపెట్టి ఉండరు :)

      నెనరుంచండి.

      Delete
  2. మిక్కిలి ప్రశంసనీయం 👏. ప్రభుత్వం వారు చేపట్టిన ఉపయోగకరమైన కార్యక్రమం 👌.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట వారు,

      ఇటువంటి సర్వీస్ మొదలుపెట్టబడిందని పేపర్ లో చూడడమే గాని అనుభవంలో కి రావడం మొన్ననే మొదటిసారి, ఇది జరిగేనా అనుకున్నా. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటిది లేదన్నారు, నిజమేమో తెలియదు. ఏమైనా చంద్రబాబు నాయుడుగారి విపత్తుల నిర్వహణ చాలా గొప్పది. మరిన్ని రాష్ట్రాలు దీనిని ప్రవేశపెట్టాలని చూస్తున్నాయని వార్త.

      ప్రాణం కంటే విలువైనదేదీ కాదుగదా!

      నెనరుంచండి.

      Delete
  3. ఇది మంచి పరిణామం. మంచి పురోగతి.

    ReplyDelete
    Replies
    1. anyagaami గారు,

      మంచిని మెచ్చుకోగలిగిన మనసూ కావాలండి. మంచిని పొగడాలి,చెడును తెగడినట్టే. నిజంగా ఉపయోగకరమైన సర్వీస్

      నెనరుంచండి.

      Delete