Sunday, 5 November 2017

మానులేని దేశమునందు


మానులేని దేశమునందు ఆముదపు చెట్టు మహా వృక్షము కాదా?

45 comments:

  1. మాను లేని నాడు నందు
    నూనెగింజల మాను
    బహు దొడ్డ మానట :)

    ReplyDelete
    Replies
    1. సరసిజనాభ సోదరి,
      అంతే కదమ్మా!
      ధన్యవాదాలు.

      Delete


  2. మాన్యులు లేని నగరమున
    శూన్యులు గూడన్ జిలేబి సున్నుండలుగన్
    నాణ్యత బడయుదురు భళీ
    పన్యారములై శుభాంగి భాసిల్లెదరే :)

    బిలేజి

    ReplyDelete
    Replies
    1. Zilebiగారు,

      సామాన్యులమే తల్లి! తల్లి!! :)

      ధన్యవాదాలు.

      Delete



    2. సామాన్యుల మే తల్లీ !
      మా మాచన పలుకుల వినుమమ్మ జిలేబీ !
      రామాయణ భారత కథ
      లే మాత్రము తణుకుబెణుకు లేకతెలుపునౌ !

      జిలేబి

      Delete
  3. ఆముదమ్ము శిశువు కమృతము పూర్వము
    వండి వార్చువారు దండిసతులు
    తలలు బోడులయ్యె తలిరుబోడుల కిప్డు
    ఆముదమ్ము తెలియ దందు వల్ల .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకులగారు,

      ఆముదం కుమ్మేవారు,వండేవారు. అది నిజంగా "ఆ ముదమే" నేటివారికి తెలియదు,చెబితే వినరుగా!

      ధన్యవాదాలు.

      Delete



    2. ఆముద ములోన పారుడు
      ఆ, ముదమును గాంచెనోయి, యాము గడియలో,
      యేమగునో తెలిపెనహో
      భో! మా యొజ్జ భళి భళి ప్రబోధ జిలేబీ :)


      జిలేబి

      Delete
    3. కందమ్మ కందాలమ్మే
      కుందనపు బొమ్మకాదే! :)

      Delete
  4. కందమె హృదయానందము
    సుందరమగు వృత్తపద్య శూన్యత వొడమన్
    మందికి మాన్యత కొఱవడ
    పందియె గురుదేవు డగును భజనలు సేయన్ .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకులగారు,

      లెస్స బలికితిరి." కందం కట్టిన వాడే కవి,పందినిపొడిచినవాడే బంటూనూ" సామెత కదా! :)

      ధన్యవాదాలు.

      Delete


    2. కందము కట్టిన వాడే
      డెందంబరయన్ జిలేబి రెపరెప లాడున్
      విందైన కైపుల పదము
      లందున సొగసు వికసింప లాహిరి యగునే !

      జిలేబి

      Delete


    3. కందమ్మా! మజ! కందపద్యముల సౌగంధమ్ము లన్ దీర్చి నా
      వందంబైనటి కైపులన్ జనులలో పంతమ్ములన్ పెంచుచున్
      ఛందంబంతయు నేర్చుచున్ గమకమున్ సాధింప యత్నమ్ముతో
      క్రిందామీదపడన్ జనావళి యికన్, కిర్రెత్తి బేజారవన్ :)

      జిలేబి

      Delete
  5. జనావళి క్రిందామీదపడన్
    సత్యం. :)

    ReplyDelete
  6. వందే కంద వశేష ఛాంధస రతే ! వందారు కందప్రియే !
    వందే నారద శారదా విలసితే ! వందారు భేద ప్రియే !
    వందే బ్లాగు వరూధినీ విరచితే ! వందారు హాస్యప్రియే !
    వందే గుండు జిలేబి నామ విహితే ! వందారు వ్యాఖ్య ప్రియే !

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకులగారు,

      పద్యం బాగుందండీ !!!

      ఏం పొగిడారండీ! :) మా నల్లోళ్ళలో మా నల్లబుల్లోడే ఎర్రోడని సామెతలెండి :)
      వందే కంద వశేష ఛాంధస రతే !......
      బిడారంలో ఒంటె గుడారంలో చేరింది :) పుచ్చపాదూ మొలిచిందండి నిన్ననే ! :)

      వందారు కందప్రియే........కందా (కందా= సాపాటు) ప్రియే :)

      వందే నారద శారదా విలసితే !.....భయమేసి శారద పారిపోయిందండి, దురద మిగిలిందిగా :)

      వందారు భేద ప్రియే !.....పుర్రెతో పుట్టిన బుద్ధీ

      వందే బ్లాగు వరూధినీ విరచితే !.......వరూధిని= సేన. దుస్ససేన. విరచితే...విరచి తే, విరవడమే తప్పించి కలపడం జనమలో లేదుగా...

      వందారు హాస్యప్రియే !....వందారు అపహాస్య ప్రియే :)

      వందే గుండు జిలేబి నామ విహితే !......గుండు జిలేబి......హ హ హ పునః పునః క్షవరకల్యాణం కావలసిందే :)

      వందారు వ్యాఖ్య ప్రియే.....కలహ వ్యాఖ్య ప్రియే :)
      _/\_

      ధన్యవాదాలు.

      Delete


    2. పద్యం బాగుందండీ !
      చోద్యంబేమన జిలేబి చురుకే చురుకూ :)
      వాద్యారు మామి గాదా
      సాధ్యంబావిడ కు సూవె చక్కగ యన్నీ :)


      జిలేబి

      Delete
    3. నా మాటలన్నీ పద్యపాదాల్లో ఇరికించేస్తున్నారు, నిజంగా అవి ఛందోబద్ధమా?

      Delete


    4. నా మాటలన్ని ఛందం
      బే మామి జిలేబి ? యొజ్జ , బేజారాయెన్ !
      సామీ యేమాటైనా
      మామికి ఛందంబు సూవె మాటలు జతియై :)

      జిలేబి

      Delete


  7. శ్రీలక్కాకుల రాజ! కట్టిరిగదా శ్రీశర్మ బాలాగునన్
    చాలా చక్కటి పద్యమున్ భళిభళీ ! శార్దూల ! కుల్లూరు వా
    సా!లాగించితి మీ జిలేబులనహో సామీ శుభాకాంక్షలౌ
    భోలానాథుడి యాదరమ్ము గలుగన్, భూయిష్ఠ మై సర్వదా

    జిలేబి

    ReplyDelete


  8. భాష్యము చెప్పెను పారుడు
    వేష్యము వోలె ప్రవహించె వేడుక గానన్ !
    కాష్యూ నట్ వలె నములుము
    డిష్యూం డిష్యూం జిలేబి డిగనురు కులనన్ :)

    ReplyDelete
  9. పద్యం బాగుందండీ !
    చోద్యంబేమన జిలేబి చురుకే చురుకూ :)
    వాద్యారు మామి గాదా
    సాధ్యంబావిడ కు సూవె చక్కగ యన్నీ :)

    నిజం చెప్పండి! ఇది కందమా? లేదా మరే వృత్తం?

    ReplyDelete
    Replies
    1. పద్యం రాసిందెవరో
      విద్యము గాలేదు నాకు వివరిస్తారా ,
      విద్యార్థి జిలేబీనా
      అధ్యాపన సేయు భాస్కరయ్య అనఘులా .

      Delete


    2. కందాతి కందమే నండి :) అదే సులువైనది :)


      చెప్పండి! నిజము కందం
      బప్పా ? మాచన యడిగిరి భామా ! నిజమే
      యప్పా యందువ ? లేకన్
      చప్పున వృత్తం బనెదవ ఛంద జిలేబీ :)

      జిలేబి

      Delete
    3. ఏమో నాకంతా గందరగోళం

      Delete
    4. వెంకట రాజారావు . లక్కాకులగారు,
      నాకే ఛందం రాదే! :)

      Delete


    5. నాకే ఛందము రాదే !
      సోకుల్మాడగ పలుకులు శోభిలె యెటులన్
      మాకే తెలియదు యందం
      బై! కాణాచి గద యొజ్జ పలుకుల రేడై :)



      జిలేబి

      Delete
    6. మీ రేదో మసిబూసి మారేడుకాయనిపిస్తున్నట్టుంది :)

      Delete
    7. వెంకట రాజారావు . లక్కాకులగారు,
      >>>పద్యం రాసిందెవరో
      విద్యము గాలేదు నాకు వివరిస్తారా ,
      విద్యార్థి జిలేబీనా
      అధ్యాపన సేయు భాస్కరయ్య అనఘులా .<<<
      నేనమాయకుణ్ణి, నన్నిందులో ఇరికించేస్తున్నారు. నాకే ఛందం రాదే

      Delete


    8. మీరేదో మసి బూసే
      స్తారండీ! తెలియదండి ఛందము లేవీ !
      పారుడు జనాళి ని గనన్
      జారెను యతులు, జ తులు సరి చక్కని ప్రాసల్ :)

      జిలేబి

      Delete
  10. ఇరికించేస్తారండీ !
    పరుల పలుకు విరస మవగ పద్యములోనన్
    మరి యందులకే గద ! నే
    మరి మరి స్తోత్రంబు జేత , మాతకు జేజే !

    ReplyDelete
    Replies
    1. అమ్మవారికి ’ఇరుకు’ ఇరికించడం అంటే ఇష్టమనుకుంటా

      Delete


  11. ఇరుకూ,యి రికించడములు
    సరిజోదట నీకు సూవె చక్కని చుక్కా :)
    బిరబిర కుఱగలి యొరుస
    ల్లుఱిదిగ విరుచును మనుజుల లుకలుక యనగన్ :)

    జిలేబి

    ReplyDelete
  12. కమ్మెచ్చులోపెట్టి పద్యాలు లాగేస్తున్నారా వడివడిగా!

    ReplyDelete
    Replies



    1. కమ్మెచ్చులోన చక్కగ
      బామ్మోయ్ కందపు జిలేబి "పదముల" వేసే
      రామ్మా ! బిరబిర వచ్చెన్
      కమ్మని పద్యము లనఘ!సుఖకరంబుగనన్ :)

      జిలేబి

      Delete
    2. మీరవధానం చేయచ్చు. శతావధానం తేలికట,అష్టావధానానికంటే!

      అవధాని జిలేబీ

      Delete


    3. మీరవధానము జేయం
      డీ! రావడియగు తెలుంగు డీలా పడుచున్ :)
      మా రాజా రావులు గల
      రా రంగులరాట్నమునకు రాజేయగనన్ :)

      జిలేబి

      Delete
    4. బలే నెట్టేస్తారు మరొకళ్ళ మీదకి :)

      Delete


    5. అవధాని జిలేబి యటన్
      రవరవ లాడుచు పదముల రవళిన్ దేలున్ :)
      కువకువ లాడుచు యినుడట
      జవనిక తీయన్ బిరబిర జావళి జేర్చున్ :)

      జిలేబి

      Delete


    6. హ! బలే నెట్టే స్తారం
      డి!బామ్మ మనపై యురుకుచు డీడీ యనుచున్ !
      రబసము లాడెడు జవ్వని
      గబగబ తను వచ్చె బో, భగభగ యనంగన్ :)

      జిలేబి

      Delete
  13. ఆహా, ఆముదం చెట్టు బొమ్మ దగ్గర మొదలయి ఇక్కడ దాకా వచ్చింది చర్చ.

    శర్మ గారూ, ఛందస్సు సరి చూసుకోవడానికి ఈ సాఫ్టువేర్ సహాయం తీసుకోవచ్చని జిలేబి గారే తన బ్లాగ్ లో “కౌముది, జీవితము లోన కాదేదీ “నో” :) “ అనే టపాలో (నవంబర్ 06, 2017) హరిబాబు గారికి సలహా ఇచ్చారు.

    http://chandam.apphb.com/?chandam

    చూడుడు :-
    http://varudhini.blogspot.in/2017/11/blog-post_6.html?showComment=1510056823394#c8419520315650458435

    కాబట్టి, ఛందస్సు వరకూ, అయ్యా అదీ సంగతి 🙂. అలాగే పద్యాలలోని భావం గురించి కూడా ఏదన్నా సాఫ్టువేర్ ఉంటే,ఆహా 🙂.

    ReplyDelete
    Replies


    1. పద్యముల లోని భావము
      గద్యము లో తెలియగాను గలదా సాఫ్ట్వేర్ !
      వేద్యం బగు నరసన్నా
      విద్యార్థియవన్ భళిభళి వివరము లన్నీ !

      జిలేబి

      Delete
  14. విన్నకోట నరసింహా రావుగారు,

    నాకే ఛందం రాదే!
    వద్దండి! :) ఆ సాఫ్ట్ వేర్ లో ములిగిపోతే ఇక తేలను. నేను పద్యాలు రాయనండీ :)
    శ్రీపాదవారిని చదివి ఇలా వచనంలో పడ్డాను, ఏంటో ఆ గణాలు,యతులు,ప్రాసలు ఇటుకల కట్టుబడి అంటే భయం. హాయిగా ఇలాగే బాగుందండీ
    అమ్మవారేదో కనికట్టు చేస్తున్నట్టుంది :)

    ReplyDelete
    Replies



    1. ఇటుకల కట్టుబడి భయము !
      కొటికాడి నవుతను ! విన్నకోట నరసరా
      య టిగయకు నన్ను సుమ్మీ !
      పటిమయు లేదయ్య నాకు పద్యము నేర్వన్ :)

      జిలేబి

      Delete