లోకులు పలుగాకులు.
లోకుల్ని కాకులతోనే ఎందుకు పోల్చేరు?
కాకి కూత కఠోరంగానే ఉంటుంది. ఏమిటి లోకం? పలుగాకుల లోకం అన్నారో సినీ కవి.
కాకుల్లో చాలా రకాలట, బొంతకాకులు,నల్లకాకులు,పిల్లకాకులు. మిరపకాయి తిన్న కాకిలా అరవకంటారు, ఇంకా ఐతే మిరపకాయ తిన్న పిల్ల కాకిలా అరవకంటారు. పిల్ల కాకి బాగా అరుస్తుందిట. ముసలికాకులూ బాగానే అరుస్తాయిట. బొంతకాకులు మిగిలిన కాకుల్ని బెదిరిస్తూ ఉంటాయి. తెల్లకాకులు లేవన్నాడు బద్దెనగారు. ఇప్పుడంతా తెల్ల కాకులదే మహిమ. వారు చెప్పిందే వేదం. మెతుకులు కనపడ్డ చోటనే కాకి చేరుతుంది, మరిన్ని కాకుల్ని పిలుస్తుంది, కూతతో.
కాకి కూసిందని మన పని మనం చేయడమూ మానకూడదు, కాకి కూత కోసం ఎదురూ చూడ కూడదు. ఈ పలుగాకుల్లో చాలా రకాలుంటాయి. కాకి కూతలు వినాలి. కాకులు కూస్తున్నాయని వాటిని తోలుకుంటూ కూచుంటే మన పని చేయలేం. కాకి కూతలు వినాలి, కాకి కూతల్ని ఆస్వాదించి, నవ్వుకోవాలి.
హేటు కూసే కాకి, కూసి కూసి, కొంతకాలానికి, కాకి అలసిపోతుంది. కాకిని అలసిపోనివ్వ కూడదు. మెతుకులేస్తూ ఉండాలి. కాకితో సహజీవనం తప్పదు. మరీ మీద మీదకొచ్చే కాకుల్ని ఉపేక్షించ కూడదు. కాకి కూతలు మన పనికి అడ్డంకి కాదు, అడ్డంకి చేసుకోరాదు. ఇది మనచేతనే ఉంది. కాకులు మొత్తాన్ని తోలుకుంటూ కూచుంటే ఎలా? మన పని చేసుకుంటూ, కాకి కూతలు వింటూ, కాలక్షేపం చెయ్యాలి. కాకి కూతని కాలక్షేపం చేసుకోవాలి. మరో సంగతి మరచిపో కూడనిది, మెతుకులున్న చోటకే కాకి చేరుతుంది. కాకి కూతలు విని మనం పయనిస్తున్న దిశ సవ్యంగా ఉందా? లేదా? అనేది నిర్ణయించుకో కూడదు.ఇది తెలిస్తే ఆచరిస్తే జీవితమే హాయి!!!! అంచేత కాకుల్ని తరిమేయకండి. కాకి కూతలు వినండి.రోజూ ఉదయమే కూసే కాకి కొన్ని రోజులు కనపడకపోతే, కాకి కూత వినపడకపోతే కాకి ఆరోగ్యం గురించి విచారించండి.కాకి జిందాబాద్!!!
అధో సూచిక:- ఎవరికైనా ఇబ్బంది కలిగితే మన్నించాలి. నేనూ కాకుల్లో ఒకడినే :)
మిరపకాయలు తిన్న
ReplyDeleteయమరాడ్దూతలు
అరవడానికున్నూ,
జిలేబీలను తిన్న లుంఠాకములు అరవడానికున్నూ వ్యత్యాస మేమైనా వుంటుందాండి తాతగారు ? :)
“తాతగారు” ఏం చెబుతారో తెలీదు గానీండి “జిలేబీ”ల ప్రభావాన్ని అంత గొప్పగా ఊహించుకోండి 🙂.
ReplyDeleteకాకి అరుపు కాకి అరుపే. జిలేబీలు తిన్నా మీ కామెంట్ల వెట”కారం”లో మార్పేమీ ఉండదుగా.
(jk 🙂)
కోట కట్టేసుకు చిర్రావూరిని భలే కాపాడతారండీ మీరు :)
Deleteమీరే అంటున్నారుగా కోట - వూరు అని. 😎
Delete
DeleteZilebi29 May 2024 at 20:42
కాకి ఏమి తిన్నా,ఏపేరెట్టుకున్నా! కాకిలాగే అరుస్తుంది.
ఎంత చదువు చదివి ఎన్ని నేర్చినగాని
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గు పాలగడుగ బోవునా మలినంబు?
విశ్వదాభిరామ వినుర వేమ.
పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల్లో పెట్టాకే పోతుంది.
నైజ గుణానికి లొట్ట కంటికీ మందు లేదు
విన్నకోట నరసింహా రావు30 May 2024 at 08:10
Deleteవిన్నకోట నరసింహా రావు30 May 2024 at 19:12
నమస్కారం.
వేడి నలభైలు దాటి పాపం పెరిగినట్టు పెరుగుతోంది,రోజూ. ఉదయం ఎనిమిది దాటి బయటికి రావడమంటే నిప్పుల గుండంలోకి వచ్చినట్టే ఉంటోంది.అందుకే ఈ ఆలస్యం. పునః నమస్కారం
🙏
ReplyDelete