తిరిగే కాలు తిట్టే నోరు....
తిరిగే కాలు తిట్టే నోరు తీరిగ్గా వుండలేవన్నది ఒక జాతీయం.
సాధారణం అవుసరం ఉంటే గాని బయటకి కదలరెవరూ, కాని కొంత మంది అవసరం లేకపోయినా తిరుగుతూనే ఉంటారు. ఇదొక అలవాటు.
”ఎక్కడికెళ్ళేవూ రాత్రి పదికి ఇంటికి చేరేవు,ఆఫీసు ఐదుకి ఐపోతే ఇప్పటిదాకా ఎక్కడ తిరిగినట్టూ, త్రిపాది లాగా?”....
”అబ్బే ఏం లేదమ్మా సత్యానందం కనపడితేనూ”...
”వాడితో పాటు ఇంటి దాకా వెళ్ళి.... వచ్చావనమాట”.
”వాడెదో కష్టం చెబుతుంటేనూ”..
”ఏవైనా చది వించుకొచ్చావా?”..
” రెండు వేలుకావాలంటే.....నెలాకరికిచ్చేస్తానన్నాడు"
ఇటువంటి వాళ్ళు ఆఫీసులో కూడా సీట్లో కూచోలేరు. ”పక్క సెక్షన్లో మిత్రానందం నిన్న బండి మీంచి పడ్డాట్ట చూసొస్తా”, పక్క సీట్ వాడికి చెప్పి పెత్తనాలకి బయలుదేరతారు. ఇది నిజంగానే వ్యసనం. ఇలా కూడా కాకుండా పని లేక తిరుగుతున్నవాళ్ళని కరోనా పోలీస్ కొడుతున్నారు, లేదా పొర్లు దండాలు పెట్టిస్తున్నారు కదా! నేటి మాట, బండి పాడుచేసి ఇస్తున్నారు, మళ్ళీ తిరగడానికి లేకుండా,అలా కాకుండా వీళ్ళని అక్కడే ఒక పూట కాపలా కాయిస్తే రోగం చప్పగా కుదురుతుంది. తిక్కతిక్కగా మాటాడేవాడెవడేనా తగిలితే వీళ్ళకి అప్పజెప్పేస్తే సరిపోతుంది :)
తిట్టే నోటి నుంచి వచ్చేవెలా ఉంటాయో మచ్చుకి :) ”నిన్ను ఎన్నెమ్మమ్మెత్తుకుపోనూ!నీనోరడిపోనూ! న్నిన్నేట్లో కలిపెయ్యా!” ఇలాగే ఉంటాయి. ఇటువంటివారి నోటి నుంచి విందామంటే మంచిమాట వినపడదు. పొరబాటున వినపడిందో ఏదో ప్రళయం కరోనా లాటిది ప్రపంచం మీద కి వచ్చి తీరుతుంది. :)
ఉబోస అంటూ చెప్పేవాళ్ళు కూడా ఈ కోవకే చెందుతారనుకుంటా.ఇక నిత్యమూ ఏదో గిలక్కుండా ఉండలేని జనాభా ఉంటారు. వీళ్ళని తగలెయ్యా, వీళ్ళ చేతులిరిగిపోనూ! ..... ఎక్కణ్ణించి ఊరతాయో కబుర్లు, తెగరాసి జనం మీద పారేస్తుంటారు. ఇదో వ్యసనం.
ఇలాటి పరిస్థితులలో కరోనా వచ్చి అందరిని లాక్ డవున్ చేసింది, ఎన్నాళ్ళూ ఇరవై ఒక్క రోజులట. చచ్చి చెడి మూడురోజులు నడవలేదు. ఏం తోచడం లేదు. ఏం చెయ్యాలి, ఏం తోచడం లేదు ఇదీ అసలు మాట.
ఏం చెయ్యచ్చూ
1.అమ్మ,నాన్న ఉంటే కాసేపు కబుర్లు చెప్పచ్చు.
2.ఇల్లాలి కి ముచ్చట్లు చెప్పచ్చు,వినచ్చు. కూడా కొంగు పట్టుకు తిరగచ్చు. వంటలో సాయం చేయచ్చు.వంటా చేయచ్చు. వంటగది సద్దచ్చు. కూరలు తరగచ్చు. వీలు కుదిరితే తలలో పేలు చూడచ్చు :) Work from Home or Work at Home :)''చాలు సంబడం ఇలా గొంగట్టుకు తిరగడమేంటో కొత్తగా, చూసేవాళ్ళు నవ్వుతారు'', అని ఆవిడ సున్నితంగా విదిలిస్తే ''చూడనిద్దూ'' అని దీర్ఘమూ తియ్యచ్చు, మరో కాఫీగ్లాసూ పుచ్చుకోవచ్చు.
3.తోట పని చెయ్యచ్చు
4.పిల్లలకి పద్యాలు,కతలు చెప్పచ్చు.
5.ఇల్లాలు చిన్నప్పుడు నేర్చుకున్న త్యాగరాజ కృతి వినచ్చు.
6.చిన్నతల్లి డేన్స్ చూడచ్చు.
7.మంచి పుస్తకం చదువుకోవచ్చు,కుటుంబం అంతా కలసి భోజనాలూ చెయ్యచ్చు,కబుర్లు చెప్పుకుంటూ.
8. ఒంటరి పక్షులు లేప్టాప్ ముందేసుకుని....ఎవరితోనైనా జగడమేసుకోవచ్చు. డవ్ జోన్స్,నిఫ్టీ వర్చుయల్ ట్రేడింగ్ చెయ్యచ్చు.
9.పక్కవాళ్ళలో హాస్పిటల్ కి వెళ్ళేవాళ్ళకి సాయం చేయచ్చు.
10.ఒంటరి ఉండిపోయినవాళ్ళకి, బిచ్చగాళ్ళకి ఆహారం అందించచ్చు.
11.రైల్వే స్టేషన్లలో ఉండిపోయినవారిని ఆదుకోవచ్చు.
12.కరోనా గురించి ఇతరులకు వివరించవచ్చు,తెలిసున్నంతలో.
13.ఇతరులకు ధైర్యం చెప్పచ్చు,జాగ్రత్తలూ చెప్పచ్చు.
14.మా దగ్గర ఒక ఫోన్ నంబర్ ఇచ్చారు, భోజనం లేక ఇబ్బంది పడుతున్నవారెవరైనా ఫోన్ చేస్తే ఆహారం అందిస్తున్నారు. వారికి సాయం చేయచ్చు.
15.పోలీస్,డాక్టర్, నర్స్,శానిటరీ వర్కర్స్,కరంట్ వాళ్ళు, డెలివరీ బాయ్స్ వీళ్ళకి అవసరం బట్టి ఒక ఆహార పొట్లం ఇవ్వచ్చు...వారికి మనిషి సాయం కావాలంటే చేయచ్చు
ఇది అనంతం. సాయం చెయ్యాలనే మనసుండాలి కాని అవకాశాలు అనంతం.
ఇక, WHO Director General, ఈయన చూడండి, ఏమంటున్నారో
1.మందుకొట్టకండి.
వామ్మో! వారమైపోలా నాలిక పీక్కుపోతావుందయ్యా! షాపులా మూసేశారు, ఇంట్లో అమ్మో, కర్ర తిరగేస్తది, సతీష్ గాడి ఇంటి దగ్గర కుదురుద్దిగాని, వామ్మో పోలీసోళ్ళు, తల్చుకుంటేనే....
2.ధూమపానం వద్దు.
ఈయనెక్కడ దొరికాడండీ బాబూ చిన్నప్పుడు బళ్ళొ చదువుకున్నవన్నీ ఏకరువెడతన్నాడా?
ఏవయ్యా పె ద్దాయనా! నువు చెప్పినయ్యన్నీ మాకు సిన్నపటనుంచి అలవాటే గాని. ఈ కరోనా-19 భూతాన్ని పెపంచకం మీద ఒదిలినోడినేమనవేం...
అధో సూచిక:- ఇదెవరిని ప్రత్యేకంగా ఉద్దేసించినదీ కాదు. అలా అనిపిస్తే సా...రీ....