Monday, 16 March 2020

करॊ न కరో న= చేయవద్దు.


करॊ न
కరో న= చేయవద్దు.


పీకలదాక త్రావితే,పెంపువహింపగ మత్తున మునిగితే
వెలభామల మూతులు నాకితే,పాయకితరుల చేతులు పిసికితే
పాచిన జిలేబి మెక్కితే,దుష్ట జిలేబి మెచ్చి గుచ్చితే
ఎటుల కరోన సోకక మాను పవన సుతా!


పద్యం నా స్వంతమేం కాదు! లిజిబే గారిది, పవన్ గారి బ్లాగు సౌజన్యంతో!

కరోన అంటే చేయవద్దని అర్ధం హిందీలో. ఏం చేయద్దూ?

1.చేతులు పిసుక్కోవద్దు: ఎదుటివారి దగ్గర చేతులు పిసుక్కోవడం బానిసత్వ లక్షణం. ఆపని చేయద్దు. మరొకరి చేతులూ పిసకద్దు. దీనివల్ల అంటువ్యాధులు అందునా కరోనా లాటివి వ్యాపిస్తాయి. 

2.మూతులు నాక్కోవద్దు: ఆడ మొగ తేడా లేక సమయం సందర్భమూ కాక, వావి వరుసా లేక మూతులు నాక్కుంటే కరోనా వచ్చి తీరుతుంది.
ముద్దిస్తానని దగ్గితే పారిపోయిన వీరులు :)

3.హగ్గులొద్దు:హగ్గులంటే కౌగిలింతలు.ఇవీ కరోనా వ్యాప్తికి తోడు. హగ్గులు లేకపోతే ఎలా? ఇంట్లో,వీధిలో ఇష్టమైనవారందరినీ హాగ్ చేయకపోతే వాళ్ళేమనుకుంటారూ. వోరి నీ హగ్గు కూలిపోను గుచ్చి కౌగలింతలు పాతవేనోయ్! నువ్వేం కొత్తగా కనిపెట్టలేదుగాని. దానికి సమయం సందర్భం ఉంటుంది. హగ్గులొద్దు, కిస్సులూ వద్దు. కిస్ ఫెచివల్స్ చేసుకుంటే కరోనా ఏ ఆపై మీ ఇష్టం. In front crocodile festivals.

4.పెగ్గులొద్దు:సిగ్గులు లేవు, హగ్గులూ లేవు, పెగ్గులూ వద్దు అంటే ఎలా? నాలుగు పెగ్గులు మింగితే కారోనా దగ్గరికి రాదట (ష). పిచ్చి పడిపోకు, నాలుగు పెగ్గులేసుకుంటే కరోనా కి తలుపులు బార్లా తెరిచినట్టే! ఏసుకో నా రాజా! ఏస్కో, ఆకేసుకో వక్కేసుకో ఆపైన చుక్కేస్కో!!  ఆపైనా కరోనా పక్కేస్కో!

5.Avoid packed and food on streets:వామ్మో హిమ క్రిములొద్దా! పానీ పూరీ లొద్దాంటే ఎలాబాబూ, నాలిక పీక్కుపోదూ, పిల్ల పేరు చెప్పి పట్టుకొచ్చే పేకట్లు పిల్లలతో పాటుగా తినకపోతే పిల్లలు నొచ్చుకోరూ :) ఏదీ వద్దంటే ఎలా చచ్చేదీ

బారు లేదు,బీరు లేదు, పోరిలేదు, చినిమా లేదు, బైస్కోప్ లేదు. ఏమీ లేదు, ఇదా స్వతంత్రం. ఆజాది చాహియే ఆజాదీ. తుపాకీ గుండు కంటే బలమైన కరోనా ఉన్నది అందుకో! నా ఇష్టమొచ్చినట్టు చేస్తాను కాదనువారెవరూ కళ్యాణ రామా! కాదనువారెవరూ! మా కేం అభ్యంతరం లేదుగాని ఒక్క మాట. నా ఇల్లు నా సొంతం తగలబెట్టుకుంటానంటే కుదరదు. నీ ఇల్లు తగలబెట్టుకుంటే అగ్గి అక్కడితో ఆగదు. ఊరు తగలబడుతూంది, అంచేత నీ ఇల్లు నువ్వు తగలబెట్టుకో లేవు. ఇదీ నీ స్వాతంత్రం, తెరియమా? 

అదేం కుదరదు నా ప్రాణం నా ఇష్టం, ఆజాదీ,ఆజాదీ కరోనా యా మరోనా !
ఆగు ,ఆగు, నా ఇష్టం ఛస్తానంటే కుదరదు, నువు కరోనా తో ఛస్తే పూడ్చి పెడితే మరొకరికి అంటుకుంటుంది, చాలా మంది ఛస్తారు, అందుకు తగలబెట్టాల్సిందే!

కరోనా తో చచ్చినవాళ్ళని పూడ్చకండి, తగలబెట్టండి. ఇది వర్ల్డ్ హెల్త్ వారి మాట. కరోన,కరోన, కరోనా!!!

ప్రయాణాలొద్దు, ఎవరినీ దేనినీ అనవసరంగా ముట్టుకోవద్దు, నీ ముక్కు మూతి T సెంటర్ని కూడా. కరోనా! 

ప్రపంచంలో ప్రతి ఇంటి ముందు లోపల అన్ని దేశాలలో కరోనా గార్డులున్నారు, యమభటులు కరోనా రూపంలో కనపడకుండా తిరుగుతున్నారు. తస్మాత్జాగ్రత! జాగ్రత!! జాగ్రత!!!



खून कि दलाली
మృత్యు బేహారులు. మేరా భారత్ మహాన్
కరన్సీతో పాటు కరోనా కూడా వస్తుంది. పాపం సొమ్ము లెక్కెట్టుకుంటే కారోనా మహమ్మారి నిన్నే ఎత్తుకుపోతుందో నరుడా!

మాస్క్ తయారు చేసుకోడం ఎంత వీజీయో!

చావక మిగిలినవాళ్ళకి మోకాల్లోతు కూడని బ్రహ్మంగారి మాట.
Videos: Credits to Whats app University.
Secret caution message leaked from the office of  YAMA through WHO





5 comments:

  1. Replies

    1. శ్రీ రామచంద్ర మూర్తి గారు
      నచ్చినందుకు
      ధన్యవాదాలు

      Delete
  2. // “ పవన్ గారి బ్లాగు సౌజన్యంతో!” // ..... పవనుడి బ్లాగ్ కాదనుకుంటానండీ, బండి వారి బ్లాగ్ అనుకుంటాను.
    —————
    // “ ముద్దిస్తానని దగ్గితే పారిపోయిన వీరులు :)” // .... Good idea. ఇదేదే ఆడపిల్లల చేతిలో అస్త్రంలాగా పనికొచ్చేట్లుందే 👌?
    —————
    “చుక్క” వద్దన్నారు, మరి ముక్క సంగతేమిటి సర్? అది కూడా డేంజర్ డేంజరంటే జీవాలు మరి కొన్ని రేజులు బతుకుతాయి పాపం.

    మనలో మన మాట ... చుక్క వేస్తే వైరసులు, బాక్టీరియాలు ఆ చుక్కలో మునిగి చనిపోతాయని జనాభిప్రాయం కదా, మీరేమిటి ఇలా అంటున్నారు? ఓహో, చుక్కతో బాటు ఐసు ముక్కలు, చల్లని సోడా / నీళ్ళు వాడతారు కదా ఆ చల్లటివి అసలు డేంజర్ అనా?🙂
    ——————-
    పానీపూరీ తినడం తగ్గిపోతే / మానేస్తే సగం దరిద్రం వదులుతుంది 😡
    ——————
    వాడిన మాస్కులను ఏరుకొచ్చి మళ్ళీ అమ్మడం ... మన సమాజపు దిగజారుడుతనానికి లేటెస్ట్ తార్కాణం. ఆ విడియోలోని వర్కర్లు చేతులకు గ్లవ్స్ వేసుకోలేదు కూడా (అవి కొనే ఖర్చు మాత్రం ఎందుకనుకున్నారేమో?). వాళ్ళ ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండచ్చుగా. మితిమీరిన డబ్బు యావ అన్ని విలువలనూ అణగదొక్కేస్తోంది. మనం గొప్పగా చెప్పుకునే భారతీయ సంస్కృతి ఇలా భ్రష్టు పట్టిపోయిందన్నమాట 😒.
    ———————
    “లబ్బరు”తో మాస్క్ తయారుచెయ్యడం idea బాగుంది సర్ 👌🙂.
    ———————

    మొత్తానికి మంచి టపా శర్మ గారు.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,

      పవన్ గారి బ్లాగేనండి. నిన్న కనిపించింది, నేడు మరిపించింది :)
      రైట్ క్లిక్ లేక రాసుకున్నానండి.
      ==============
      ముక్క మీద భిన్నాభిప్రాయాలున్నాయండి. చైనా లో పందుల్ని సామూహికంగా సజీవంగా పూడ్చినట్టు ఇక్కడ కోళ్ళని పూడ్చేస్తున్నారండి. అమ్మకాలు లేవు, ఉంచితే మేత దండగ, ఇప్పటిలో రేట్ వచ్చేలా లేదు.
      ===================
      చుక్క వేస్తే బాక్టిరియాన్ చావదటండి, పెద్దల ఉవాచ, పెరుగుతుందట.
      ================
      పానీ పూరీ మానెయ్యడమా? ఎంతమాట ఎంతమాటంటిరి, నాలిక పీక్కుపోదూ సాయంతరం అయే సరికి బండి దగ్గరకి చేరకపోతే. చుక్క కంటే బలవత్తరమైనదండి.
      =================
      అయ్యా! సొమ్ము సంపాదించడమే ధ్యేయం, ఎలా అన్నది ఆలోచించదగ్గది కాదు :) కరన్సీతో వైరస్ సోకుతుందిటండి. ఓనర్ తో సహా అందరూ డబ్బులు లెక్కపెట్టుకునే టప్పటికి ఉంటారా అని అనుమానమండి. :)
      ====================
      జేబురుమాలు, రెండు ”లబ్బరు" బేండ్ లతో మాస్క్ మా బలేగా తయారు చేశాడండి పోలీస్ మావయ్య :)
      ================
      సిత్రాలు సూడరో సివుడో సివుడా, మరెన్ని సిత్రాలోనండి
      ================
      నచ్చినందుకు
      ధన్యవాదాలండి

      Delete
  3. సిత్రాలు సూడరో సివుడో సివుడా!

    రిటయిర్డ్ ప్రొఫెసర్ గా జిలేబి గారిచే నాకు పరిచయం చేయబడ్డ శ్రీ గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి గారికి తెనుగు తెలియదు,అర్ధం కాదు, రాయడమూ రాదు.

    ''నాకు తెలుగు వ్రాయడం రాదు...అర్థం కూడా అవదు.'' Sri G.P.Sastri's words
    కాని తెనుగులో పద్యాలల్లేసి పుస్తాకాలూ ప్రచురించేసేరు. మరో సంగతి కూడా అర్ధ రాత్రి సరదా పూరణలు కూడా చేస్తారు, జిలేబిగారికి అంకితం ఇస్తారు రోజూ. అదీ జిలేబి గారి సిత్రం సివుడా

    ==================
    నా పరోక్షంలో నన్ను శ్రీ శాస్త్రి గారికి పరిచయం చేస్తూ జిలేబి గారు అన్నమాటలివని శ్రీ శాస్త్రి గారి మాట.
    G P Sastry (gps1943@yahoo.com) "సమస్య - 3308 (ప్రత్యుపకారమ్ము...)" పోస్ట్పై క్రొత్త వ్యాఖ్యను చేర్చారు:


    శ్రీమాన్ కష్టేఫలి శర్మ గారు:

    నాకు తెలుగు వ్రాయడం రాదు...అర్థం కూడా అవదు.

    మీ గురించి జిలేబి గారు గతంలో నాకు వ్రాసిన మాటలు ఇచ్చట పొందు పరచుచున్నాను:

    "శ్రీ శర్మ గారితో మాట్లాడటమే ఒక అందమైన అనుభవం.

    Enjoy good company of people. See if you can contact him. It will be a pleasure for both of you coming from different walks of life.

    We call him Blog Gandhi. Like you sir, he is also a towering personality albeit from different profession.


    జిలేబి"

    నమస్సులు




    శంకరాభరణం కు మార్చి 13, 2020 9:38 PM న G P Sastry (gps1943@yahoo.com) పోస్ట్ చేసారు
    అప్పుడు శాస్త్రిగారిని కూడా టవరింగ్ పెర్సనాలిటీ గా ఆకాశానికెట్టేసేరు, జిలేబి.
    నాడు నన్ను టవరింగ్ పెర్సనాలిటీ మీలాగే అని పరిచయం చేసేరట జిలేబి. మరి నిన్న అటువంటి టవరింగ్ పెర్సనాలిటీ శాస్త్రి గారు కాస్తా దారీ పోయేవాడయ్యాడు, చూడవా చిత్రం సివా!
    రోదనలు పలు రకమ్ములు!
    ''వాదనలను చేసి రోసి వా యనుట, జిలే
    బీ దాష్టీకమను కినుక
    తో దారిని బోవు వారి తో మొరలిడుటా !''
    ===============
    మరెన్ని సిత్రాలు కనపడతాయోగదా శివా!! నీకే చెబుతా!!!

    ReplyDelete