Tuesday, 15 April 2025

మనమే!

మనమే!


 ఆఫీసు వారిచే “రిటైర్డ్” అని ప్రకటించబడిన తర్వాత, అప్పటి నుండి సమయాన్ని గడపడం అనేది అన్ని ఉద్యోగులకు మరియు ఎగ్జిక్యూటివ్‌లకు తలపోటుగా మారుతుంది. 


ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి, ప్రజలు వివిధ మార్గాలు మరియు పద్ధతులను అభివృద్ధి చేసుకున్నారు.  


1. కొంతమంది కష్టపడే బృందానికి చెందిన వ్యక్తులు వెంటనే ‘రామూ కాకా’ పాత్రలోకి మారిపోతారు. ఉదయం త్వరగా లేచి, తలకు తువ్వాలు వేసుకొని, ఇంటిని శుభ్రపరచడం, వంటలు చేయడం మొదలుపెట్టేస్తారు. మిగతా రోజంతా భార్యకు డ్రైవర్ సేవలు అందించడం, షాపింగ్ చేయడం, సినిమాలు చూపించడం వంటివి చక్కగా నిర్వహిస్తారు. ఇలాంటి వ్యక్తుల భార్యలు గత జన్మలో ఎంతో పుణ్యాలు చేసి ఉండాలి, అందుకే ఈ అమృత సమాన జీవితాన్ని అనుభవిస్తున్నారు!  


2. మరికొంతమంది రిటైర్మెంట్ తర్వాత అకస్మాత్తుగా మతపరంగా మారిపోతారు. ఉదయం, సాయంత్రం రెండు గంటలపాటు దేవాలయాల్లో పూజలు, భజనలు, కీర్తనలతో సమయం గడుపుతారు. కానీ గతంలో ఒక్కసారి కూడా దేవాలయంలోకి పాదం పెట్టని వారు, ఇప్పుడు తమ పాపాలు క్షమించబడతాయని భావిస్తున్నారు.  


3. *ఇంకొంతమంది రిటైర్ అయిన వెంటనే తమలో వాల్మీకి, తులసీదాస్ ఆత్మలు ప్రవేశించినట్లు కవులు, రచయితలు అయిపోతారు. ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో తమ రచనలతో మిత్రులను ఇబ్బంది పెట్టినా, వారు మౌనంగా ప్రశంసించక తప్పదు.  


4. *కొందరికి ఉద్యోగ జీవితంలోనే రాజకీయాలపై ఆసక్తి ఉంటుంది. తమకు ప్రజాదరణ ఎంతో ఉందనే భ్రమలో, రిటైర్మెంట్ తర్వాత ఏదో రాజకీయ పార్టీలో చేరి ఎన్నికల బరిలోకి దిగుతారు. కానీ ఘోరంగా ఓటమి చెంది, ఆరాధన అంటే అధికారం ఉన్నప్పుడు మాత్రమే అని గ్రహిస్తారు. తర్వాత పార్టీ ఆఫీసుల బయట శనగలు తింటూ కనిపిస్తారు.  


5. ఇంకొందరికి వారు ఎన్నో సంవత్సరాలుగా వుంటున్న కాలనీ లో సర్వీస్ లో ఉన్నన్ని రోజులు ఏ సమస్యని పట్టించుకోని వారు రిటైర్ అవుతూనే తాము ఎప్పుడో చదివిన సర్టిఫికెట్స్ బైటకి తీసి లాయర్ గా రిజిస్టర్ చేసుకొని వారు ఉంటున్న ప్రాంత రాజకీయాలపై ఆసక్తి చూపిస్తూ తాము ఇబ్బంది పడుతూ అందరినీ ఇబ్బందిపెడుతూ అలా అని వారికి ఇక డబ్బుతో అవసరం ఉండదు కాబట్టి సేవ చేస్తామని ఉబలాట పడుతుంటారు.


6. *ఇంకొంతమంది రిటైర్డ్ పెద్దలు ఇంట్లో పనికిరాని వ్యక్తులుగా భావించబడతారు. అందుకే వారు ఇంటి నుండి బయటకు వెళ్లడానికి ఒక ఎత్తుగడ కనుగొంటారు—ఉదయం పది అయ్యాక బ్యాంక్ పాస్‌బుక్‌లు తీసుకుని ఏదైనా బ్యాంకులోకి వెళ్లి గంటన్నర సమయం గడుపుతారు. బ్యాంక్ ఉద్యోగులు వీరిని కస్టమర్లకంటే స్టాఫ్‌గానే భావిస్తారు.  


7. పైవన్నింటికంటే ఎక్కువమంది రిటైర్డ్ వ్యక్తులు స్నేహితులతో కలిసి కాలనీ పార్క్‌లలో కూడి, ప్రభుత్వాన్ని దూషించడం, తమ సాహస కథలు చెప్పడం వంటి పనులతో కాలం గడుపుతారు. కానీ వీరిలో ఎవరూ తమ ఉద్యోగ కాలంలో ఏమీ ప్రత్యేకం చేయనట్లు కనిపిస్తుంది.  


8. *కొంతమంది రిటైర్డ్ స్నేహితులు ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడాన్ని ఇష్టపడతారు. వారి పిల్లలు, కోడళ్ళు చిన్న పిల్లల్ని వారికి అప్పగించి ఆఫీసు లేదా సినిమాలు చూడటానికి వెళ్తారు. అప్పుడు వారు తాతలుగా మారి, పిల్లల సంరక్షణలో విలువైనవారవుతారు. కొందరు విదేశాల్లో ఉన్న తమ పిల్లల వద్ద నెలల తరబడి బాలల సంరక్షణ సేవలు అందిస్తూ ధన్యతను అనుభవిస్తారు.  


9 మరికొందరు ముఖంలో ఇప్పటికీ ప్రకాశించే ఉత్సాహం కలిగి ఉంటారు. అలాంటి వారిని చూసి అనేకులు వారి అనుభవాలు వినడానికి, గౌరవించడానికి చుట్టూ సేకరిస్తారు.  


10. *ఇంకొంతమంది తమ ఉద్యోగ జీవితంలోని కథలు చెప్పాలనే ఆశతో పార్కుల్లో తిరుగుతుంటారు. ఎందుకంటే ఇంట్లో భార్యకు విసుగు, పిల్లలు మొబైల్‌లో మునిగిపోయి వినరు.  


11. ఇంకొందరు ఆఫీసు రోజుల్లో తాగిన చాయ్‌ను మిస్ అవుతూ, వీధి మూల టీ స్టాల్స్ మరియు పాత మిత్రులను వెతుక్కుంటూ తిరుగుతుంటారు—కానీ ఇంట్లో షుగర్, వయస్సు అనే పేరుతో నిషేధాలు ఎదురవుతాయి.  


ఈ వివరణలో మీకు మీరే కనిపిస్తున్నారా?  


ఈ సందేశాన్ని ఇతరులకు పంపండి—వారు త్వరలోనే ఈ జాబితాలో చేరవచ్చు!  


మీ స్థానం మీరు ఎంచుకోండి.  

మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను!

COURTESY:Whats app

Friday, 11 April 2025

కత మొదలయింది.

 కత మొదలయింది. 


ముంబై పేలుళ్ళ సూత్రధారి,పాక్ లో పుట్టి,అక్కడ సైన్యంలో పనిజేసి కెనడా పౌరుడిగా చెలామణీ అవుతున్న తహవ్వుర్ హుసైన్ రాణా ను అమెరికా ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి ఢిల్లీలో అప్పగించింది,ఒప్పందం ప్రకారం,ఆదేశపు కోర్ట్లు తీర్పులిచ్చిన తరవాత. ఇంకిప్పుడు మొదలయింది భారత్ లో కత......అదెటులంటేని...


అతను మా దేశపు పౌరుడు కాదు, చాలా కాలం కితమే దేశం వదలిపోయాడు అని సన్నాయి నొక్కులు నొక్కింది పాక్ ఎంబసీ.


తహవ్వుర్ని అమెరికా తీసుకొచ్చి అప్పజెప్పింది తప్పించి అతన్ని అమెరికాలో అరస్టు చెయ్యలేకపోయారు,ఇక్కడికొచ్చాకానే అరస్టు చేసి కోర్టుకి తీసుకెళ్ళేరు,ఇందులో మీగొప్పమే అని ఇంకా ఎవ్వరూవాక్రుచ్చలేదు. 


అది మీ గొప్పేం కాదు,మేమెప్పుడో ఉత్తరం రాశాం  అమెరికాకి,అన్నారు కాంగ్రెస్ వాదులు.


కేస్ ఆరునెలల్లో తేల్చెయ్యచ్చు అన్నారు చిదంబరం మహాశయులు. అదేమో?


ఇతను ఒక చిన్న చేప పెద్దచేపలు ఇంకా దొరకనే లేదూ అని శలవిచ్చారో మాజీ.....


హక్కుల సంఘాలవారింకా రాగం మొదలెట్టలేదేమో.... మందులు,వైద్యం సరిగా అందటం లేదు.బిరియానీ పెట్టటం లేదు వగైరా వగైరా...ఎర్రమిత్రుల మాటే వినబడలా....


కపిలులు,మనువులు,గొపగొప్ప కొమ్ములు తిరిగినవారు ఏం వాదిస్తారో చూడాలి. 


అతను హిందువయ్యా! పేరు చివర రాణా లేదూ? అది హిందువుల పేరు. ఆర్.ఎస్.ఎస్ తమవాడినొకడిని పాక్ పంపి ఇదంతా చేయించి ప్లాన్ చేసింది అని ఇంకా ఏ డిగ్గీగారూ అనలేదేమా?


నడుస్తున్న కత చూడాలి..

Wednesday, 9 April 2025

గొప్ప

 గొప్ప

ఒకప్పుడు ఒకరి గొప్ప మరొకరు గుర్తించి చెప్పేవారు.

నేడు ఎవరిగొప్ప వారే చెప్పేసుకుంటున్నారు,మరికరికి ఆ సావకాశం ఇవ్వడమెందుకని 🤣👌❤

Monday, 7 April 2025

బందీ!

 బందీ!

బందీ!
ఉదయమే ఆరు గంటలకి బాలభాస్కరుడు రెండు బిల్డింగుల మధ్య ఇలా బందీ ఐ చిక్కాడు. హన్నా! ఎ0త ధైర్యం రా నీకు నీ పని చెప్తా అని చురచురా చూసాడు,మరో మాట లేదు,ఒక నమస్కారం చేసుకుని మన్నించవయా, నీ పేరెట్టుకున్నవాణ్ణి ఆ మాత్రం దయలేదా అంటూ పారిపోయా,లోపలికి. మళ్ళీ బయటికి తొంగి చూస్తే ఒట్టు,మర్నాడు ఉదయం దాకా!!!! ఎవరు ఎవరికి బందీ చెప్మా!!!!

Sunday, 6 April 2025

జై శ్రీరాం. జయ జయ శ్రీరాం.

 జై శ్రీరాం. జయ జయ శ్రీరాం


జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ।
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః ।
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ॥

*****

ఇల్లలకగానే పండగకాదు.

నడిచే ఎద్దునే పొడుస్తారు.

పారా హుషార్!

జై శ్రీరాం. జయ జయ శ్రీరాం