Monday, 30 June 2025

తాతముల్లె

 తాతముల్లె

వివరంగా చెప్పనుగాని క్లుప్తంగా చెప్పి ముగించేస్తా!

పాతకాలంలో అదేం లెండి నేటికాలంలో కూడా, ముసలివారికో అలవాటుంటుంది. అది డబ్బులు తలకింద పెట్టుకోడం.ఇంట్లో ఏ అత్యవసరానికి దీనినుంచి తీసి డబ్బులు ఇవ్వరు. ఏం! పోయేటపుడు కూడా పట్టుకుపోతాడా? అని ఈసడిస్తారు కూడా!  ఎందుకు వీరు డబ్బు తలకింద పెట్టుకుంటారు? అదీ కొచ్చను. 🤣 


నాటికి నేటికి ఏనాటికి మారనిది మానవ మనస్తత్వం. ఏంటది? సామాన్యుడైనా మాన్యుడైనా వయసు మీదపడ్డవారికి సొమ్ములు అవసరంలేదు,కర్చులు ఏడుస్తూనో మొత్తుకుంటూనో కొడుకులు కోడళ్ళే పెడతారు. ఈ పెద్దవాళ్ళకి అంతా పరాధీనమేకదా! బయటికెళ్ళి నచ్చినది కొనుక్కోలేరు,తినలేరు. బయటికిపోవాలంటే తోడు కావాలి. సరే ఇక కొనుక్కోడమంటే వీరికి కనపడదు వినపడదు,'కవి' లు కదా! కొట్టువాడికి, మాల్ లోనూ మాటాపలుకూ ఉండదు. మరింక దగ్గర డబ్బెందుకు? అదీన్ని చిల్లరేంకాదు,పెద్దమొత్తంలోనే జమచేసుకుని తలకింద పెట్టుకుంటారు. మనవలు మనవరాళ్ళు దానిలోంచి డబ్బులు కొట్టేయాలని చూస్తుంటారు,కాని ముసలాళ్ళు ఇవ్వరు.తలకింద పెట్టుకుంటారు,పెద్దవాళ్ళుగనక దీనిని తాతముల్లె అంటారు.   మరెందుకీ డబ్బులు? 


చివరికాలం ఎప్పుడొస్తుందో తెలీదు, ఆ సమయంలో అంతా ఆతృతతో ఉంటారు. ఒకసారి ముసలిప్రాణం గుటుక్కుమన్నది మొదలు ,అంతా గొల్లు మంటారు,తప్పదు మరి. ఆ మరు నిమిషమ్నుంచి మొదలవుతాయి కర్చులు. మొదట కావలసినవి పచ్చి వెదుళ్ళు ఇవి ఇంట్లో ఉండవు బయటనుంచి తెప్పించుకోవలసిందే! సరే! ఆ సమయంలో ఎంత కలిగినవారైనా సొమ్ము దగ్గరుండకపోవచ్చు. ఇది అప్పుకి వెళ్ళే సమయమూ కాదు. బంధువులు,మిత్రులు కర్చులు చేయడానికి వెనుకాడరు, కాని  ఆ తరవాత ఇచ్చినా పుచ్చుకోరు. తరవాత  కాలంలో ఇది దెప్పుళ్ళకి సావకాశం. ఇది తరతరాలా ఉండిపోతుంది. 

మీ తాత పోయినపుడు కుండలు,పిడతలు,వెదుళ్ళు తెప్పించడానికే ఇబ్బంది పడిపోయారు,డబ్బులు లేక,  ఆ నాడు మా సుబ్బిగాడు సొమ్ములు కర్చు పెడితేగాని మీ తాత శవం కదల్లేదు,ఇంటినుంచి,తెలుసా!నువ్వేదో గొప్పలు చెప్పకోయ్, లా ఉంటాయి, తరవాతకాలంలో మాటలు. ఇవి చాలా బాధనూ కలిగిస్తాయి. అటువంటి సన్నివేశాలను ముందు తరం వారికి లేకుండ ఉండేందుకే, కనీసం, మొదటి మూడు రోజుల కర్చుకేనా ముల్లె ఉంచేవారనమాట. 

ఇదీ తాతముల్లె కత,సంక్షిప్తంగా       

Sunday, 29 June 2025

అట్లుంటది పెళ్లామ్స్ తో మరి 😉😂😆🤭

అట్లుంటది పెళ్లామ్స్ తో మరి 😉😂😆🤭


భార్య : "ఏమండీ వచ్చేటపుడు పెరుగు తీసుకొస్తారా.. ఇంట్లోని పెరుగు మూడు రోజుల క్రితం నాటిది.. బాగా పుల్లగా అయింది."


భర్త : "అవునా... అలాగైతే దాన్నేం చేస్తావు?"


భార్య : "ఏం చేయాలి ? బయట పారబోస్తానంతే..."


భర్త : "అమ్మ చెబుతుండేది.. పెరుగును బయట పారబోయరాదని. ఏదో ఒకటి చేయి..."


భార్య : "ఏం చేయాలి.. మజ్జిగ చేస్తే పులుపే పులుపు. నోట్లో పెట్టుకోలేమే!"


భర్త : "ఒక పని చేయి. మజ్జిగ పులుసు చేయి. తినడానికీ రుచిగ ఉంటుంది."


భార్య : "గుడ్ ఐడియా .. ఎలాగూ బయటకు పోతున్నారుగా.. కొన్ని సామాన్లు చెబుతాను, వ్రాసుకోండి."


భర్త : "సరే చెప్పు..."


భార్య : "ఊఁ.. కొత్తిమీర, కరివేపాకు, అల్లం.. ఆ.. ఒక టెంకాయ, జీలకర్ర.."


భర్త : "సరే .. వ్రాసుకున్నాను.. బయల్దేరనా?"


భార్య : "ఉండండి.. ఇంకా ఉన్నాయి.. ఒక బూడిద గుమ్మడికాయ..."


భర్త : "బూడిద గుమ్మడికాయనా ? అదెందుకు?"


భార్య : "మరి మజ్జిగ పులుసులో బెండకాయలు వేస్తరా? తెచ్చేదేదో పెద్దదే తెండి. కోసిపెట్టినది , కుళ్ళిపోయినది కాకుండా చూసి తీసుకురండి."


భర్త : "సరే... బయల్దేరనా?"


భార్య : "అయ్యో .. కాస్త ఆగండి.. ఒకటే గుమ్మడికాయ తేకూడదంట, అమ్మమ్మ చెబుతుండేవారు. ఎలాగూ తెస్తున్నారు రెండు తెండి. అవి కూడ పెద్దవి. ఇంకో పని చేయండి.పెద్ద గుమ్మడి కాయ తెస్తున్నారెలాగూ, ఒక కేజి చక్కెర, ఒక కేజి నెయ్యి , ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఏలకులు..."


భర్త : "ఇవన్నీ మజ్జిగ పులుసుకు ఎందుకే?"

భార్య : "ఛీ, పులుసుకు కాదండి.. హల్వా చేయడానికి. గుమ్మడికాయను పగలగొట్టి అలాగే వదిలివేయరాదు. అపశకునం.."


భర్త : "ఇక చాలా?"


భార్య : "కాస్త ఆగండి.. ఓ నాలుగైదు నిమ్మ కాయలు, నల్ల మిరియాలు, ఇంగువ తీసుకురండి. ఘమఘమల వాసనలొస్తాయి."


భర్త : "హల్వాకు ఇంగువ వేస్తారా?"


భార్య : "అబ్బా.... హల్వాకు ఎవరైనా ఇంగువ వేస్తారాండి.. ఇవి గుమ్మడికాయ వడియాలకు.. గుమ్మడికాయ తెస్తున్నపుడు వడియాలు పెట్టకపోతే ఎలా చెప్పండి?"


భర్త : "ఇకనైనా వెళ్ళనా?"


భార్య : "ఏదో జ్ఞాపకానికొస్తోంది ఉండండి. ఆ.. జ్ఞాపకమొచ్చింది. ఒక పొట్లకాయ తెండి. మజ్జిగ పులుసుకోసం గుమ్మడికాయతో బాటు మంచి కాంబినేషన్ . దాంతో బాటు ఒక అర్ధ కేజి మొత్తని శనగపిండి తీసుకురండి. ఎలాగూ పొట్లకాయ తెస్తున్నారు కాబట్టి బజ్జీలు చేయకపోతే ఎలా చెప్పండి? అలాగే వంటసోడా, రిఫైన్డ్ ఆయిలూ తీసుకురండి, వేరుశనగనూనె కాదు సన్ ఫ్లవర్ ఆయిల్..."


భర్త : "సరే.. బయల్దేరుతున్నాను."


భార్య : "అదేమిటి వెనుక తలుపు వైపు. అక్కడెక్కడికి వెళ్తున్నారు."


భర్త : "నేను బయటకు పోవడం లేదు, వంటింట్లోకి వెళ్తున్నాను."


భార్య : "ఎందుకు? మార్కెట్ కు పోరా?"


భర్త : "నీ మార్కెట్ నాశనం కాను. గ్లాసుడు మజ్జిగపులుసు కోసం వేయి రూపాయలు ఖర్చు చేయాలా? పాపమొస్తే రానీ.. నేనే ఆ పులిసిన పెరుగును బయట పారబోస్తాను.."


భార్య : "ఏమిటండీ, మీరే చెప్పారుగా..."


భర్త : ఓసి... నీ అమ్మ కడుపుమాడా బుద్ధి లేక చెప్పానే ..!


అట్లుంటది పెళ్లామ్స్ తో మరి 😉😂😆🤭

Courtesy:whatsapp

Saturday, 28 June 2025

బలవంతుడ

 బలవంతుడ

బలవంతునికే మిత్రులుంటారు. శత్రువులూ ఉంటారు. కాని బలహీనునికి శత్రువులేగాని మిత్రులుండరు. అలాగని బలవంతుడు


బలవంతుడ నాకేమని

పలువురతో నిగ్రహించి బ్రతుకుట మేలా?

బలవంతమైన సర్పము 

చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ!


అంచేత బలమున్నవాడు ప్రతివాడితోనూ శత్రుత్వం తెచ్చుకోకూడదు.

అధికారము,ధనము,అందము,బలము, యవ్వనము,మిత్రులూ శాశ్వతం కాదు


యుతులకు దుర్భలులకు

 మెవ్వఁడు? నీకు నాకు బ్రహ్మాదులకున్
 మెవ్వఁడు ప్రాణులకును
 మెవ్వం డట్టి విభుఁడు ల మసురేంద్రా!

అందరి బలమూ పరమాత్మే నీ స్వంతబలమే లేదు సుమా గర్వ పడకని ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపునకు చెప్పినమాట, ఇది నిత్య సత్యం.

Thursday, 26 June 2025

అనుమతులక్కర లేదు

 అనుమతులక్కర లేదు



రెక్కలు నీవి,ఆకాశం ఎవరిసొత్తూ కాదు. 

ఎగరడానికి అనుమతులక్కర లేదు, కాదు అడక్కు.  


Thursday, 19 June 2025

మాలిక ఇక కనపడనట్టే...నా?

 మాలిక ఇక కనపడనట్టే...నా?


ఒకప్పుడు బ్లాగులు కొల్లలు. ఆగ్రిగేటర్లు కూడా చెప్పుకోదగిన లెక్కలోనే ఉండేవి. ఆగ్రిగేటర్లు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయాయి, కారణాలనేకం. నేను బ్లాగుల్లోకొచ్చేనాటికి ఉచ్చ దశలో ఉంది,బ్లాగ్ ప్రపంచం. గొప్ప గొప్ప అగ్రిగేటర్లన్నీ కనుమరుగైపోయాయి, కాలంలో. నిన్న మొన్నటి దాకా ఉన్న మాలిక కూడా నెమ్మదిగా కనపడకుండా పోయింది, మరి కనపడుతుందా? 


ఇక మిగిలిన ఏకైక ఆగ్రిగేటర్ శోధిని. శ్రీ శ్రీనివాస్ గారి దయ మా ప్రాప్తి.   

Saturday, 14 June 2025

కరోనా-నింబస్

 కరోనా-నింబస్


కరోనాకి వేరియంట్ ఒమిక్రాన్ అది కొంతకాలం పీడించింది. నెమ్మదిగా కరోనా తగ్గింది. జనాలు శ్వేఛ్ఛావాయులు పీల్చుకున్నారు. నాలుగేళ్ళయిందేమో, కరోనా మళ్ళీ మొదలయింది. ఇది ప్రపంచంలో అన్ని దేశాలను చుట్టుముడుతోంది. చిన్న దేశాలు తప్పించి మిగిలినవారు పలకటం లేదు. అగ్నేయాసియా దేశాల్లో జోరుగా వుంది. పశ్చిమదేశాల్లో బ్రిటన్,కెనడా, మొదలైన దేశాల్లోనూ అమెరికాలోనూ ఉంది. చైనా సంగతి తెలీదనుకోండి.  ఐక్యరాజ్య సమితివారు ఈ వేరియంట్ కి నామకరణం చేయలేదుగాని నింబస్ గా అనధికారికంగా పిలుస్తున్నారీ బుజ్జిని. 


దీని ప్రత్యేకతేంటీ అదిగదా  కొచ్చను. దగ్గు,రొంప,వగైరావగైరా అన్నీ మామూలే లచ్చనాలు. ప్రత్యేకతేమంటే గొంతులో కత్తులు  నూరినట్టుంటుందిట. (రేజర్ బ్లేడ్స్)అంటున్నారు. చాలా తొందరగా వ్యాప్తి చెందుతుందిట. మరణాలూ ఉన్నాయి. మనదేశంలోనూ ఉన్నది కాని బహు నెమ్మదిగా వ్యాపిస్తున్నది. మొత్తం దేశం మీద ఏడు వేల కేసులుంటే అందులో ఎక్కువ కేరళా,గుజరాత్,ఢిల్లీ, పశ్చిమ బంగ లో ఉన్నాయట. మిగిలిన దేశం మీద తక్కువే ఉన్నాయట. ప్రభుత్వాలు జాగ్రత్తలు  చెబుతున్నాయి,తీసుకోండి. మన ప్రాంతంలో సోకరాదనే నా అభిలాష.  సోకితే మందులు వేసుకుంటూ,  గొంతులో రేజర్ బ్లేడ్స్ అనిపిస్తే వేడి నీళ్ళలో రాళ్ళ ఉప్పు కరిగించి గోరువెచ్చగా ఉండగా గొంతులో పోసుకుని గరగరలాడించి,ఉమ్మేయండి. ఇది రోజుకి మూడు నాలుగుసార్లు పైగా చేయచ్చు. ఆపై నిప్పుల కుంపటి దగ్గర కూచోండి,  కొద్ది దూరంగా కాలకుండా. ఆపై కుంపటి  మీదకి వంగి నోరు బాగ తెరిచి వేడి  గొంతులోకి పోయేటట్లు కాచండి,గొంతును. చాలా శమనగా ఉంటుంది.  

ఆరోగ్యమస్తు. 

 

https://www.thehealthsite.com/news/covid-19-cases-in-india-live-updates-13-june-2025-new-coronavirus-variant-nimbus-nb-1-8-1-sparks-panic-with-razor-blade-throat-and-severe-symptoms-active-cases-1229923

Thursday, 12 June 2025

ముక్కుపిండి వసూలు చేస్తా!

ముక్కుపిండి వసూలు చేస్తా!


ముక్కుపిండి వసూలు చేస్తా!నన్నమాట వింటుంటాం. ఏంటబ్బా అనుకున్నా ఇంతకాలమూ. 

శరీరం లో నొప్పులు మెడ నొప్పి,వెన్ను నొప్పి,సయాటికా నొప్పి ఇలా వివిధ నొప్పులకు అస్థిపంజరంలోని ప్రతి ఎముకను నొక్కి సరి చేసున్నవారు, డాక్టర్లు ఎక్కువ కనపడుతున్నారు, ఉత్తరాదిని. మనదాకా ఇంకా వచ్చినట్టు లేదిది.  ప్రతి భాగాన్ని విరిచినప్పుడు ఒక చిన్న శబ్దం, దాన్ని రోగికి వినిపించేందుకు డాక్టర్ చేతికో పరికరం, ఇలా నడిచిపోతోంది.  డాక్టరు  పడుకోబెట్టి,కూచోబెట్టి, మీదపడి, మెడవిరిచి ఇలా ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. చూడ్డానికి కొంత ఎబ్బెట్టుగానే ఉంది. ఇందులో డాక్టర్లు ఆడ మగ కూడా, ఈ మీదపడి కౌగలించుకున్నంత పని చేసిజేసి, సున్నితభాగాలని తడుముతూ కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగమే ముక్కు పిండడం కూడా అలా ముక్కు  దూలం విరిస్తే శ్వాస బాగా ఉన్నట్టు అలా  విరిపించుకున్నవారి హావ భావాలు తెలుపుతున్నాయి. మరి ఇలా ముక్కు పిండిన డాక్టరు డబ్బులు పుచ్చుకోడా?  అదే ముక్కుపిండి వసూలు చేయడం అనుకుంటా. 

 

ఒకప్పుడు పెద్దవాళ్ళైన స్త్రీలు పిల్లల పట్ల ప్రేమ తెలియచేయడానికి మెటికలు విరిచేవారు,గుర్తుందా? 


గురజాడ కన్యాశుల్కంలో ఒక పాత్రచేత మొల్లో చెయ్యేసి సొమ్ము వసూలు చేసుకురమ్మన్నాడు, మా పంతులు అంటాడు గిరీశం తో, సానిదానితో తీయించుకున్న ఫోటోల సొమ్ముకోసం. ఈ మొలలో చెయ్యివేసి వసూలు చేయడమేమిటన్నది కొచ్చను. పాత కాలంలో మొలలో దాచుకునేవారు రూపాయలు, దానిలోంచి తీసుకుంటానని అర్ధం అనుకున్నా! కాదని తెలిసింది. మొలలో చెయ్యేసి అంటే గుడ్డలూడదీసి వసూలు చేస్తాననిట. అంటే గుడ్డలిప్పి పరువుతీసి..... అదీ కత.పరువున్నవాడికైతే కదా! అదీ పాయింటు...   

Monday, 9 June 2025

అన్నీ..కొంచం..కొంచం..వార్తలు

అన్నీ..కొంచం..కొంచం..వార్తలు


ఋతుపవనాలు కరుణించలేదింకా. 40,41 మండుతూనే ఉంది. మరో నాలుగురోజులిలా అంటున్నారు.

**

కరోనా దేశాలన్నిటినీ చైనాను కూడా పట్టిపీడిస్తున్నట్టు వార్తలున్నాయి. మరి అమెరికా 

,యూరప్ ల సంగతే తెలీదు. భారత్ లో కూడా కాలు పెట్టింది,కాలు పెట్టి వారంపైగా ఐనా నిన్నటికి కేసులు 6000 లకి చేరలేదు. ఇంకా ఎక్కువ కాల/నందుకు ఎర్ర పత్రికలు ఏడుస్తున్నాయి. పుట్టింటివారి చుట్టాలు,మహరాష్ట్ర,ఢిల్లీ లో మాత్రమే కేసులు ఎక్కువగా ఉన్నాయి.పుట్టింటివారి చుట్టాల రాష్ట్రంలోనే ఎక్కువున్నాయి. మరో బూస్టర్ డోస్ అవసరం లేదన్నట్టు వార్తలు. ఇదివరలో చేసిన వాక్సీన్ పని చేస్తున్నట్టుందని వార్తలు. 

**

మరో పాథొజన్ పై ఒక చైనీయుడు అమెరికా యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్నాడు,చైనా నుంచి మొక్క తెప్పించుకుని. ఆ చైనీయుడి గర్ల ఫ్రెండ్ నఏనూ దానిమీద పరిశోధన చేస్తా అని ఆ మొక్కని చైనా నుoచి అమెరికా తెప్పించుకుంది. ఈ మధ్య చెకింగులు ఎక్కువయ్యాయై, అందునా యూనివర్సిటీ లపై,అమెరికాలో. ఇదేమి మొక్క వివరాలు తీగ లాగితే డొంక కదిలింది. ఈ పాథోజన్ ను మొక్కలపై ప్రయోగిస్తే ఆహార పదార్ధాలు పండించే అన్ని మొక్కలూ నెమ్మది నెమ్మది ఉత్పాదన తగ్గి, తరవాత చచ్చిపోతాయని తేలింది. దీంతో ఆ ఇద్దరిని పట్టుకుని అరస్టు చేసి తీగ లాగితే ఇద్దరూ చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యులని, గూధచారులు కావచ్చేమోనని అనుమానం.    

**

గ్రేటా  తన్ బర్గ్ గుర్తుందా? ఒకప్పుడు భారత్ ను అల్లరిపెట్టింది. ఇప్పుడు ఇస్రయెల్ ని అల్లరిపెట్టాలని బయలుదేరింది. ఇస్రయెల్ ఒకటే మాట చెప్పింది. ఇస్రయెల్ జలాలలోకి అనుమతింపబడని నౌక ఏదీ రాలేదు. వెనక్కి తిరిగిపో! గౌరవంగా ఉంటుంది. నువు తెచ్చే ఒక మూటా సరుకులు ఒకళ్ళికి కూడా సరిపోవు. కాదని మొండికేసి ముందుకొస్తావా? చేయవలసిన పని నా నౌకాదళం  చేస్తుంది అని ఒక్కటే వారినింగ్ ఇచ్చింది...చూడాలి...  

**

బీహార్,బెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కాంగ్రెస్ కి మళ్ళీ ఓటింగ్ మెషీన్ల భూతం పట్టుకుంది. 

** 

Monday, 2 June 2025

అప్రస్తుత ప్రసంగం.

 అప్రస్తుత ప్రసంగం.


నేను పుట్టినకాలం నాటి ముచ్చట. ఆ రోజుల్లో వినోదం అంటే తోలుబొమ్మలాట. ఈ తోలుబొమ్మలాడించే కళాకారులు రామాయణ,భారత,భాగవతాల్లో అంశాలు చెబుతుండేవారు,తోలుబొమ్మల సాయంతో. ఈ ఆట కొంత నడిచిన తరవాత తెరపై కేతిగాడు ఉరఫ్ జుట్టుపోలిగాడు ఉరఫ్ గాందోళిగాడు,బంగారక్కల బొమ్మలను తెరపై వేసి అసందర్భ ప్రసంగం చేసి హాస్యం పుట్టించేవారు. ఆ తరవాత కాలంలో ఈ హాస్యం శృతి మించి రాగానపడినట్టు బూతులు చోటు చేసుకున్నాయి.  సరే ఆ తరవాత అవి సినిమా,టివి లకీ చేరిపోయాయి.  హాస్యం అపహాస్యమూ అయింది. 


ఇంతకీ ఇదెందుకు గుర్తొచ్చిందీ? అదీ కొచ్చను. 96 ఏళ్ళ వృద్ధ తోలుబొమ్మలాట కళాకారిణికి పద్మ అవార్డు ఇవ్వడం జరిగింది. అప్పుడు గుర్తొచ్చింది, నాటి కాలంలో,   ఆంధ్ర ప్రాంతంలో మా వూరు నరిసిపూడి, ఈ తోలు బొమ్మలాటకి ప్రసిద్ధి పొందింది. అంతే కాదు నాటి తోలుబొమ్మలాట కళాకారులకు  మా పూర్వీకులు గురువులు. అదీ బాదరాయణ సంబంధం,ఇదో అప్రస్తుత ప్రసంగం.               

 

కాలంలో ఇది సాహిత్యంలోనూ చోటు చేసుకుంది. భాసుని మృఛ్ఛకటిక నాటకంలో శకారుడు,(రాణీగారి తమ్ముడు, అనధికార కేంద్రం),  మాటల ద్వారా హాస్యం పండింప జేసేరు. ఆ తరవాత కాలంలో తెనుగులో గురజాడవారు  తమ కన్యాశుల్కం నాటకం ద్వారా ఈ రకపు హాస్యాన్ని పండించడం చేసేరు. గిరీశం, బుచ్చమ్మల ద్వారా     అపహాస్యపు మాటల  ద్వారా, హాస్యం కొంత పండింప జేసేరు. ఆ నాటిక అవసరం నేటి కాలానికి లేకపోయినా,ఆ సమస్య చచ్చిపోయినా,కొందరు నేటికీ ఆ నాటికను వేస్తూ,చచ్చిన గుర్రాన్ని తోలుతూనే ఉన్నారు ( ఏదో కారణం ఉండి ఉంటుంది) ఇది నేటి కాలానికి అప్రస్తుతం .    మృఛ్ఛకటకం, కన్యాశుల్కాలని పోలిస్తే భాసుడు శకారుణ్ణి సృష్టిస్తే గురజాడ గిరీశాన్ని పుట్టించారు. భాసుడు ఒక హీరోని,హీరోయిన్ గా ఒక వేశ్యను పుట్టించి, చివరికి వేశ్యను ఉదాత్త పాత్ర చేసేరు. అలాగే గురజాడ భాసుని హీరో విలన్ లను కలిపేసి గిరీశాన్ని తయారు చేసి,మథురవాణి అనే వేశ్యను ఉదాత్తం చేసేరు. గురజాడ  నాటికకు భాసుని నాటిక ఉత్తేజమా? ఏమో తెలిసినవారు చెప్పాలి. ఇదీ అప్రస్తుత ప్రసంగమే! డామిట్ కథ అడ్డం తిరిగింది. ఎక్కడబ్బా? 

  

ఇక అష్టావధానం అనేది ఒక కవితా ప్రక్రియ. చెళ్ళపిళ్ళ వారి ద్వారా అది ప్రజల దగ్గరకు చేరింది. అందులో ఒక అప్రస్తుత ప్రసంగితో ప్రసంగం కూడా ఒక ప్రక్రియ. ఇలా ప్రస్తుత ప్రసంగం కవులనూ చేరింది. ఇందులోనూ  హాస్యంచోటు చేసుకుంది, ఒక్కొకపుడి అపహాస్యం కూడా అవుతోంది.  


కొద్ది మోతాదులో అప్రస్తుత ప్రసంగం కూడా బాగుంటుందేమో సుమా!

 ఇదీ నేటి కాలానికి అప్రస్తుత ప్రసంగం.  

Sunday, 1 June 2025

వివేచన-రసజ్ఞత.

 వివేచన-రసజ్ఞత.   


నిన్నటి టపాకి వచ్చిన లక్కరాజువారికామెంటుకి సమాధానం రాయబోతే టపా ఐపోయింది. నిన్నటి టపాకి తదుపరి మరియు అనుసంధానం. 


మొదటి ఉపమానంలో ఎదురుగా ఉన్నది నిశ్చలం,బుద్ధి లేనిది, అందుచేత వివేచన మనకే కావాలి. అది పైకి కనపడుతున్నట్టు అందమైనదో కాదో తేల్చుకోవలసింది మనమే!

 

ఇక రెండవదానిలో ఉపమానం బురదపంది కదులుతుంది, ఎలా కదులుతుందో మనం బుద్ధితో ఊహించాలి,దానికి నిశ్చయం ఉండదు. ఇక్కడా మనమే వివేకం ఉపయోగించాలి. ఉపమానం బురదపంది కాని అందంగా కనపడే బురద పంది లాటి మనుషులూ తారసపడతారు. వారు బుద్ధి ఉపయోగించరు, అందుచేత మనమే బుద్ధి ఉపయోగించి దూరంగా ఉండాలి. ఎంత దూరం అది తెలుసుకోగలగడమే విజ్ఞత, దానిని ఆచరించడమే రసజ్ఞత.  ఇది హార్వర్డ్ లోనూ ఈటన్ లోనూ నేర్పరు,నేర్పలేరు. అదంతే! వయసుతో చదువుతో వివేచన పెరగాలి,బుద్ధి పెరగాలి.  


ఇక మూడవదానిలో ఇద్దరూ చలనం,బుద్ధి ఉన్నవారే, చదువుకున్నవారే!  ఎదుటివారు మూర్ఖులు అని తెలుసుకోగలగడమే విజ్ఞత,ఎవరు మూర్ఖులు? దీనికిదివరలో సమాధానం చెప్పడం జరిగింది,వెతుక్కోవచ్చు.  అది తెలిసి ఎంతదూరంలో ఉండాలి? ఎంత మాటాడాలి ? ఎప్పుడు మాటాడాలి ? తెలుసుకోవడం విజ్ఞత , వీటిని తెలుసుకుని ఆచరించడమే రసజ్ఞత. 

త్వం శుంఠ అంటే త్వం అంటారు, ఇది లోక రీతి.    ఇది విజ్ఞత, చదుతో నిమిత్తం లేదు దీనికి. అందుకే చదువది ఎంతగల్గిన అన్నారు శతక కర్త! ఇదెవరిని ఉద్దేశించినది కాదు, ఎవరేనా భుజాలు తడుముకుంటే నాకు బాధ్యత లేదు. మన్నించండి.