రాముని రాజ్యం-భరతుని పట్టం-3
ఇంతకు ముందు భాగాలు లింకుల్లో చదవండి.
https://kasthephali.blogspot.com/2023/03/1.html
రాముని రాజ్యం-భరతుని పట్టం-3
ఇంతకు ముందు భాగాలు లింకుల్లో చదవండి.
https://kasthephali.blogspot.com/2023/03/1.html
కలికి చిలకల కొలికి .......
చిత్రం : సీతారామయ్యగారి మనవరాలు (1991)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : చిత్ర
కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు యెరుగని పసిపంకజాక్షి
మేనాలు తేలేని మేనకోడల్ని
అడగవచ్చా మిమ్ము ఆడ కూతుర్ని
వాల్మీకినే మించు వరస తాతయ్య
మాయింటికంపించవయ్య మావయ్యా
కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
ఆ చేయి యీ చేయి అద్ద గోడలికి
ఆ మాట యీ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మా నాటి కోడలివి
తెచ్చుకో మాయమ్మ నీదు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే
పూలల్లొ దారమై పూజలే చేసే
నీ కంటి పాపలా కాపురం చేసే
మా చంటిపాపనూ మన్నించి పంపూ
కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
మసకబడితే నీకు మల్లెపూదండ
తెలవారితే నీకు తేనె నీరెండ
ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మలపంట మా అత్త చాలు
పుట్టగానే పూవు పరిమళిస్తుంది
పుట్టింటికే మనసు పరుగుతీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో మనసున్న మామ
సయ్యోధ్యనేలేటి సాకేత రామా
కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
*****
ఈ పాట వింటుంటే ఒక తెనుగు జానపదగీతం గుర్తొస్తుంది. అది ఇదే ..
దొందూ దొందే!!!
ఒకకొత్తగా పెళ్ళయిన జాయ,పతి. ఇద్దరూ కలసి ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో నది దాటాల్సి వచ్చింది. పడవెక్కి, ప్రయాణం తరవాత దిగేరు. నది ఒడ్డు ఎక్కుతూ తలపైకెత్తి చూస్తే, ఒడ్డున విరగబూసిన చింతచెట్టు కనపడింది ఇద్దరికీ,
పతి అసంకల్పితంగా
తింతతెట్టు పూసిందే అన్నాడట!
చింతచెట్టు పూసిందే అన్నమాట.
దానికి జాయ మాటకలుపుతూ
తాతే పూతే తాలానికి తాయదా? పూయదా? అందట.
కాచే పూచే కాలానికి కాయదా?పూయదా అని ఆమె మాట.
ఒకరికి "చ"పలకదు,మరొకరికి "క" "చ" రెండూ పలకవు.
ఇది విన్న పడవ సరంగు దొందూ దొందే!అన్నాడు.
ఇద్దరూ ఇద్దరే అన్నమాట. ఇతని "ఇ", "ర", ఒత్తులు పలకవు.
ఈ చిన్ని కతని సరదాగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది మేధావుల పరంగా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం, ఒకరిని మరొకరు ఉత్పేక్షాలంకారలో పొగుడుకుంటూ ఉంటారు.
భారత గణతంత్రదిన శుభకామనలు
కలికాలం
కలికాలం I
ఇది కలికాలం II
ఆకలి కాలం,
మూకల కాలం,
కేకల కాలం,
రూకల కాలం.
కలికాలం I
ఇది కలికాలం II
రూపుల కాలం,
మాపుల కాలం,
రేపుల కాలం,
పాపుల కాలం.
కలికాలం I
ఇది కలికాలం II
చూపుల కాలం
రాపిడి కాలం
చావుల కాలం
దోపిడి కాలం.
రోగం రొష్టు-సంసారం గుట్టు
ఇదొక నానుడి,నాటికాలందే కాదు నేటికాలందీనూ!
రోగం రొష్టు
ఏం? ఎందుకూ కదా కొచ్చను. నాటికాలంలో వైద్య సహాయం తక్కువ,కావల్సినవారందరికి కబుర్లు చేసి మరీ చెప్పుకునేవారు,ఉత్తరాలూ రాసుకునేవారు. మీ అల్లుడికి జ్వరం ఎంతకీ తగ్గటం లేదు,వైద్యం దారి వైద్యందే జ్వరందారి జ్వరందేలాగా ఉందీ అని, అటునించి ఈ మాత్రలువాడి చూడు అని మనిషిచేత పంపడమో,ఉత్తరం రాయడమో చేసేవారు. ఇందుకోసం రోగం రొస్టు. నాటి రోజుల్లో జబ్బులు కూడా చెప్పుకునేవే ఉండేవి. నేడు డాక్టర్ దగ్గరకెళితే చాంతాడంత టెస్టులు రాసి చేయించుకురా అని పంపితే అవి పూర్తయ్యేటప్పటికే వారం పడుతుందిలా ఉంది. ఇక వైద్యం సంగతి చెప్పేదేలేదు. మరెవరితోనైనా చెప్పుకుంటే, ఆయన దగ్గరకెందుకెళ్ళేరు, ఈయన దగ్గరకెళ్ళలేకపోయారా? ఇలా సలహాలిస్తే వెళ్ళిన ప్రతి డాక్టరూ టెస్టులు రాస్తే,చేయించేమని చెప్పినా మళ్ళీ చేయించాల్సిందేనంటే చద్దికంటే ఊరగాయి ఎక్కువైన చందమైపోయింది,నేటి వైద్యం. అబ్బే! అమెరికా తీసుకెళ్ళలేకపోయారా? అమెరికాలో వాళ్ళు వైద్యం గొప్పగా చేసినా అక్కడివాళ్ళు ఎందుకు చస్తున్నట్టు? ఇదికదా కొచ్చను. అంచేత నేడు రోగం గుట్టైయింది. ఇప్పుడు చెప్పుకునే రోగాలూ రావటం లేదేమో! ఇక దేశంలో కూడా సెకండ్ ఒపీనియన్ వైద్య శాలలు వెలిసాయి.వీరు వైద్యం చెయ్యరు. టెస్టులు చేసి అన్నీ రోగ నిర్ణయంచేసి చెబుతారు.పాత వైద్యం తాలూకు రికార్డ్ ఇవ్వక్కరలేదు. టెస్టులలో తేడా పాడా ఉండదనీ,రోగనిర్ణయం కచ్చితాంగా చేస్తామనీ చెప్పుకుంటారు.పంపించేస్తారు. ఆ తరవాత రోగి ఇష్టం.
ఇక సంసారం గుట్టు.
సంసారంలో అనేక ఇబ్బందులుంటాయి. పెళ్ళాం గయ్యాళి కావచ్చు,లేదా మేదకురాలు కావచ్చు. అలాగే మొగుడున్నూ! పిల్లలు చెప్పినమాట వినకపోవచ్చు. ఈడొచ్చిన పిల్ల ప్రేమలో పడచ్చు. ఇలా ఉంటాయి. లేదా డబ్బు ఇబ్బందులూ,రాబడి తక్కువా,ఇలా అనేకం. బయట చెప్పుకునేవా? అమ్మా! మా ఆయన ఎందుకూ పనికిరాడే, అందుకూ పనికిరాడే అని పాటికేళ్ళు సంసారం చేసినామె తల్లితొ చెప్పుకుంటే,తల్లి మాత్రం ఏం చేయగలదు? చులకన కావడం తప్పించి. అందుకే పెద్దలు
ఆయుర్విత్తం గృహఛ్ఛిద్రం
మంత్రమౌషధ సంగమౌ
దానమానావమానశ్చ
నవగోప్యా మనీషిభిః
వయసు,సాంసారంలోని ఇబ్బందులు,మంత్ర,తీసుకునే మందు,స్త్రీ పురుష సంగమం,దానం,మానం,అవమానం ఈ తొమ్మిదీ గుట్టురా బాబూ అన్నారు. ఆపై మీచిత్తం. ఇప్పుడంతా పబ్లీకున చెప్పుకునేవే అంటారా?అంతా ట్రాన్స్పరెన్సీ అంటారా? తమ చిత్తం.
తీర్థానికి వెళ్ళొచ్చా!
తీర్ధoలోకి వెళ్ళె ముందు ఒక చిన్న మాట.
మగవాడితో పోలిస్తే స్త్రీలు ఆహారం రెట్టింపు తీసుకుంటారు, తెలివి నాలుగురెట్లు, ఆరు రెట్లు సాహసం, కామం ఎనిమిదిరెట్లు ఉంటుందని చెబుతున్నారు పెద్దలు.
పట్నాలలో, పల్లెలలో కూడా
నిషేధం.
ఏరకుమీ కసుగాయలు
దూరకుమీ బంధుజనుల దోసము సుమ్మీ
బారకుమీ రణమందున
మీరకుమీ గురువునాజ్ఞ మేదిని సుమతీ
పచ్చి కాయలు కొయ్యకు.బంధువులలో లోపాలు ఉండచ్చు,అంతలో వారిని తూలనాడడం తగదు,తప్పు సుమా! యుద్ధరంగం నుంచి పిరికివాడిలా పారిపోకు.దేశానికి అవసరమైనపుడు పారిపోవడం తప్పు.గురువు చెప్పిన మాట అతిక్రమించకు.
నేటికాలంలో పచ్చికాయలే కోసి, రకరకాల కృత్రిమ పద్ధతుల ద్వారా పండబెడుతున్నారు. అన్ని స్థాయిలలోనూ, కృత్రిమంగా పెంచుతున్నారు. అన్ని కాయలకి పళ్ళకి ఇంజక్షన్లు చేస్తున్నారు. చివరికి, కొబ్బరికాయ కల్తీ లేనిదనుకున్నా నేటి దాకా,కాదు కొబ్బరికాయకి చెట్టున గెలపై ఉండగా ఇంజక్షన్ చేస్తున్నారు. మనల్ని దేవుడే రక్షించాలి.
బంధుజనలెక్కడబాబూ! ఒకప్పుడు ఇద్దరు లేక ముగ్గురుచాలు మారోజుల్లో మాట, అరవైయేళ్ళ పైమాట. ఆ తరవాత మేమిద్దరం మాకిద్దరు,ఇదీ స్లోగను. ఆపై మేమిద్దరం మాకొక్కరు. ఇప్పుడు స్లోగన్ పెళ్ళొద్దు పెళ్ళాం కావాలి,పెళ్ళొద్దు మొగుడు కావాలి,ఇదీ స్లోగను. ఏరోజుకారోజే కొత్త మొగుడు,కొత్తపెళ్ళాం. లివ్ ఇన్ చాలు,పిల్లలా? బెడద. ఇక బంధువులెక్కడనుంచి వస్తారు? ఎవడి పెళ్ళాంతో ఎవడేనా తిరగచ్చు, లైనేయచ్చు, తప్పుకాదు.. ఆడామగాకి తేడాలేని రూలు, ఇదే చట్టం,ఇదే న్యాయం. ఇప్పుడు రాజకీయ నాయకులు ముగ్గురు నలుగురు పిల్లల్ని కనండి, ప్రోత్సాహకాలు ఇస్తామంటున్నారు. మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఆలోచిస్తున్నాను,లేదూ, ఎవడి పెళ్ళానికైనా లైనెయ్యాలి.
మూడో ప్రపంచయుద్దం రాబోతోంది. అంతా సిద్ధం కావాల్సిందే,ముసలి,ముతకతో సహా! చావో! రేవో!! నేటికాలంలో అందరూ కీబోర్డ్ వారియర్లే, అలా కుదరదు.
గురువు? ఎక్కడబాబూ! అంతలోనూ కట్,పేస్టు ప్రొఫెసర్ల సంఖ్య పెరుగుతోంది. కట్ పేస్టుకి, కాపీ పేస్టుకి తేడా తెలియని గొప్పోళ్ళూ తయారవుతున్నకాలం. ఏమవుతుంది,ముందు కాలంలో? భగవాన్ జానే!!!