కాదేదీ కవితకనర్హం
కుక్కపిల్లా,సబ్బు బిళ్ళా, అగ్గిపుల్లా
మహాకవి శ్రీశ్రీ
పేరడీ
తెనుగులో పేరడీ కవితలకు ఆది గురువు శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి. వీరు జరుక్ శాస్త్రిగానే ప్రసిద్ధులు. ఆదిగురువుకు నమస్కరిస్తూ
కాదేదీ తినుట కనర్హం
కుక్కా,నక్కా,పిల్లీ,బల్లీ
నేటి అవుసరం ఉడతా మిడతా
తింటేనే ఉనికి లేకుంటే లేదు మనికి
కడుపుకాలితే సర్వం సమానం
కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం.
ఆది పేరడీ గురువును స్మరించుకున్న సందర్భంగా చిన్న కవిత :)
పేరడీ కవిత్వానికి
ఆది గురువు జరుక్కు
దీనికి కావాలి చమక్కు
అనిపించాలి చురుక్కు
నవ్వు రావాలి భళుక్కు
ఇది ఇంతకు ముందే ఎవరేనా చెప్పేసేరేమో కూడా :)