Courtesy:Whats app
ఏంటీ పుణుక్కుంటున్నారక్కడా?? సణిగిందో ఇల్లాలు.
ఏం లేదూ బీరువా సద్దుదామనీ..సాచేశాడా మగమహారాజు.
చూస్తూనే ఉన్నాలెండి మీ సద్దుడు అంది సద్దుడు మాట మీద నొక్కి మూతి విరుస్తూ!
నలభై రోజుల్నించీ కుండల్లోకి గుర్రాలని తోలుకుంటూ మీరు చేస్తున్న పనులివేగా, మురిపెంగా విసుక్కుంది.
ఖాళీగా కూచుంటే ఏం తోచటం లేదోయ్
సరేగాని, ఏంటా మాసిపోయిన బనీనూ మీరూనూ, చెమట వాసనతో చిరాకేయటం లేదూ? విప్పేయండి, వాష్ లో వేస్తాను అంటే ఓహో అనుకున్న మగమహారాజు బనీను విప్పేసేడు,గొప్పగా. లోపల దాచుకున్నవి మరచిపోయి బనీను విప్పడంతో కాయితాలు జలజలా రాలేయి. ఆ ఇల్లాలు కాగితాలన్నీ ఏరి బీరువాలో జాగ్రత్త చేసుకుని తాళమేసి, మగమహారాజుని చూస్తూ...
అవును కదా! ఉదయం నాలుగునుంచి ఎనిమిది మధ్యాహ్నం ఒకటినుంచి రెండు, రాత్రి ఏడునుంచి ఎనిమిది దాకా రసోయి,కిచెన్,వంటిల్లు తీసి ఉంచితేనే, చిరుబొజ్జలు, బాన పొట్టలు వచ్చేసేయి. వచ్చినవేమైనా పోతాయేమోగాని ఇవి పోవులెండి అని సాగతీసిందా ఇల్లాలు, బొజ్జ నిమురుకుంటూ బయటికెళ్ళేడా మగమహారాజు :)
Courtesy:Whats app
😁🙂
ReplyDeleteవిన్నదే గానీ అసలు ఈ సామెతకు అర్థం ఏమిటి సర్?
Deleteగుండు చట్డియల్ కుదర ఓట్రదు :)
Deleteగుండు చట్టియిల్ కుదర ఓట్రదు :)
విన్నకోటవారు,
Deleteసింపుల్ గా చెప్పాలంటే పని పాటు లేక ముప్పొద్దులా తిని పుణుక్కోవడం.
🙂🙂 థాంక్సండి.
Delete