Saturday, 9 May 2020

కాలు జారితే కైలాసం

courtesy Whats app

5 comments:

  1. Appalling 😳😳. విడియో చూసి నాకు నోట మాట రాలేదు కాసేపు. ఎవరో ఏ ఊరే అన్నట్లు ఈ విడియో జనాలది ఏ ప్రాంతమో?

    అసలీ విడియో నిజమేనా? వాట్సప్ లో దేన్నీ పూర్తిగా నమ్మలేం కదా.

    విడియో నిజమే గనక అయితే ... ఆ కొండ ప్రజలది తప్పంటాను నేను. ఏమైనా సరే కొండమీదే మా నివాసం అంటున్నట్లున్నారు. మూర్ఖత్వం. స్వయంకృతాపరాధం. కొండ దిగి, తిరిగి పైకి ఎక్కడానికే ఒక పూట పట్టేటట్లుంది. బరువులు మోసుకుంటూ, చిన్నపిల్లలను కూడా తీసుకువెడుతూ ఆ ఏటవాలు ఇనపనిచ్చెన దిగడం, ఎక్కడం .... ఏమిటా జీవనం? పైగా కొంతదారి సన్నటి ఇరుకు కొండసైడు (మరి, అక్కడ మాత్రం నిచ్చెన వెయ్యకుండా ఎందుకు వదిలేసారో?). విడియోలో మనుషులు కొండమేకల్లాగా ఆ దారుల వెంబడి తిరుగుతున్నారు. కానీ ఉదాహరణకు ... పురిటి నెప్పులొస్తున్న గర్భిణీను కొండ కిందకెలా దించుతారు? బహుశః దించరేమో, కొండ మీదే ఏ ముసలవ్వో పురుడు పోసినా పోసేస్తుందేమో?

    ప్రజల కన్నా ప్రభుత్వానిది ఎక్కువ తప్పు. ఆ కొండజనాల్ని హెలికాప్టర్లలో బలవంతంగా కొండ క్రిందకు దించె్సి వాళ్ళకు ఇళ్లు, భూములు ఇచ్చి ఇక్కడే నేలమీదే బతకండని చెప్పక, మా బాబే మా తల్లే కొండమీదే ఉంటామంటారా, సర్లెండి మీ కోసం ఏటవాలు నిచ్చెన కట్టించి ఇస్తాం అంటారా? పోనీ కొండ చెక్కి ఘాట్ రోడ్డు వెయ్యకుండా నిచ్చెన కట్టడమేమిటండీ మహాప్రభో? అదేమన్న ప్రభుత్వం? అసలీ ఖర్చంతా చూస్తే ఆ సొమ్ముతో ఆ జనాలకు కొండ క్రింద పునరావాసమే కల్పించుండచ్చుగా?

    ఏతావాతా ఈ విడియో మీద నాకు అనుమానంగా ఉంది. ఎలా వెరిఫై చెయ్యడం?

    ReplyDelete
    Replies
    1. "వాట్సప్ లో దేన్నీ *పూర్తిగా* నమ్మలేం కదా"

      గురువు గారూ, objection your honor. వాట్సాపు, ట్విట్టర్ వగైరాలతో దేన్నీ "కొద్దిగా" కూడా నమ్మకపోవడమే సరయిన పాలిసీ అని వినమ్రంగా మనవి.

      Delete
  2. అదేదో టూరిస్ట్ ప్లేస్ అయ్యుంటుంది.

    ReplyDelete

  3. విన్నకోటవారు,బోనగిరిగారు, జైగారు
    అబద్ధానికి నిజానికి దూరమెంత? బెత్తెడు అనేవారు. నేటి కాలంలో ఆ దూరం కూడా చెరిగిపోయినట్టే ఉందండి.

    ReplyDelete