Wednesday, 20 May 2020

అయ్యయ్యో చేతిలో డబ్బులు ఐపోయనే

అయ్యయ్యో చేతిలో డబ్బులు ఐపోయనే
అమ్మయ్యో జేబులు ఖాళీ ఆయనే!

లాక్డవున్ లో తిని కూచుంటే సొమ్మయిపోయిందీ.
పులిమీద పుట్రలా రిలయన్స్ రైట్స్ వచ్చిపడిందే 

దీకి కట్టడానికి సొమ్మెక్కడనుంచి వచ్చు?

ధాన్యం అమ్మితేనో?
అమ్మినదానికే సొమ్మురాలేదు భాయీ

బంగారం కుదవబెడితే
ఇదే చచ్చు సలాహాభాయీ
అప్పుచేసి పప్పు కూడంటే ఇదేనోయీ

ఎవరినేనా చేబదులడిగితే
అందరిదీ ఇదే పరిస్థితైతే అప్పెవరిచ్చేనూ

రిలయన్స్ రైట్స్ కి అప్పుచేసి కొనే సీనుందా?
నాలుగేళ్ళలో షేర్ రేటు రెట్టింపయ్యిందే

గోవిందా! గోవిందా!!

మరిప్పుడు దారేదీ?
ఆలోచన తెగటం లేదోయీ
అప్పుడే ఒక రోజైపోయిందీ!!!!

RIL-RIGHTS ISSUE
This company deals in oil and Telecom sectors,primarily.
The last benefit from the company was a 1:1 bonus in 2017.
Now this company is offering one share for every fifteen shares held by a shareholder, at a premium of Rs.1247 per share. The market value of this share is around Rs.1500 as on date. The share value of this company was  Rs.780.90 in sep 2017 and now it is around Rs.1500/-   Yellow metal  GOLD is trending high and the rate may increase up to Rs.82000/-per ten grams by next year  end, a good short term investment. Be careful about GOLD control Rules.

Disclaimer: This is not an encouragement to invest in stock or to buy gold. Consult financial experts before investment.

58 comments:



  1. రైట్సు తరువాయి మార్కెట్ట్లో ౬ నెలల్లో ౯౯౯ రూపాయలకు వచ్చును :) అప్పుడు కొనుక్కొన వచ్చును :)

    ReplyDelete
    Replies
    1. జిలేబి
      ముల్లు తీసి కొఱ్ఱు కొట్టుకోవడమంటే ఇదే :)
      ఏదీ ఒక లక్ష ఇవ్వరాదూ తొందరలోనే ఫిరాయించేస్తానూ :)

      ఓయ్ జిలేబీ ఎక్కడా? సౌండ్ లేదే!
      సొమ్మనేటప్పటికి జిలేబి పరార్!

      Delete
  2. ఏమిటి శర్మ గారు, మీరు కూడా “షేర్” ఖానా 🤔?
    వాటి సంగతేమో కానీ పేరడీలు వ్రాసే నైపుణ్యం ఉందండీ మీకు 👌

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      చిన్నప్పుడు చదువుకున్నది ఆచరణలెండి. పదేళ్ళయింది కొట్టు మూసేసి, వ్యాపారం మానేసి :) చిగుళ్ళు మిగిలిపోయాయి, కొట్టు మూసేసరికి. విగిలిన చివుళ్ళు ఇవీ RIL,Infosis,L&T,Lupin,siemens,AB, etc పెరమనెంట్ గా మూసెయ్యాలని ఆశ కుదరటం లేదు. ఒక రైట్స్ షేర్ వచ్చిందండి దానికి తొంభైతొమ్మిది కలిపి జిలేబి దగ్గర సొమ్ముచ్చుకుని కొనాలని ఆశ. అప్పడిగానండి. కొంటే తగిలితే జాక్ పాటేనండి, లేకుంటే మామూలు పాటేనండి.
      కలిసొస్తే వీరభద్రయ్య లేకుంటే ఉత్తి భద్రయ్య కదండీ :)
      పారడీలంటారా మిత్రులు బండివారి చలవ కదూ :)

      Delete
    2. కుమ్మేశారు గురువు గారు. ఇన్నాళ్లూ ఈ పేరడీ లు నా ఇలాకాయే అనుకున్నా. లాభం లేదు, ఇక వేరే వ్యాపకం చూసుకోవాల్సిందే. జస్ట్, కొంచెం అటూ ఇటూ చిన్న చిన్న పదాలు జోడిస్తే పక్క యాప్ట్ - for karaoke singing. చాలా బాగా వ్రాశారు సర్. Kudos. vnr garu, గురువు గారు పేరడీ లు కొనసాగించేట్లు గా చేయడం ఇక పై మీ వంతే సర్. ☺️☺️☺️

      Delete
    3. మిత్రులు బండి వారు,
      ఈ ఇలాక మీదే!మీదే!!మీదే!!! ముమ్మారు.
      సరదాగా రాసానండి. మీరు బాగుందంటే జోష్ వచ్చె :)

      Delete
    4. విన్నకోటవారు, బండివారు.
      ఇదంతా చూస్తుంటే చిరాగా ఉంది కదూ. ఈ రోజుతో క్లోజ్. మిగిలినవన్నీ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా

      Delete
    5. శర్మ గారు,
      ఎంత మాట 🙏! చిరాకేమీ లేదండి. బండివారు కూడా “షేర్” ఖానేమో తెలియదు గానీ నా వరకయితే ఆసక్తి లేక / సగం అర్థం అవక షేర్ల గురించిన ఈ చర్చ నేను చదవడం లేదు, ఇంక చిరాకనే మాట ఎక్కడ?

      మొదటి నుండీ మూడు కళలు నాకు పట్టుబడలేదండీ ... ఒకటి షేర్ మార్కెట్లో వేలు పెట్టడం, రెండు పేకాట ఆడడం, మూడు గుర్రప్పందాలు కాయడం. అలవాటయ్యే వయసులో అంటుకోలేదు, ఇప్పుడీ వయసులో ఏం నేర్చుకుంటాం (నేర్చుకునే అసక్తి, ఉత్సాహం లేవని భావం)? ఈ సారికిలా పోనిద్దాం 🙂🙂.

      Delete
    6. విన్నకోటవారు,
      అదృష్టవంతులు కదా!అంత బుద్ధిమంతులా :)
      వయసు వ్యసనలన్నీ పదేళ్ళకితమే పోయాయండి. ఇది శేషం :) ఋణశేషం,రణశేషం( శత్రు శేషం) అగ్నిశేషం ఉంచకూడదని పెద్దలమాట.మిత్రులు నిండు కుండ. :) నిండు కుండ తొణకదని సామెత. :)
      ఇప్పుడు అంటించుకోవద్దు లెండి :)

      Delete
  3. జిలేబి గారు చెప్పారుగా, అలాగే చెయ్యండి.
    నెల రోజుల క్రితం బాగా తగ్గినప్పుడు కొందామనుకున్నాను, కుదరలేదు.

    ReplyDelete
    Replies
    1. బోనగిరిగారు,
      చవక కొననివ్వదు కరువు తిననివ్వదని సామెత కదండీ
      జిలేబి లక్ష ఇస్తానంది కదా ఛాన్స్ తగులుతుందండీ, తప్పక కొనేస్తానండీ

      Delete
  4. అయ్యా బండి వారూ,
    శర్మ గారి ముందు నేనెంతండీ, పిపీలకాన్ని.
    వారికి మూడ్ వస్తే అలవోకగా వ్రాసేస్తారు.

    ReplyDelete
    Replies
    1. VNR sir,
      Switching to science from commerce, particularly to electronics, there is a a device called MOSFET. This device is having a extra electrode called GATE to which a pulse is to be given. This is called start pulse. :)
      వారికి మూడ్ వస్తే అలవోకగా వ్రాసేస్తారు.

      _/\_

      Delete

  5. లక్ష రూపాయల అప్పుతో ౮౦ సేర్లు కొంటారా లేక పైన మరో ఇరవై ఐదు పెట్టి వందా ?

    ఎట్లయినా కనీసం ౧౨౦౦ సేర్లున్నాయన్న మాట అంటే ౧౮ లకారాలాయె :)

    అందులో ఓ లకారం నాదనుకోండి :) అట్లా మార్కెట్తు లో సరిపడా సేర్లు వది లేసి రొక్కం‌ అట్టే పట్టేసుకుని‌ కూర్చోండి . ౯౯౯ కి వస్తుంది. అప్పుడో ౧౦౦ సేర్లు కొనుక్కోండి . మొత్తం‌ఇప్పుడు కొనుక్కోడం‌ కన్నా ఓ నలభై ఎక్కువే వస్తుంది‌ :)

    ఆ తరువాత ఆ నలభై సేర్లని ౨౫౦౦/ వచ్చినప్పుడు అమ్మేసి నా బకాయి‌ తీర్చేద్దురూ :) వడ్దీ ఏమీ వద్దు లెండి అసలు మాత్రం ఇవ్వండి‌ చాలు


    ఇట్లు
    జిలేబి‌ చేవ్రాలు.

    ReplyDelete
    Replies
    1. జిలేబి,
      పుట్టు, కాలు అంటే ఓహో పుడింగి అనుకున్నా!
      గొంగళిపురుగులావచ్చి సీతాకోకచిలకయ్యిందంటే నిజమనుకున్నా :) కాదా!
      ఒక షేర్ కి రైట్స్ వచ్చిందంటే ఎన్ని షేర్లున్నట్టు పదిహేనుకదా! దానితో తొంబై తొమ్మిది కలిపి వంద రైట్స్ అడిగుతాను. ఇప్పుడు తెలిసిందా. ( మీకెవరికి అక్కరలేకపోతే నేనే తీసుకుంటా ఆన్నరుగా ముఖేష్, అదీ ఆశ)
      గల్లాపెట్టెలో డబ్బులు తియ్యవులే నీకో నమస్కారం, మరెక్కడేనా చూసుకుంటా :)

      Delete


    2. ఇదేమి లాజిక్కు మహాదేవా శంభో అనపర్తీశా తల‌తిరిగెను :) అడగండి ఇచ్చిన‌ చో పుచ్చుకొనుడీ :)


      జిలేబి

      Delete
    3. రైట్స్ అంటే అంతేకదు మరీ, తగిలితే జాక్పాట్ కదా

      Delete
  6. ఈ “సేర్ల” గోల నాకేనాడూ బోధపడలేదు గానీ ఒక సందేహం .... “సేరు” ఆశించిన రు.2500 కు పెరగపోతే ఏమిటి సంగతి? లక్ష అప్పెలా తీరేది 🤔 ?

    ReplyDelete
    Replies

    1. పెరిగితేనే తీర్చండి :)

      వేల కోట్లకే దేశంలో ఎగనామాలుండగ ఓ సేటు వారు :) లక్షో లెక్ఖా ? గోవిందా యనేయండి :)


      జిలేబి

      Delete
    2. విన్నకోటవారు,
      సేరంటే డబ్బులాటేనండి. జాగర్తగా అడుకుంటే బాధ లేదు. అప్పుడప్పుడు గ్లోబల్ ట్రస్ట్ బేంక్ లాటివి తగులుతాయండి. దేని మీద ప్రేమ ఉండకూడదందండి, డబ్బు మీద తప్ప. :)ఇప్పుడు దీని లెక్క చెబుతా చూడండి.

      ఈ కంపెనీలో నాకు ఇదివరలో పదిహేను షేర్లున్నాయి. అందుకుగాను హక్కుగా ఒక షేరు మార్కెట్ రేటు కంటే తక్కువకి నాకు ఇస్తానంతున్నారు, అదే రైట్స్ అంటే. ఇవి వద్దనుకునేవారూ ఉంటే నేనే తీసుకుంటా అంటున్నారు అంబానీ. అందుకు మరో తొంభై తొమ్మిది కలిపి వందా అడుగుతున్నా. ఇస్తారనే ఆశ. ఇప్పుడు కట్టవలసిన సొమ్ము వంద షేర్లకి ౩౧౪౨౫ అంటే మొత్తం సొమ్ములో నాలుగో వంటు. మిగతాది తరవాత వచ్చే మార్చి,నవంబర్లలో కట్టాలి. రేపు నాలుగో తారీకునాటికి వంద అలాటయినట్టు చెబితే వాటిని అమ్మేసుకోవచ్చు.మార్కెట్ లో ఏభై పెచ్చుకి కొంటారండి :) కనీసం ఒక షేర్ కి ఏభై వచ్చినా ఐదు వేలు లాభం, పది రోజుల్లో. అప్పూ తీర్చెయ్యచ్చు. లచ్చెందుకూ కదా. అనుమానం. అప్పు అడిగేటప్పుడు కార్ లో వెళ్ళి అడగాలి, కావలసినదానికంటే ఎక్కువడగాలండి. అదీ సంగతి.

      Delete
    3. నిన్ను నమ్ముకుంటే గోవిందా జిలేబమ్మో

      Delete


    4. ఏమిటో ఈ వయసులో ఈ జంజాటం‌

      వంద అడిగితే వాడు వందా మీకిచ్చారను కొందాం

      అంటే ౧౦౦ మంది ౧౫ సేర్ల లెక్క వాళ్లు వదిలేసుకున్నట్టే లెక్క అప్పుడే మీ కు వంద గేరంటీ

      అంటే మీకు వంద అలాటయితే మార్కెట్టు సెంటిమెంటు అంత తక్కువన్న మాట :) సో మీ ఎదురుచూపు సరి అయితే మార్కెట్ట్లో రాబోవు‌ దినములలో ౯౯౯ ఖాయం :)


      జిలేబి

      Delete


    5. ఈ మాటన్నారే - ఇది సూపరు‌ :)


      ~~~లచ్చెందుకూ కదా. అనుమానం. అప్పు అడిగేటప్పుడు కార్ లో వెళ్ళి అడగాలి, కావలసినదానికంటే ఎక్కువడగాలండి. అదీ సంగతి.!!!


      జిలేబి

      Delete
    6. ఆశ ఉండాలి జిలేబీ :) ఆశావహ దృక్పధం కావాలి :) కోట్ల షేర్లలో నాకో వందుండవా?

      Delete
    7. నడిచి వెడితే కుబేరుడికి కూడా అప్పు పుట్టదు.

      Delete

    8. నిజంగా అంతగా కావాలనుకుంటే ౧౨౦౦ వందల పుట్ ఆప్షన్‌ జూన్ నెలది అమ్మేసేయండి‌

      జూన్ నెల ఎక్స్పయిరీ డేట్ కి
      ౧౨౦౦ వందలకు వస్తే కొనేయండి :)

      రాలేదా దక్కిన ప్రీమియము మీ రాశ పడ్డ ౫౦౦౦ కన్నా‌ ఎక్కువే వస్తుంది :) దాన్నెట్టి‌ మార్కెట్లో సేరు కొనుక్కోండి సేరే కావాలనుకుంటే :) లేదా ఎంజాయ్ మాడి :)




      జిలేబి

      Delete
    9. ''నిజంగా అంతగా కావాలనుకుంటే ౧౨౦౦ వందల పుట్ ఆప్షన్‌ జూన్ నెలది అమ్మేసేయండి‌''

      అంత సీన్ లేదమ్మా
      చిన్న రహస్యం
      తొంభుఇ తొమ్మిది ఎక్కువడిగాను కదా! అలాటయితే వెంఠనే అమ్మేసుకోవాలి.
      మరో తొమ్మిదో ఆపైనో ఇస్తే ఉంచుకోవాలి.
      ఒకటే ఇస్తే/ పెచ్చు అసలివ్వకపోతే దాచుకోవాలి. ఎందుకో చెప్పాలా?
      సంగతి చెబితే నీ పుట్టూ కాలూ ఉళ్ళ్ళ్ళ్ళ్

      Delete


    10. ఇది చిరు చేపల ఆశన్న మాట :)

      ప్చ్ !


      జిలేబి

      Delete
    11. శర్మ గారు, మీ లాజిక్ నాకు అర్ధం కాలేదు. Entitlement లేకుండా షేర్లు ఇస్తాడా?
      Entitlement కూడ కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు అని విన్నాను.
      అంటే మీకు 100 షేర్లు కావాలంటే 99 entitlement కొనుక్కోవాలి.

      Delete
    12. bonagiri,
      sir amay entitlement is one and asking extra 99. He may allot or maynot allot abut I can ask, the provision is there. If he allots it is a boon. By the present trend he may not allot extra. Even the rights partly (25%) paid share is trading at ( 314.25+200.00+) in NSE

      Delete
    13. శర్మగారూ, ఇంకా allocation పూర్తవలేదుగా. ప్రస్తుతం entitlement మాత్రమే అమ్ముతున్నారనుకుంటా.

      Delete

    14. సూర్య,
      అలాట్మెంట్ పూర్తి కాలేదు. ఎంటైటిల్మెంట్ అమ్మేసుకుంటున్నారు. ఇదివరకు అల్లాటయితే కాని కొనేవారు కాదు. ఇప్పుడంతా కంగారే! ఇదే మొదటి సారిట ఎంటైట్ల్మెంట్ అమ్ముకోవడం అల్లాట్ కాకుండానే

      Delete
    15. ఇందులో వింత ఏముందండీ. ఎవరూ కొనకపోతే ఆ ఎక్స్ట్రా షేర్లన్నీ తానే డబ్బులిచ్చి తీసుకుంటానని అంబానీయే అన్నాడు. మరి అప్పుడు మార్కెట్ విలువకి ఆఫర్ చేసిన ధరకు మధ్య ఉండే తేడాని ఎందుకు వదులుకోవాలి?
      విన్నకోటవారికి అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే ఇది ఒక వస్తువుని కొనే డిస్కౌంట్ కూపన్ లాంటిది. పైపెచ్చు చెల్లింపు కూడా ఒక్కసారి కాకుండా 3 విడతల్లో(అదీ వడ్డీ లేకుండా!). అయితే కూపన్లు మాత్రం ఇదివరకే షేర్లు ఉన్నవారికి మాత్రమే అలాట్ చేశారు. కూపన్ వాడుకోకపోతే expire అయిపోతుంది. కానీ ఇప్పటికే షేర్లు ఉన్న కొందరు ఇంకా కొనడానికి ఇష్టపడకపోవచ్చు. అలాంటపుడు తమ డిస్కౌంట్ కూపన్ ని వేరొకరికి కొంత ధరకు అమ్మేయవచ్చు. కూపన్లు కొనుక్కున్నవారేమో దాన్ని వాడుకుని అసలు షేరుని డిస్కౌంట్ లో కొనుక్కోవచ్చు.

      Delete
    16. సూర్య,
      మీకక్కరలేకపోతే నేనే కొనుక్కుంటా అన్నదే వ్యాపార లక్షణం. :) మూడు వందల పద్నాలుగు రూపాయల దానికి రెండు వందల పైగా ప్రీమియమా? ఏమండి, వింత కదా! కారణాలు చెబుతున్నారనుకోండి. పావలా కోడికి ముప్పావలా దిగదుడుపంటే ఇదే కదూ :)

      Delete
  7. హేవిటో, అంతా గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంది, మనకు కొరుకుడు పడదు లెండి 🙏

    ReplyDelete


  8. విన్నకోటవారు,
    మీలాటివారే గ్రీక్ అండ్ లాటిన్ అంటే ఇబ్బందే :)
    దేశం పారిశ్రామికంగా ఎదగాలంటే సామాన్యులు పెట్టుబడులు పెట్టాలండి. అర్ధం చేసుకుంటే చాలా సులువు. ముందు కావలసినవి, సొమ్ము సరే అనుకోండి
    ౧.బేంక్ అక్కౌంట్
    ౨.డిమేట్ అక్కౌంట్
    ౩.ట్రేడింగ్ అక్కౌంట్.
    వీటిని అన్ని బేంకులూ ఇస్తున్నట్టు ఉన్నాయి.

    ఇక ఒక వంద రిలయన్స్ షేర్లు కొనుక్కోవాలి ఎలా? నాకు తోచిన సులువు మార్గం.
    సొమ్ము రెడీ చేసుకుని ముంచుకోండి.ఇప్పుడు రైట్స్ లో వంద షేర్లకి 31425 రూపాయలు కట్టిన వారికి వంద షేర్లు నాలుగో తారీకుకి వస్తాయి. అందులో కొంతమంది అమ్మేసేవారుంటారు. దానిని కొనండి అంటే 26425 లోగా కొనుక్కోవచ్చని నా అంచనా. ఇప్పుడు నాలుగో వంతు పే చేసిన షేర్ మీ పేరు మీద మీ అక్కౌంట్ కి వస్తుంది. ఆ తరవాత 21 మే నెలలో 31425 రూపాయలు నవంబర్ లో మిగిలిన సొమ్ము 62850 రూపాయలు పే చెయ్యండి. అప్పుడు వంద రిలయన్స్ షేర్లు మీవే.Fully paid up. వీటిని ఏ స్టేజ్ లో నైనా అమ్మేసుకోవచ్చు. మార్కెట్ ఒడిదుడుకులు ఎప్పుడూ ఉంటాయి. మీకుగా ఒక షేర్ కనసుల్టెంట్ ని సంప్రదించండి.తుది నిర్ణయం ఎప్పుడూ మీదే. ఇంకా ఇతర విధాల చేయచ్చుగాని తెలియని వారికి ఇబ్బందే.ఈ షేర్ మాత్రం సుదీర్ఘకాలానికి మంచి పెట్టుబడి.
    Disclaimer: The information is only for guidance and this blogger is not responsible for risks.

    ReplyDelete
  9. అంత వ్యవసాయం చేస్తూ సంపాదిస్తూ కూడా రిలయన్స్ లో 15 షేర్లేనా. నా దగ్గర 55 ఉండడం తో 3 షేర్లకి entitlement వచ్చింది. పోర్టుఫోలియో లో రిఫ్లెక్ట్ అవ్వలేదు కాని cash sell లో అమ్మేసా.
    ఇప్పటికే 55 ఉండగా ఎన్నని కొనుక్కుంటాం.
    మీరింకా గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ జ్ఞాపకాల్లో ఉన్నారు. నాకైతే గడచిన ఏళ్లలో అన్న ఇచ్చిన దానికంటే తమ్ముడు నొక్కేసిందే (communications, power, infra, defence) ఎక్కువ.
    ఆ bhel వాడు? వాడి దుంప తెగ. మోదీ పెరు చెప్పి 280 రూపాయల లెక్క అంటగట్టి ఇప్పుడేమో 25 రూపాయల దగ్గర్లో "ఇప్పుడు హాపీయా" అంటున్నాడు. ఎవరితో చెప్పుకోను నా బాధ!!

    ReplyDelete
    Replies


    1. సూర్య,
      అలా గడిపేశానండి. ఉన్నవన్నీ అమ్మెయ్యగా మిగిలినవి. తమ్ముడి చేతిలో గ్లోబల్ చేతిలోఇలా కొంతమంది దగ్గర నష్టపోయాం కదా

      Delete
    2. ఈ టైం లో మెటల్ స్టాక్స్ మంచివేమో. ప్రపంచం normal mode కి వచ్చాక మళ్ళీ infra కోసం metals కి డిమాండ్ పెరగొచ్చు కదా

      Delete
    3. Yellow metal is trending high and likely to reach 82000 per 10 grams as per fore casts.Metals shares are better, I suppose

      Delete
    4. 82వేలా? కొంచెం ఎక్కువేమోనండి. 50వేల దగ్గరకు వెళ్లి తరువాత కొంచెం సర్దుకుంటుందని నేను విన్నాను.

      Delete

    5. తాతగారు వారి వయసు చెప్పుకుంటున్నారు :)

      Delete

    6. సూర్య,
      నేను చెప్పినది 2021 చివరికని అంటున్నారు.అంతా గాలి కబుర్లే కదా! ఎటైనా పెరగుతుంది,తప్పదండి.

      Delete
  10. షేర్లు గురించి నాకు కూడా ఏమీ తెలియదు sir. షేర్లు , జ్యోతిష్కం నాకు ఎందుకో చాలా క్లిష్టం గా అనిపిస్తాయి.

    ReplyDelete
    Replies
    1. బుచికి
      కావాలని తగిలించుకోవద్దుగాని,విషయం గురించిన కనీస పరిజ్ఞానం కావాలండి, అందుకు కొంత తెలుసుకోవాలి. జీవితం కదా :)

      Delete
  11. వివరణకు Thanks సూర్య గారు.

    హక్కునే (entitlement) కొనుక్కున్నవాడు పెద్దగా లాభపడేట్లేమీ అనిపించడం లేదు నాకు. ఉదాహరణకు ... వేరే చేట మీరన్నట్లు హక్కును మీ దగ్గర రు.205 లకు కొనుక్కున్న పెద్దమనిషి సదరు షేరుని డిస్కౌంట్లో రు.1257 కు కొనుక్కుంటే దాదాపు మార్కెట్ రేటుకు కొనుక్కున్నట్లే కదా (1257 + 205 = 1462 whereas ప్రస్తుత
    మార్కెట్ రేటు 1500). ఎందుకలా హక్కునే కొనుక్కుందామనే ఆత్రం, ఆయాసం అంతా? బహుశః భవిష్యత్తులో షేర్ మార్కెట్ రేటు మరింత పెరుగుతుందనే అంచనా యేమో? మరి ఆరు నెలలాగితే 999 కే దొరకచ్చు అంటున్నారు “జిలేబి” మెహతా గారు? హేవిటో, విష్ణుమాయ.

    లేదా ... నాకే సరిగ్గా అర్ఖం కాలేదేమో?

    ReplyDelete
    Replies

    1. విన్నకోటవారు,
      ఎండలా మండిపోతున్నాయి. చుట్టూ ప్రాంతాలలో కరోనా వార్తలు జోరందుకున్నాయి.నిన్న ఉదయం నుంచి కరంట్ వారి ప్రేమ పెరిగిపోయింది, రాత్రి దాకా. వాళ్ళ బాధలేంటో తెలీదు.

      కతలోకొస్తే
      ఎలా ఐనా ఒకటేనండి, కాని రైట్స్ లో సంవత్సరంన్నర కాలందాకా అంత సొమ్మూ పే చెయ్యక్కర లేని వీలు చిక్కింది. దీనికోసమే చాలామంది 200+, (that is the craze) పెట్టి రైట్స్ కొంటున్నారు. కొంచం పిచ్చిగా అనిపిస్తుంది. పొంగు తగ్గడానికి కొంత కాలం పడుతుంది. ఓపిక కావాలి. ఒక చిన్న కత చెపుతా వినండి. :)

      హర్షద్ మెహతా కాలం.దీరూభాయ్ పెద్దగా పేరులోకి రాని కాలం. రెండు కొత్త కంపెనీలు పబ్లిక్ ఇస్యూ కొచ్చాయి. అవి RPPL, RNRL మరో గుజరాత్ కంపెనీలే అనుకుంటూ రెండిటి లోనూ ఒకో వంద షేర్లకి అప్లికేషన్ పడేశారు,చెరోవెయ్యి కట్టి.ఆ కంపెనీలు కొంత కాలం సాగాయి, తరవాత లో they were merged in RIL. అప్పుడు 31 షేర్లుఇచ్చారు. ఆప్పుడప్పుడు కొంచంగా అడ్జస్ట్మెంట్ కి సొమ్ములు కట్టడం తప్ప, పెద్ద పెట్టుబడిలేదు for 30 years. Total investment లెక్కేస్తే కొన్ని వేలు ఉండచ్చు. ఓపికగా వేచి చూశారు. ఆపెట్టుబడి 31 షేర్లు తరవాత కాలంలో నేటికి 750 షేర్లయ్యాయంటే నమ్మగలరా? కావలసినది ఓపిక, ఒక్కరోజులో లక్షలొచ్చి పడిపోవు. Yes this is a success story. అన్ని కంపెనీలూ ఇలా వుండవు. గ్లోబల్ ట్రస్ట్ బేంక్,సిన్ఫోసిస్ ఇలా ఎన్నో పెట్టుబడులు మింగేసి పరార్ ఐపోయినవీ ఉన్నాయి, ఉంటాయి.

      ఇక జిలేబి మెహతా గారు ఏదీ తిన్నగా చెప్పరు. అది వారి డి.ఎన్.ఏ లో తేడా కదండి. 999 ఆరు నెలలో వస్తుంది, ఎప్పుడు, తెలీదు. వచ్చిన రోజు ఒక్క క్షణం ఆ రేట్ నిలబడుతుంది, మనం కొనే లోపు లోయర్ సర్క్యూట్ కి ట్రేడింగ్ ఆగిపోతుంది. ఆ తరవాత ట్రేడింగ్ మొదలైనపుడు పదకొండు వందలతో మొదలవుతుంది. :) ఈ మధ్యలో ఏం జరిగింది? మాయ విష్ణుమాయ. కావలసింది ఓపిక,విచక్షణ. ఇందులోకి దూకద్దు, తెలుసుకోండి అంతే

      Delete

    2. పుట్ ఆప్షన్ సేల్ చేసి కూర్చోండనెడు కత చెబ్తే వినరే :)

      Delete
    3. థాంక్స్ శర్మ గారు.
      మొత్తం సొమ్ము ఒకేసారి చెల్లించనక్కరలేని సౌలభ్యం రైట్స్ కు మాత్రమే ఏమిటి, సాధారణంగా అన్ని ఈక్విటీ షేర్స్ కూ ఉంటుందిగా .... 1st Call, 2nd Call అనో ఏదో అంటారనుకుంటాను కదా? ఏదో వినికిడి జ్ఞానం లెండి. ఇప్పుడు ఇందులోకి దూకే ఆలోచనా లేదు, చేతిలో అంత వెసులుబాటూ లేదు 🙏.

      కరోనా వార్తల నేపధ్యంలో జాగ్రత్తగా ఉండండి.

      Delete

    4. వినరా వారికి అన్నీ తెలిసి నట్టూ వుంటుంది తెలియనట్టూ వుంటుంది :)



      జిలేబి

      Delete
    5. దాన్నే “మిడిమిడి జ్ఞానం” అంటారు 🤘.

      Delete

    6. విన్నకోటవారు,
      అందరికి అన్నీ తెలిసుండాలని లేదు. అన్నీ తెలిసినది/తెలిసినవాడు సర్వజ్ఞుడు/ సర్వజ్ఞ పరమేశుడు/ అమ్మ మాత్రమే.

      జిలేబమ్మ గల్లాపెట్టి నిండుగా ఉంది, నాదేమో నిండుకుంది అదీ తేడా :)

      Indian public offer IPO పబ్లిక్ ఇస్యూ అన్నది కంపెనీ ఇచ్చేది, అలాగే రైట్స్ ఇస్యూ కూడా. వీటి విలువ ఒక్క సారిగా వసూలు చేయరు. రెండు మూడు ముక్కలుగా వసూలు చేస్తారు. వాటినే ఫస్టుకాల్, సెకండ్ కాల్ అంటారు.ఎందుకిలా? :) ఇది పెట్టుబడులను కొద్దికొద్దిగా ఆకర్షించే విధానం. :) దీన్నే ప్రైమరీ మార్కెట్ అనీ అంటారు. ఇక బయట కొనే షేర్లు కొనే చోటు సెకండరీ మార్కెట్.we have to pay the full value as per the market rate we have purchased. అవే ఎన్.ఎస్.డి.ఎల్, సి.ఎస్.ఆడి.ఎల్ Securities board of India కింద పని చేసే స్టాక్ ఎక్ఛేంజిలు. హైదరాబాదులో కూడా ఒక స్టక్ ఎక్ఛేంజి ఉండాలి.ముంబైలో ఎన్.ఎస్.ఇ,బి.ఎస్.ఇ.National stock exchange,Bombay stock exchange.
      ఇప్పుడు దూకద్దు తెలుస్కోమనే నా సలహా కూడా. వయసులో దూకినవాళ్ళం వయసు మళ్ళినా వదుల్చుకోలేక పోతున్నాం కదా!

      Delete
    7. jai,
      Thank you sir for the correction.

      Delete
  12. Secururities Exchange Board of India
    SEBI
    ^
    ^
    ^
    National Securities depository alaimited Limited Central securities depository Limited
    NSDL C.S.DL
    ^ ^
    ^ ^
    ^ ^
    Natinal stock Exchange Bomaby stock Exchange
    ^ ^
    ^ ^
    ^ ^
    Depository Participant Depository Participant
    ^ ^
    ^ ^
    Client. Client

    1 There are 35 stock Exchanges in India, but only two are working
    2 The Depository participant can be a member of noth the stock exchanges. Normally we call them brokers
    3 A client can have any number of accounts in any depositiry participents
    4.Comapnies may register their share in any one exchange or in the two exchanges.

    ReplyDelete
  13. కొన్ని మాటలు వినబోతాం.ఏంటవి?
    మా కంపెనీ రైట్స్ ఇస్యూ పది రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది వగైరా. ఇదేంంటీ?
    అసలు ఈ రైట్స్ ఇస్యూ ఎందుకు? వివరాలు షేర్ హోల్డర్లకి చెప్పాలి, సెబి కి చెప్పాలి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఇచ్చెయ్యదానికి లేదు. సెబి కి కారణాలు చెప్పాలి. సెబి ఒప్పుకోవాలి. ఈ రైట్స్ అప్పులు తీర్చేందుకు :) అందుకు ఇస్తున్న రైట్స్ ని ఎగబడి కొంటున్నారు కదా.
    రైట్స్ ఎన్ని?
    అసలు పెట్టుబడి X shares. Rights issued 1:15 Hence it is
    ఇప్పుడిచ్చినది X/15=y. షేర్ హోల్డెర్స్ కి y అంటే, for individual, it is apart of y లో భాగం. మాత్రమేరావాలి. తనకి రావలసినదానికంటే ఎక్కువ అడగచ్చు.మరి ఎక్కువ ఎక్కడినుంచి వస్తుంది? ఎక్కువ ఎక్కడినుంచి ఇస్తారు? ప్రమోటర్ల షేర్ నుంచి. అంటే సొమ్మెక్కడి చేరింది? :)
    ఇక రైట్స్ అండర్ సుబ్స్క్రైబ్ అయింది అంటే కంపెనీ మీద నమ్మకం లేదు.
    రైట్స్ సబ్స్క్రైబ్ అయింది అంటే సరాసరి అభిప్రాయం.
    రైట్స్ ఇన్ని రెట్లు, అన్ని రెట్లు ఓవర్ సస్క్రైబ్ అయింది అంటే కంపెనీ బ్రహ్మాండంగా ఉంది. ప్రజలకి మా మీద ఇంత నమ్మకం ఉంది. అని గొప్పలు చెప్పుకోవడమే. ఇది అన్ని కంపెనీలూ చేసేపనే.

    రేపటి రోజుల్లో యువత, మీరే కంపెనీలు పెట్టాలి లేదా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలి. ఇలా ఉద్యోగాలు చేసి ఎన్నాళ్ళు గొర్రెకు బెట్టెడు తోకతో బతుకుతారు? Don't live like an employee be an employer. Wish it, try it.

    ReplyDelete