మూడు పువ్వులు....
వాడికేంట్రా! వాడిపని మూడు పువ్వులూ ఆరు కాయలా ఉందీ, అంటారు, దీనర్ధం, ఏలేస్తే కోలు దిగేలా ఉందంటారు, పల్లెటూరివాళ్ళు. దీనికి ఆశ్లీలార్ధమూ చెప్పేవారున్నారు.
అబ్బాయిగారి పని మూడు పువ్వులూ ఆరుకాయల్లాగే ఉందిట. మొదట అమేటీ లో నెగ్గేరు అది సొంత సామ్రాజ్యం. పువ్వు పిందయింది, అది ఉడుకు పిందయి రాలిపోయింది..
అది దూరాక్రమణ పాలయిందనుకుని చింతించి,వగచి మరో పచ్చటి చోటుకి మారేరు. ఆ పూవు పిందయింది, ఇదీ ఉడుకుపిందయి రాలిపోతుందా? ఇప్పుడది ఎర్ర వారి కళ్ళ బడి దురాక్రమణ, మిత్రుల పేర వెన్నుపోటు తగిలేలా ఉంది, ఈపువ్వు పిందయ్యేనా? అనుమానమే! ఇప్పుడు మూడో పువ్వు చూసుకోక తప్పటం లేదు, అది బరేలీ. అమ్మ త్యాగమయి, తన స్వంత సీటు కొడుక్కోసం వదిలేసి రాజ్య సభకెళ్ళిపోయింది. అమ్మ ఒడి కదా భయమేల వెంటనే నామినేషన్ వేయచ్చుగా అడిగాడో సందేహి. నిజమేగాని ఇక్కడా మరే దురాక్రమణ దారు తయారవుతాడో చెప్పలేం కదా! అందుకే సస్పన్స్, దేశం ముక్త కంఠంతో పోటీ చెయ్యమనలేదూ! ఈ పూవు పిందయ్యేనా? పురిటిలోనే సంధి కొట్టేనా? కాలమే చెప్పాలి.
మూడు పువ్వులు ఆరు కాయలవుతాయా?
No comments:
Post a Comment