ఆశ.
ఆశ మానవుణ్ణి నడిపిస్తుంది.
పేరాశ మానవుణ్ణి పరుగుపెట్టిస్తుంది. ఫలితం ఉండదు.
దురాశ మానవుణ్ణి పరుగుపెట్టించి బోల్తా పడేలా చేస్తుంది.
నిరాశ మానవులకి దూరంగానే ఉండాలి. ఇది కమ్ముకుందా మరిలేవడు. పొరబాటుగా నిరాశలో చిక్కుకున్నా, పడిపోయినా అది క్షణికంకావాలి. పడిపోయినందుకు సిగ్గుపడ కూడదు. నిరాశనుంచి బయటపడాలి బంతిలా పైకి లేవాలి.
కందుకమువోలె సుజనుడు
కిందంబడి మగుడ మింటి కెగసెడును జుమీ
మందుడు మృత్పిండము వలె
కిందంబడి అణగియుండు కృపణత్వమునన్
543 స్థానాలున్న లోక్ సభలో అన్ని స్థానాలకూ పోటీ చేసి లేదా ( 272 ఆపై స్థానాలకు) మెజారిటీ రాగల స్థానాలకు పోటీ చేసిన పార్టీ వాడు ప్రధాని అవుతానని చెప్పుకోడం, ఆశ. ఎందుకంటే నెగ్గిన తరవాత పార్టీ కూడా ఎన్నుకోవాలిగా:)
543 స్థానాల్లో మెజారిటీ స్థానాలుకి (272) కూడా పోటీ చేయలేని పార్టీ వాడు ప్రధాని అవుతానని చెప్పుకోడం పేరాశ. ఎందుకంటే,ఆ పార్టీ వారు, ఈ పార్టీవారు నన్ను ఎన్నుకుంటారనుకోడమే పేరాశ.
543 స్థానాల్లో పదిస్థానాలకీ పోటీ చేయలేని పార్టీవాడు ప్రధాని ఐపోతానని ఆశ పడటం చెప్పుకోవడం దురాశ.
ప్రధాని గట్రా వదిలి పెట్టి ప్రెసిడెంట్ అయిపోవడానికి మార్గం చూసుకోవడం ఈజీ :)
ReplyDelete