విన్నకోట నరసింహా రావు25 May 2024 at 12:46 నాలుగు వందలు దేశం మొత్తం మీద ఒకటే రేటండి, రైతుకు మిగిలేది తక్కువే!. ఇందులో రైతుకొచ్చేది 200లే. మిగిలినదంతా కోత,రవాణా,నిలవ ఇలా ఇతరఖర్చులే. నేరేడు ఏ భూముల్లోనైనా పెరుగుతుంది. అందుకే మనదేశం జoబూ ద్వీపం:) నేరేడు ఇంటి పెరట్లో పెంచద్దన్నది పాతకాలపు మాట. ఇది వందేళ్ళు,వందడుగులు పెరిగే చెట్టు. దీనివేళ్ళు ఇంటిలో చొరబడి ఇల్లు లేపేస్తుందని వద్దన్నారు, మరో కారణం లేదు. చాలా చోటు ఆక్రమిస్తుంది, దీని నీడన మరొక మొక్క మొలవదు. చాలా శాఖలతో చాలా పెద్దదవుతుంది,మర్రి చెట్టులాగా. నేటికాలంలో హైబ్రీడ్,సీడ్ లెస్ కూడా పండిస్తున్నారు. టెర్రేస్ గార్డెన్ లో కుండీలలో పెంచుకోవచ్చు. సెమీ ఆరిడ్ ప్రాంతాలలో సాగు చేస్తున్నారు. నాటిన ఆరేళ్ళకి కాపుకొస్తుంది. గయ్యళిగా భూమి ఉండేకంటే ఇది లాభసాటి వ్యవసాయం.
విన్నకోట నరసింహా రావు25 May 2024 at 19:02 "తీపి" వ్యక్తులే తినాల్సింది :) అన్ని పళ్ళూ తినదగ్గవే. వీటిలో ఫ్రక్టోస్ కార్బ్ గా మారడానికి ఎక్కువ సమయం పడుతుంది జి.ఐ తక్కువ. ఉపయోగాలూ, లాభాలూ,పోషకాలూ ఎక్కువ. ఏప్రిల్ చివరినుంచి జూలై చివరిదాకానే దొరుకుతాయి.మందులు తినే ఖర్చుకంటే ఈ ఖర్చు తక్కువేనండి. వారానికో కేజి, అన్ని పళ్ళూ మితంగానే తినాలి. మీకు తెలియనిదా! :) నాతో వాగించడం :) గింజలు కూడా పోగేసి ఎండపెట్టి పొడి చేసుకుని తీపివారు మందుగానూ వాడుకోవచ్చు.
కిలో నాలుగు వందలా 😳? బంగారం పూత గానీ పూసి అమ్ముతారా 😕?
ReplyDeleteదీనికన్నా వీలున్నచోట ఇంటి పెరట్లోనే ఓ నేరేడు చెట్టు ఉంటే పోలా? మనం తిన్నన్ని తిని అమ్ముకున్నన్ని అమ్ముకోవచ్చు కూడా ఆ లెక్కన 😎.
అవునూ, ఇంటి పెరట్లోనే (పోనీ వాకిట్లోనో) నేరేడు చెట్టు వుండకూడదని కొందరు స్వయంప్రకటిత విజ్ఞానుల సలహా వినిపిస్తుంటుంది. దాంట్లో నిజమెంతంటారు శర్మ గారు?
మీ యింటి పెరట్లో పెట్టుకోవచ్చండి.
Deleteఇందులో ఏలాంటి సందేహమూ లేదు.
అడగటం మరిచా
Deleteఇల్లుందాండీ లేకుంటే నాడోడియా ?
తెలుగులో అడగండి 😏.
Deleteఆంధ్రులన్న మాట
Deleteఅచ్చ తెనుగు రాదేమో :)
విన్నకోట నరసింహా రావు25 May 2024 at 12:46
Deleteనాలుగు వందలు దేశం మొత్తం మీద ఒకటే రేటండి, రైతుకు మిగిలేది తక్కువే!. ఇందులో రైతుకొచ్చేది 200లే. మిగిలినదంతా కోత,రవాణా,నిలవ ఇలా ఇతరఖర్చులే.
నేరేడు ఏ భూముల్లోనైనా పెరుగుతుంది. అందుకే మనదేశం జoబూ ద్వీపం:)
నేరేడు ఇంటి పెరట్లో పెంచద్దన్నది పాతకాలపు మాట. ఇది వందేళ్ళు,వందడుగులు పెరిగే చెట్టు. దీనివేళ్ళు ఇంటిలో చొరబడి ఇల్లు లేపేస్తుందని వద్దన్నారు, మరో కారణం లేదు. చాలా చోటు ఆక్రమిస్తుంది, దీని నీడన మరొక మొక్క మొలవదు. చాలా శాఖలతో చాలా పెద్దదవుతుంది,మర్రి చెట్టులాగా.
నేటికాలంలో హైబ్రీడ్,సీడ్ లెస్ కూడా పండిస్తున్నారు. టెర్రేస్ గార్డెన్ లో కుండీలలో పెంచుకోవచ్చు. సెమీ ఆరిడ్ ప్రాంతాలలో సాగు చేస్తున్నారు. నాటిన ఆరేళ్ళకి కాపుకొస్తుంది. గయ్యళిగా భూమి ఉండేకంటే ఇది లాభసాటి వ్యవసాయం.
మరో సందేహం. నేరేడు పళ్ళు “తీపి”వ్యక్తులు తినచ్చా?
ReplyDeleteతినొచ్చండి
Deleteమధు మేనికి మంచి మందు అల్లో నే రేడు.
ఆహా “జిలేబి” గారు, ఎంత కాలానికి ఒక డొంకతిరుగుడు లేని మాట చెప్పారు 👌🙂.
Deleteధన్యవాదాలండి 🙏.
विनरा वारु
Deleteसरिग्गा चदिवि नट्टु लेरु :)
విన్నకోట నరసింహా రావు25 May 2024 at 19:02
Delete"తీపి" వ్యక్తులే తినాల్సింది :) అన్ని పళ్ళూ తినదగ్గవే. వీటిలో ఫ్రక్టోస్ కార్బ్ గా మారడానికి ఎక్కువ సమయం పడుతుంది జి.ఐ తక్కువ. ఉపయోగాలూ, లాభాలూ,పోషకాలూ ఎక్కువ. ఏప్రిల్ చివరినుంచి జూలై చివరిదాకానే దొరుకుతాయి.మందులు తినే ఖర్చుకంటే ఈ ఖర్చు తక్కువేనండి. వారానికో కేజి, అన్ని పళ్ళూ మితంగానే తినాలి. మీకు తెలియనిదా! :) నాతో వాగించడం :) గింజలు కూడా పోగేసి ఎండపెట్టి పొడి చేసుకుని తీపివారు మందుగానూ వాడుకోవచ్చు.
ధన్యవాదాలు శర్మ గారు.
Deleteమీతో “వాగించడం” కాదండి, జనహితార్థం మీలాంటి పెద్దలు, విజ్ఞులు, విశేష జీవితానుభవం కలవారు చెబితేనే సొంపుగా ఉంటుంది 🙏.
“జిలేబి” గారు (25 May 2024 at 12:59),
ReplyDelete// “ మీ యింటి పెరట్లో పెట్టుకోవచ్చండి.” //
మీ మాట వింటే కొంప కొల్లేరే.
పైన శర్మ గారి వివరణ గమనించండి (26 May 2024 at 09:15).
వినరా వారు
Deleteఇది చదివేరా ?
టెర్రేస్ గార్డెన్ లో కుండీలలో పెంచుకోవచ్చు.
// Zilebi 26 May 2024 at 04:34
ReplyDeleteविनरा वारु
सरिग्गा चदिवि नट्टु लेरु :) //
====================
తిన్నగా చెప్పారని నేనేదో మిమ్మల్ని మెచ్చుకున్నాను అనుకున్నాను. కాదా? డొంకతిరుగుడేనా? అయితే You are incorrigible.
// Zilebi 26 May 2024 at 04:40
ReplyDeleteఆంధ్రులన్న మాట
అచ్చ తెనుగు రాదేమో :) //
=====================
హెంత ధైర్యం మీకు. తెలుగుగడ్డ నడిబొడ్డున పుట్టి పెరిగినవాడిని. మీలాగా దేశాంతరాలు పట్టి పోలేదు తెనుగు మర్చిపోవడానికి.
ఇప్పటికైనా పైన // “ ఇల్లుందాండీ లేకుంటే నాడోడియా ?” // అని మీరన్నదాంట్లో “నాడోడియా” అంటే ఏమిటో తెనుగులో చెప్పండి.
హాశ్చర్యం! నాడోడి అచ్చ తెనుగు తెలియనివారు కూడా తెలుగు గడ్డ నడి బొడ్డు గట్రాస్ చెప్పడం
Delete