ఐతే , నేనన్నట్లే ..... ద్వితీయ విఘ్నాన్ని దాటుకుంది . ఇక , అద్వితీయంగా పయనించు గాక ..... ఈ చిత్రానికి నా ప్రయత్నం . గంట వాయించినా గాని వెంట పడరె అచట పీచు మిఠాయి కొన్నట్లు లేదు , ప్రక్కనే ఐసు బండి ప్రభంజనమ్ము వచ్చు వారును , కొనువారు వరుస గట్టె .
వెంకట రాజారావు . లక్కాకుల గారు, విఘ్నాలు గాట్రా నాకు తెలీదుగాని... మీరు పాయింట్ పట్టేసేరు. పక్క ఐస్ బండి వాడు అమ్ముకుంటున్నాడు. వీడి దగ్గరకెవరు రావటం లేదు...పోనీలే అని కొందామనుకుంటే వెనకాల ఇల్లాలుగారి వెనక్కి లాగేశేరు. వీడు బిక్కమొహం వేశాడు..వాణ్ణి ఊరుకోబెట్టడానికి ఫోటో తీసి వాడికి చూపించి బయట పడ్డా..అదీ సంగతి :) ధన్యవాదాలు.
ఫోటో బాగుందండీ :)
ReplyDeleteపీచు మిఠాయిని గనవే
మాచన బండిన గణగణ మనవూ రొచ్చే
వేచిన దొరకదు రుచి చవి
చూచిన తీయన మరియిక చూడక కొనవే
చీర్స్
జిలేబి
Zilebiగారు,
Deleteమీకు పుణ్యం ఉంటుంది :) అప్పుడప్పుడైనా కొంచం వచనం రాయండీ
ధన్యవాదాలు.
చూచిన వెంటనే నోరూరగ
ReplyDeleteదాచిన రూపాయిని చేతిన
చాచి ఆవురుమని ఆబగా తిన
పీచు మిఠాయిపై ఆశయె పుట్టెన్
nmrao bandiగారు,
Deleteరావు గారు నిజంగానే నోరూరి కొందామనుకున్నా! ఉపయోగం/యోగం లేకపోయింది, అందుకే ఫోటో తీసుకున్నా. :)
ధన్యవాదాలు.
నోరూరెను కొందామని !
Deleteఓరోరి గురుతుకు వచ్చె ఓ, "ఉపయోగం"
ఆరాముగాదు నాకున్
సారీ మరియిక మిటాయి చక్కెర కేళీ :)
చీర్స్
జిలేబి
(పరార్!)
Zilebiగారు,
Deleteఉన్నమాటే శలవిచ్చారుగదా :)
ధన్యవాదాలు.
ఎదురుగా ఉన్న పీచుమిఠాయి తినడానికి కూడా ఉపయోగం(?) / యోగం లేదంటారేమిటి శర్మ గారు?
ReplyDeleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteవెనకాలే ఇల్లాలుగారూ ఉన్నారండి :) అసలే సుగరూ మళ్ళీ పీచుమీఠాయా, అంటే చేసేదేముందండి :)
ధన్యవాదాలు.
అవునవును ఆ "భుజకీర్తులు" రెండూ (షుగరు, బీపీ) ఉంటే ఇక చెప్పేదేముందిలెండి? 🙏🏾
Deleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteభుజకీర్తులనే కంటే వాటికి ముద్దు పేర్లున్నాయండి శంఖు,చక్రాలని. డయాబెటిస్ కి శంఖమనీ, బి.పి కి చక్రమనీ
ధన్యవాదాలు
ఐతే , నేనన్నట్లే ..... ద్వితీయ విఘ్నాన్ని దాటుకుంది . ఇక , అద్వితీయంగా పయనించు గాక ..... ఈ చిత్రానికి నా ప్రయత్నం .
ReplyDeleteగంట వాయించినా గాని వెంట పడరె
అచట పీచు మిఠాయి కొన్నట్లు లేదు ,
ప్రక్కనే ఐసు బండి ప్రభంజనమ్ము
వచ్చు వారును , కొనువారు వరుస గట్టె .
వెంకట రాజారావు . లక్కాకుల గారు,
Deleteవిఘ్నాలు గాట్రా నాకు తెలీదుగాని... మీరు పాయింట్ పట్టేసేరు. పక్క ఐస్ బండి వాడు అమ్ముకుంటున్నాడు. వీడి దగ్గరకెవరు రావటం లేదు...పోనీలే అని కొందామనుకుంటే వెనకాల ఇల్లాలుగారి వెనక్కి లాగేశేరు. వీడు బిక్కమొహం వేశాడు..వాణ్ణి ఊరుకోబెట్టడానికి ఫోటో తీసి వాడికి చూపించి బయట పడ్డా..అదీ సంగతి :)
ధన్యవాదాలు.
Deleteపెండ్లము "వెను" "కీ" నివ్వగ
బండ్లన ఆయిసు కిరీము బంధము గానన్
కండ్లన తడియన నొకటే
పండ్లకు నిచ్చెను బహుమతి ఫలుదా అయిసన్
జిలేబి
Zilebiగారు,
Deleteతిట్టేరో దీవించేరో అర్ధం కాలేదండి బాబు! :)
ధన్యవాదాలు.