Thursday 28 January 2016

కోతి కొమ్మచ్చి




41 comments:


  1. కష్టే ఫలే వారు :)

    కష్టే ఫలే యనేనుర !
    బెష్టుగ మరియీ వరుసల బిగుబిగు ఫోటో
    పుష్టిగ మాచన వజ్జల
    సృష్టిన కొమ్మచ్చి కోతి సృజనయు గానన్

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebiగారు.
      అర్ధం కాలా!
      ధన్యవాదాలు.

      Delete
    2. *బర్మా బోయిన గాని కష్టేఫలే బాబాయ్
      శర్మా గారిని వెంబడించి పిలచుచు బాయ్యా యని
      సుర్మా పూయగ నెగబడ నయ్యో
      ఖర్మా! ఇదెక్కడి కష్టమనుచు నాయన తల గీరగ బట్టెన్ ...

      కేవలం సరదా తప్ప ఇంకేమీ వెదకొద్దు, ఇందులో ...
      భాషా పాండిత్యం ఆమడ దూరం మనకు ...
      మరక్కడే లేదు సాపత్యం ఆవిడకు మనకు ...
      జేకే ...
      :)

      *బర్మా : శర్మ గారి కొత్త బ్లాగ్ ...

      Delete
    3. or...

      *బర్మా బోయిన గాని కష్టేఫలే బాబాయ్
      శర్మా గారిని వెంబడించి పిలచుచు బాయ్యా యని
      సుర్మా పూయగ నెగబడ నయ్యో
      ఖర్మా! ఇదెక్కడి కష్టమనుచు నాయన తల పోసెను బాబోయ్ ...

      Delete

    4. బండి రావు గారి కోసం :)

      బర్మా బోయిన గూడా
      శర్మా గారిని పిలచుచు సరిసరి బాబాయ్
      సుర్మా పూయగ నెగబడె
      ఖర్మా! యిదియేమిర యనె కష్టే కాలే

      జిలేబి

      Delete
    5. అమ్మా ! మీతో పద్యాలాడుట సరి సరి నా త
      రమా ! ఇదియొక చిరు సరదా మాత్రమె గద దయ గ
      నుమా ! జిలేబ(హ)ను మాయమ్మ ముందర నా త
      రమా ! వేయగనటునిటు గంతులు వేడితి వినుమా !

      ఏదో మీ పుణ్యమా అని నాలు ముక్కలు
      నాకు కూడా అబ్బుతున్నాయేమోనని
      అనుమానంగా ఉంది...
      regards ...
      :)

      Delete
    6. or ...
      అని ఇచ్చిన పై కామెంట్ ఈ విధంగా
      ఉండవలసినది పొరబాటున ఆ విధంగా
      పోస్ట్ చేయబడింది. గమనించగలరు.

      బర్మా బోయిన గాని కష్టేఫలే బాబాయ్
      శర్మా గారిని వెంబడించి పిలచుచు భయ్యా యని
      సుర్మా పూయగ నెగబడ నయ్యో
      ఖర్మా! ఇదెక్కడి కష్టమనుచు నాయన తల పోసెను బాబోయ్ ...

      Delete
    7. బండి రావు గారు,

      అమ్మా మీతో పద్యాలాడుట ,... బాగా వ్రాసారు :)

      మీకోసం మధురగతి రగడ :)

      తరమా మీతో తధికిట లాటా
      చిరుసర దామ్మా చికుబుకు పాటా
      సరిసరి పదముల సరిగమ తరమా
      పరిపరి మామ్మా పద్యము గనుమా
      జిలేబి వేసితి జింతక వినుమా
      భలేగ గంతులు భళీగ గనుమా

      చీర్స్
      జిలేబి

      Delete
    8. షుక్రియా ... షుక్రియా ... షుక్రియా ...
      అని మూడుసార్లు ముందుకు వొంగి మొగల్ స్టైల్ లో మీకు
      దణ్నాలెడదామనుకుని మొదటి దణ్నానికే బొక్క బోర్లా పడ్డా
      (ఆనందంతో పొంగి, ముందుకు ముందుకు ఇంకా ఇంకా వొంగి ) ...
      ఆ ఒక్క దానితో సరిపెట్టుకుని మంచి మనసు చేసుకోండి ...
      :)

      Delete
    9. nmrao bandiగారు,
      మనదైన బాణీలో చెప్పండి,అంటే తెలుసుగా :)
      ధన్యవాదాలు.

      Delete
  2. photo is terribly out of focus. poor quality

    ReplyDelete
  3. ప్చ్, జిలేబీయం అర్ధం కాలే :(

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావుగారు.
      నా గోలా అదేనండి బాబూ :) !
      ధన్యవాదాలు.

      Delete
  4. ఈ చిత్రానికి నా ప్రయత్నం -
    కోతి కొమ్మచ్చి కాదు , యీ కొంటె కాయ
    కోయ నెగబ్రాకె మామిడి కాయ కొఱకు ,
    కంచె యగుపించ , దెట్టి రక్షణయు లేదు ,
    తోటలోనుండి రహదారి బాట కలదు .

    శర్మగారూ ,
    సందియమొకటి యేర్పడు , ముందు ముందు
    తమరిచట సమస్యాపూరణ మిడు యత్న
    మేమియును కాదు గద ! ఘనమిది , వినుండు
    వెలయు శర్మాభరణమను పేర బరగి .

    ReplyDelete
  5. లక్కాకుల వారు !

    శర్మా భరణము గనరే
    మర్మాతిశయము లతోడ మాచన పంచెన్
    తుర్మా యనవా రిటపా
    ధర్మారామము భళిభళి ధరణిన జెల్లున్

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకులగారు.
      ఎక్కడ చూచినా అమ్మవారు పద్యంలో తప్పించి వచనంలో మాటాడిందే లేదు. అదేమో అర్ధమూ కాదు :)
      ఇక్కడో సమస్యాపూరణం మొదలుపెట్టే దురూహ ( మాట సరయినదేనా :) ) లేదు :)
      అమ్మవారే ....
      ఇక ఈ ఫోటో గురించి,
      కార్తీక మాసంలో వనసమారాధన రోజు ఒక కొంటె కుర్రాడు చేసిన విన్యాసం. హటాత్తుగా చూశాను, చేతిలో కెమేరా ఉంటే ఒకసారి క్లిక్ చేశా దాని ఫలితమే ఇది.
      ధన్యవాదాలు.

      Delete
    2. sarma gaaru,

      బాగా చెప్పేరు. చూడాలి ముందు ముందు ఏం చేస్తుందో ఆవిడ!

      cheers
      zilebi

      Delete
    3. Zilebiగారు,
      అదేగదా భయం :)
      ధన్యవాదాలు.

      Delete
  6. మాలతి గారి (తెలుగు తూలిక) వ్యాఖ్య "స్ఫూర్తా" జిలేబీ గారి వ్యాఖ్యకి?

    ReplyDelete
    Replies
    1. స్పూర్తీ గీర్తీ గట్రా వింటుంటే గుండె గాభరా గా ఉంది. కొరడా చరచినట్లు ఉంది విన్న కోట వారు :)

      జిలేబి

      Delete
  7. అమ్మవారూ ! తవరయిన ఆదుకోండి
    పరగ అమృతాభరణమను బ్లాగు దెరిచి
    శర్మగారు భయపడిరి , జడుపెరుగరు
    తమరయిన సమస్యా పూరణము లిడుటకు .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకులగారు,
      సమర్ధులని బాగా గుర్తించారు :)
      ధన్యవాదాలు.

      Delete

  8. < "ఇక్కడో సమస్యాపూరణం మొదలుపెట్టే దురూహ ( మాట సరయినదేనా :) ) లేదు :)
    అమ్మవారే....." >
    ----------------

    :-) :-) :-) కొత్త విద్య సాధనకి జనం బలి :-)

    (2). అదియునూ గాక ఒకవేళ మరో సమస్యాపూరణం మొదలయితే ఇక "మాలిక" వ్యాఖ్యల పేజ్ రెండు వైపులా భువనవిజయం తో నిండిపోతుంది. "మాలిక" వారేమో వ్యాఖ్యల కోసం రెండో పేజ్ తెరవరు. ఇక మాలాంటి పామరులేం చెయ్యాలి :-(

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావుగారు,
      నాదీ అదేభయం :)
      ఇందులో నా ప్రమేయం ఏమీలేదని మనవి :)
      ధన్యవాదాలు.

      Delete

    2. రావోయీ నాసామీ పరాకే లనోయీ
      కావేరీ నీదేగా బకాయీ మిటాయీ
      మావా నీవేగా మాకు మారాజు మాలీ
      పోవే రాణీ పూబోణి పోపోవె వేణీ :)

      చీర్స్
      జిలేబి

      Delete
    3. జిలేబీ గారి పద్యం లోని ఆ "సామి" ఎవరు, "కావేరి" ఎవరు? ప్చ్, ప్చ్ :(
      కానీ, పద్యం చివరి పాదంలోని "....... రాణీ పూబోణి ....... వేణీ" మాత్రం ఓ పాటని గుర్తుకి తెచ్చాయి. చెప్పేస్తున్నా, ఏమనుకోకండి :)
      పాత "కృష్ణవేణి" సినిమాలో "కృష్ణవేణీ, తెలుగింటి విరిబోణీ, నా ఇంటి అలివేణీ .......... " అని ఓ హిట్ పాట ఉంది. కోడెవయసు వల్ల మేం ఆ పాటని "కృష్ణవేణీ, ఎదురింటి విరిబోణీ, పక్కింటి పూబోణీ" అని పేరడీ చేసేవాళ్ళం :)
      జేకే :)

      Delete
    4. Zilebiగారు,
      అమ్మబాబోయ్ :)
      ధన్యవాదాలు.

      Delete
    5. విన్నకోట నరసింహా రావుగారు,
      పద్యం కట్టడం నేర్చుకునే రోజుల్లో పదాలని గణాలుగా చూసి యతి నియమం చూసుకుని,ప్రాస నియమంచూసుకుని పద్యం కట్టెయ్యమంటాడు క్షేమేంద్రుడు. ఇలా కట్టడం అలవాటయిన తరవాత గాని పద్యంలో భావానికి చోటు రాదంటాడు. ఆ తరవాతే దానికి సొగసూ వస్తుందంటాడు. ప్రస్తుతం జిలేబి గారు చేస్తున్న పని అదే! :) ఇటుకలు పేర్చుకుంటూ పోయినట్టుగా పదాలు పోహళించుకుంటూ , పద్యం కూడా కట్టడమే అన్నారు శ్రీపాద వారు. :)

      ధన్యవాదాలు.

      Delete

  9. పదములు గణములను యతిగ
    అధరముల బలుక నియమము ప్రాసను చూడన్
    కుదురును జిలేబి పద్యము
    చతురా ! క్షేమేం ద్రుపలుకు చప్పున గనుమా

    జిలేబి

    ReplyDelete
  10. గణ యతి ప్రాసల కన్నను
    గణుతింపగ భావమొకటె ఘనమని దెలిసెన్ ,
    ఝణక ఝణక జజ్జనకగ
    'గణ' తంత్రపు నాట్య హేల ఘనమా ? కాదే !

    ReplyDelete
  11. లక్కాకుల వారు :)

    గణముల గుణముల నెల్ల సు
    గుణముగ తంత్రుల సమేత గూర్చుచు రాగా
    గణయంత్ర జంత్ర చలిత చ
    రణముల లక్కా కులకవి రాయల గంటిన్ :)


    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  12. వెంకట రాజారావు . లక్కాకులగారు,
    అది నాటి మాట ఇది నేటి మాట
    ధన్యవాదాలు.

    ReplyDelete

  13. అది నాటిమాట యిది నే
    టిదనియు నేర్చిన పలుకులు టింగున తట్టన్
    అది మా మది తలపులలో
    పదిలము సాయగ సరసర పద్యము వచ్చెన్

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. దీటైన చతుర వచనపు
      బాటల పండిత తలలను వంచగలుగు ఆ
      నాటి జిలేబీ జిలిబిలి
      మాటలలో వ్యంగ్యమెల్ల మాటున బడియెన్ .

      Delete
    2. వెంకట రాజారావు . లక్కాకులగారు,
      అంతయూ మనమేలునకే..ఇదే బాగుందేమోనండి..
      ధన్యవాదాలు.

      Delete
    3. Zilebiగారు,
      పద్యం బాగుంది
      ధన్యవాదాలు.

      Delete
  14. లక్కాకుల వారు :)

    చతురత వచ్చును వచ్చును
    యతుల జతుల తో డను గను యవనిక మనమున్
    మెతుకు మెతుకు వేరనగా
    అతుకుల బొంతలు జిలేబి ఆరణి లయ్యెన్ :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebiగారు,
      పద్యంలోనే మాటడండి ఇక ముందు.....
      ధన్యవాదాలు.

      Delete

  15. కష్టే ఫలే వారు :)

    పద్యం లోనే మాటన
    తధ్యము యగునా యనెనుగ దా మాచన్నా
    గద్యము పద్యము జడిజడి
    విద్యగ రాగన బిరబిర విరివిగ గనుమా

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు,
      తెలిసినట్టే ఉండి, ఏమీ తెలీకుండా పోయిందే :)
      ధన్యవాదాలు

      Delete