Saturday 16 January 2016

పల్లెలో పండగ చిత్రాలు












7 comments:


  1. భలేగ ఘరాన బహారి బజారు
    చలేగ ఖరారు చమీకు జరూరు
    జిలేబి కమీంటు జి,మాచన మీరె
    విలేజి ఫుటోల విహారి ఒహోరె


    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అహోర! జిలేబి
      పద్యమునగాని
      పల్కక యున్నది
      పల్కులు చిల్కలె?.

      Delete
    2. వృత్తమున 'భలేగ' వృత్తాంతమేమిటో
      తెలియరాదు మాకు తెలివిలేదు,
      శ్రీ జిలేబి గారి శిష్యరికముజేయ
      తెలియునేమొ కాస్త తెలివిగలుగ .

      Delete
  2. మీరు పెట్టిన ఫొటోల్లో కనీసం కాస్తయినా సాంప్రదాయ పద్ధతులు కనిపిస్తున్నాయి (ఈ రోజుల్లో చాలామటుకు విరబోసుకున్న జుట్టు, పంజాబీ డ్రెస్సులే కదా). సంక్రాంతి పండగ సంబరాల్లో పెరిగిపోతున్న కృత్రిమత్వం, నాయకుల విచ్చలవిడితనం, విలువల పతనం గురించి ఆవేదన వెలిబుచ్చిన ఈ కవిత "వాట్సప్" లో కనిపిస్తే మీ అందరితో పంచుకుందామని పట్టుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. తన "తెలుగు వెలుగు" బ్లాగులో "సంక్రాంతి శుభాకాంక్షలు" అనే టపాలో పొన్నాడ మూర్తి గారూ ఇటువంటి భావాన్ని వ్యక్తపర్చారు.

    -------------
    వేమూరి మల్లిక్ గారి కవిత:

    కుంకుళ్ళెరుగని తల అంట్లు..
    నలుగులెరుగని స్నానాలు..
    సాంబ్రాణి ధూపం తెలియని కురులు..
    పూలకి నోచుకోని కత్తిరించుకున్న జడలు..
    కాటుకెరుగని కళ్ళు..
    గాజులెరుగని కరాలు
    అందెలు తెలియని పాదాలు
    గోరింట మెరియని నఖాలు
    వరిపిండే కలవని రంగవల్లులు..
    పట్టుపావడాలెరుగని చిన్నారులు
    ఓహో.. పండగొస్తోంది..
    ప్లాస్టిక్ తోరణాలు..
    ఫేసుబుక్కుల్లో ముగ్గులు
    కొని తెచ్చుకున్న పిండివంటలు ..
    వాట్స్ అప్పుల్లో శుభాకాంక్షలు..
    ఓహో సంబరాలిస్తుంది..
    ఎంకి పెళ్ళి సుబ్బి చావుకంటూ
    కోడిపుంజుల చావులు..
    సంప్రదాయమంటూ నాయకుల వికృతాలు..
    జూదాలంటూ జనాల అప్పులు..
    వహ్వా పట్టేయ్యాలంటూ పోలీసుల లంచాలు..
    ఓహో సంక్రాంతి సంబరాలు..
    తెలుగు నేలపై కృత్రిమ కోలాహలాలు..
    ఓహో సంక్రాంతి పండగొస్తోందోచ్.....
    --:ఒ0ఒ:--

    ---------------

    కవిత బాగుంది కదా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies

    1. నరసింహారావు గారు,

      ఇలా బాధపడి పడి విరమించుకున్నా! మంచి కవితను పంచారు, వేమూరి వారికి కవితకు ధన్యవాదాలు.

      ’మీకూ శుభాకాంక్షలు’ అంటున్నారు, నాకేమో అదోలా అనిపిస్తుందలా అంటే!
      మీకు మీ కుటుంబానికి సంక్రాంతి శుభకామనలు.
      ధన్యవాదాలు.

      Delete
    2. అన్నలు తమ్ముళ్ళు హాయిగా కలిసుండు
      బహుకుటుంబాలు పాడుబడెను
      పెద్ద కుటుంబాల ప్రేమలు బంధాలు
      బ్రద్దలై ఒంటరి బ్రతుకులయ్యె
      ఒద్దిక కొరవడ్డ ఇద్దరు ప్రేతాలు
      పిల్ల ప్రేతమొకటి - ప్రేమలేని
      లంకంత కొంపలో రాజీకి రాలేక
      మాట పలుకు లేక మ్రగ్గుటరయ ,

      ఇల్లు మేడలయ్యె యిరుకయ్యె మనసులు ,
      డబ్బులెక్కువైన డాబు దప్ప
      ఇంటి నిండ మనుజు - లెల్లలు లేనట్టి
      బంధనాలు లేని పండుగేల ?

      Delete
    3. వెంకట రాజారావు . లక్కాకుల గారు
      అంతా ఉరుకులు పరుగులు
      నిల్చి నీళ్ళు తాగినదిలేదు.
      మిద్దెలు భవంతులైనాయి
      మనసులు ఇరుకైనాయి.

      నీది నాదనుపోరు పెరిగె
      మన్దియనుమాతయే వినపడదు
      ప్రేమయన్న బూతుమాటాయె
      కలుపుట కల్ల విడుచుటమిన్న
      ధన్యవాదాలు

      Delete