Tuesday 8 December 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-ఏడుస్తూ వ్యవసాయం చేస్తే….

ఏడుస్తూ వ్యవసాయం చేస్తే….......continue at కష్టేఫలే


రోజుకో పద్యం.

ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోసము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ.

పక్వానికి రాని పచ్చికాయలు నేలరాలినవి తినకు. బంధుల్ని తిట్టకు. యుద్ధం నుంచి పారిపోయిరావద్దు. గురువులమాట  విను. ఇవి చేయకపోతే దోషం సుమీ.

పచ్చికాయలు తింటే ఆరోగ్యం చెడుతుంది, వద్దన్నారు. బంధువులని తిట్టకూడదు, వారిని మార్చుకోలేము, అది కుదరని పని. అందుకు వారితో సాధ్యమైనంత సఖ్యంగా ఉండాలి, కుదరకపోతే దూరంగా ఉండాలి తప్పించి, తిట్టుకుంటే మనమే పదిమందిలో పలచనైపోతాం. యుద్ధానికి సిద్ధపడద్దు, శాంతి ఎల్ల వేళలా మంచిది, ఇక యుద్ధం చేయక తప్పకపోతే మాత్రం విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాల్సిందే. యుద్ధమే చేయాల్సివస్తే, ధర్మమే ఎప్పుడూ జయిస్తుంది. గాంధారి ఏమని దీవించింది? ’యతోధర్మస్తతోజయః’ (ధర్మమెక్కడుందో అక్కడే జయమూ ఉంటుంది) అని దీవించింది, 'విజయోస్తు' అనలేదు, కొడుకే అయినా సరే దుర్యోధనుడిని.ధర్మం ఏపక్క ఉందో ఆమెకు తెలియదా? తెలుసు గనకే ’విజయోస్తు’ అనిదీవించక, ’యతోధర్మస్తతోజః’ అంది కదా! ధర్మ యుద్ధమే చెయ్యి,ప్రాణం పోయినా సరే, ఇష్టపడే యుద్ధం చెయ్యి, ఏడుస్తూ యుద్ధం చెయ్యకు.యుద్ధం నుంచి పారిపోకు, పిరికివాడివవుతావు.యుద్ధం మొదలెట్టి క్షమగురించి ఆలోచించకు, యుద్ధం లో శత్రుసంహారమే కర్తవ్యం. 'గురువు నై దేవుడు నై' ఇది కొద్దికాలం చాలా బాగా నడుస్తుంది, ఇలాటివారు చివరికాలంలో గురువో దైవమో అని పరుగులు పెడుతున్నారు, చూస్తున్నాంగా. 

6 comments:

  1. "రోజుకో పద్యం" ఓ అద్భుత ఆలోచన

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాస్ జీ,
      ఇది శ్యామలీయం వారి నుంచి ఐడియా కాపీ. వారు స్వయంగా పద్యాలు రాస్తున్నారు. నేను పాత పద్యాలు పట్టుకుని వ్యాఖ్యానలు రాస్తున్నానంతే !
      ధన్యవాదాలు.

      Delete
  2. నేను కూడా రోజుకొక పద్యం వ్రాసుకుంటున్నానండీ. (ఎవరైనా చదువుతుంటే వారికి ఈ విషయం తెలుసును.)

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయంవారు,
      మీరు ప్రచురించిన వెంఠనే రోజూ మొదట చూసి చదివేది నేనే!
      ధన్యవాదాలు.

      Delete
  3. కష్టే ఫలే వారు,

    ప్రస్తుతానికి ఈ మోడ్ లో ఉన్నా నంటా రా ? => యుద్ధం మొదలెట్టి క్షమగురించి ఆలోచించకు! జేకే !

    పద్యమూ వివరణా కూడా బాగుంది.

    @శ్యామలీయం వారు,

    ఎవరైనా చదువుతూంటే -> రోజూ కాకున్నా అప్పుడప్పుడు చదువుతా (అర్థం కాక పోయినా కూడా ఫర్లేదు ఎప్పుడో ఒకప్పుడు అర్థం కాదా అనుకుంటూ )



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు,
      అంత మాటనగలనా?
      ధన్యవాదాలు.

      Delete