Monday 7 December 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-నమస్సులు-వివరణ.


నమస్సులు-వివరణ........continue at కష్టేఫలే




రోజుకో పద్యం.

అనఘునికైన జేకురు ననర్హుని గూడి చరించునంతలో
మన మెరియంగ నప్పుడవమానము కీడు ధరిత్రియందు నే
యనువుననైన దప్పవు యధార్ధము, తానది ఎట్టులన్నచో
నినుముని గూర్చి యగ్ని నలయింపదె సమ్మెటపెట్టు భాస్కరా

చెడ్డవాడితో స్నేహం మూలంగా ఎప్పటికైనా అవమానము, కీడు జరుగుతాయి, భూలోకంలో. ఎలా అంటే ఇనుముతో  స్నేహం మూలంగా అగ్నికి కూడా సమ్మెటపోటు తప్పలేదు కదా.

చెడ్డవానితో స్నేహం కీడు కలగజేస్తుందన్న శతకకారుని మాట ఎంతేని సత్యం. ఒక్కొకప్పుడు తెలిసి,తెలియక కూడా చెడ్డవారితో స్నేహం చేస్తాం. అప్పుడు అగ్నికి ఇనుముతో చెలిమి మూలంగా సమ్మెటపోటు తగిలినట్టు, కష్టాలు చుట్టుముట్టి అవమానం జరుగుతుంది. ఇది నిత్య వ్యవహారంలో చూస్తున్నాం కదా! ఒక పాపం పని జరిగినపుడు ఆ పాపాన్ని ముగ్గురు పంచుకుంటారని చెప్పుకున్నాం, వారు కర్త,కారయిత,అనుమోదక. కర్త తనచేసే పాపం చేసిపోతే ఆ తరవాత కారయిత, అనుమోదకులు నింద పొందుతున్నారు, అవమానం పాలవుతున్నారు. అందుచే తెలుసుకోవలసింది? పాపం చేసేవారికి దూరంగా ఉండటం, కారయిత, అనుమోదకులు ఒకరే ఐతే? పాపంలో ఎక్కువ భాగం ఎవరు పంచుకుంటున్నారు, తెలిసి, తెలియనివారే! ఎప్పుడూ పాపత్ములను దూరంగానే ఉంచాలి. ఎవరు శిక్షింపబడతారు ? తప్పు చేసినవారా? కాదు. ఇదిగో ఈ నానుడులు చూడండి. ముంజలు తిన్నవాణ్ణి వదిలేసి మోరలుతిన్నవాణ్ణి తన్నినట్టు, ఏదుపంది నొదిలేసి ఊరపందిని శిక్షించినట్టు, తప్పుచేసినవాణ్ణి వదిలేసి తలుపు తీసినవాణ్ణి తన్నినట్టు,తప్పు చేసినవారు తప్పించుకుపోయి చోద్యం చూస్తుంటే తన్నులు తింటున్నవారు అవమానపడినట్టు కదా! అందుచేత తప్పుచేసేవాడి కూడా ఉండటం కూడా......ఇది లోక రీతి.

2 comments:

  1. అపార్థపు రోజుల్లో - కీడు ధరిత్రియందు నేయనువుననైన దప్పవు యధార్ధము ! కాలమే దీనికి సమాధానం చెప్పాలి .

    చీర్స్
    జిలేబి
    (ఇది కూడా రోహిణీశకట ప్రభావమే నేమో !)

    ReplyDelete
    Replies
    1. Zilebi గారు,
      కాలం మీద తోసెయ్యడమఎందుకండీ.
      ధన్యవాదాలు.

      Delete