కార్తీక పున్నమి
రోజుకో పద్యం
బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమలచేత జిక్కి చావదె సుమతీ
బలమైనవాడనని ఎక్కువమందితో విరోధం పెట్టుకోవద్దు. బలమైన సర్పం కూడా చలిచీమలకి దొరికి మరణిస్తుంది సుమా.
నేడు జరుగుతున్నది, బలముంది నోరుందని అందరిని తూలనాడితే, ఎగతాళీ చేస్తే,బాధ పెడితే, హింసిస్తే, ఏమవుతుందో! గిరినాగు భయంకరమైనినది. చిత్రంగా ఈ గిరినాగును చలిచీమలే పట్టుకుని చంపేస్తాయి. ఒక సారి వాటికి దొరికితే చావే గతి, ఏదో ఒక రోజు దొరక్క తప్పదు. ఆ రోజు అయ్యో అని ఓదార్చేవారే కరువైపోతారు.
అదేమో నండీ ; ఈ మధ్య ఏది చదివినా అందులో ఏదన్నా సూక్షి ఉందేమో అని పిస్తోందండి !
ReplyDeleteఈ పై ఫోటో లో కాకరోత్తులు ; భుస్వానాలు; విష్ణుచక్రాలు ఆ పై పద్యం ఇంకా ఆ పై ఆ గద్యం ; గిరి సర్పం చలి చీమలు అబ్బా ఏమిటో మరీ అంతా సూక్షి మాయామయం గా అనిపిస్తోంది !
అంతా సూక్షిమాయ :)
శుభోదయం
జిలేబి
జిలేబి గారు,
Deleteజగన్నాటకమంతా తమ దర్శకత్వం లో జరుగుతుండగా ’ఏమీ సూక్షీ’ అని బుగ్గలు నొక్కుకోవడం కూడ విష్ణుమాయలో భాగమే కదా!
ధన్యవాదాలు.
Deleteశర్మ గారు !
ఇంత దర్శకత్వం ఉందంటారా నాలో !
జేకే
జిలేబి
Zilebiగారు,
Deleteముంజేతి కంకణానికి అద్దం కావాలా? అద్దం కావాలనడమే విష్ణుమాయ కదా!/కాదూ?
ధన్యవాదాలు.
థాంక్స్ శర్మ గారూ, నా మాట మన్నించి వ్యాఖ్యల పెట్టెని పునరుద్ధరించినందుకు.
ReplyDeleteమీ ఇంటి ప్రాంగణంలో టపాకాయల సందడా? ఫొటోలు బాగున్నాయి.
విన్నకోట నరసింహా రావు గారు,
Deleteతెనుగు బ్లాగుల నుండి తొలగిపోవాలనే నిర్ణయం తీసుకున్నా
ధన్యవాదాలు.