Potters at work 1900
Courtesy:- Old Indian photos
రోజుకో పద్యం.
ఎంతచదువు జదివి ఎన్ని విన్ననుగాని
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గుపాలగడుగ బోవునామలినంబు
విశ్వదాభిరామ వినురవేమ.
భావం:- ఎంత చదువుకున్నా, ఎన్ని మంచి మాటలు విన్నా, హీనుడు=బుద్ధి హీనుడు చెడ్డగుణం నుండి తప్పించుకోలేడు. బొగ్గు నల్లగా ఉంటుంది, తెల్లనైన పాలతో కడిగినా నలుపుపోతుందా?
కష్టే ఫలే వారు,
ReplyDeleteటపాల తాంబూలాలతో మొదలెట్టి
ఫోటోల పూల చెండులతో అలరింప జేసి
ఇప్పుడు
పద్యాల పారిజాత పరిమళాలు వెదజల్లు తున్నారు .
చీర్స్
జిలేబి
Zilebగారు
ReplyDeleteiఏమనాలో తెలియటం లేదు.
నమస్సులు
" ........ రేణువులయి, మృత్తికన్ గలిసెనోకద కుమ్మరివాని సారెపై?" (జాషువా)
ReplyDeleteమీ వెతికితెచ్చే పాతఫొటోలు బాగుంటాయి.
విన్నకోట నరసింహా రావు గారు,
Deleteచిన్నప్పుడు జాషువా గారి ఖండ కావ్యాలు చదివేను. మళ్ళీ దొరకలేదండి, శ్మశానం తో సహా. మంచి పద్యం గుర్తు చేసినందుకు
ధన్యవాదాలు.