రేగు వడియం
బుర్రుంటే బూడిదమ్ముకు బతకొచ్చన్నా ఒకప్పుడు. ఇప్పుడు చెబుతున్నా మరో యాపారం. అదే రేగొడియం. రేగువడియం తెలియనివారు,తినని తెనుగువారుంటారనుకోను. రేగు పళ్ళు సంవత్సరంలో 4 నెలలేవస్తాయి అక్టోబరు చివర మొదలుకొని మార్చి మొదలు వరకు. దేశం మొత్తం మీద రేగుబాగానే పండుతుందిగాని,ఇలా రేగువడియం పెట్టుకోవడం ఒక తెనుగువాళ్ళ సొత్తే అనుకుంటా. ఇంత చెబుతున్న రేగువడియం ఎలా ఉంటుంది రుచికి? పుల్లపుల్లగా,తియ్యతియ్యగా,కారంకారంగా బలేరుచితో ఉంటుంది. వానాకాలంలో వర్షం పడుతుండగా ఒక రేగు వడియం తింటూ కూచుని వర్షం చూస్తుంటే బలే బావుంటుంది. ఇంతకీ రేగు వడియం పెట్టుకోడమెలా? రేగుపళ్ళు కడిగి ,తగు బెల్లం,ఉప్పు,పచ్చి మిర్చి చేర్చి కచ్చాపచ్చాగా తొక్కుకుని తగు జీలకర్ర,ఇంగువ వేసుకుని ముద్ద చేసుకుని చిన్న చిన్న ప్లాస్తిచ్ కవర్లలో చిన్న ముద్దపెట్టి ఒక్కనొక్కు గాలాసుతోనో గిన్నెతోనో నొక్కితే రేగువడియం పెట్టుకోడం అయిపోయింది. వీటిని ఎండలో ఎండబెట్టుకుంటే సంవత్సరం పొడుగునా తినచ్చు. నిలవ ఉంటాయి. గాలి చొరని డబ్బాలో పెట్టుకుంటే మరీ మంచిది.
యాపారం ఎలా అనికదా కొచ్చను. ఒక బస్తా రేగుపళ్ళు అంటే పది కేజీలు సీజన్ లో కొనుక్కుని వడియాలు పెట్టుకుని అమ్ముకోవచ్చు. ఈ రేగువడియం తయారీ ఖర్చు ఒక్కొకటి రెండు నుంచి మూడు రూపాయలలోపు ఉంటుంది. ఐదు రేగు వడియాలు ఒక పేకట్ పాతిక రూపాయలకమ్ముకుంటే లాభం ఎంతబ్బా? ఓపికుంటే ఎగుమతీ కూడా చెయ్యచ్చుఅవిడియాలు ఊరికే చెప్పెయ్యరు,కరుసవుద్ది.
పెపంచం మొత్తమ్మీద తెలుగోళ్ళు చాలా దేశాల్లో ఉన్నట్టాపడతాంది,ఇంకేటాలీసెం వద్దు తొరపడు సోదరా! తాక్స్ 200% వేసినా కొంటారు,రుచి అసుమంటిది,మరీ😜 మల్లీ ఏడేలే,సీజనైపోయింది.

అందరికీ గట్లా అ "విడియాలు ఇచ్చే బదులు సొంత గ్యాపారం జెయ్యొచ్చుగా ? :)
రిప్లయితొలగించండికుదరదంతే :).
కుష్ లమే నా ?
జిలేబి,
తొలగించండినాకు డబ్బు సంపాదన అవసరంలేదు,ఇప్పుడు. జీవితంలో కావలసిందేదో సంపాదించేసేను.😜😜😜
' కాలంలో కన్నపిల్లలుగాని,కాలంలో సంపాదించిన సొమ్ముగాని ఉండాలి,వృద్ధాప్యానికి '(ఇదొక నానుడి). భగవంతుడు ఈ రెండూ కలగజేసేడు,నాకు. డబ్బు సంపాదించడమేకాదు,సద్వినియోగం చేయడం కూడా ఒక కళ. అదీ చేసేననుకుంటా. ఇప్పుడు నాకు డబ్బెందుకు? చివరికాలానికా? డబ్బుంటే బతికేస్తానా? పిచ్చి. నేను డబ్బుగురించి వ్యాపారం చెయ్యను. 'లాభం లేని వ్యాపారంజీతం లేని ఉద్యోగం చెయ్యకూడదు',ఇదొక నానుడిలే.
యువతకి చెబుతుంటాను,అప్పుడప్పుదు,ఇలా. గాడిదల్ని పెంచి పాల యాపారం చెయ్యమనా,విన్నావా? ఓ కుర్రోడు, ఆడగాడిదలి పెంచేడు,ఊరిపక్కనే కోటీశ్వరుడయ్యదు. బూడిదమ్ముకుంటున్నాదో కుర్రోడు, నిజమే ఇది,పెకట్టు కేజి 300.
ఇప్పుడిది, చెయ్యి లేదూ యాపారం చేద్దామనుకునీవోళ్ళని ప్రోత్సహించు. ఎవడూ మొదతీ రోజే అంబానీ ఐపోడు,ఇది చెప్పు కుర్రోళ్ళకి. బతకడం నేర్పు. ❤🙏
"నాకు డబ్బు సంపాదన అవసరంలేదు,ఇప్పుడు. జీవితంలో కావలసిందేదో సంపాదించేసేను, భగవదనుగ్రహం వలన ఆదరణకూ అన్నోదకాలకూ లోపం లే" దన్నారు శర్మగారు. అంతకంటే కావలసిన దేముందండీ. అదృష్టవంతులు వారు.
తొలగించండినా ధర్మపత్ని శారద వెళ్ళిపోయిన తరువాత తాడూబొంగరం లేని వాడిని ఐపోయాను. ఇంకా ఉండి ఏమి సాధించాలో తెలియదు. ఈవయస్సులో ఆట్టే సాధించగలిగిందీ కనిపించటం లేదు. నలుగురికీ భారంగా ఐపోయానని అనిపిస్తూ ఉంది.నావలన అందరికీ ఇబ్బందులు కలిగిస్తున్న ఈశరీరంపైన అప్రీతిగా ఉంది. పరపిండోపజీవనం గడిపే ఈజీవనయాత్రను నాదగ్గర డబ్బు తగినంత ఉన్నంత మాత్రాన సుఖంగా ఉందని భావించగలనా? భగవంతుడు ఇంకా ఏమిప్రయోజనాన్నిఆశించుతున్నాడో ఈఉపాధినుండి అని ఆశ్చర్యపోతూ ఉంటాను.
శ్యామలీయం గారు,
తొలగించండివందనం.🙏
నిజమే అమ్మ కలగజేసింది,నేను సంపాదించుకున్నా అనుకుంటున్నది కూడా అమ్మ కలగజేసిందే!!🙏 తృప్తి కావలసినది. ఎంత డబ్బుంటే తృప్తి కలుగుతుంది?ఎంత మంది పిల్లలుంటే కలుగుతుంది, తృప్తి? మనకంటే ఘోరమైన పరిస్థితులలో ఉన్నవారి మాటేమి? నిలువ నీడలేక,తిన తిండిలేక అల్లాడేవారికంటే మనం ఎన్ని రెట్లు మేలంటారు? నేను ఎప్పుడూ ఉన్నదానితోనే తృప్తిపడతాను. ఉన్నస్థితికంటే మంచిదానికోసం ప్రయత్నం చేసాను. అమ్మ ప్రసాదించినదే మహా ప్రసాదమని స్వీకరించి తృప్తి పడతాను.ఈ వయసులో సంపాదనకోసం కొట్టుకులాడిపోను. అంతే. ఇదే చిన్న లాజిక్. 🙏🙏🙏😜 ఇక ఆరోగ్యం,మనం చాలామంది కంటే చాలా ఆరోగ్యంగా ఉన్నం కదూ🙏 నెలకి ఒకసారైనా హాస్పిటల్ లో wards లో ఉన్నవారిని చూసివస్తే మన ఆరోగ్యం ఏంటో అర్ధమవుతూ ఉంటుంది.😜
శారదగారు కాలంచేసిన తరవాత ఒంటరినయ్యానంటారు. ఇద్దరూ కలసి కదా జీవితం ప్రారంభించారు. ఒకరు ముందు గమ్యం చేరిపోయారు.బాధ సహజం,దానిలో కూరుకుపోవద్దన్నదే నా మతం. కొంతకాలం ఒంటరితనం బాధించడమూ సహజం. దానినుంచి బయటపదటమే ప్రాజ్ఞుల లక్షణమని మీకు తెలియనిదా? మీ కూడా చాలామంది ఉన్నారు,మిమల్ని అనుక్షణం కనిపెట్టుకుంటున్నవాళ్ళున్నారు, మీకాలు విరిగినప్పుడు తెలియలేదా? ,. లేనిదేమి? శారదగారు, తిరిగి రారుగా విచారించినా. గడచినదానికోసం విచారం వ్యర్ధం,ఇది మీకు చెప్పగలవాడినా? అల్పుడిని,అజ్ఞానిని, సాహసం చేసేసేను,చెప్పడానికి.
ఇక డబ్బా? అబ్బో అదొక పెద్ద జబ్బు. డబ్బు నిప్పులాటిది. అవసరమైనంత కావాలి,ఆపైది జబ్బే. ఎంతకావాలి అన్నది,ఎవరికి వారు నిర్ణయించుకోవలసినదే! డబ్బుంటే బతికిపోము. రాకేష్ ఝున్ ఝున్ వాలా తెలుసా! 500 రూపాయలనుంచి మొదలై వేలకోట్లు సంపాదించాడు. చివరికి చక్రాల కుర్చీకి అతుక్కుపోయి చనిపోయాడు. పోనీ స్టీవ్ జాబ్స్ తెలుసుగా,మీకు, డబ్బులేకపోయాడా? 😜
మీవల్లకావలసినదేమో అమ్మ నిర్ణయిస్తుంది,చెప్పిన పని చేసుకుంటూపోవడమే! అది లేదు,ఇది లేదు,వారు లేరు,వీరు లేరు అనుకోవడం వ్యర్ధం.
ఎమో చాలా చెప్పేసేను,చదువులేనివాడిని,రానివాడిని,మనసులో మాట కూడా తిన్నగా చెప్పలేనివాడిని, పొరపాట్లు మన్నించెయ్యండి. 🙏
రిప్లయితొలగించండిపెద్ద వారలు మాటలాడెడు సమయము
మౌనమే మేలగు వలదు మారు బల్క
బోకు మధ్యలో యిరువురు బొప్పకట్టు
రీతి నిన్ను పిఠాయింతు రే జిలేబి
ఏమన్నా సంధికి వచ్చినారా
లేక యింకనూ డిస్ కషన్ ఉన్నదాండీ ?
జిలేబి,
రిప్లయితొలగించండినీకు తెనుగు రాదు,నేర్చుకోవు 'బొప్పకట్టు' కాదు,దాన్ని 'బొప్పికట్టు' అని వాడతారు. అర్ధం మొడితే బొప్పి తేలినట్టని అర్ధం. నీకు హాస్య ప్రసంగం ఎక్కడచేయాలో ఎక్కడ మాట అపహాస్యం అవుతుందో తెలియదు. ఎదుటివారి మనసు నొప్పించడమే పనిగా మాటాడ కూడదని తెలియదనుకోలేను. 🙏