Monday, 3 March 2025

మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా?

  మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా?

ఏ దేశానికైనా విదేశాంగ విధానం ఒకటే! అదే స్వార్ధం. తమ దేశపు అవసరాలు ముందు,ఇదే అన్ని దేశాలకి వర్తిస్తుంది.


అంతర్జాతీయ రాజకీయం చాలా వేగంగా మారిపోతోంది, మరో సారి ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి. రెండు యుద్ధాలు నడుస్తున్నాయి. ఒకటి యూక్రైన్ రష్యా మధ్య,మరొకటి హమాస్ ఇస్రయెల్ మధ్య. మొన్న శుక్రవారం అమెరికా ఓవల్ ఆఫీసులో జరిగిన రగడ, అదిన్నీ పాత్రికేయుల ఎదురుగా, ఒక పెద్ద చరిత్ర . జలనిస్కీ ట్రంప్ ల మధ్య జరిగిన సంభాషణ వేడి పుట్టించింది. అమెరికా అధ్యక్షుని  నోట జలనిస్కీ మూడవ ప్రపంచయుద్ధంకి తెర తీస్తున్నాడన్న మాట వినపడింది. జలనిస్కీ సంధికి ఇష్టపడటం లేదన్న సంగతీ తెలుస్తూనే ఉంది, ఇది మిత్ర దేశాలలో వేడి పుట్టించింది. ఈ సమావేశానికి ముందే ఫ్రాన్స్,బ్రిటన్, జర్మనీలు  ట్రంప్ ను కలిసాయి. రాజకీయాల్లో బ్రిటన్ అమెరికా ఎప్పుడు విభేదించవు,  కాని కొంత విరుగు చూపి, Britan యూక్రైన్ కి పెద్ద లోన్ ఇవ్వడానికి ఒప్పందం చేసేసుకుంది, దీని తరవాతే .  బ్రిటన్ సైన్యం ఒంటరిగా రష్యాను ఎదుర్కోగలదని ట్రంప్ ఎగతాలిగా మాటాడినది కూడా బయట పడింది. ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోతున్నట్టుంది. ఏదో రకంగా ఆయుధాలు అమ్ముకోడమే ధ్యేయంగా ఉండే అమెరికా శాంతి అంటోంది, ఇదే ఒక చిత్రం. మొన్న జరిగిన మీటింగ్ లో  ట్రంప్, నీకు సంధి కావాల న్నపుడే వద్దువులే అని కూడా అనేసేరు,జలనిస్కీతో. జలనిస్కీ, నీ చాపకిందికి నీళ్ళొస్తున్నాయి చూసుకోమనీ ట్రంప్ కి చెప్పేసేరు. ఇంతదాకా మీ కోసం సరఫరా చేసిన ఆయుధాల ఖరీదుకుగాను నీ దేశంలోని రేర్ మెటల్స్ గురించి ఒప్పందం మీద సంతకం చేయమంటే జలనిస్కీ చేసినదీ తిరుగుబాటు.  పల్లెటూరి రచ్చబండ రాజకీయంలా వ్యవహారం సాగిపోయింది.  బ్రటన్ లోన్ ఇవ్వడం ఆయుధాలు అమ్ముకోడానికే! ఇతర నాటో దేశాలన్నీ చిన్నవి జర్మనీ, ఫ్రాన్స్ తప్పించి. అమెరికా ఇక ముందు ఆయుధాలు ఇవ్వననీ,యుద్ధం కాదు ఇప్పుడు నీకు సంధి మాత్రమే అవసరం అని చెప్పినా జలనిస్కీ వినలేదు.  బ్రటన్ ఆయుధాలతో యూక్రైన్ పోరాటం  దేశ వినాశనమే అవుతుందని సోషల్ మీడియా ఉవాచ, ఆయుధాలున్నా పోరాట యోధులు లేని చందమైపోయింది యూక్రైన్ కి.   నాటో దేశాలు   ఉమ్మడిగా యూక్రైన్ తరఫున రష్యాను ఎదుర్కొంటాయా! తెల్లారి లెస్తే పొయ్యిలో పిల్లి వెలగాలంటే నాటో దేశాలన్నీ రష్యా ఇచ్చే గేస్ మీద ఆధారపడక తప్పదు. ఒక గేస్ పైప్ లైన్ యూక్రైన్ ద్వారా వెళ్ళేదానిని పాడు చేసేరు. ఎవరిగోల వారిదే,ఎవరి అవసరమూ వారిదే.యూరప్ మంటల్లో ఉంది.  


ఇదిలా ఉండగా ట్రంప్ ఆఫ్గనిస్తాన్ లో వదిలేసిన ఆయుధాలు,అప్పుడు యుద్ధంలో మీకిచ్చిన ఆయుధాల ఖరీదు చెల్లించమని ఆఫ్గనిస్తాన్ పీకమీద కూచునేలా ఉంది.ఎందుకిప్పుడు ఇది గుర్తొచ్చింది? ఆఫ్గాన్ లో ఉన్న కొన్ని మెటల్స్ ని స్వంతం చేసుకోవాలని చైనా చూస్తోంది. వాటిని చైనాకి దక్కకుండా చేయాలని అమెరికా ప్రయత్నం.  ఇక మధ్య ప్రాశ్చంలో ఇస్రయెల్ అమెరికా మాటకి బుర్ర ఊపుతోంది,యుద్ధం కొనసాగుతోంది.   

 

మరోపక్క చైనా ఆఫ్గాన్ మీద కన్నేసి ఉంచింది. అమెరికా దిగితే తానూ దిగేందుకు సిద్ధoగానే ఉంది. ఆస్త్రేలియా,జపాన్ లు అమెరికా పాటపాడుతున్నాయి. ఇండియా తటస్తంగా ఉంది.

భారత్ కి అంతర్గత శత్రువులే! బయటి శత్రువులు తెలిసినవారే!!  అంతర్గత శత్రువులు  స్వయంప్రకటిత మేధావులు,అర్బన్ నక్సల్స్,ఆందోళన జీవులు. వీరికి జనం సుఖంగా బతకడం ఇష్టముండదు. వీరు అధికవిద్యావంతులు,శేషప్పకవి చెప్పినట్టు ఈ అధిక విద్యావంతులు అప్రజోజకులే అవుతున్నారు, ఎంగిలి మెతుకులకోసం దేశాన్ని తాకట్టు పెట్టెయడానికి కూడా వీరు వెనుకాడరు. డీప్ స్టేట్ వారి ఎంగిలి  నీళ్ళు,మెతుకులకి ఆశపడే జీవులు. వీర్నేదైనా అంటే భోరున ఏడుస్తారు, మమ్మల్ని అనేసేరు,చూశావా దేశంలో వాక్కు స్వాత్రత్ర్యం లేదు వగైరా వగైరా వాగుతారు, ఇది వీరి జన్మహక్కు.  పట్టించుకుంటే రెచ్చిపోతారు. ఎదో చెయ్యాలి ఊరుకే వదిలేస్తే లాభం లేదు. 


ఇంతకీ అమెరికా యూక్రైన్లో శాంతి వచనాలు పలకడానికి కారణం  చూస్తే,ఇంతవరకు జరిగిన యుద్ధంలో రష్యా ఆక్రమించుకున్న ప్రాంతంలో యూక్రైన్ దేశపు రేర్ మెటల్స్ లో 60 శాతం ఉన్నాయి. రష్యాని అక్కడినుంచి తొలగించి,ఆమెటల్స్ ని స్వంతం చేసుకోవాలని అమెరికా ఆరాటం. ఇక బ్రిటన్ అవసరం? మిగిలిన 40 శాతం రేర్ మెటల్స్ ప్రాంతం చిన్న దేశాలకి మిత్ర దేశాలకి చేరువగా ఉంది. దాన్నికైవసం చేసుకోవాలని బ్రిటన్ ఎత్తుగడ. రష్యా మాట ఒకటే. నాటో కూటమిలో యూక్రైన్ చేరకూడదు,ఒప్పందం ప్రకారం. క్రిమియాను వదులు కోవాలి. ఇలా యూక్రైన్ కుక్కలు చింపిన విస్తరి కాబోతోందేమో!


చివరగా ఇస్రయెల్ హమాస్ లది బతుకుపోరాటం. కలసిబతుకుదామనుకుంటె సమస్య లేదు. ఒకరినొకరు లేకుండా చేసుకోవాలని చూస్తే చివరికి మిగిలేది బూడిద. 

26 comments:

  1. తాతగారి పొలిటికల్ కామెంట్రీ బావుంది.

    చూస్తూంటే "తాతగారు" తలరాత రాస్తున్నట్టున్నారు మూప్రయు నకు :)


    ReplyDelete
    Replies
    1. Zilebi3 March 2025 at 10:45
      ముళ్ళకంపమీద బట్ట పడితే కంగారుగా లాగేసుకుంటే చిరిగిపోతుంది. జాగ్రత్తగా ముళ్ళు తొలిగించుకుని బట్టని తీసుకోవాలి. అలాగే యుద్ధం లో చిక్కుకున్న యూక్రైన్ స్వతంత్రం పోగొట్టుకోకుండా తన ప్రజలు చావకుండా ఉండేదుకుగాను సంధి చేసుకోవడమే నేటి అవసరం. అది మరచి జలనిస్కీ ఉడుకు జుర్రుకుంటే నష్టపోయేది యూక్రైన్ మాత్రమే. కూడా నేడు ఉన్నామంటున్నవారు ఎవరి అవసరానికి వారు జారుకుంటారు. చెప్పాలంటే చాలా ఉంది ఒక టపాలో అయేది కాదు.
      'తాతగారు' మూ.ప్ర.యు ని తలరాత రాస్తే తప్పించగలవారెవరు?

      Delete
  2. ట్యాగు లైను - పొగ వూదుతున్న తాతగారు :)

    ReplyDelete
    Replies
    1. Zilebi3 March 2025 at 10:47
      తాతగారు పొగ ఊదడు. ఏవరి అవస్రాన్ని బట్టి వారు మంట ఎగసన తోస్తూ ఉంటారు,అంతే.

      Delete
  3. సునిశిత విశ్లేషణ సర్. పాశ్చాత్య దేశాలలో ప్రస్తుతం ఉన్న ఈ గందరగోళ పరిస్థితులు భారత దేశం ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపుతాయి అనిపిస్తుంది.

    ReplyDelete
    Replies

    1. బుచికి3 March 2025 at 10:59
      మొన్న మొన్న యూరోపియన్ యూనియన్ వారు భారత్ తో వ్యాపారం నింత్తం మాటలకొచ్చి వెళ్ళిన సంగతి. యూరప్ మంటలు ఎగదోస్తోంది. ఎవరిని తప్పు పట్టడంకాదు. ఉద్రేకాలు మరికొంత రంగాన్ని పాడు చేస్తున్నాయి. ఒకప్పుడు బుల్లి తెర హాస్యనటుడైన ఈ జలనిస్కీని గద్దె ఎక్కించినది డీప్ స్టేట్ కదా. మనదేశం మీద కొంత ప్రభావం చూపే సావకాశం ఉంది. మనదేశ విదేశాంగ విధానం ప్రకారం అలీనంగానే ఉంటాం. తప్పదు కూడా. మరో కుంపటి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నేడు బంగ్లా సైనికులకాల్పులు మరోరంగాన్ని సిద్ధం చేస్తున్నాయా! ఇందులో ఎవరి హస్తం ఉందో!

      Delete
  4. ఒకప్పుడు రాజరికంలో రాజులకు రాజ్యకాంక్ష ఉందనుకోవచ్చు.
    ఇప్పుడు సమస్యలకు కారణం, ప్రజాస్వామ్యంలో దేశాధినేతలను వెనకుండి నడిపిస్తున్న కేపిటలిష్టుల దురాశ అని నా అనుమానం.

    ReplyDelete
    Replies
    1. Bonagiri3 March 2025 at 20:26
      మానవులంతా కాంత,కనకాల చుట్టూనే తిరిగుతారు,ఏదేశం వాళ్ళైనా సరే! వీటికి ప్రతి రూపాలే ఆశ,భయం. ఇవే రాజ్యాలేలతాయి,ఎక్కడైనా సరే! ఇదే మానవ మనస్తత్త్వం. వాళ్ళు కేపిటలిస్టులైనా, కంYఊనిస్టులైనా ఓక్టే. ఐతే ఇందులో ఒకరు చేస్తే పరిపాలన,మరొకరు చేస్తే పీడన అంతే తేడా అనుకుంటా సార్. ఎక్కడైనా జరిగేదొకటే.
      ==========================================================
      ప్రపంచ రాజకీయాలు రన్నింగ్ కామెంట్రీ రాయడానికి కూడా కష్టంగా జరిగిపోతున్నాయి, గత రెండు రోజులుగా. జలినిస్కీ అమెరికా నుంచి లండన్ వచ్చి లోన్ అగ్రీమెంట్ చేసుకున్నా తరవాత, యూరప్ నాయకుల సమావేశం జరిగింది. అందులో వారు మేము యుద్ధ విరమణకు ఒక ప్లాన్ గీసి అది పెద్దన్నకిస్తాం, ఆపై ముందుకెళదాం అన్నారు. ఈలోగానే అమెరికా తాను నాటో నుంచి,యు.ఎన్ నుంచి తప్పుకుంటున్నట్టు అనధికార వార్త విడుదలయింది. దీంతో యూరప్ నాయకులు వణికారు. పెద్దన్న లేక నాటో ఏమీ చేయలేదని తేల్చేసేరు. దీంతో జలనిస్కీ తగ్గి నేను రిజైన్ చేస్తాననడం మొదలెట్టేడు. ట్రప్ పిలిస్తే మళ్ళీ చర్చలకి వెళతా అన్నాడు. ఇదెలా ఉందంటే విందు భోజనానికి బాజభజంత్రీలతో వచ్చి ఆహ్వానిస్తే కాదని మూకుడుచ్చుకుని పులుసుకోసం వెళ్ళినట్టి సామెత గుర్తు చేసింది. ఇదిలా జరుగుతుండగా పుతిన్ అమెరికా నుద్దేసించి మీకు కావలసినది రేర్ మెటల్స్ కదా అవి నా దేశం లో చాలా ఉన్నాయి. ఫలానా ఫలానా చోట్ల ఉన్నాయి, మీరొచ్చి తవ్వుకోవచ్చు అని ఆహ్వానించాడు. అంతే కాదు మీ ప్రభుత్వం కాని,ప్రైవేట్ కంపెనీలుగాని రావచ్చు,మాటాడుకుందామన్నాడు. దీంతో యూరప్ నాయకుల నాళ్ళు కుంగిపోయయి. ముందేం జరుగుతుందో వేచి చూడాలి.

      ప్రతిదేశం తమ పూర్వ వైభవం తిరిగి సంపాదించుకోవాలని అనుకుంటున్నాయి, మరి బ్రిటన్ అదికోరుకోవడం తప్పేంటి? అప్పటిలాగా ప్రపంచమొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకోడం తప్పా?

      ఈలోగా ట్రంప్ యూరప్ నాయకుల్ని ఉద్దేసించి, పుతిన్ గురించి భయపడి చావద్దు,ముందు మీ దేశాల్లో ఇల్లు చక్కబెట్టుకోండి, మీ దేశాల్లో జరుగుతున్న,అక్రమ వలసదారులు,టెర్రరిస్టులని అదుపుచేసుకోండి, లేకపోతే చరిత్రకి కూడా మిగలరన్నట్టు హెచ్చరించారు. జరగబోయేది వేచి చూదాం.

      Delete
    2. తాత గార్కి ట్రంప్ మహాశయుని పుణ్యమా అని జోష్ వచ్చేసింది
      మళ్లీ ఫుల్ ఫాం లో కి వచ్చేసేరు

      ఇన్నాళ్లుగా ఊసురో మంటున్న టపాస్, కా మింట్స్ , లక్స్మీ అవుటుల్లా ఢమాల్ ఢమాల్ పేలుతున్నాయి.

      తాత గారి ఈ నూతనోత్సాహంపు వీచికలకు జేజేలు :)




      Delete
    3. Zilebi4 March 2025 at 11:14
      నేనెరిగి అంతర్జాతీయ రాజకీయాలు ఇంత గ్రామస్థాయి రాజకీయల్లా తయారవుతాయనుకోలేదు. జోష్ కాదు వేదన. తగిలేది తప్పేది చూసుకోవాలంటారు,పెద్దలు.
      మీరు జేజే లంటే ఎందుకో భయంగా ఉంది.
      =====================================
      నాటో చేరాలనే జలనిస్కీ కోరిక బలంగానే ఉంది. యూరప్ నాయకుల్లో కొత్తగా ఎన్నికైన జర్మనీ నాయకుడు పాల్గో లేదు. ఫ్రాన్స్,బ్రిటన్నాయకులు జలనిస్కీ పాల్గొన్న సమావేశం లో ఫ్రాన్స్ మాట జలనిస్కీకి బ్రీటన్ కినచ్చలేదు. పెద్దన్నకి నచ్చే, రష్యాతో యుద్ధవిరమణ ప్రపోసలే తయారు కాలేదు, జలనిస్కీ వెంటనే యుద్ధం ఆపడానికి సిద్ధంగా లేడు. చూడాల్సిందే.
      అమెరికా నాటో నుంచి తప్పుకోలేదు అంటున్నారు కొందరు పాత్రికేయులు. ఇక యు.ఎన్ నుంచి తప్పుకుంటుందా? వేచి చూడాలి.

      Delete
  5. ప్రపంచం ఎటు పోతున్నా .....
    ఇండియాలో పాలన కేవలం ప్రజా ప్రయోజనాలకోసమే . పాలకులు ' యదా యదాహి ..... సృజామ్యహం ' అంటూ పుట్టు
    కొచ్చినవారే .
    ప్రభుత్వ సంస్థలన్నీ ప్రజాపనులు వదిలేసి
    ప్రభువుల కనుసన్నలలో తరిస్తున్నాయి .
    ఏ ఆఫీసు కెళ్ళినా , ఇదేతంతు . అబ్బో , ముఖ్య
    మంత్రులూ , మంత్రులూ వేదిక లెక్కి ,
    తమ ప్రభుత్వం నిఖార్సయిన ప్రజాప్రభుత్వమని
    డబ్బా కొట్టుకుంటున్నారు .
    ప్రజాధనం ( మధ్యతరగతి + ప్రభుత్వోద్యోగులు
    చెల్లించే పన్నులు ) నూటికి 18 రూ మాత్రమే
    ప్రజాపనులకు , మిగతాది ప్రజాప్రతినిధులు +
    బ్యూరోక్రాట్ల జోబుల్లోకి వెళుతున్నట్లు నివేదికలు
    వెల్లడిస్తున్నవి . ఇక వెయ్యేళ్ళు గడచినా
    భారత దేశం ఇలా సుభిక్షంగా వెలుగుతూనే
    ఉంటుంది . మేరా భారత్ మహాన్ .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల4 March 2025 at 09:58
      వెయ్యేళ్ళుగా బానిసత్వానికి అలవాటు పడిపోయాం. ఇప్పటికి స్వతంత్రం వచ్చినట్టపించటంలేదు. మనదొక దేశమేకాదన్న వారూ ఉన్నారు, మరో దేశానికి ఊడిగం చేస్తున్నవారూ ఉన్నారు. ఇంకా చెప్పుకోవాలంటే వెళ్ళేళ్ళుగా మిమ్మల్ని పరిపాలిస్తున్నాం మరో వెయ్యేళ్ళైనా పరిపాలిస్తాం అని చెబుతున్నవారికి కాళ్ళు పడుతున్న కాలం. ఇక మేధావుల సంగతి చెప్పనక్కరలేదు,అధిక విద్యావంతులప్రయోజకులైరి,సత్యం,సత్య,సత్యం. ఉంగరాల వేళ్ళతో మొట్టేవాళ్ళనే ఎన్నుకుంటున్నాం.గొంగట్లో తింటూ వెంట్రుకలు లెక్కపెట్టుకోవచ్చంటారా? మీరు చెప్పినట్టుకాక మరొకలా ఎలా జరుగును సార్!

      Delete
    2. ఆ చెప్పుతో సరిగా పళ్ళూడడం లేదని
      ఈ చెప్పుని తెచ్చుకున్నాం . అంతే తేడా

      Delete
    3. వెంకట రాజారావు . లక్కాకుల4 March 2025 at 15:48
      ఫారిన్ చెప్పుతో పళ్ళు ఊడటం లేదని,సొతంత్రం కోసం సత్యం,అహింస సాధనాలుగా సొతంత్రం తెచ్చేసుకున్నామనే చరిత్ర రాసింది చదూకున్నాం. సొతంత్రం అనే సొంత చెప్పుకి అన్నీ అతుకులే. న్యాయం,విద్య అందరికి సమానం అని రాసుకున్నాం. కొంతమందికే అర్ధరాత్రయినా తలుపులుదీసి న్యాయం చెబుతున్నారు. మీరూ నేనూ ఐతే కిందనుంచి రావోయ్ అంటారు, సమానం ఎక్కడ సార్!. ఇక విద్య ఉద్యోగాలు ఒకడికి నూటికి నూరు మార్కులొచ్చినా చదువుకి సీటివ్వం,మరి కొంతమండికి 35 మార్కులొచ్చినా సీటిస్తాం, మరి ఉజ్జోగాలూ,ప్రమోషన్లు అదేబాట. ఇదేనా సార్ సమానం. ఒకమతం వారు ఒక ఆస్థి చూపి అది మాది అంటే మాటాడే వీలు లేదు, కోర్టుకు చెప్పుకునే వీలు లేదు. పదమూడు వందల సంవత్సరాల కితం గుడి ఉన్న స్థలం ఆ ఊరే మాది అంటే ప్రభుత్వం నోరిప్పలేదు. మరి ఆ మతం ఆ గుడి కట్టినరోజునాటికి లేనే లేదు. ఇదేకదు సార్! మనం రాసుకున్న సమానత్వం. మన స్వంత చెప్పుతో కూడా పళ్ళు రాలటం లేదు అందుకు మరో విదేసి చెప్పు తెచ్చుకోవాలని కొందరు తాపత్రయపడిపోతున్నా మనం నోరిప్పం. అసలు మనం నోరిప్పి మాటాడటం మరిచిపోయి ఎన్ని తరాలయిందో కదా! ఇలా కాకపోతే మరెలా జరుద్ది సార్! అతుకుల చెప్పుని సరి చేసుకోవాలనీ మనకి లేదు కదు సార్! మరి పళ్ళెలా ఊడతాయి????

      Delete
    4. మన మనసులో ఉన్న ఆవేదనను మాటల్లో అద్భుతంగా చెప్పారు సార్.
      🙏🏻👏👏.

      పదకొండేళ్ల బీజెపీ పాలన తో సహా 77 ఏళ్లుగా హిందువులకు సనాతన ధర్మానికి అన్యాయం జరుగుతూనే ఉంది.

      Delete
  6. శిరముపై కమనీయ శిఖి పింఛముల వాడు
    చెవుల కుండల దీప్తి చెలువు వాడు
    నుదుటిపై కస్తూరి మృదు తిలకము వాడు
    ఉరమున కౌస్తుభం బొలయు వాడు
    నాసాగ్రమున గుల్కు నవ మౌక్తికము వాడు
    కరమున వేణువు మెరయు వాడు
    చర్చిత మైపూత సరి చందనము వాడు
    గళమున ముత్యాల కాంతి వాడు

    తరుణ గోపికా పరి వేష్ఠితముల వాడు
    నంద గోపాల బాలు డానంద హేల
    లీల బృందావనము రాస కేళి దేల
    వచ్చె కలలోకి కన్నుల భాగ్య మనగ .

    ReplyDelete
  7. లక్కాకుల రాజన్నగారూ

    నిన్న హరి లంఘించి ఈ ప్రశ్న వేసెను
    సమాధానము తెలుపగలరు

    ద్రుతగతి తరుమృగవరూధినీ నిరుధ్ధలంకావరోధ వేపధులాస్యలీలోపదేశదేశిక ధనుర్జ్యాఘోష," - ఏదో పజ్యాలు గిలికేస్తూ సొంత డబ్బా కొట్టుకోవటం కాదు,దమ్ముంటే దీని కర్ధం చెప్పు!




    ReplyDelete
    Replies
    1. ఔరా జిలేబీ!
      ఎంత పొగరెక్కి పోయింది నీకు?
      నేను నిన్నడిగితే నాకు జవాబు చెప్పడం పోయి అందరికీ తగిలిస్తున్నావు.
      హరియే హరుడై మూడోకన్ను తెరిస్తే తట్టుకోగలవా!
      ధిక్కారమున్ సైతునే, విష్ణుజన ధికారమున్ సైతునే?
      హాస్యం హాస్యంలా ఉన్నంతవరకే మర్యాద,వెకిలితనం స్థాయికి వెళితే మర్యాద దక్కదు.
      నువ్వు నన్ను అవమానించావు.హద్దులు దాటితే నువ్వు "బ్లాగ్ లోకపు హవల్దార్!" అని పొగిడిన హరిబాబు దెబ్బ నీకూ తగుల్తుంది 0 మర్యాద,మర్యాద,మర్యాద!
      అసలు రూపం తెలియని ముసుగొలో ఉన్నాను కదా అని చిరుడ్రీంసు తరహా వెకిలితనం చూపించకు.
      ఖబడ్దార్!

      Delete
    2. నమో నమః మీ వ్యాఖ్య హృద్యం :)

      Delete
    3. “జిలేబి” గారు,
      ఓ జోక్ గుర్తొచ్చింది.
      ఒక ఇంగ్లీషు కలెక్టర్ గారు ఓ తాసిల్దార్ గారిని వట్టి ఫూల్ లా ఉన్నావే అన్నాడట. తనని పొగుడుతున్నారనుకుని - కించిత్తు చెముడున్న ఆ తాసిల్దార్ గారు - చిత్తం చిత్తం, తమ బోటి పెద్దలంతా అలాగే మెచ్చుకుంటున్నారు అన్నాడట.

      Delete
    4. తరుమృగముల తమాషా :)


      Delete
  8. ఈ పద్యపాదం హనుమంతుని యొక్క గొప్ప శక్తిని మరియు వేగాన్ని వర్ణిస్తుంది. హనుమంతుడు లంకను కాల్చినప్పుడు, చెట్లు మరియు జంతువుల సమూహం వేగంగా కదిలింది. లంక యొక్క అడ్డంకులు అడ్డుకోబడ్డాయి. భయం వల్ల వణుకు అనే నృత్యానికి గురువులాగా, విల్లు యొక్క తీగ యొక్క ధ్వని భయంకరంగా ఉంది.

    ReplyDelete
  9. నేను పొరబడ్డాను
    శ్రీమాన్ వేంకట నాధులు రచించిన శ్రీరఘువీర గద్యలో యుధ్ధకాండలోది ఈ సమాసం

    శ్రీరామచంద్రుని కోదండ ధనుష్టంకార భయంకర దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది .
    లంక సమీపం లోని చెట్లపై కోతులు ఉధ్ధృతంగా సంథరిస్తూ లంకానగరాన్ని దిగ్బంధం చేసేయి . రామచంద్రుని ధనుష్టంకారానికి లంకలోని రాక్షసులు
    వణికు అనే లాస్య భంగిమకు లోనయ్యారు .

    ReplyDelete
  10. ఆల గాచుచు కన్నయ్య అన్న తోడ
    ఆట లాడుచు బృందావ నాటవిని , మ
    నోఙ్ఞ విపినధరా తటమున , కనంగ
    నల్లకలువ వోలె స్ఫురించె , నద్భుతముగ .

    ReplyDelete