'విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన: HM
AP: పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని స్కూల్ హెడ్మాస్టర్ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.
* 'పిల్లలు చదువులో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన బొబ్బిలి మం. పెంట జడ్పీ స్కూల్ HM రమణ... వారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి, గుంజీలు తీశారు.
'మేము కొట్టలేము.. తిట్టలేము.. ఏమీ చేయలేము.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది' అని ఆవేదన వ్యక్తం చేశారు.
Courtesy:Whats app
మాస్టారు ఎంత ఆవేదన చెంది ఉంటారు? సమాజం ఎటుపోతోంది? ఇoతకీ తప్పెవరిది?
అయినా పిల్లలు చూస్తూ నిలబడ్డారు గానీ వెంటనే అందరూ కలిసి పాట పాడుతూ (వాళ్ళు అంత అభిమానించే సినిమాల్లో లాగా) పరుగున వెళ్ళి హెడ్ మాస్టర్ గారి కాళ్ళ మీద పడలేదే 🤔 ?
ReplyDeleteఅలనాడు తనకు అగ్రపూజ చెయ్యలేదని నిండు సభలో నానా రభస చేసిన శిశుపాలుడు …. అతను, అతని అంశ గలవారు కలియుగంలో వ్యాపారస్తుడిలాగాను, సినిమా వారి లాగాను అవతారమెత్తి, జనాల్ని మాయాజాలంలో పడేసి సమాజంలో అగ్రస్థానానికి ఎగబాకారు. వాళ్ళకి అగ్రపూజలు అందిస్తున్నారు నాయకులు. తమ వ్యాపారాభివృద్ధికై రకరకాల మార్గాలు కనిపెడుతూ పిల్లల్ని ప్రభావితం చేస్తున్నారు. క్లాసులో టీచర్లని / లెక్చరర్లని అవమాన పరుస్తూ మాట్లాడడం అందులో ఒక భాగం. పిల్లలు అదే నేర్చుకుంటున్నారు మా స్టారు (సారు కాదు) అనుకుంటూ.
మరొక ప్రధాన కారణం సోకాల్డ్ సైకాలజిస్టులు నానా రకాల థియరీలు చెబుతూ పిల్లల్ని కొట్టకూడదు తిట్టకూడదు అని నీతులు చెప్పడం మొదలెట్టారు. వాటిని ఫాలో అయిపోతున్నారు ప్రభుత్వాలు, టీచర్లు.
అందుకే ఇలా “తోటకూరనాడైనా చెప్పలేదే” అన్నట్లు తయారవుతున్నారు పిల్లలు.
మా చిన్నతనంలో స్కూల్లో మాస్టార్లు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు అన్నగార్లు ఒక్కటిచ్చారంటే చుట్టూ ఉన్న లోకం కాసేపు పంచరంగుల్లో కనబడేది.
ఛార్లెస్ డికెన్స్ గారి (Charles Dickens) నవలల్లో ఇంగ్లండ్ లోని 19వ శతాబ్దపు స్కూళ్ళ పద్ధతులు వర్ణిస్తాడు చూడండి, అలా ఉండేదిట ఒకప్పుడు.
తప్పెవరిది అంటారా ? ఆధునిక కాలపు జనాలదే, ఎనీ డౌట్ ?
విన్నకోట నరసింహా రావు14 March 2025 at 12:14
Deleteపిల్లలలో సహజ స్పందనలు లేవు,పెద్దలూ అలాగే ఉన్నారు.
పిల్లలలో నేర్చుకోవాలనే కుతూహలం నశిస్తోంది.పిల్లలలో ఏ చేస్తేఏమవుతుంది? అనే నిర్భయత్వం నెలకొంది. చదువుకోవాలనుకునేవాళ్ళని చదువుకోనిచ్చేలా కూడా లేరు,కొందరు. హక్కుల సంఘాలు మేధావులు గురించి చెప్పక్కరలేదు.విద్య వ్యాపారమే. టీచర్లే అన్నిటికి బాధ్యులైపోరు,వారు కూడా ఈ పాపంలో భాగస్వాములే,అనుమానం లేదు. ఇక తల్లితండ్రులు,సమాజం దీనికి బాద్యత వహించక తప్పదు.
కర్ణుని చావుకి కారణాల లాగా ఈ సమస్యకి కారణాలనేకం.
దారం తెగినగాలిపటాలని ఆదుకునేందుకు చాలా చాలామంది రెడీగానే ఉంటారు. ఇప్పటికే ఇది పెరిగిపోయింది,సమస్య అయింది కూడా! పరిష్కారం పోలీసులు కోర్టులే!
ప్రస్తుత విషయం మంత్రిగారి దగ్గరకి చేరింది,వేచి చూదాం.
తప్పెవరిది ?!
ReplyDeleteమీకు తెలుసా ?
1 . ప్రభుత్వపాఠశాలలకు వచ్చే పిల్లలు (వేరే ఏదారీ లేని) , ప్రొద్దున లేచి కూలీనాలీ చేసుక బ్రతికే బడుగు
జీవుల పిల్లలు , పెద్దలు పనికెళ్ళగానే వీళ్ళు దారం తెగిన గాలిపటాలు . పెద్దలకు వీళ్ళను పట్టించుకునే తీరిక కానీ , పెద్దల మాట వినే పిల్లలు అరుదనే విషయం మీకు తెలుసా ?
2 . దరిమిలా , వాళ్ళహాజరు చాల తక్కువ .
హాజరే లేక అధ్యనం యెలా ?
3 . మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉన్నా ,
హాజరు తక్కువ .
4 . కాస్త వెసులుబాటు ఉండీ లేనివాళ్ళు కూడా
ప్రైవేటుపాఠశాలలకు మొగ్గుచూపుతున్నారు .
5 . ఇరవై శాతం ప్రభుత్వ పాఠశాలలలో చదివే పిల్లలు నర్ద్వందంగా ప్రతిభావంతులు . 8 వ తరగతి నుండి ప్రైవేటుపాఠశాలలు వారి తలిదండ్రులను ప్రలోభ పెట్టి వలవేసి పట్టుక పోతారు . మిగిలేది తాలు , తరచుగా బడికిరాని పిల్లలు . గ్రామీణప్రాంతాలలో ఈ స్థితి మరీ యెక్కువ .
పరిష్కారంగా నేనొక వినూత్న ప్రయేగం సేసేను .
అరగంట ముందుగా మా ఉపాధ్యాయుల నందరినీ
ముందుగా నిర్ణయించుకున్న హేబిటేషన్ కు తీసుక వెళ్ళి , హాజరు సక్రమంగా లేని పిల్లల పెద్దలను కలిసి
చర్చించడం . ప్రతిరోజూ ఈ పని చేసేవాడిని . కొంత మార్పు సాధించేను .
6 . మీకు తెలుసా ? ఇప్పుడు ఉపాధ్యాయు లెవ్వరూ
పనిచేసే గ్రామంలో ఉండడం లేదు . వంద కి మీ లైనా ప్రయాణం చేయగలుగుతున్నారు .
నిజంగా చిత్తశుధ్ధి ఉంటే , ఉపాధ్యాయుడు తలచు
కుంటే , అద్భుతాలు సృష్టించవచ్చు .
7 . పాఠశాలకు వచ్చిళ పిల్లలకు చదువు చెప్పడం -
అదేమంత గొప్పవిషయంకాదు.
పాపం , పేదరికపు బడుగుల దారంతెగిన గాలి పటాలను కూర్చోబట్టి చదువు చెప్పే చిత్తశుధ్ధిగల ఉ
పాధ్యాయులు కావాలి .
8 . మీకు తెలుసా ? ఉపాధ్యాయులే పలు వ్యాపకాలతో ధనసంపాలనలో తల మునకలై
నేడు తీరుబాటు లేకుండా ఉన్నారు .
9 . మీకు తెలుసా ? ఉపాధ్యాయ వృత్తికి అకౌంట బిలిటీ లేదు .
10 . ఎంత సేపటికీ పిల్లలను కొట్టి భయపెట్టి , చదివించడం భేషైన మార్గంగా భావిస్తున్నారు .
ఇది తప్పుడు మార్గం . 38 దేండ్లు నేను ఈ వృత్తిలో తలపండినవాణ్ణి . నేనెప్పుడూ పిల్లలను కొట్టలేదు .
పిల్లలను దగ్గరకు తీసుకున్నాను . గొప్పగా విద్యావంతులను చేసేను . ఈ పని చేయడం ఎవ్వరికైనా సాధ్యమౌతుంది . కడుపులో కలగాలి .
ప్రతి పిల్లవాడూ మన దృష్టిలో ఉండాలి .
ఉపాధ్యాయ వృత్తి మిగతా వృత్తులకంటే భిన్నమైనది . కేవలం బెల్లూ - బిల్లూ ఇక్కడ కుదరవు .
11 . సదరు ప్రధానోపాధ్యాయుడు చేసింది నా దృష్టిలో తప్పే .
మాస్టారు, మరి ఆ దారం తెగిన గాలిపటాలు ఎగిరి ఎక్కడ చిక్కుకుంటాయో అన్నదొక పెద్ద సమస్య.
Deleteఉపాధ్యాయుడికి వృత్తిపట్ల నిబధ్ధత ఉంటే , దారం తెగిన గాలిపటాలను కూడా కూచోబెట్టి , ఆస్ట్రొనాట్స్ గా మార్చి అద్భుతాలు సృషించ గలడు .
Deleteవెంకట రాజారావు . లక్కాకుల14 March 2025 at 13:59
Deleteమాస్టారు,
మీ స్పందన సహజం,మీ బాధ కూడా సహజం,కాని మనం ఉద్యోగాలు విరమిమించిన పాతిక/ఇరవై సంవత్సరాల క్రితం కాలం లోలా లేదు,నేడు. ఆ నాడు సెల్ ఫోన్ లేదు,నెట్ లేదు,సోషల్ మీడియా అసలు లేదు. పాతికేళ్ళకితం నాకే తెలియదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ప్రతి కుర్రాడు/కుర్రదాని జేబులోనూ ఏదో చిన్నది స్మార్ట్ ఫోన్ ఉంటుందన్నదే నిజం. ఇప్పుడు వాళ్ళకి హీరోలు టీచర్లు కాదు,మరొకరు,ఇది అందరికి తెలిసినదే! మీకు టీచర్ల గురించి తెలుసుగనక చెప్పేరు. టిచర్లు కూడా ఈ పాపంలో భాగస్వాములే! కాదనలేరు. ఏ ఒక్క టీచరు పని చేసేచోట కాపరం ఉండడు. వాళ్ళ పిల్లలు ఆ స్కూల్ లో చదవరు. పట్నం లో స్కూల్ లో చదువుకుంటుంటారు. టిచర్ల గురించి నేను రాస్తే బాధ కలుగుతుంది,రాయను, పుచ్చిపోయిన మిరియాలు జొన్నలపాటి చెయ్యవా ?
అన్న సామెతలాగా వారు ఇప్పటికి జ్ఞానం ప్రసాదించేవారన్న గౌరవం నా నర నరాల్లో ఇంకిపోయి ఉంది,మన్నించండి,మారలేను. ఈ అనౌచిత్యానికి సమాజం మొత్తం,మీడియా,సినిమా బాద్యత వహించక తప్పదు. భోజనపథకాలు మరో తలనొప్పి. చదువుకోవాలనుకునే వాడికి ఇవన్నీ అడ్డుకావు. ఎలాగైనా బతికేస్తామన్న భరోసా నేడు మిక్కుటంగా ఉంది.
ఇక టిచరు లెసన్ ప్రిపరేషన్ గురించి చిన్ననాటి ఒక ముచ్చట. నేను ఎ.ఎస్.ఎల్.సి లో ఉన్నపుడు మా హెడ్ మాస్టారు రేపు ఈ ఇంగ్లీష్ లెసన్ చెబుతాను మీరూ ప్రిపేర్ అయి రండి అనేవారు, ఆయన ఉదయమే ఇంటి దగ్గర లెసన్ ప్రిపేరయ్యేవారు,నేని డిక్షనరీ దగ్గర పెట్టుకుని ఆయన ఇంటి ఎదురుగా ఉన్న ఇంటి అరుగుమీద ప్రిపేర్ అయే వాడిని. అది ఒకటి రెండు సార్లు చూసిన ఆయన నీ ప్రిపరేషన్ నోట్స్ ఇమ్మని తీసుకుని చదివేవారు. ఎక్కడెక్కడ పొరపాట్లు ఉంటే చెప్పేవారు. ఈ రోజుకి ఆ మాస్టారి జె.వి.నరసిహం మాస్టారిని మరిపోలేను. నాచే ఇంత చెప్పించేసిన మీకు నమస్కారం.
మా తెలుగు మాస్టారి పేరు బోడేపూడి వెంకటరావు గారు మీ ఇంగ్లిష్ మాస్టర్ లాగానే మమ్మల్ని ప్రిపేర్ అవమనే వారు . నాకు ఇంకా తెలుగు సమాసాలు అవీ గుర్తున్నాయంటే ఆయనే కారణం .
DeleteRao S Lakkaraju15 March 2025 at 20:50
Deleteనేర్చుకోవాలనే కోరికుంటే టీచర్ మార్గాలు చూపగలరు. గుర్రాన్ని నీళ్ళదగ్గరకి తోలగలంగాని తాగించలేం కదా! అలాగే నేర్చుకోవాలని లేనివానికి, నేర్చుకోగల శక్తి లేనివానికి చెప్పి ఉపయోగం ఉండదు. మన బంగారం మంచిదైతే కంసాలిననుకోడం ఎందుకని సామెత. అంటే కావలసినది నేర్చుకోవాలనే బలమైన కోరిక.
ఒక ఉదాహరణ కొంత కాలం కితం ఒక గ్రూప్లో శ్రీ కాశీ కృష్ణాచార్యులవారి సంస్కృత పాఠాలు మొదలయ్యాయి. అందులో చేరాను. సహస్ర పూర్ణ చంద్ర దర్శన సమయం వయసు పూర్తైన నేను. కొన సాగుతున్నాయి పాఠాలు. నిన్నటి పాఠం ఈ రోజుకి గుర్తుండటం లేదు. వయసు,మందులు కారణం,అనుమానమే లేదు. కాని ఇంకా కుస్తీ పడుతున్నా! ఓడిపోతానని తెలుసు. తెలిసి కూడా ప్రయత్నం.
ఆ రోజు మాస్టారు పాఠం చెప్పేముందు తయారయ్యేవారు. మానవుడు నేర్చుకునే, అధ్యనం,అధ్యాపనం ద్వారా. నాడు ఇది అలవాటయింది,నేటికిన్నీ అవసరాన్నిబట్టి అమలులోకొస్తోంది. అదీ టీచర్ చెయ్యగల మార్గదర్శనం. ఏంటో ఎక్కువచెప్పేసేనండీ! 🙏
వెంకట రాజారావు . లక్కాకుల14 March 2025 at 13:59
Deleteమాస్టారూ!
మీరు చాలా కష్టపడి మీరన్నట్టు మీదగ్గర మిగిలిపోయిన తాలుని టెంత్ దాకా లాక్కొచ్చి గట్టెక్కించారు. అత్తెసరు మార్కులతో గట్టెక్కేరు. ఇక్కడినుంచి మొదలయ్యాయి,అసలు కష్టాలు. పై చదువులు చదవాలని కోరికలేదు,కాయకష్టం చెయ్యలేరు. చిన్న చిన్న ఉద్యోగాలు చెయ్యడం నామోషీ! పెద్దే ఉద్యోగం కావాలి,ఫేన్ కింద కూచుని కాలుమీద కాలేసుకుని కాలక్షేపం చేస్తే నెలకి జీతమిచ్చేయ్యాలి. ఇవీ కోరికలు,చిన్నవే లెండి. సాధ్యమా? కాదు కనక ఈ గాలి పటాలు ఎక్కడేనీ చిక్కుకుపోతాయి,తప్పదు.
వీళ్ళకి ఏ పని చెయ్యడం చేతకాదు. ఒక కుర్రాణ్ణి ఒక పెద్దాయన దగ్గరకు పంపా ఉద్యోగం కోసం. ఆయన నీకు ఉద్యోగం ఇస్తా! నాదగ్గర చెయ్యగల పనులు చెబుతా, ఏది చెయ్యగలవో చెప్పు అని, చెప్పుకొచ్చాట్ట,రావు గోపాలరావు డయలాగ్ లాగా. ఆయన చెప్పినదానిలో ఏ ఒక్కపనీ చెయ్యలేక పోతానంటే. ఒక పని చెయ్యి నా కార్లు రోజూ ఎక్కడెక్కడో తిరిగొస్తాయి. అలా తిరిగొచ్చిన కార్లు దుమ్ము పట్టేస్తాయి. రోజూ వాటిని తుడవడం,వారానికొకసారి వాటర్ సర్వీసు చెయ్యడం, ఇది చెయ్యి నీకు నెలకి పదిహేను వేలిస్తానన్నాడట. మూడు రోజులు కూడా ఆ పని చెయ్యలేక పారిపోయాడని ఆయన చెబితే ఔరా! అనుకున్నా. ఇది స్వానుభవం. మన్నించాలి.
ఇది కరెక్ట్ కాదు సార్ , అవినయం అనుకోవద్దు . ఎవరి భవిష్యత్తునూ
Deleteమనం ముందుగా ఊహించడం ,
వదిలేయడం నాకిష్ట ముండదు .
పది ఉత్తీర్ణతతో కొంతమందిలో ఆసక్తులు పెరిగి , పైకి చదువుకో వాలనే
తపన మొదులవుతుంది .
మా కేంపస్ లోనే ఇంటర్ ఉంది .
ఇంటర్ తర్వాత కొంతమంది టీచ్ ట్రయినింగ్ చేసేరు . కొంతమంది
ఇంజనీరింగ్ చేసేరు . మిగతవారు
తదితర వృత్తులను అందిపుచ్చు
కున్నారు . పదితోముగించినవారుకూడా
భవన నిర్మాణ కార్మికుగానో , ఇతరేతర
రంగాలలో నైపుణ్యాలను పొదివి పుచ్చు కున్నారు .
మీరు వారిని అసాంఘిక శక్తులుగా మా
రుతున్నట్లు భావించేరు . నేను తెగిన గాలిపటాలనడం - బతుకులు ఇబ్బంది
కరంగా - జీవనంగడవని - వాళ్ళ దారీ
తెన్నూ తెలియని పిల్లలనే ఉద్దేశ్యంతో
అన్నాను . పాపం ఆ అమాయకులను
మీరు వేరే కోణంలో (నాదృష్టిలో అవమానకరంగా)చూసేరు . ఆ పిల్లలు
మన పిల్లల కంటే ఎందులోనూ తీసి
పోరు . మార్గదర్శనం చేసే గొప్ప ధార్మిక
మైన ఉపాధ్యాయు లుండాలే కాని ,
ఆ పిల్లల , వారి తలిదండ్రుల కళ్లల్లో
మెరుపులు చూడగలం .
రాజశేఖరకెడ్డి పుణ్యమాని చదువుకోవా
లవుకునే వారికి అనేక అవకాశాలున్న విప్పుడు .
వెంకట రాజారావు . లక్కాకుల16 March 2025 at 10:43
Deleteఎవరి భవితను మనం ఊహించలేం,శాసించనూ లేం. తాలు అన్నది కూడా మీరువాడిన మాటే. మీరు మెరుగుపెడితే మెరిసిన వారి గురించీ నేననలేదు, మెరుగు పెట్టడం కోసం ప్రయత్నమూ తప్పు పట్టలేదు. ప్రయత్నం లేకనే గొప్పవాళ్ళం ఐపోవాలనే వర్గం బయలుదేరింది సమాజంలో అలాటివారి గురించే నేనన్నది. కృషితో నాస్తి దుర్భిక్షం అదీ నా మాట. దారం తెగిన గాలిపటాల మాటా నాది కాదు. నేనెవరిని కించపరచను,అది నా అలవాటు. కించపరచేనని మీరనుకుంటే నాది దురదృష్టం. మనపిల్లలు,వాళ్ళపిల్లలు అన్న దృష్టి కూడా నాకు లేదు, నాకు పిల్లలంతా ఒకటే, చదువుకోడానికి అవకాశాలు లేని వాళ్ళంటే అభిమానం, ప్రోత్సహించడం అలవాటు. . 'మన పిల్లలు' పచ్చపూసలేం కాదు. చదుకుంటానన్నవారందరికి నా మద్దతు ఎప్పుడూ ఉంది. ప్రయత్నం చేస్తానన్నవారిని నేనెప్పుడూ కించ పరచను,ప్రోత్సహిస్తాను. మీరు టీచర్లదే పూర్తి బాధ్యత అని మొత్తం తప్పు మీ నెత్తిన రుద్దుకుంటున్నారని నా బాధ. అస్తు,మీరలా అంటే కాదనగలవాడను కాను.
మంచి సమాజం క్లాసు రూములలోనే రూపు
Deleteదిద్దుకుంటుందని పెద్దలంటారు . మిగతా
వృత్తులకంటే ఉపాధ్యాయవృత్తికి సమాజం
పట్ల భాద్యత ఎక్కువ . సమాజంతో మమేక
మయ్యే అవకాశం కూడా ఉపాధ్యాయుడికి
ఎక్కువ ఉంది .
ఉపాధ్యాయవృత్తిపట్ల నిబధ్ధత కలిగి పనిచేసిన నాకు , నేటి భాద్యత మరిచిన ఉపాధ్యాయులంటే కినుక ఉంది .
' మేము చదువు చెబుతున్నాం . వాళ్ళు నేర్చుకోవడం లేదు . గుర్రాన్ని నీళ్ళవద్దకు
..... ఇలాంటిమాటలు ఈ వృత్తికి పనికిరావు.
పిల్లలలో IQ ఎక్కువ తక్కువ లుండవచ్చు .
కాని , వీడికి చదువురాదు - అని ముద్రేసి వదిలెయ్యరాదు . ఉపాధ్యాయుడు ఆసక్తి ఏర్పరచి నేర్పించాలి .
చదివితి తెల్గు నాంగ్లమును సంస్కృతమున్నొక కొంత , యిష్టమై
మదికి లయించు నొజ్జదనమందున ముప్పది యెన్మిదేండ్లుగా
బ్రదికితి , లక్షలాదికి నవారిగ జీవన మార్గ సత్యముల్
విదిత మొనర్ఛి ధన్యతల వెల్గుల గాంచితి ,
భాద్యతావిధిన్ .
మీరు పెద్దలు . లోకాన్ని చదివినవారు .తమకు తెయనివికావు .మన్నించండి . 🙏
సాష్టాంగ నమస్కారం ఎలా చెయ్యాలి
ReplyDeleteగుంజీలు ఎలా తియ్యాలి అని నేర్పిస్తున్న అయ్యవారి వీడియోకి
వాయిస్ ఓవర్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారేమోనండి కాస్తా వెరిఫై చెయ్యండి.
Zilebi14 March 2025 at 16:42
Deleteనీలాటి కట్ పేస్టు ప్రొఫెసర్లు ఉన్నచోట అదీ సాధ్యమే .. ప్రస్తుతానికి విషయం మంత్రిగారి దగ్గరకు చేరిందట. చూదాం.
మాస్టార్ల భయము భక్తి /గౌరవము లేకుండా చదువు రావటము చాలా కష్టము . పిల్లల్ని స్కూల్ కి పంపించక పోవటం అమెరికాలో నేరం కాబట్టి పిల్లలు స్కూల్ కి వస్తారు కానీ వారికి మాస్టార్ల మీద భయమూ భక్తి గౌరవము లేని వాళ్ళు చివరికి ఏ వృత్తుల్లో జీవితం గడుపుతారో లోక విదితం .
ReplyDeleteనిబధ్ధత గల ఉపాధ్యాయుడు పిల్లల నుండి , సమాజం నుండీ నిరంతరం గౌరవ మర్యాదలు పొందుతూనే ఉంటాడు . ఇది కేవలం ఉపాధ్యాయుల సొంతం .
DeleteRao S Lakkaraju15 March 2025 at 05:43
Deleteభక్తి/గౌరవం ఇంట్లో పెద్దలపట్ల తల్లితండ్రులపట్లనే లేదు, ఇక టీచర్లెక్కడ సారూ!
ఈ స్టైలేదో వైరలయ్యేటట్టే వుంది :)
ReplyDeleteమరో టీచరూ మొదలెట్టేడు
సత్యాగ్రహము :)
https://youtu.be/9lHtsztsM9Y
Zilebi15 March 2025 at 09:33
Deleteవృత్తిలో గౌరవం లోపించింది.తృప్తి కలిగేలా పరిస్తితులు లేవు. చదువుకంటే ఇతర విషయాలకి ప్రాధాన్యం పెరిగిపోయింది.
అవును ,
ReplyDeleteఇదొక క్రొత్త ట్రెండ్ ,
ఉపాధ్యాయుల్ని పనిచేసే ఊర్లలో కాపుర ముండ మనండి . ఉండరు . నిరంతరం
ప్రయాణం చేసే టీచరు ప్రిపేరయ్యే దెప్పుడు ?
ఓపిగ్గా బోధించడం సాధ్యమౌతుందా ?
తాను చెప్పిన చదువును మూల్యాంకనం
చేయగల్గు తున్నాడా ?
చదువు చెప్పడం కాదు , నేర్పించగలగాలి .
పిల్లలకు ఆసక్తి ఏర్పరచాలి , ప్రతి పిల్లవాడూ
తన దృష్టిలో ఉండాలి . నేను చెప్తున్నాను .
వాళ్లు నేర్చుకోవడం లేదు , అంటే , ఆ ఉపా
ధ్యాయుడు ఈ వృత్తికి పనికిరాడు . ప్రభుత్వ
పాఠశాలలలో 20 శాతం మంది పిల్లలు మాత్రమే - చదవడం , రాయడం చేయగల్గు
తున్నారంటే , నేటి ఉపాధ్యాయులకు వృత్తి
పట్ల నిబధ్దత లేదనుట నిజం . పాపం
పసి హృదయాలకు ఇదోరకం టార్చర్ .
వెంకట రాజారావు . లక్కాకుల15 March 2025 at 10:17
Deleteమీరిలా చెబితే మీరెవరు ఇలా చెప్పడానికి అని అడిగే రోజులుగాని,పొరబాటు సరిదిద్దుకునే రోజులుగావు సార్!
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
ReplyDeleteగురుర్దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
🙏🙏🙏
వెంకట రాజారావు . లక్కాకుల15 March 2025 at 17:53
Deleteశ్రీ గురవే నమః
🙏