Friday, 21 March 2025

ట్రెండు

 ట్రెండు


ఫిబ్రవరి మధ్యనుంచే సూరిబాబుగారు నలభైకి ఒకడుగు అటూ ఇటూ వేస్తూ 'తగ్గేదేలే....' అంటున్నాడు. పది పరీక్షలు మొదలవగానే ఒక స్టూడెంట్ కుర్రాడు సీకాకులంలో 'దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరూ...'అని ఒక డయలాగ్ పరీక్షాకేంద్రం గోడమీద రాసాడట. ఇక జూసుకోండీ అది వీడియో వైరల్ జేసేరట,కుర్రోళ్ళు,టీచర్లు, మేధావులు. అబ్బ ఇంత గొప్ప డయలాగ్ రాయగలిగినవాణ్ణి తయారు చేయగలిగినందుకూ,అంత ధైర్యవంతుడు మా స్టూడెంట్ అని చెప్పుకోడానికీ, ఇటువంటి మేధావి రేపు ఫీల్డ్ కొస్తే కాసులు గలగలే అని మేధావులూ ఎదురు చూస్తన్నారట. శుభం. 

పొద్దుటే అంబష్టుడు తల చీదర వదల్చేడు,పొన్నకాయలా గుండు చేసి. గుండు చేస్తూ గుండు ఇప్పుడు ఫేషను తెలుసాండీ, పిలక కూడా. పట్టెడు పిలక ముడి చుట్టుకోడం నేటి ట్రెండు. గుండు చేయించుకుని గడ్డం మీసం దుబ్బులా పెంచుకుని కండలు కనపడేలా  టి షర్టులేసుకుని తిరగడమూ ట్రెండ్ అండీ అన్నాడు. అమ్మో! గుండు కెంత ట్రెండూ అనుకున్నా!    

దూడంత దుఃఖం పాడంత సుఖం లేదన్నట్టు, ఊరుకున్నంత ఉత్తమం బోడగుండత సుఖం లేదుగా

34 comments:

  1. మూడు రోజుల క్రితమే కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లి, గుండు చేయించుకుని వచ్చాను. రెండేళ్లుగా ప్రయత్నిస్తుంటే, ఆ వేంకటేశ్వర స్వామి దయ వలన ఈ సారి లాటరీ లో సుప్రభాతం సేవ టికెట్ దొరికింది. స్వామి సన్నిధిలో నిలబడి సుప్రభాతం వినడం అద్భుతమైన అనుభవం.

    ReplyDelete
    Replies
    1. Bonagiri21 March 2025 at 20:28
      వయసుండగానే చూడాల్సినవి చూసెయ్యండి,నాలా వయసయ్యేకా చూదామంటే కదలగలిగేది ఉండదు. నల్లనయ్యను చూసొచ్చారన్నమాట. అందునా ఉదయం సుప్రభాతసేవ అద్భుతం,అదృష్టం

      Delete
    2. తిరువాభరణములు దీసి పక్కనబెట్టి
      ఇమ్ముగా హరికి గోణమ్ము గట్టి
      పన్నీట దడిసిన పచ్చడమ్ములు దెచ్చి
      లలితంపు రొమ్ము తల మొలజుట్టి
      తుమ్మెదమైచాయ దొడరు నచ్యుతునికి
      శిరసాది పచ్చ కప్పురము నలది
      కన మల్లె పూవల్లె కన్నుల కింపైన
      స్వామికి పునుగు జవ్వాది పట్టి

      శుక్రవారాలు అలవేలు శోభనవతి
      మగని కైసేసె , నెన్ని జన్మాల ఫలమొ !
      దివ్యమంగళ వేంకట దేవదేవు
      మోము వీక్షించు కొనరండు , పుణ్యఫలము 🙏

      Delete
    3. శర్మ గారు,
      // “ వయసుండగానే చూడాల్సినవి చూసెయ్యండి, “ //

      చాలా కరక్ట్ గా చెప్పారు. వయసయి పోయిన తరువాత యాత్రలంటూ దేశం మీద పడితే ఆయాసం, నీరసమూ తప్ప మరేమీ ఒరగదు.

      అందుకే వయసులో ఉన్న కుర్ర జంటలకు నేనదే చెబుతుంటాను - తీర్థయాత్రలు కూడా ఈ వయసులోనే చేసెయ్యండి, ముసలితనం మీద పడేదాకా ఆగకండి - అని.

      Delete
    4. విన్నకోట నరసింహా రావు22 March 2025 at 12:45
      20-25 వరదగోదారి వయసు.పెళ్ళి హనీమూను టైములో చూడవలసినవి చూసెయ్యాలి, భార్యాభర్తలు వదలి ఉండలేని కాలం.. 25-30 వయసు ఉల్లోల గోదారి ఉద్యోగం,పిల్లలు. 30-50 ఉల్లోల కల్లోల గోదావరి,పిల్లల చదువులు పెళ్ళిళ్ళు వగైరావగైరా, ఖాళీ ఉండదు.గానుగెద్దు జీవితం. 50-60 శాంత గోదావరి భక్తి,ముక్తి మీద మనసు నిలిచేసమయం చూడవలసినవి చేసే సమయం. 60 దాటిన తరవాత ఒకరికి ఆయాసం,మరొకరికి నీరసం. ఒకరిని ఒకరు వదలి ఉండలేని సమయం,అనగా ఒకరు బాధ పడుతుంటే మరొకరు వదలి ఉండలేని సమయం ప్ర్యాణాలే కుదరవు. ఆ తరవాత ఏమో దైవ నిర్ణయం, ఒకరు జారిపోతే మరొకరు ఒంటరి పక్షిలా, శరీర,మానసిక బాధలు అనుభవిస్తూ (పిల్లలు సరినవాళ్ళైతే) ...కి ఎదురు చూడ్డం తప్పదు. ఇలా అన్నానని ఏమీ అనుకోవద్దు. ఇది జీవిత సత్యం. ఏనిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు? విధి విధానమును తప్పించుటకు ఎవరు సాహసించెదరు?

      Delete

    5. వెంకట రాజారావు . లక్కాకుల22 March 2025 at 11:13
      అద్భుతం. ఇంత చక్కటి వర్ణన ఈ మధ్య చదవలేదు.

      Delete
  2. మరి మీ అంబష్ఠుడు మీకు పిలక పెట్టాడా, శర్మ గారు ? 🙂

    ReplyDelete
    Replies
    1. అన్నట్లు ఈ రోజుల్లో కూడా అంబష్ఠులు ఇంటికొచ్చి చేస్తున్నారా ? అదంతా మరొక యుగపు విధానం అనుకున్నానే.

      Delete
    2. విన్నకోట నరసింహా రావు21 March 2025 at 20:55
      విన్నకోట నరసింహా రావు22 March 2025 at 08:28
      పాతికేళ్ళుగా పిలకా,గుండూయేనండి, పరకలు పల్చగా కనపడీ,కనపడకుంటే కుదురు కాస్త పెంచవోయ్ అన్నా! అప్పుడు చెప్పుకొచ్చాడీ ట్రెండు గురించి. పదిహేనేళ్ళుగా అంబష్టుడు ఇంటికొచ్చే ఏర్పాటు చేసుకున్నానండి, నాలుగో శుక్రవారం నిసబు.

      Delete
  3. ఎండా కాలం వచ్చేసింది
    ఇక అంబరమణి తాతగారు హుస్ హుస్ అంటూ
    నెత్తమ్మివిరివిందు కు పోటీ గా టపాస్ :)

    వెల్కం బెక బెక
    గుండు బద్రము :)


    గుండు సున్న
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebi22 March 2025 at 08:47
      నిన్ననే గుండు చేయించుకున్న తరవాత స్నానం చేసి బయటికొస్తే గుండు చుర్రున కాలింది. పెద్దాయనతో పరాచకాలు కుదరవ్! గుండు బద్రమే! నడిచినా మరేంజేసినా గదిలోనే, టపాలకీ మన్నా వచ్చే రోజులొస్తాయి,తప్పదు.

      ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతోంది, అమెరికాలో ట్రంప్ వచ్చేకా పరుగులే,పరుగులు.చాలా ట్రెండవుతున్నాయి. చాలామంది మూటా ముల్లీ సద్దేసుకున్నారు,మరికొందరు సద్దేసుకుంటున్నారు. అంతర్జాతీయంగా చాలా వింతలు జూస్తాం,ముందు. కట్టలు, డిల్లీ లో కట్టలు ట్రెండు.

      శరీరమాద్యం ఖలు దహ్ర్మ సాధనం కదా మన సంగతి జూద్దాం,కొత్తమందు దిగుమతైయ్యిందిట డయాబెటీస్,ఊబకాయం వగైరా వగైరా. లిల్లీ కంపెనీ ఇన్సులిన్ తయారు చేసినకంపెనీయే ప్రపంచం మీద వదిలింది,మనదాకా వచ్చింది. మరొకటి రాబోతోంది,మన దేశపు ఆవిష్కరణ వేళ్ళు పొడుచుకోనక్కరలేదట డయాబెటీస్ టెస్టుకి ఐ.ఐ.ఎస్సి కనిపెట్టిందో సూత్రం,పరిక్షలో ఉందిట.

      Delete
    2. శర్మ గారు,
      // “ టపాలకీ మన్నా వచ్చే రోజులొస్తాయి,తప్పదు.” //

      నో, వీల్లేదు వీల్లేదంతే.

      Delete
    3. విన్నకోట నరసింహా రావు22 March 2025 at 12:55
      ఎండవేడి ఇబ్బందండి. డెస్క్ టాప్ లోగాని తెనుగులో బాగా రాయగలవీలు లేదు. డెస్క్ టాప్ ఉన్నగదికి ఎ.సి లేదు. ఇబ్బందులు తప్పించి రాయడానికి ఇబ్బందికాదండి.

      Delete
    4. దయా బేటీ కంట్రోల్ కి చియాసీడ్స్ సోక్డ్ వాటర్ మందని ఈ మధ్య ఈ మద్యమును తాగుతున్నారట మీకేమన్నా ఉపయోగమా చూడండి తాతగారు


      Delete
  4. Zilebi22 March 2025 at 17:45
    చిన్నప్పుడు వేసవిలో పుల్లైసు బండి దగ్గర సబ్జాగింజల షర్బత్ తాగుంటావు. ఆ సబ్జాగింజలు అవేలే తులసి గింజలు వాటిని తాగితే దయాబెటీస్ కి మంచిదట. అన్నట్టు మరచా నీకన్నీ ఫారిన్ సరుకు కావాలిగా ఛియాలే గుర్తుకొస్తాయి. అలాగే కొనసాగిపో!😁
    ఇగిగో చూడు ఈ అమ్మాయి దేశియే వందేళ్ళనుంచి ఎవరూ సాధించని సమస్యని సాధించిందిట. జేజే లు చెప్పడానికి కూడా నీకు చేతులు లేవవు,ఫారిన్ కాదుగా

    https://www.ndtv.com/world-news/indian-origin-student-at-us-university-solves-100-year-old-math-problem-7968018

    ReplyDelete
    Replies
    1. మంచి విషయమండి
      చిన్నప్పుడు ట్యూషన్ కొచ్చేది‌.
      చాలా బాగా బ్రెయినీ.


      Delete
    2. “జిలేబి” గారు incorrigible.
      అన్నిటా తనదే చివరి మాట అవాలని తాపత్రయ పడుతుంటారు.

      Delete
    3. మ్రక్షణాభ్రాష్ఠ తైలాన మఖ్ఖి వడియె :)

      Delete
    4. Zilebi23 March 2025 at 10:24
      కొయ్! కొయ్!! "స్టీవ్ జాబ్స్, స్టీఫెన్ హాకింగ్ అనుమానమొస్తే నన్నే అడిగేవారని" కూడా చెప్పుకో!! నమ్మేస్తాం. వీటినే కోతలంటారు మావోళ్ళంతా!!!!! నీదగ్గర చదువైతే కట్ పేస్టూ, కాపీ పేస్టు మాత్రమే నేర్చుకుని ఉండేది.

      Delete

    5. Zilebi23 March 2025 at 14:09
      ఏడిస్తే అమ్మ "తెలిసేలా ఏడు. కారణం చెప్పి ఏడు,లేదూ ఏడ్చిన తరవాతైనా కారణం చెప్పు" అనేది

      Delete
  5. కృష్ణ పరమాత్మ పిలుపుల కేసి ' తగ ని
    రీక్షణ దొరకొంటి , నికను , కెరలి భువిని
    సేయదగు కార్యములు గాని , శ్రియము గాని
    లేవు , జాగేల ? కొనిపొమ్ము , కృష్ణ ! కృష్ణ !

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల24 March 2025 at 08:56
      కోరికదే! ఆయనకి వినపడిందో లేదో!వినపడీ వినపడనట్టున్నాడో!! అసలు వినిపించుకో లేదో!!! నువ్వు గజేంద్రుడిలా ఆత్మ సమర్పణ చేసుకోలేదురా బిడ్డా అంటున్నాడో!! ఏమో!! ఏమీ తెలియదు!!!! అగమ్యగోచరం. అంతర్గత శత్రువులతో నిత్య పోరాటం తప్పటం లేదు. అలసిపోయానయ్యా! ఇంక ఈ ఆట చాలు అన్నా వినిపించుకునేలా లేడు.మోహం,లోభం లో కూరుకుపోతున్నాం. ఎప్పటిదాకా! చెప్పలేం. అదే కదా విష్ణుమాయ.

      Delete
    2. आयनकि विनपडिंदो लेदो

      आयना मन बापते नेमो :)

      Delete
    3. Zilebi24 March 2025 at 09:28

      "ఆయనకి వినపడిందో లేదో
      ఆయ్నా మనబాపతేనేమో!"

      యద్భావం తద్భవతి. నీ పోచుకోలు విన్నపాలు వినాలా? ఎందుకు వినాలి? ఎప్పుడేనా మనసారా స్మరించావా? కష్టమొస్తే గుర్తొచ్చేడా? సుఖం లో స్వామీ నీదయ అని ఎప్పుడేనా అనుకున్నావా? లేదే! మరి నీమాటెందుకు వినాలి?

      Delete
    4. నీ మాటెందుకు వినాలి ?
      అతడు తనని తానెవరో తెలుసుకోడానికి :)

      Delete
    5. Zilebi24 March 2025 at 13:05
      తనను తాను తెలుసుకోగలిగితే సమస్య లేదు. తనను తాను పొగుడుకుంటే తన్నుకున్నట్టుంటుందని నానుడి.

      Delete
  6. రామా ! రావేమిర ! రఘు
    రామా ! మా మొర , వినీ , పరాకా ! రాకా
    సోమా ! నీ పద సన్నిధి
    లో మే ముండ తగమా ? త్రిలోకారామా !

    ReplyDelete
  7. 'పరమాత్మా మన బాపతె'
    పరాచికాలు తగునా ? , ప్రభాభాస్వంతా
    పర నారాయణ పరమే
    శ్వర కృష్ణునిపయి , అతండె జగతికి గతియౌన్ .

    ReplyDelete
  8. పరమాత్మను వేరుగ తల
    చిరి! ద్వైతపు మాయలోన చినబోవుచు వే
    డిరి! మన ఉనికి అతనిదని
    మరిచిరి మొరబెట్టుకొనిరి మానవులకటా!


    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల24 March 2025 at 11:42
      వెంకట రాజారావు . లక్కాకుల24 March 2025 at 12:04
      పద్యాలు బాగున్నాయి. ఆ శాల్తీకి ఉచ్చం నీచం తెలీదు. ఏమి మాటాడవచ్చో ఏది కూడాదో తెలియదు కదు సార్!

      Delete
  9. తప మెంత జేసెనో తల్లి యశోదమ్మ
    పరమాత్మ కృష్ణుని పట్టి పెంచ ,
    తప మెంత జేసిరో తాము గోపాలురు
    కలిసి కృష్ణునితోడ గదిసి దిరుగ ,
    తప మెంత జేసెనో తనర గోమాతలు
    కృష్ణునితో వనిన్ క్రేళ్ళురుకగ ,
    తప మెంత జేసెనో తరుణి రాధాదేవి
    కృష్ణు వక్షస్థలిన్ గెలిచి పండ ,

    పరగ రేపల్లె , బృందావనముల వరలు
    ప్రకృతి , తపమెంత జేసెనో , పరమపురుషు ,
    కృష్ణ దామోదరు పద పంకేరుహముల ,
    మొనసి ముద్దాడు , భాగ్యముల్ బొంద నిలను .

    ReplyDelete
  10. కన్నడు తపమెంత జేసెనో అలాంటి ఇరువురు తల్లుల పొందుటకు అలాంటి రేపల్లె లో వెలుగుటకు అనాలె మేల్ షావనిజమ్ పనికి రాదు


    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల25 March 2025 at 09:56
      సీసం అందంగా సాగింది. చప్పట్లు.

      Delete
    2. Zilebi25 March 2025 at 11:43
      తమదో భ్రమ ( భ్రమ మలయాలం)

      Delete