నడుస్తున్న చరిత్ర.-విశ్వావసు
భద్రం నో అపివాయః మనః శాంతిః శాంతిః శాంతిః
కొత్త సంవత్సరం విశ్వావసు ఈ నెల 30 వ తారీకున మొదలవుతోంది. అంతకు ముందురోజు శనివారం సూర్యగ్రహణం,ఎక్కడెక్కడ కనపడుతుంది? అదీ కొచ్చను. కలనైనా నీ తలపే కలవరమందైనా నీ తలపే అన్నట్టు ఆమెరిక.సం.రా ల ఉత్తరభాగంలో,కెనడా,గ్రీన్ లాండ్,యూరప్, టర్కీ మధ్య ప్రాచ్యంలో కొద్దిగా,ఆఫ్రికా పశ్చిమ భాగంలో కొద్దిగా కనపడుతుంది. మిగతా ప్రపంచానికి కనపడదుగాని దాని ప్రభావం ఇతరచోట్లా ఉంటుంది,ఎలా?
ఇక ప్రపంచ రాజకీయ చరిత్ర ఎలా నడుస్తోందీ? అమెరికా గ్రీన్లాండును కొంటానంటోంది? ఎందుకూ అక్కడ మంచేకదా? అక్కడ రేర్ ఎర్థ్స్ దొరుకుతాయి. ఇది చాలాకాలంగా డెన్మార్క్ చేతిలో ఉండి. జనాభా చాలా తక్కువ. మాఊరంత జనాభా! మా స్వాతంత్య్రం వదులుకోమంటున్నారు.
కెనడా లో ట్రూడి రాజీనామా చేసాకా కొత్త ప్రధాని వచ్చారు. ఆయన మళ్ళీ నెల చివరలో ఎలక్షన్లు ప్రకటించారు. ఆయనంటారు మా రాజకీయాల్లో చైనా,INDIA లు వేలు పెట్టడానికి వీలుందని. నానోట్లో నీ వేలు పెట్టు,నీకంట్లో నా వేలు పెడతా అంటే కుదురునా? ఈ ఊరికి ఆవూరెంత దూరమో ఈ వూరికి ఆవూరూ అంతే కదా?
ఇక యూరప్ ఉడుకుతోంది. అటుపెద్దన్నను కాదని స్వతంత్రంగా యూక్రైన్ ని చేర్చుకుని యుద్ధం కొనసాగించలేదు, కాదనుకుని ఊరుకోలేదు. మింగలేక కక్కలేక అవస్థపడుతోంది. మిగడానికి సరిపోయినదానికంటే ఎక్కువ కొరికితే ఏమవుతుంది? అదే పరిస్థితి యూరప్ ది నేడు. ఇంక రష్యా చర్చ లు చేస్తూనే ఉంది యుద్ధం ఆపడానికి, కాని కొలిక్కి రావటం లేదు. చాలాplan లు ఉన్నా,దేనికీ ఒప్పుదల కావటం లేదు. చివరిగా ఒక మెలికపెట్టింది. కొన్ని దేశాలు,యు.ఎన్ కూడా చర్చలో పాల్గోవాలి అంటోంది. యూక్రైన్ తో అమెరికా రేర్ ఎర్థ్స్ ఒప్పందమూ సంతకాలు కాలేదు. జలనిస్కీ ఇటూ అటూ తిరగడం తప్పించి ఉపయోగమే కనపడటం లేదు.
ఇక టర్కీలో కొద్దికాలం కితం జరిగిన ఎన్నికల్లో ఎర్డోగన్ మళ్ళీ ఎన్నికయారు. ప్రతిపక్ష నాయకుని అరెస్టు చేయ్యడం తో దేశం అతలాకుతలం అవుతోంది. ఇక మధ్య ప్రాచ్యం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇస్రయెల్ హమాస్ల మధ్య శాంతి ఒప్పదం కొనసాగదు.
ఆఫ్గాన్ పాకిస్థాన్ మధ్య వైరం నడుస్తూనే ఉంది. బలూచ్ నాయకురాల్ని అరస్టు చేసింది పాకిస్థాన్. మొన్న జరిగిన క్వెట్టా ట్రైన్ పై దాడితో అట్టుడికి బలూచ్ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. పాక్ కి కంటిమీద కునుకు లేదు. ఈలోగా తను దాచిపెట్టుకున్న తీవ్రవాదులను గుర్తు తెలియనివాళ్ళు కాల్చి చంపుతున్నారు. అందులో మనదేశం మీద 26/11 తారీకున దాడికి మూలకారకుణ్ణి ఎవరో లేపేసేరట, నిజం ఇప్పటికీ ఇంకా పాక్ ప్రకటించలేదు.
మనదేశం ఒక ఉగ్రవాదిని పంపించెయ్యమని అమెరికాను చాలాకాలంగా కోరుతోంది. అలా పంపడానికి ఏర్పాట్లు జరుగుతోంటే ఆ తహావూర్ రాణా గారు, నన్ను భారత్ పంపితే మరి బతకను నన్ను చంపేస్తారు, నాకు సుగర్,బి.పి.కేన్సర్ ఇలా లక్ష అనా రోగ్యా లున్నయి. అంచేత పంపడానికి లేదని అక్కడ సుప్రీం కోర్టుకి మొరబెట్టుకుంటే కాదoది. ఇంకా ఆశ వదలుకోక ఛీఫ్ జస్టిస్ కి తన అపీలు రిఫర్ చేసాడు. ఇప్పుడది విచార్ణలో ఉంది. భారత్ రాక తప్పదు. ఇక్కడికొస్తే మా మిత్రులకి పండగే పండగ. కొంతమంది లాయర్లకి చెప్పేదే లేదు. రాబోయే కాలంలో మన కోర్టుల్లో ఏం జరుగుతుందో వేచి చూదాం. ఇంతకు మించి లోతుగా దేశీ వ్యవహారాలోకి పోవద్దు. హిందీ చీనీ భాయి భాయి, ట్రంప్ సుంకాల దాడి తట్టుకోవాలంటే మనం కలసి పని చెయ్యాలంటోంది,చిత్రం చూడాలి.
ఇక బర్మాలో ప్రభుత ఉందా? ఏమో తెలియనట్టే ఉంది. రఖైన్ ప్రాంత ఆర్మీ తమప్రాంతాన్ని చేతుల్లో ఉంచుకుంది. బంగ్లాదేశ్ లో చిత్రం జరుగుతోంది. ఆర్మీ నాయకుడు పై తిరుబాటన్నారు. ఆయన మాత్రం సైన్యాన్ని దేశం లో వివిధ ప్రాంతాలకి పంపి దేశం లో శాంతి ఉంటుందని ప్రాధానిపై తిరుగుబాటును సహించాను, కాని శాంతి కనపడటం లేదు, చెప్పలేదంటనకపొయ్యేరు. శాంతి స్థాపించుకోండి, లేదూ శాంతి స్థాపించి మేం barocks లకి తిరిగి వెళతామంటున్నాడు. జరగనున్నది చూడాలి.
ప్రాచ్యంలో మరో వింత చైనా,ద.కొరియా,జపాన్ లకి ఎప్పుడూ ఉప్పూ ,నిప్పే! కాని మొన్న ఈ మూడు దేశాలూ కలుసుకున్నాయి. ట్రంప్ను తట్టుకోవాలంటే మనం ఒకటి కావాలంటున్నాయి. చూడాలి. ఇక ఆస్ట్రేలియా,న్యూజిలాంద్ లు మాదేశం నుంచి ఉగ్రవాదాన్ని సహించం అంటున్నాయి. దీని భావమేమి తిరుమలేశా?
Current affairs బాగా follow అవుతున్నట్లున్నారే, శర్మగారు 👏.
ReplyDeleteఉగాది పంచాంగ శ్రవణం లాంటిది చేయించేసారు 🙂.
कट् पेश्टेमो :)
Deleteవిన్నకోట నరసింహా రావు26 March 2025 at 14:23
Deleteచేయగలది,చెయ్యగలిగినది పని లేదు. ఊరకనే కూచోలేం అందుకు పేపర్లు తిరగెయ్యడం. వార్తలు చదువుతుండటం పెరిగిందండీ. అందుకే ఈ పోస్టు. ఇక పేపర్ల సంగతి చెప్పేరూ! దేశీ పేపరైనా,విదేశీ ఐనా ఎజండా లేని పేపరుండదు,లేదు కూడా. కొన్నిటికి భారత్ మీద విషం,ద్వేషం చిమ్మడమే ఎజండా. కొంతమంది రచయితలూ ఆ బాపతే. మన కట్ పేస్టు ప్రొఫెసరు ఒకప్పుడు హిందూ పేపర్లో తిరుపతి రిపోర్టరుగా పని చేసిన శాల్తీయే! అప్పుడు ఇలా కట్పేస్తులు లేవుగాని,కాపీలకి విషం,ద్వేషం చొమ్మడానికి వెనుకతీయని బాపతే
Zilebi26 March 2025 at 19:50
Deleteపచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది. నేను తిట్టకుందా నీకు రోజు గడవదేమో. ఒక్కరోజు తిట్టకుండా ఉండగలనేమో అని చూస్తుంటాను. అబ్బే కుదరదుగా.
చేయగలది,చెయ్యగలిగినది పని లేదు....
Deleteభగవద్ధ్యానం చేయవచ్చుకదా ?
Zilebi27 March 2025 at 11:38
Deleteమంచిమాట విన్నానే! తమదగ్గరనుంచి,ఇన్నేళ్ళకి.👌
పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్, హాస నిద్రాదులు జేయుచున్ హరినామ స్మరణ. ఇక దేహబాధలు,సాంఘిక మర్యాదలు,కట్టుబాట్లు ఉన్నంతకాలం తప్పవుగా!
నేను తిట్టకుందా నీకు రోజు గడవదేమో అనెవరో ఓ తాతగారన్నారు గొప్పలు పోయేరండి నిన్న
Deleteహేవిటి వీరి బడాయి ఓ రోజులోనే తుస్సుమనిపించేద్దారి అనిపించి :)
సంక్షిప్తంగా నాకు తెలిసినవి తెలియని ప్రపంచ విషయాలు తెలుసుకున్నాను . థాంక్స్
ReplyDeleteRao S Lakkaraju26 March 2025 at 18:50
Deleteధన్యవాదాలు.
నడుస్తున్న చరిత్ర చూస్తాం జరుగుతున్న సంఘటనలూ చూస్తుంటాం, కారణాలు కనుక్కోలేం ఒక్కొకప్పుడు. కారణం లేని కార్యం ఉండదు. కాని ఆ కారణం వెనక చరిత్రలో ఉంటుంది. దాన్ని పట్టుకోగలిగితే...
జగమంతా జగడాలే ,
ReplyDeleteభుగభుగలే , నేతలంత పూని , ప్రజా శాం
తి గనుట మాని , తగాదా
దిగి నడుచుట జూడ , పుడమి తేజము దొరగున్ .
వెంకట రాజారావు . లక్కాకుల27 March 2025 at 09:36
Deleteఏజాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం
నరజాతి చరిత్ర సమస్తం పరజీవన పరాయణత్వం. (శ్రీశ్రీ)
చెబితే శానా ఉంది.
స్వగతం :
ReplyDelete-----------
పండుగాదు - ఎవ్వరికినీ పనికిరావు ,
ఎండుటాకు - చిమ్మివేతురు - రాల , నే చివరకొ
' అపుడు ' నేనంత నేనింత యనగ వలదు
నీకు నీవే బరువు నేడు , ' నిజము ' చూడు .
-
ReplyDeleteబరువు బరువనుచు రాజా
కురుచ బడవలదు హృదయపు కుహురమున జగ
ద్గురువును ధ్యానించు శరణు
శరణనుచు పవిత్రమైన సంకల్పముతో
పరమాత్మ జగద్గురునిన్
Deleteకరుణాకరు కమల నయను కంసారి హరిన్
కరివరదుని గజగమనుని
తిరముగ నా హృదిని జేర్చితి గదే విబుధా !
Deleteవెంకట రాజారావు . లక్కాకుల27 March 2025 at 17:56
శరీరం మీద ఎరుక ఉన్నంతకాలం బాధలు తప్పవు సార్! మీకు తెలియనిదా? ఒక్కొకప్పుడు ఇలా వెలిబుచ్చుతుంటాం,బాధలు సహించలేక. అబ్బ తిట్టితినని ఆయాసపడబోకు రామచంద్రా! ఈ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా!
గొప్పది ప్రకృతి , భువిపయి
ReplyDeleteఎప్పటిలా మావి కాచె నేపుగ , నవిగో
ముప్పిరిగ వేప పూతలు
చొప్పడె ఋతువున , నుగాది శోభలు మెరిసెన్ .
ఇంతగా ప్రకృతి తనంత హృద్యమగుచు
శోభనలువోవ , మనిషి ఈసున , మనోజ్ఞ
తలు మరిచి , తృప్తి గోల్పడి మెలుగు చుండె
ఋుతు సమావర్తియై వెల్గు రీతు లెవ్వి ?
'కష్టే ఫలే కబుర్లు' - ఒక చిన్న ప్రశంస
ReplyDeleteఒకచో నవోన్మేష ముదయించు ధిషణకు
అక్షర రూప హృద్యంగమమ్ము
ఒకచోట దర్శించి వికలమై హృదయమ్ము
స్పందించి వ్రాసిన బడుగు బొమ్మ
ఒకచో మనోల్లాస చకిత జీవన చిత్ర
రమణీయ భావనా రస విశేష
మొక్కచో బ్లాగర్ల కొక్కింత మార్గ ద
ర్శనము శాయంగల ప్రతిభ లున్న
అనుభవ జ్ఞాని , జగమెరిగిన బుధుండు ,
నియతి 'కష్టే ఫలే' బ్లాగు నిర్వహించు
హితుడు 'భాస్కర శర్మ' మాకిష్టు -డరయ
బ్లాగు లోకాన వెలసిన భాస్కరుండు
వట్టి కబురులు గావు - చేవ గల జీవి
తానుభవ సత్యములు – నేటి మానవులకు
మార్గ దర్శకము-లప్రతిమాన ప్రతిభ
రూపు దాల్చిన శర్మగారూ ! నమస్సు .
"బ్లాగు లోకాన వెలసిన భాస్కరుండు. " True.
ReplyDeleteరాజారావు మాస్టారు,
ReplyDeleteఅక్షరసత్యం మీరు చేసిన ప్రశంస 👏.
అయితే “కష్టేఫలి” శర్మ గారి గురించి ఏం చెప్పినా “జగమెరిగిన ….. ….. ……” అన్నట్లుంటుంది - అని నా అభిప్రాయం 🙏.
-
ReplyDeleteఒకచో ఫెడేలు తిట్టు మ
రొకచో గయ్యిని నతడెగురును వ్యాఖ్యలపై
తకరారుచేయగాను వె
నుకాడడు ప్రశంసలివి మినురతనుడితడే :)
నారదా