Friday, 27 December 2024

జరిగితే

జరిగితే జ్వరమంత సుఖం లేదు.


జరిగితే జ్వరమంత సుఖం లేదు.

విషం పని చేసినంత తొందరగా మందు పని చెయ్యదు.

గోచీకన్న దరిద్రం ప్రాణం పోవడం కంటే కష్టం లేవు.

సృష్టిలో మూడు జీవులే ఆహారాన్ని చేతితో తీసుకుని నోట్లో పెట్టుకుంటాయి. అవి మానవుడు,కోతి,ఏనుగు మాత్రమే.

పడిశం పదిరోగాల పెట్టు.


స్వగతం:- చలి,రొంప,దగ్గు, పులకరం,జ్వరం కాదు,నాలుగురోజులుగా బాధపెట్టేస్తున్నాయి జమిలిగా. ఇది జ్వరప్రేలాపన కాదు. 😊

Wednesday, 25 December 2024

నన్నెవరూ పట్టించుకోవటం లేదు.😊

నన్నెవరూ  పట్టించుకోవటం లేదు.😊


నన్నెవరూ  పట్టించుకోవటం లేదు.

ఇలా బాధపడకు. 

ఎవరికీ నీ అవసరం లేదు,అందుకే పట్టించుకోడం లేదు.ఇది పచ్చి నిజం. బాధపడి ఉపయోగం లేదు. ఇలా అనుకోడం కష్టం అనుకుంటే 

అందరూ నావాళ్ళే అందుకే పట్టించుకోటంలేదు అనుకో మనసు ప్రశాంతం. ఇలా అనుకోడం మరికొంత బాధకే కారణం అనుకుంటావా? 

నాకెవరూ లేరు అనుకో, ఈ కనపడేవాళ్ళంతా మిధ్య, ఇదొక నాటకం అనుకో,ఇప్పుడు నీ మనసుకి బహు ప్రశాంతత చిక్కి తీరుతుంది.

లేదూ!

ఎవరినీ నువ్వు పట్టించుకోడం మానెయ్యి అప్పుడు చిత్రంగా అందరూ నిన్ను పట్టించుకుంటారు. అది చేయలేవు.

అదే విష్ణుమాయ. 

Monday, 23 December 2024

అంత మనిషైనా

 అంత మనిషైనా


 అంత మనిషైనా,ఇంత మనిషైనా, ఎంత మనిషైనా, భార్య కాళ్ళ దగ్గర కూచునేవాడే.

ఎంత నేర్చినా ఎంత జూచినా ఎంతవారాలయిన కాంత దాసులే.


Saturday, 21 December 2024

పేరులోనేముంది?-లింకులు.

 పేరులోనేముంది?-లింకులు.


తెనుగునాట అందరికి ఇంటిపేరు, పేరు,చివర తోకపేరు ఉంటాయి. ఇప్పటిదాకా ఈపేరుని విరిచి ముందు వెనకలు చేసిరాసినా  చెల్లిపోయింది. ఇకముందలా చెల్లేలా లేదు. పేరుతో బేంకు,ఆధారు, పాన్ కార్డు అన్నిటిలో ఒకేలా లేకపోతే మామూలుగా జరిగిపోవచ్చుగాని సంస్థలకి చెల్లింపులు,రావలసినవి ఇబ్బందులు పడేలా ఉంది,వ్యవహారం. ఇక బేంకుల్లో పోస్టాఫీస్ లో జాయింటు కాతాలున్నవాళ్ళలో ఒకరు జారిపోతే ఆ జాయింటు పేరు తీసెయ్యడానికి కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ఒప్పుకోడంలేదు. ఎన్నేళ్ళైనా ఇది అలాగే ఉండిపోతోంది. ఉన్నా ఇబ్బంది లేదుగాని ఈ కాతా నెంబరు ఏ సంస్థకిచ్చినా ఒప్పుకోడం లేదు, చెల్లింపులు,రావలసినవి జరగటం లేదు.  ఇటువంటి చిక్కులో పడి కొట్టుకున్నా. ఒక్కో సంస్థ  ఒక్కోలా  అదే పేరుని తిప్పి తిప్పి రాసుకున్నాయి. ఐతే లింకంతా పాన్ కార్డులో ఉన్నట్టు పేరు లేకపోతే చికాకులే. నా సౌభాగ్యానికి ఒక పేరు కాదు రెండు పేర్లు. ఈపేర్లతో చిన్నప్పటినుంచి చిక్కుబడుతూనే ఉన్నా. 

ఎంకన్నబాబూ ఎప్పటికయ్యా ఈ గోల తప్పేది నాకంటే ఆయన నవ్వుతూ నిలబడతాడంతే. 

సీతారాం,సీతారాం,సీతారాం జయ సీతారాం.  

Thursday, 19 December 2024

కల

 కల

ఆహారము,నిద్ర,భయము,మైథునము సర్వజీవులకు సమానం. మూడు అవస్థలన్నారు. అవి జాగృతి,స్వప్న,సుషుప్తి, (మెలకువ,కల,నిద్ర). మెలకువ,నిద్ర కానిదే కల. కల అనేది మానవులకే పరిమితం అనుకుంటా. కలలో మనసు మెలకువగా ఉంటుంది,లయం కాదు. 


కునుకుపడితె మనసు కాస్త కుదుట పడతది

కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది 

అన్నారో సినీకవి. 


నిద్రలేనిది కలలేదు. కలను మనసే  సృష్టించుకుంటుంది. సాధ్యాసాధ్యాలు,స్థలకాలాలు,సమయం లేనిది కల. తనకు కావలసినవన్నీ సమకూర్చుకుంటుంది. వాటిని అనుభవిస్తుంది. ఏడుస్తుంది, నవ్వుతుంది, ఏమైనా చేస్తుంది. మెలకువ వచ్చాకా ఓ! ఇది కలా అని విస్తుపోతూ ఉంటుంది.


కలలోనే ఒక కలగా

ఆ కలలోనే మెలుకువగా

కలయో నిజమో వైష్ణవ మాయో

తెలిసి తెలియని అయోమయంలో 

నీవేనా నను తలచినది,నీవేనా నను పిలచినది

అంటారో సినీకవి మరో చోట. 

కల దానిలో నిద్ర,ఆ నిద్రలో కల,కలనుంచి మెలకువ ఇలా చిక్కులు బడిపోతూ ఉన్న మనసు, ఏది నిజం,ఏది కల తెలియని అయోమయమే  వైష్ణవమాయ...


ఇటువంటి అయోమయ స్థితి లో పడిపోయినది యశోద 

కలయో! వైష్ణవమాయమో  ఇతర సంకల్పార్ధమో సత్యమో ......ఇలా అయోమయస్థితిలో పడింది,  కన్నయ్య నోటిలో భువనభాండమ్ములు జూచి. 


వైష్ణవమాయలో చిక్కుకోకు, మనసును చెదరగొట్ట బడనివ్వకు.


ఓం! భద్రం నో అపివాతయ మనః 


ఇది మన్యుసూక్తంలో చెప్పబడ్డ మొదటి మంత్రం.

మనసుకు మనసే శత్రువు. . 


Wednesday, 18 December 2024

ఓం భద్రం

ఓం భద్రం 


ఓం భద్రం నో అపివాతయ మనః

ఓం శాంతి శాంతి శాంతిః

మమ సర్వారిష్ట శాంతిరస్తు.

Tuesday, 17 December 2024

అంతా నటులే

 అంతా నటులే

ప్రపంచ రంగస్థలం మీద అంతా నటులే! ఎవరిపాత్ర వారు నటించి తప్పుకుంటుంటారు. ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు పోయేది తెలీదు. పాత్ర ఎంటో తెలీదు. ఎంతకాలమో తెలీదు. ఏం తెలుసు? ఏమీ తెలీదని కూడా తెలీదు. కాని ఉన్నదేమి? అహంకారం నేను,నేను అనేది, ఆ తరవాత హాహాకారం. అంతా తమ చెప్పు,చేతలలోనే ఉందనుకుంటారు.దానికి తోడు మరో మాయ డబ్బు. చిన్నమ్మ ముందు నడుస్తుంటే కళ్ళెలా కనపడతాయి? కొంతమంది జీవితంలో నటిస్తారు,మరికొందరు నటనలో జీవిస్తున్నామంటారు. అంతా చిరంజీవులమనుకుంటారు, అదే చిత్రం.

ఒక్కొక్కరిది ఒక్కొకపాత్ర కొంతమంది ద్విపాత్రాభినయమూ చేస్తుంటారు. చూసేవాళ్ళుంటే త్రిపాత్రాభినయం చేస్తారు. చివరికంతా వచ్చిన చోటికే చేరతారు. అక్కడే సమానత్వం. ఇదింతే మాయ విష్ణుమాయ. 

Saturday, 14 December 2024

బెల్లం-చీమలు-గుకేష్ 🤣

బెల్లం-చీమలు-గుకేష్  🤣


బెల్లం ముక్క కోసం చీమలు ఎగేసుకొచ్చేసేయి, అందులో ఓ చీమ చచ్చిపోయింది తొక్కిసలాటలో దీనికి పెద్ద పంచాయతీయా? ఇది వార్తేటీ?

ఓరి పిచ్చినాయాలా బెల్లం ముక్కని అరస్టు చేస్తే పండగ,ఎవరికనంటావా? నీది మట్టి బుర్రరా సన్నాసి. ఇను. 

బెల్లమ్ముక్కకి ఉచిత ప్రచారం, మీడియాకి పండగ,పోలీసులకి పండగ,లాయర్లకి కోర్టులకి పండగ, పిపీలకాలకి దెబ్బలు తినే పండగ. ఇది రాయి....వార్త వైరల్.. 

+++++++++++++++++++++++++

గుకేష్

ఎవడీడు? సెలిబ్రిటీయా? వరస హత్యలు చేసి ఎలా తప్పించుకోవాలా చెప్పినోడా? చదనం దుంగలు దేశం దాటించే ప్లాన్ చెప్పినోడా? లేదూ దేశాన్ని ఎలా అమ్మేయాలో చెప్పినోడా? ఈడిదేం కాదే!

ఈడు వరసబెట్టి హత్యలు చేసినోడు,పద్దెనిమిదేళ్ళ లోపు కుర్రోడు, మనదేశపోడే. ఇంటర్నేషనల్ పేరు తెచ్చేసుకున్నోడు.మన దేశానికీ పేరు తెచ్చినోడు.  

చెప్పు,చెప్పు. ఇదిరా వార్తంటే! ఎవడేసే! ఇంతమొగోడు? అంత చిన్న వయసులో. వార్నీయవ్వ!!!!

ఇను ఈ కుర్రోడు చదరంగపు ఆటలో   మొదలెట్టి ఎదుటివాని బంట్లు,ఏనుగులు,గుర్రాలను వరసగా హత్య చేసి, నల్ల పావులతో ఆడి  ప్రత్యర్ధిని చిత్తు చేసి ప్రపంచ ఛాంపియన్ అయ్యేడు. 

గుకేష్ కి అభినందనలు.

ఇలా చెబితే అది హాట్ కేక్ లా వార్త వైరల్ గా పోతదిరా!

Thursday, 12 December 2024

బొంగరం

బొంగరం

for video click on

https://sarmabc.blogspot.com/2019/04/blog-post_89.html

 

 courtesy; google

బొంగరం తిరిగినంత సేపే ముద్దు, అలాగే మానవుడు సంపాదిమచినంతసేపే కుటుంబం పట్టించుకుంటుంది.....

యావద్విత్తోపార్జన సక్తః 
తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజీవతి జర్జర దేహే 
వార్తాం కోపి న పృచ్చతి గేహే ||5||

భావం: ఎంతవరకు ధన సంపాదన చెయ్యగలుగుతారో అంతవరకే తనవారంతా ప్రేమగా ఉంటారు. దేహం కాస్త సడలిపోయి, ఏ పని చేయగల శక్తి లేనివారైతే ఇక ఇంటిలో ఎవరూ పట్టించుకోరు. కుశల ప్రశ్నలు కూడా వేయరు. 


courtesy:
https://ckiranbabu.blogspot.com/2010/01/bhajagovindam-lyrics-in-telugu.html#google_vignette

Tuesday, 10 December 2024

పిచ్చి ముదిరింది.

 పిచ్చి ముదిరింది. 

చొక్కాలు చింపుకోడం నుంచి ఆత్మార్పణ దాకా ఇది మరీ ముదిరి చిన్నపిల్లల్ని సమిధలు చేసే స్థాయికి పెరిగింది. ఊరంతా రోగమైతే వైద్యునింట పండగని నానుడి.


Tuesday, 3 December 2024

అమ్మకానికి లేనిది

డబ్బుతో  కొనలేనిది ఉందా?/డబ్బుతో  కొనలేనిది ఉoది


 ధన మార్జయ కాకుత్స్థ

ధన మూల మిదం జగత్!

శ్రీరాముడు. శ్రీమద్రామాయణము.


డబ్బే లోకంలో సర్వానికి మూలం సుమా!


డబ్బుతో కొనలేనిది ఉందా లోకం లో?


ఎంత డబ్బుతోనూ కొనలేనిది,అమ్మకానికి లేనిది "క్షణం ఆయుస్సు!"

Wednesday, 27 November 2024

విజయ గాథ

విజయ గాథ





 ఆశ్రయం ఇచ్చి ఆదరించాల్సిన భర్త బహిష్కరించడంతో ఆమె ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని కన్నీళ్లమయమైన జీవితాన్ని కడతేర్చుకుందామని కడలి వైపు నడక సాగించింది..                     అలా సముద్రతీరంలో నడుస్తూ ఉండగా‌ అక్కడ పల్లీలు బఠాణీలు అమ్ముతున్న వారిని చూసింది. ' చదువు సంధ్యల్లేని ఈ అమాయకులు కాయకష్టం చేసుకొని జీవించగలుగుతున్నప్పుడు నేను మాత్రం వారిలా ఎందుకు జీవితాన్ని సాగించలేను!'  అన్న ఒక్క ఆలోచన ఆమెలో ఆశాదీపం వెలిగించింది.                     అప్పటి నుండి తీరంలో బఠాణీలు పల్లీలు అమ్ముతూ కొత్త జీవితం మొదలెట్టింది.            ‌‌‌‌‌‌‌‌            మొదటిరోజు సంపాదన కేవలం 50 పైసలు మాత్రమే. కానీ ఓర్పుతో పట్టుదలతో విశ్వాసంతో అమ్మడం ఆపలేదు. మొదట్లో ఐదు,ఏభై,కొన్ని నెలల తర్వాత ఆదాయం నూరు రూపాయలకు చేరింది.                       కొన్నాళ్ళకు సూక్ష్మ ఋణాలను తీసుకుని టీ కొట్టు ప్రారంభించే స్థితికి చేరింది. మరి కొన్ని సంవత్సరాలకు ఒక హోటల్ ప్రారంభించింది. నాణ్యతకు ప్రాధాన్యత నిచ్చి వ్యాపారం సాగించడం వల్ల కొద్ది కాలంలోనే వ్యాపారం పుంజుకొని చెన్నై నగరంలో అనేక ప్రాంతాల్లో హోటల్ బ్రాంచ్ లు నెలకొల్పగలిగింది.                        ప్రస్తుతం " Sandeepa Chain Of Restaurants " అనే సంస్థకు అధిపతిగా ఆమె సంపాదన నెలకు అక్షరాల రు.50 లక్షలు. 1982లో కేవలం 50పైసలతో మొదలుపెట్టి ఆదాయాన్ని నేడు రు.50లక్షలకు చేర్చిన ఆమె విషాదగాథకు  ప్రత్యక్ష సాక్షి  'చెన్నై మెరీనాబీచ్'.                        2010 సంవత్సరంలో అత్యుత్తమ వ్యాపారవేత్త పురస్కారం పొందిన ఆ ధీర వనిత పేరు      '' పెట్రి శ్రియ నారాయణ్ ''.                     తినడానికి తిండిలేని నిర్భాగ్యస్థితి నుండి చనిపోవడానికి కూడా సిద్ధమయిపోయిన స్థితి నుండి నేడు కొన్ని వేలమందికి ఉపాధిని కల్పించిన ఇటువంటి వ్యక్తుల జీవితగాథలే కదా మనకు స్ఫూర్తి!.                      శరీరం నీరసపడితే ఆహారం స్వీకరిస్తాం. అలాగే మనసు నీరస..

courtsy:whatsapp.


 ఇది పెద్దలు,పిన్నలూ కూడా చదవ వలసిన గాథ, ఇటువంటివాటినుంచి స్ఫూర్తి పొందాలి. కుశంకలు లేవదీసేవారూ ఉంటారు. దీని నుంచి నేర్చుకోవలసినదేమి?

1) కష్టాలు చుట్టు ముట్టినపుడు చావు పరిష్కారం కాదు. కష్టాలతో పోరాడి గెలవాలి. దీనికి మగ,ఆడ తేడాలేదు. ఆడవారికి ఆడతనం అదనపు శత్రువు కావచ్చు.

2) విజయానికందరూ చుట్టాలే!

3) కష్టంలో ఆదుకునేవారు అరుదు. స్వయం కృషినే నమ్ముకోవాలి. చదివిన చదువును సార్ధకం చేసుకోవాలి.

4) ఒక్కరోజులోనే ఎవరూ కోటీశ్వరులు కారు,కాలేరు. పెరుగుదల క్రమంగానే ఉంటుంది. 

5) చేసేపనిలో నిబద్ధత,నిజాయితీ ముఖ్యం.

6) విజయానికి  పొంగిపోకూడదు, కష్టానికి కుంగిపోకూడదు.

7) శరీరం నీరసపడితే ఆహారం స్వీకరిస్తాం అలాగే మనసు నీరస పడితే విజయగాథలే తరచి చూడాలి.

8) ఈమె కష్టాలు పడి ఉండదా? శంక. ఇలా ఎదగడానికి ఆమె పడిన కష్టాలు ఊహించుకోడమే కష్టం, అందునా స్త్రీగా.


తీరిగ్గా తరచి ఆలోచిస్తే నేర్చుకోవలసినవి మరెన్నో!


Monday, 25 November 2024

*బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధం*

*బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధం*


 కింది విషయాలు తమ కామెంటులో బోనగిరిగారు (courtesy: What"s app) చెప్పేరు. ఇందులో ఎన్ని మనం ఆచరిస్తున్నాము,ఎన్ని సంపాదించుకోగలిగాము,ఎన్ని అలవాటు చేసుకున్నాం చూదామని బయలుదేరి నిష్కర్షగా సమాధానాలు రాసుకున్నవి ఇలా ఉన్నాయి. ఇవి ఎవరిమటుకు వారు రాసుకోవచ్చు.

************

*ఎంత డబ్బు వెచ్చించిన ఔషదాలయాల్లో అందు బాటులో లేని దివ్య ఔషధాల రకాలు ఈ క్రింది విషయం చదివితే దొరుకుతాయి.*



*బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధం*
ఈ అలవాటు దగ్గరగా గత పాతిక సంవత్సరాలుగా అలవాటయింది. ఇప్పుడు తెల్లవారుగట్ల నాలుగు తరవాత పడుకోబుద్ధికాదు. రోజూ ఉదయాన్నే లేస్తే ఆ రోజంతా హుషారుగా ఉంటుంది. ఇలా నాలుక్కే లేవాలంటే రాత్రి ఎనిమిదికే పడుకోవాలి. ఎనిమిదికే పడుకోవాలంటే ఆరుగంటలకే తినెయ్యాలి. ఈ మధ్య ఒక మనవరాలికి చెప్పా! అలాగే అంది,ఎలా కుదురుతుంది చెప్పు ? అని మళ్ళీ మామూలయిపోయింది, రెండు రోజుల్లోనే.  నిద్ర పట్టటం లేదంటుంది, రాత్రి ఒంటిగంట దాకా రోజూ మెలకువగా ఉంటే ఇక నిద్ర ఎక్కడపడుతుంది? ఈ అలవాట్లే ఆ తరవాత కాలంలో డయబెటీస్ కి కారణం. 

*సూర్య నమస్కారంలు ఒక ఔషధం*
చిన్నప్పుడు యోగా నేర్చుకున్నా! ఉద్యోగంలో చేరేకా మార్పొచ్చేసింది. రిటయిర్ అయ్యాకా మరచిపోయాను. కరోనా పుణ్యామా అని నాలుగేళ్ళుగా యోగా చేస్తున్నా! ఆసనాలు వేస్తున్నా! సూర్య నమస్కారాలు మొదటి మెట్టు.

*నిత్య అగ్నిహోత్రం ఒక ఔషధం*
అబ్బో! చెబితే శానా ఉంది. నలభై ఏళ్ళు శ్వేతకాష్టాలు నిత్యాగ్నిహోత్రం లో వ్రేల్చి,  రిటయిర్ అయ్యాకా, మనవరాలు పుణ్యమా అని మానేశా! దీని మూలంగా మిగిలిన సౌభాగ్యం హై బి.పి.

*ప్రాణాయమం  ఔషధం*
యోగాలో భాగం ప్రాణాయామం. నిత్యమూ చేస్తూనే ఉంటా.

*ధ్యానం  ఔషధం*
ధ్యానం లో కూచోలేకపోతున్నా! కూచోలేకపోవడం ఒక కారణం, ఆలోచనల్ని నిరోధిoచలేకపోవడం మరో కారణం

*ఉదయం/సాయంత్రం నడక  ఔషధం.*
ఒకప్పుడు ఉదయం నడిచేవాడిని. ఆ తరవాత కాలంలో ఉదయమూ, సాయంత్రమూ నడవడం అలవాటయింది. ఆ తరవాత రోజుకు ఐదు సార్లు నడవడం అలవాటయింది. రోజు మొత్తం నడుస్తూనే ఉంటారా? అడగద్దు. ఉదయం 2500,టిఫిన్ తరవాత 1500,భోజనం తరవాత 1000,సాయంత్రం 2000,రాత్రి టిఫిన్ తరవాత 1000 అడుగులు వేస్తా. ఇది నాలుగు కిలోమీటర్లవుతుంది. ఇది బాగా అలవాటయిపోయింది. ఎవరి అవసరాన్ని బట్టి అనగా BMI ఇండెక్స్ ను బట్టి నడక నిర్ణయించుకోవాలి. అoదరికి ఒకటే కొలత పనికిరాదు.

*ఉపవాసం  ఔషధం.*
ఉపవాసం కుదరనిదే! బాలలు వృద్ధులు, అనారోగ్యవంతులు ఉపవాసం చెయ్యకూడదనో,చేయలేరనో, చెయ్యక్కరలేదనో చెప్పేరు,పెద్దలు. 

*కుటుంబం తో కలిసి భోజనం చేయడం  ఔషధం.*
ఇది పగలు సాధ్యం కాదు. రాత్రిపూట నేను మాత్రం సాయంత్రమే టిఫిన్ చేసేయడంతో మిగిలినవాళ్ళంతా కలసి కింద కూచుని భోజనం చేస్తారు. ఇది కుదరలేదు. ఇల్లాలున్నంతకాలం ఇద్దరమూ కూచుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవాళ్ళం. అది గత స్మృతే!

*నవ్వు మరియు హాస్యం కూడా ఔషధం.*
నవ్వు ఎప్పుడొస్తుంది? మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు. అలా ఉల్లాసంగా ఉండాలంటే పాజిటివ్ ఆలోచనలే ఉండాలిట.అప్పుడే నవ్వొస్తుంది. నేను నవ్వుతూ ఉంటానో లేదో ఇతరులే చెప్పాలి,నేను చెప్పుకోకూడదు.
హాస్యం ఆస్వాదిస్తాను,ఆనందిస్తాను. అపహాస్యం సహించడం కష్టంగా ఉంటుంది. నా జీవితం నుంచి హాస్యం అడుగంటిపోయిందనుకుంటా.

*గాఢ నిద్ర  ఔషధం.*
ఎనిమిదికే పడుకుంటా కనక నిద్ర బాగానే పడుతుందనుకుంటా. పగలు ఒక గంట పడుకుంటా ,ఇది నా అలవాటు.

*అందరితో కలిసి మెలిసి మెలగడం  ఔషధం.*
దీనిగురించి కూడా ఇతరులు చెప్పాల్సిందే!

*సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం  ఔషధం*
దీనికేం లోటులేదు.

*మనస్సులో సానుకూలత  ఔషధం.*
దీనికేం లోటులేదు.

*ఆధ్యాత్మిక జీవనం ఔషధం*
ఇదేంటో తెలీదుగాని ఇతరులు మనకు చేయకూడదనుకునేవి ఇతరులకు మనం చేయకపోవడమే పరమ ధర్మం. అదే ఆధ్యాత్మిక జీవనానికి నాంది అనుకుంటా.

*అందరికీ మంచి జరగాలని కోరుకోవడం ఔషధం.*
లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇదే నా నినాదం. 

*ఇతరుల కొరకు ప్రార్థించడం ఔషధం.*
ఇతరుల గురించి చింతించి వారు బాగోవాలని కోరుకోవడమే ప్రార్ధన అనుకుంటా.

* ఆలింగనం  ఒక  ఔషధం*
పరమౌషధం. కాని ఇది మరచిపోతున్నారు. మిత్రులు కలసినపుడు ఇది అనుభవం లోకి వస్తూనే ఉంది.

*పరోపకారం దివ్య ఔషధం*
ఇది ఇతరులు చెప్పాల్సిందే!

*మనసుకు నచ్చిన వారితో ముచ్చట్లు దివ్య ఔషధం*
ఇంతకు మించిన ఔషధం లేదు కాని ఆ మనసుకు నచ్చినవారికి తీరికా,ఓపికా ఉండాలిగా!

*ఆత్మీయులను తలుచుకోవడం ఒక ఔషధం*
ఆత్మీయులను తలుచుకోడానికి ఇబ్బందులుండవుగనక అందరికి సాధ్యమే!

*కొన్నిసార్లు, నిశ్శబ్దం ఔషధం.*
అందుకే తాతగారు 
అనువుగానిచోట అధికులమనరాదు
కొంచముండుటెల్ల కొదువకాదు
కొండ అద్దమండు కొంచమైయుండదా
విశ్వధాభిరామ వినురవేమ. అన్నారు.

*ప్రేమ ఇతరులకు పంచడం ఔషధం.*
మనం పంచడానికి సిద్ధమైనా తీసుకునేవారుండాలి.

*ఇక చాలు అని తృప్తి చెందడం ఔషధం*
సంపూర్ణ జీవితం గడిపేసేను ఇక దేని మీదా ఆశలేదు. తృప్తి చెందా!

*ఈ ఔషధాలన్నీ  పూర్తిగా ఉచితం....*
ముమ్మాటికి నిజం. కొందామంటే ఎక్కడా అమ్మకానికి దొరకవు.

*ప్రతి ఒక్క  “మంచి” మనిషితో మనసువిప్ఫి మాట్లాడడం దివ్య ఔషధం**

😄😄😄😄😄

*ఇవన్నీ  ఏ మoదుల దుకాణములో దొరకవు.*
ముమ్మాటికి నిజం.

*ఇవన్నీ మనలో మనమే సృష్టించుకోవాలి అంటే కొద్దిపాటి సమయం సాధన చేయాలి*
అన్నిటికంటే కష్టమైనది ఇదేనేమో!
*******

Thursday, 21 November 2024

మధుమేహం ( షుగర్ )

 

నవంబరు 14 మధుమేహ నివారణా దినోత్సవం సందర్భంగా మధుమేహం గురించి ఓ చిన్న కధనం...,, 



మధుమేహం ( షుగర్ ) ఒక వ్యాధి కాదు అనేక వ్యాధుల సమ్మేళనం.మధుమేహవ్యాధి అదుపు చేయవచ్చు. కానీ నేటి శాస్త్ర విజ్ఞానం ప్రకారం పూర్తిగా లేకుండా చేయటం అసాధ్యం.            

ఆహార క్రమశిక్షణ, నియంత్రణ ద్వారా అదుపులోకి వస్తుంది.

     ఈ వ్యాధి శరీరంలో అనేక అవయవాలపై హాని కలిగిస్తుంది. మన శరీరంలో షుగర్‌ లెవల్స్‌ అదుపులో లేనప్పుడు ఎక్కువ హాని కలుగుతుంది. షుగర్‌ వ్యాధి అనేది జన్యుపరంగా లేదా హార్మోన్ల లోపం కారణంగా రక్తంలో షుగర్‌ స్థాయిని పెంచుతుంది. దానివల్ల మధుమేహం వస్తుంది.


షుగర్‌ వ్యాధి శరీరంలో అదుపులేనప్పుడు గుండె, మూత్రపిండాలు, కాలేయం, నరాలు, కళ్లు, పక్షవాతం, పాదాలకు సంబంధించిన వ్యాధు లకు ఎక్కువగా గురవుతారు. నేటి జీవనశైలి మార్పుల వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ పాదాలకు ఎక్కువ హాని కలుగుతుంది. ముఖ్యంగా కాళ్లు మంటలు, తిమ్మిర్లు, మొద్దుబారటం, స్పర్శ తగ్గటం ఇలాంటి సమస్యలతో ఎక్కువగాబాధపడుతుంటారు. 


అలాగే తీవ్రంగా చెమటలు పట్టడం, చర్మం నల్లబడటం, అరికాళ్లు పగుళ్లు రావటం, చర్మం బాగా పొడిబారటం ఇవన్నీ ఒక రకమైన నరాలకు సంబంధించిన వ్యాధి లక్షణాలు. ఇవి శరీరంలో షుగర్‌ లెవల్స్‌ విపరీతంగా పెరగడం వల్ల వచ్చే అవకాశాలున్నాయి. ఈ విధమైన లక్షణాలు ఉన్నవాటిని డయాబెటిక్‌ న్యూరోపతి అంటారు.


న్యూరోపతి అనేది నాడీ కేంద్రానికి సంబంధించి వచ్చే అనర్థాలు. ముఖ్యంగా నరాలు డామేజ్‌ అవ్వటం, ఎలాంటి లక్షణాలు కలగకుండా వచ్చే పుళ్లు, రక్తనాళాలలో రక్త ప్రసరణ తగ్గటం, రక్త నాళాలు సన్నబడటం, అతి తక్కువ వ్యవధిలో కాళ్లకు చెడు వాపు రావటం వంటివి ఎక్కువగా వస్తాయి.

డయాబెటిక్‌ న్యూరోపతి అనేది షుగర్‌ పేషంట్లకు 28-32 శాతం ఉంటుంది. 


ఐదు సంవత్సరాలు పైబడి షుగర్‌ వ్యాధి ఉన్న వారిలో ఈ లక్షణాలు కనబడుతుంటాయి. వీరిలో సహజంగా కాళ్లకు స్పర్శ లేకపోవటం, చిన్న చిన్న పుండ్లు రావటం, అవి వచ్చినట్టు తెలియకపోవటం లేదా త్వరగా తగ్గకపోవటం, అరికాళ్ల పగుళ్లలో మలినం చేరి, ఇన్‌ఫెక్షన్‌ రావడానికి అవకాశం ఉంటుంది.

రకాలు 

1. పెరిఫిరల్‌ న్యూరోపతి 

2. అటోనమిక్‌ న్యూరోపతి 

3. ప్రాక్సిమల్‌ న్యూరోపతి


నివారణ :క్రమం తప్పకుండా ప్రతి నెలా షుగర్‌ లెవల్స్‌ పరగడపున పరీక్ష చేయించుకుంటే (ఎఫ్‌బిఎస్‌) 110ఎంజి/డిల్‌ లోపు ఉండేలా... 


అల్పాహారం తీపుకున్నాక (టిఫిన్‌) గంటన్నరకు (పిపిబిఎస్‌) 140ఎంజి/డిల్‌ ఉండాలి. 


అలాగే హెచ్‌బిఎ1సి కూడా 5.6-6.5 శాతం ఉండవచ్చు. 


బిపి కూడా 130/80ఎంఎం హెచ్‌జిఎల్‌ లోపు ఉండాలి.


శరీరంలో కొవ్వు (చెడు కొలెస్ట్రాల్‌) టిజిఎల్‌, ఎల్‌డిఎల్‌ అదుపులో ఉంచుకోవాలి.


ప్రతిరోజూ క్రమం తప్పకుండా 30-40 నిమిషాలు వ్యాయామం చేయాలి. (వాకింగ్‌, జాగింగ్‌, షటిల్‌).

శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి. 


బిఎంఐ 21 శాతం లోపు ఉండాలి.


ఎలాంటి మానసిక ఒత్తిడికి కలిగినా, నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి.


క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవాలి.


ప్రతి మూడు నెలలకు హెచ్‌బి ఎ,సి, కొలెస్ట్రాల్‌ పరీక్షలు, కిడ్నీ పరీక్షలు, గుండె ఇసిజి పరీక్షలు చేయించాలి. 


అలాగే కంటికి సంబంధించిన పరీక్షలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేయించుకోవాలి. 


పాదాలకు సంబంధించిన పరీక్షలు డిజిటల్‌ బయోథీసోమీటర్‌, వ్యాస్కులర్‌ డాప్లర్‌, పొడియాస్కాన్‌ (అరికాళ్ల స్కాన్‌) పరీక్షలు అవసరం.

డాక్టర్. తాడి రామ గుర్రెడ్డి.. షుగర్ వ్యాధి వైద్య నిపుణులు... అనపర్తి.. తూ,గో,జిల్లా.

courtesy: whats app

================================================

సీనియర్ పేషంట్ గా అనుభవం.

కొత్తగా సుగర్ వచ్చినవాళ్ళు డిప్రెస్ కావద్దు,టెన్షన్ పడద్దు. ఇవి మొదటి శత్రువులు.

అశ్రద్ధ,బద్ధకం ఆ తరవాత శత్రువులు.

సమయపాలన అత్యవసరం అనగా ఒకే సమయానికి తినాలి,ఒకే సమయానికి పడుకోవాలి. ఒకే సమయానికి మందులు వేసుకోవాలి.

నిద్ర లేకుండడం కూడదు. రాత్రి ఒకటి,రెండు దాకా మేలుకుని ఉండకూడదు. ఎనిమిదిగంటల నిద్ర అత్యవసరం.

బిళ్ళేసుకుంటే సరిపోతుందనుకోకూడదు. 

వ్యాయామం అత్యవసరం.

BMI ఇండెక్స్ చూసుకోవాలి. అందులో వయసు,ఎత్తు   మార్చుకోలేం. మార్చుకోగలిగినది ఒక్క బరువే,అదీ వ్యాయామంతోనే.


ఇన్ని తిప్పలెక్కడపడతాం బిళ్ళేసుకుంటామనుకుంటే నమస్కారం. 

మా డాక్టర్ గారికి నమస్కారం మరియు అభినందనలతో.


Tuesday, 19 November 2024

మూర్ఖులమనసు రంజింపరాదు.

 చేరి మూర్ఖులమనసు రంజింపరాదు.


 చలి పెరిగిందన్నారు మిత్రులు ఉదయమే!


చలి పెరిగింది,మూర్ఖుని బలంలా. అంటే చలిపెరిగితే ఉష్ణం  తగ్గిందని ఉష్ణ చలన సూత్రం చెబుతోందిట. అలాగే మూర్ఖుని బలం పెరిగితే అన్యాయానికి బలం పెరుతుంది అనగా న్యాయం బలం తగ్గుతుంది.

 ఇది  అన్యాయం కదా! 

పిచ్చి మాట.  

లోకం లేదుటయ్యా! నవ్వదూ. 

మరో పిచ్చిమాట. 

లోకం నిన్ను చూసి నవ్వడమే కాదు నిన్ను న్యాయాన్ని గుర్తించవు.  

అదేం!

చలికి ఉష్ణం తలవంచలా!  అలాగే మూర్ఖుని బలానికి అనగా అన్యాయానికి న్యాయం తలవంచక తప్పదు.లోకం నిన్నుచూసి నవ్వుతుంది,మూర్ఖునికి మారాడదు.  

హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు చెప్పినట్టు ఎవరూ చెప్పరు.


వైరులెవ్వరు? చిత్తంబు వైరిగాక 

చిత్తమును నీకు వశముగా జేయవయ్య!

మదయుతాసురభావంబు మానవయ్య!

యయ్య! నీ మ్రోల మే లాడరయ్య! జనులు.


 ఇదే లోకరీతి.

Saturday, 16 November 2024

చెట్టు చెడేకాలానికి

 

చెట్టు చెడేకాలానికి


ముందొచ్చిన చెవులకన్న వెనకొచ్చిన కొమ్ములు వాడి.


అసలుకంటే వడ్డీ ముద్దు.


నమ్మించి ద్రోహం చేసినట్టు.


తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్టు.


పెంపుడు కుక్కే పిక్క పట్టుకుంటుంది.


పెదవి దాటితే పృధివి దాటుతుంది.


దవడ ఆడిస్తే తవ్వెడు నీళ్ళకి ఆధారం.


దమ్మిడి ముండకి ఏగాని క్షవరం.

కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కోపం.

చెట్టు చెడేకాలానికి కుక్కమూతి పిందెలే పుడతాయి.

Thursday, 14 November 2024

భవదధీనం కురు విభో

 భవదధీనం కురు విభో


  సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ

నటత్యాశా శాఖా స్వటతి ఝుటితి స్వైరమభితః

కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం

ధృఢం భక్త్యా బద్వా శివ భవదధీనం కురు విభో


శివా! నా మనసనే కోతి మోహం అనే అడవిలో అదుపులేకుండా తిరుగుతోంది. యువతుల పాలిండ్లపై నాట్యం చేస్తోంది. ఆశ అనే వృక్షశాఖలపై తిరుగాడుతోంది. ప్రభో! నీవా కపాలం చేతబట్టి తిరుగాడే బిచ్చగాడివి నా చంచల మనసనే కోతిని నీ భక్తి అనే తాడుతో గట్టిగా కట్టి  నీ అధీనం చేసుకో!


నా అనుకోలు.

ఇది శివానందలహరి లో 20వ శ్లోకం. నేనా సంస్కృతం తెలిసినవాడిని కాదు,  శ్లోకం చదివితే నాకనిపించినది,ఇదీ.


శివునికి తన మనసులో మాట చెప్పుకుంటున్నాడిలా! 

శివా! నా మనసనే కోతి మోహాటవి అంటే కామక్రోధ,మోహ,లోభ,మద,మాత్సర్యాలతో నిండిన అడివిలో యధేఛ్ఛగా అడ్డు ఆపు,అదుపులేక తిరుగుతోంది. ఎలా? యువతుల కుచగిరులపై నర్తిస్తోంది అనగా స్త్రీవాంఛ మిక్కుటంగా ఉన్నది. అనుభవిస్తున్నకొద్దీ పెరుగుతోంది,తరగటం లేదు. ఆ పైగా మోహాటవిలో ఆశ అనే వృక్ష శాఖలపై ఒకదానినుంచి మరొకదానికి యధేఛ్ఛగా దూకుతోంది. అనగా కోరికలు అనంతంగా పుడుతూనే ఉన్నాయి. నెరవేరినా లేకున్నా. నా మనసనే కోతి ఒక కోరికనుంచి మరో కోరికకు తిరుగుతూనే ఉంది. ఈ కామానికి (కోరిక) మోహానికి అంతు కనపడటం లేదు. నీవా కపాలం చేతబట్టి తిరిగి బిచ్చమెత్తుకునే బిచ్చగాడివి. అంతేనా నిన్ను ఇలా వర్ణించింది శ్రీరుద్రం

 "ప్రాలేయాచలమిందుకుందధవళం గోక్షేరఫేనప్రభం

 భస్మాద్యనంగ దేహ దహన జ్వాలావళీ లోచనం"

 అంటే హిమాలయపర్వతం,చంద్రబింబం అంతతెల్లగా  , అప్పుడే పితికిన ఆవుపాలపై నురగంత తెల్లగా ఆపై ఒంటినిండా పూసుకున్న భస్మం, ఇంకా ఆపై మదనుని దహించిన మూడో కన్ను, ఇలా ఉంటావంది ఒకచోట నిన్ను వర్ణిస్తూ. చాలా చోట్ల చెప్పింది,వీటికి తోడు తలపై జటలుకట్టిన గుండ్రంగా తీర్చబడ్డ జుట్టూ, మెడలో, కాళ్ళకి చేతులకి పాములు ఒంటిని రక్తమోడుతున్న గజచర్మం ధరించి, ఒక చేత భిక్షాపాత్రగా కపాలం, మరొకచేత చేత శూలంతో విలక్షణంగా ఉంటావు. నిన్ను చూచి జాలితో బిచ్చం వేస్తుంటారు. అటువంటి ఆహార్యం తో ఉన్న నీకు ఒక కోతి కూడా ఉంటే బిచ్చంపెట్టేవాళ్ళు ఎక్కువౌతారు.  అందుకని నా మనసనే కోతిని నీ భక్తి అనే తాటితో బంధించి తీసుకుపో! ఎంత హృద్యంగా ఉంది వేడుకోలు. అంటే నాకు నేనుగా నీపై భక్తి నెరపలేను నీవే నా మనసును నీ పట్ల భక్తి అనేతాటితో బంధింపబడేలా చేయవయ్యా అనీ వేడుకుంటున్నాడు.

           


Tuesday, 12 November 2024

బుర్రలో గుంజుంటే

బుర్రలో గుంజుంటే

బతకడానికి,  బతికించడానికి,ఉపాధి కల్పించడానికి, పెద్ద చదువే అక్కరలేదు.   శేషప్ప కవిగారు ఎప్పుడో చెప్పేరు 'అధిక విద్యావంతులప్రయోజకులైరి ' అని. సామాన్య చదువు చాలు గాని, కావలసినది  బుర్రలో గుంజు, బతకాలి, పదిమందిని బతికించాలనే తపనుండాలి,స్వార్ధం కాదు.  

బుర్రలో గుంజుంటే బూడిదమ్ముకు బతకొచ్చని చాలాకాలం కితమే చెప్పేను. ప్రపంచంలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్నవారు,అధిక ధనవంతులు అందరూ ఎక్కువ చదువులేనివారే!  పెద్దచదువులు చదివినవారు తమ తల తాకట్టులో పెట్టుకుంటారు. స్వతంత్రంగా ఆలోచనలు పుట్టవు. బానిస బతుకులు వెళ్ళదీస్తుంటారు. 

పెద్ద చదువులేదని బాధపడద్దు. డబ్బు సంపాదించడానికి గాడిదలు కాయచ్చు. బూడిదమ్ముకు  బతకొచ్చు. ఆకులు కూడా అమ్ముకు బతకొచ్చు. పదిమందికి ఉపాధి కల్పించచ్చు. ఆకులా? ఈసడించకండి. అవును ఆకులే. ములగచెట్లు పెంచండి. ములాగకు అమ్ముకు బతకొచ్చు. ములగాకుకి విదేశాల్లో కావలసినంత డిమాండు,  అలాగే కరివేపాకు కూడా. ఇవి రెండూ నిత్య డాలర్ల పంట. 

మీరే  చెయ్యచ్చుగా, చచ్చు కొచ్చను ఒక మేధావినుంచి.   నా జీవితం గడచిపోయింది.నాకిక డబ్బూ అవసరం లేదు. మరొకరికోసం డబ్బు సంపాదించను. సంపాదించే ఓపికాలేదు. సంతృప్తి చెందాను. 

 ఒకప్పుడు నిశాని, అంటే చదువులేనివాడు,వేలిముద్ర తప్ప తన సంతకం చేయలేనివాడు, ఒక నిరుపేద మొక్కలు అమ్ముకుని బతకడం ప్రారంభించాడు,కడియం లో, ఊరూర కావిడిలో మొక్కలు పెట్టుకుని అమ్ముకునేవాడు, ఆ తరవాత లారీలకొద్దీ మొక్కలు ఎగుమతి చేసే స్థితికి ఎదిగాడు, ఆ తరవాత వేగన్లకొద్దీ మొక్కలు ఎగుమతి చేసేవాడు. ఎంతో మందికి ఉపాధి కల్పించాడు.అంతేనా ఇతన్ని చూసి మరికొంతమంది మొక్కలు పెంచడం అమ్మడం మొదలెట్టేరు. ఇప్పుడా వ్యాపారం ఒక 1000 చదరపు కిలో మీటర్ల పైగా విస్తీర్ణానికి చేరుకుంది. వేలకొద్దీ జనాలకి ఉపాధి సంవత్సరం పొడుగునా దొరికింది. తరవాత తరాల్లో పిల్లలు బోటనీ మైన్ గా విద్య అభ్యసించి ఆ వ్యాపారాన్ని మరికొంత పెంచారు, ఇప్పుడక్కడ బోన్సాయి నుంచి,విదేశాల మొక్కలు కూడా పెంచే స్థాయికి,డ్రాగన్ ఫ్రూట్ ఉత్పత్తికి ఉపయోగపడుతున్నారంటే. ఒక చదువురాని నిశాని ఒక మంచి వ్యాపారం అభివృద్ధి చేసి చూపించి కాలం చేసేడు.    ఇప్పుడు కడియం మొక్కలకు ప్రసిద్ధి. కావల్సింది బుర్రలో గుంజు. దానితో కొన్ని తరాలని, వేలమందిని  బతికించే ఒక పరిశ్రమనే స్థాపించి పోయాడు.  అదీ కావలసింది. కట్,పేస్టు, కాపీ,పేస్టు  పి.హెచ్.డి ల మేధావులు సమాజం లో ఒకరిపై మరొకరిని రెచ్చగొట్టి ద్వేషం పెంచడం తప్పించి మరెందుకు పనికిరారు, ఎందుకూ పనికిరారు.

Sunday, 10 November 2024

ఒక్కమెతుకు-అన్నప్రసాదం

 ఒక్కమెతుకు-అన్నప్రసాదం

సముద్రలో స్నానం చేయాలంటే దిగాలి,అలలకు వెరవక, జీవితమూ అంతే. శరీరబాధలు ఇలాగే ఉంటాయి,ఇకతగ్గవు,ఒక్కసారి సూర్యనారాయణుడి దర్శనం చేసుకొద్దామని బయలుదేరా,కుటుంబం,బంధువులతో కలసి,రెండు ఆటోల్లో. కార్తీకమాసం చొరబడ్డ మొదటి ఆదివారం. ఆటో నడుస్తోంది  సాఫీగా, ఏమని చూస్తే రోడ్డు బాగుచేస్తున్నారు అన్నాడు, అబ్బాయి.

  కొంతదూరం పోయే సరికి గోతులు మామూలయ్యాయి. పడుతూ లేస్తూ  బిక్కవోలు చేరాం,ముందుగా గణపతిని దర్శించాం. సమయం చూస్తే ఏడు దాటింది అంతే. వినాయుకుడి ఆలయం చిన్నది. ప్రదక్షిణం, దర్శనం తరవాత అక్కడే కూచున్నా. 


Bikkavolu

ఈలోగా ఒకమ్మాయి, చంకలో బేగ్ వగైరా కొన్ని వస్తువులు అక్కడ పెట్టి, దర్శనానికి వెళ్ళాలని ప్రయత్నంలో, సామాన్లు ఇక్కడ కొంచం చూడండని ఇద్దరు ముగ్గుర్ని అడిగింది, కాదు పొమ్మన్నారు. బిక్కమొహంతో నిలబడింది,ఏం చేయాలని. నాకు జాలేసింది. ఆ సామాన్లు అక్కడ పెట్టమ్మా, నొవ్వొచ్చీదాకా నేను ఇక్కడే వుంటా అని చెబితే ఆనందంగా దర్శనానికి  వెళ్ళింది. కొంచం సేపట్లో ఒకాయన సామాన్లు తీయాలని చూశాడు, ఒకమ్మాయి అక్కడ పెట్టుకెళ్ళింది తీయకు, అన్నా,కర్రతో బెదిరిస్తూ. అతను ఇవి మావేనండి అన్నాడు. మీవో ఎవరివో నాకనవసరం, ఆ అమ్మాయి వచ్చేదాకా నువ్వు చెయ్యి వెయ్యడానికీ వీల్లేదని, అటకాయించా. ఈ లోగా అమ్మాయొచ్చేసింది, నవ్వుతూ, ఈయన మా ఆయనండి అంది. నువ్వు చెప్పలేదు కదమ్మా! నేను చూడలేదు  కదా అన్నా! నవ్వుతో  సామాన్లు పట్టుకువెళ్ళిపోయింది.  ఎంతజూసినా ఏడున్నర  దాటింది.   



Star tortoise
ఎటుగాని టైము సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకుని టిఫిన్ చేదామని ముందుకు కదిలాం. గోలింగేశ్వరుణ్ణి దర్శించాం. కార్తీకమాసం జనం ఉంటారనుకున్నా. మేము తప్పించి ఏవరూ లేరు,వస్తారేమో. ప్రదక్షిణం దర్శనం చేసుకున్నాం తృప్తిగా. అక్కడే పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యుని దర్శించి బయటికొచ్చాం. టిఫిన్ కి వెళదామంటే వెనక్కి వెళ్ళాలంటే ముందుకే కదులుదామని ముందుకు కదిలి మామిడాడ చేరాం.దర్శనం తర్వాత టిఫిన్ చేద్దామని అనుకున్నాం.  స్వామి ప్రదక్షణం చేసాను. జనమే జనం, దర్శనం చేసాను.


ఉషా,ఛాయా,పద్మిని,సౌఙా సమేత సూర్యనారాయణుడు.
కిందటి సారి వెళ్ళినపుడు తీసినది. అప్పుడు ఆగస్ట్ నెల జనం లేరు,తీరుబడిగా దర్శనం చేసినప్పుడు తీసుకున్న ఫోటో.

 ప్రదక్షణ సమయంలో ఒక బోర్డ్  చూసాను. క్షీరాభిషేకం చేయించుకున్నవారికి అన్న ప్రసాదం, అని. అనుమానం తీరక అమ్మకి చూపించా, మనకు కాదు అనేసింది. దర్శనం తరవాత కూచుని, అన్నప్రసాదం  అందరికి కాకపోవచ్చు, నేను వెళ్ళి ఒక్కమెతుకు అన్న ప్రసాదం పెట్టమని అడిగి తీసుకుని వస్తానని  బయలుదేరా. అమ్మ, అబ్బాయి కూడా వచ్చారు.  అందరూ బయలుదేరారు, ఏం జరుగుతుందో చూదామని. అన్నప్రసాద వితరణ చోటికెళ్ళి అక్కడున్న ఒక పెద్దాయనతో నామాట చెప్పుకున్నా! ఆయన నాకేసి చిత్రంగా చూసి వెళ్ళి కూచోండి అన్నారు. మహా ప్రసాదమని చెప్పి అప్పటికే అక్కడ కూచున్నవాళ్ళ  వరసలో కూచున్నా.  నా కూడా వచ్చిన మిగిలినవారు నిలబడ్డారు. ఇది చూసిన ఆ పెద్దాయన అందరూ వరసలో కూచోండి ప్రసాద వితరణ జరుగుతుందంటే ఆనంద పడ్డాం. భోజనం అవుతుండగా ఒకరు ఎలావుందని అడిగారు. ఈ రోజు నా జీవితం లో మరువలేనిది. ఒక్క మెతుకు అన్న ప్రసాదం కోసం వచ్చినవాడిని,స్వామిదయతో పూర్తిగా ఆహారం స్వీకరించా, చాలా బాగుందని చెప్పా. . ప్రసాదం అద్భుతంగా ఉంది, ఒక్క మెతుకు వదలలేదు. ఆకునాకి తిన్నాను, వేసిన, ఎక్కువగానే వున్న  తీపి ప్రసాదంతో సహా! సుగర్ అమాంతం పెరుగుతుందని,  తెలిసి కూడా తీనేసేను. చిత్రం మందులు కూడా తెచ్చుకోలేదు,మరచా!. కానున్నది కాకమానదు, చూదాo స్వామి దయ అనుకున్నా.  అన్నప్రసాదం తీసుకున్నాం. వస్తుంటే చెప్పేరు, ప్రతి ఆదివారం అందరికి అన్నప్రసాదం ఉంటుందని.  కొంతమంది విరాళాలివ్వడమూ చూసి,విరాళమిచ్చాను.ఆ పెద్దాయన నా సంగతి చూసి ప్రసాదం పొట్లం కట్టించి ఇస్తా పట్టుకెళ్ళమన్నారు. వద్దండి అన్నా! అప్పుడు గుర్తొచ్చి, ప్రసాదం ఒకసారి తిరస్కరించినది, నిలబడ్డా. ఈ లోగా వారు రెండు పొట్లాలు కట్టించి,తీపి ప్రసాదం,పులిహోర కూడా ఇచ్చారు. వారికి ధన్యదాలు చెప్పి,స్వామికి మరొకసారి అక్కడనుంచే నమస్కారం చేసుకుని వచ్చాం. నా కూడా ఉన్నవారికి ఇదంతా చిత్రం గానే తోచి ఉండచ్చు. 


ఇంతా చేస్తే సమయం పది, నిజంగా అది టిఫిన్ టైమూ కాదు భోజనం టైమూ కాదు. ఆ తరవాత రామాలయంలో రాముని దర్శించి వెనక్కి బయలుదేరాం. సమయం పదకొండు లోపు.  వచ్చేటపుడు ఆటో సాఫీగా పరుగెట్టింది, ఏమంటే మరో దారిని వెనక్కి వెళుతున్నామని. అన్నీ నేను తిరిగిన దారులే మార్పు వచ్చింది,నాకు మరపూ వచ్చింది. 



ఇంటికి చేరేం. సమయం  పదకొండున్నర. అన్న ప్రసాదం తీసుకుని రెండు గంటలయింది కదా సుగర్ ఎలా ఉందో చూదామని చూస్తే 235 ఉంది. మాత్రలు మరచాం కదా అని అప్పుడే వేసుకున్నా! మరునాటి ఉదయానికి మామూలుగానే ఉంది. రొటీన్ లో పడింది. ఆహారంకాని, వ్యాయామం కాని, మందులుగాని ఏమీ మారలేదు. ఎందుకీ సొద?


 కిందటి సారి సూర్యనారాయణున్ని దర్శించి వస్తుంటే ఒక పెద్దాయన నా దగ్గరకొచ్చి అన్నప్రసాదం తీసుకువెళ్ళండి, అని చెప్పేరు,ప్రత్యేకంగా. నేను మాది అనపర్తే దగ్గరకదా వెళ్ళిపోతామని వచ్చేసాను. దర్శనానికి  వెళ్ళాలనుకున్నపుడు అది గుర్తుకొచ్చి ఒక్కమెతుకైనా, అన్న ప్రసాదం తీసుకు రావాలని అనుకున్నా!   


ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ తరవాత నుంచి చెలికత్తెల ప్రాభవం పెరిగింది. తప్పదని మందులు మింగి భరించా, ఇంతకాలమున్నూ. మందులు మింగినా చెలికత్తెల ప్రాభవం తగ్గలేదు, ఏరోజూ. 


కొస మెరుపు:- వారమయింది. దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని వచ్చి.  అదే హారం,అవే మందులు,అదే వ్యాయామం. ఏదీ మార్పు లేదు. రోజూ దిన చర్యలో మార్పు లేదు,  చెలికత్తెల బాధలు తగ్గుముఖం పట్టాయి,చెప్పుకోతగినంతగా! రెండేళ్ళు పైగా రాని మార్పు ఇప్పుడే ఎందుకొచ్చింది? మరి  చెలికత్తెల ప్రాభవం ఒక్క వారంలో ఎందుకు తగ్గింది? అర్ధం కాని, సమాధానం లేని ప్రశ్న.   

Friday, 1 November 2024

చెలికత్తె చెలగాటం

చెలికత్తె చెలగాటం

బయటకు కదలటం లేదు,నడకకు కూడా. ఊరుదాటి ప్రయాణం రెండున్నర సంవత్సరాలకితం,అత్తారింటికే. ఇప్పుడత్తారింటి కెందుకూ? బావమరిది రెండున్నరేళ్ళకితం పక్షవాతానికి గురయ్యాడు.అప్పటినుంచి ఆరోగ్యం మెరుగు పడలేదు. ఇప్పటికిన్నీ అలాగే ఉన్నాడు. చూసి చాలారోజులైందని,బయలుదేరాను మొన్న ఆదివారం,ఆటో మీద. దేనిమీదైనా ప్రయాణం ఒకటే అనుకోండీ! రోడ్డలా ఉంది మరి.  బావమరిది, వాడే మేనమామ కొడుకు కూడా, చూసి తిరిగొచ్చా.

 మొత్తం చేసిన ప్రయాణం  38 కిలో మీటర్లు. ఇంటికి  తిరిగొచ్చేటపుడు చిరకాల చెలికత్తె వెంటబడింది. తప్పదుగా ఆహ్వానించా!!వచ్చినావిడ అంత తొందరగా కదలదని తెలుసు,కాని ఆహ్వానించక తప్పదు మరి. ఇంకక్కడినుంచి ఒకటే గుసగుసలు. వదలిపెడితేనా? ఇంట్లో వాళ్ళ తిట్లు,ఎందుకావిణ్ణి అంత చంకెక్కించుకుంటారు,అని. ఆవిణ్ణి సాగనంపాలంటే చిన్నపనేం కాదు.  అందునా పాతకాలపు చెలికత్తె.  ఒకటే గుసగుసలు ఏమీ తోచనివ్వదు, కూచోనివ్వదు,నుంచోనివ్వదు, మూడు రోజులు తెగ ఇబ్బంది పెట్టేసింది,గుసగుసలతో!  

 అంగుళం పొడుగు మాత్రలు మింగమన్నారు,ఇంట్లో వాళ్ళు. అమ్మా! ఈవిడ అంగుళం పొడుగు మాత్రలకి వదలదు,వెళ్ళదు. వెళుతున్నట్టు నటిస్తుంది,అంతే సుమా అని చెప్పి, నా మంత్రం ఉపయోగించడం మొదలెట్టాను. అదే యోగా చేయడం.  మాత్రలు మింగితే చెలికత్తెలొస్తారు బయటికి, వారే ఆకలి మందగింపు,విరేచనం బంధించడం, ఆ తరవాత మరెవరొస్తారో చెప్పడం కష్టం. మరెలా అనుభవించక తప్పదు,కొంతకాలం. సాగనంపడానికి కావల్సిన సరంజామా. యోగా చేయడం, ఎక్కువ సేపు కూచోకపోవడం. ఇలా. అదేనండీ వెన్నునొప్పి, వెన్నుపోటు కాదండోయ్. వెన్నుపోటంటే మరో అర్ధమండీ! తెనుగు మాస్టార్ లకు బాగా తెలుస్తుందండి, ఈ తేడా!!

సాధారణ వెన్నునొప్పికి కారణాలు.

1.ఆహార విహారాల్లో సమయం పాటించకపోవడం. నిద్రాసమయాలు పాటించకపోవడం (సిరికార్డియన్ రిథం చెడిపోవడం)

2.సెల్ ఫోన్ కి అతుక్కుపోవడం.

3.అజీర్తి. వీరు పొదుపుగా నీరు తాగుతారు. నీరే అజీర్తికి మంచిమందు.

4.మలబద్ధం అజీర్తికి చెలికత్తె. అబ్బో! దీని గురించి చెప్పాలంటే గ్రంధాలే ఉన్నాయి.

5.వృత్తి పరమైనవి. నడక మంచి మందు. కూచుని చేసే ఉద్యోగాలవారు గంటకో రెండు గంటలకో ఒకసారి ఒక పది నిమిషాలు నడవాలి. ఇది చెయ్యరు. నడక అంటే ఒక్కసారే నడిచెయ్యాలి, అంత టైం లేదంటారు. ఒక్కసారి నడవ కూడదు. ప్రతి బోజనం తరవాత నడవాలి. టిఫిన్ తరవాత నడవాలి. టీచర్లు క్లాసులో నడవచ్చు,పిల్లలికి చెబుతూ. అలాగే ఇతరులు కూడా, వీలు బట్టి నడవాలి.

6. ఈ విషయం లో స్త్రీలు ప్రత్యేకమే. ఋతు కాలంలో వేధిస్తుంది వెన్ను నొప్పి రూపంలో. ఇది మొదలు గర్భ ధారణ,ప్రసూతి సమయాలు చెప్పక్కరలేదు. అజీర్తి,మలబద్ధం వీటికి జోడింపు. ఇందులో టీచర్లైతే, పొట్టివాళ్ళైతే బోర్డ్ మీద రాయడానికి సాగి, మెడలు వెనక్కి వంచి రాస్తారు. భుజాలనొప్పి,వెన్నునొప్పికి కారణాలు. ఇంతేకాదు,పేపర్లు అదేపనిగా దిద్దడం నేడు అవసరమైపోయింది,ఇది అదనపు కారణం.   

7.స్త్రీల వస్త్రధారణ కూడా కారణమంటే ఆశ్చర్యం కాదు. లో దుస్తులు బ్రా,పేంటీలు వెన్నును ఇరవైనాలుగు గంటలూ నొక్కుతూనే ఉంటాయి. ఇవి వెన్నునొప్పేకాదు కేన్సర్ కి కూడా కారణమని వైద్యులంటారు. అంతే కాదు తొడుక్కునే జాకెట్లు లో పేడ్ లూ చంకలలో పేడ్ లు మూలంగాను కూడా వెన్నునొప్పికి కారణమని చెబుతున్నారు వైద్యులు. కొందరు జాకెట్లలోనే పేడ్ లూ వేయించుకుని కుట్టించుకుంటున్నారు. ఇవి ఎంత బిగువంటే విప్పుకోడమే కష్టం. డాక్టర్లు కూడా ఇవి చెప్పటంలేదు. ఎవరేనా చెప్పబోతే మేము ఏమి దుస్తులు ధరించాలో కూడా మీరే చెప్పాలా అని దెబ్బలాటకొచ్చే ఫెమినిస్టులున్నకాలం.అంచేత ఎవరూ చెప్పరు,చెప్పలేరు.

8.చెప్పుకుంటూ పోతే కారణాలనేకం.

ఇవన్నీ అందరికీ తెలుసుగాని నివారణ చెప్పండి,అంటారా!

ఉధృతంగా ఉన్నపుడు డాక్టర్ ని సంప్రదించక తప్పదు. మందులే పరమావధి కాదు. జాగ్రత్తలు చాలా అవసరం.

1.నేల మీదగాని,బల్లమీద గాని పడుకోండి. బొంతగాని,రగ్గుగాని వేసుకోండి. తలకింద ఎత్తు పెట్టద్దు,తలగడ నిషేధం. బుర్రొంచుకునే పనులు తగ్గించుకోండి. పేపర్లు దిద్దదం లాటివి. నీరసం అలసట కూడా వెన్నునొప్పికి కారణాలంటే నమ్మలేరు. అది చూసుకోండి.

2.యోగా చెయ్యండి. చాలా ఆసనాలున్నాయిగాని వెన్నునొప్పికి సూచనలు.

2.1 ప్రాణాయామం చెయ్యండి. అదిన్నీ అనులోమ విలోమ ప్రాణాయామం, మిగిలినవి గురువు దగ్గర నేర్చుకోవలసినవే. ప్రమాదం లేనిది,ఇది. కుడిచేతి బొటనవేలు,మధ్యవేలు తో రెండు ముక్కులూ మూయండి,సుఖాసనంలో కూచుని. ఎడమ ముక్కు మూసినది  తెరవండి ఊపిరి తియ్యండి,ముక్కు మూయండి మధ్యవేలుతో, ఊపిరిబట్టండి, ఊపిరి నెమ్మదిగా కుడి ,ముక్కునుంచి వదలండి నెమ్మదిగా ! ఇలాగే కుడి ముక్కుతో గాలిపీల్చి కొనసాగండి. ఎంత సేపు? పీలచాలి వగైరా కదా! పది అంకెలు లెక్కేదాకా పీలచండి,అంతే సేపు బిగబట్టడం ,ఊపిరివదలడం. 


2.2  సుఖాసనంలో కూచోండి. కాళ్ళు ముందుకుచాచండి, వెన్ను నిలువుగా ఉండాలి..భుజాలు బిగబట్టకండి. ఇలా కూచోలేనివాళ్ళు చాలా మందే ఉన్నారు. ఆ తరవాత కాళ్ళు కొద్దిగా ముడవండి, శరీరం ముందుకు కాళ్ళమీదకి వంచండి.రెండు చేతులతో రెండు పాదాలూ పట్టుకోండి. శరీరం పైకి లేపకుండా కాళ్ళు ముందుకు చాపండి, ఇదే పశ్చిమోత్తాసనం. ఊపిరి బగబట్టకండి.


2.3 సుఖాసనంలో కూచోండి. రెండు కాళ్ళు ముందుకు చాచండి. ఒకకాలు ముడవండి పక్కగా, అరికాలు చాచినకాలుని తాకుతూ. శరీరం ముందుకు వంచండి, ఊపిరి వదలండి.. పై ఆసనంలోనూ  ఇందులోనూ మోకలిని ముద్దు పెట్టుకోగలగాలి,కాలు వంచకుండా. ఇలాగే రెండో వైపూ చేయండి. మొదటిరోజే కాళ్ళు వంగవు,కంగారొద్దు.నెమ్మదిగా వస్తుంది. రోజూ చేయాలి.


2.4 సుఖాసనంలో కూచోండి కాళ్ళు చాచండి. అరికాళ్ళు రెండూ ఎదురెదురుగా తాకేలా కాళ్ళు ముడవండి. పాదాలు రెండు చేతులతో పట్టుకోండి. ముడిచినకాళ్ళని పైకి కిందికి ఆడించండి. ఇది శలభాసనం. ఇలా ఉండగా వెన్నువంచి నుదుటితో అరికాళ్ళను తాకే ప్రయత్నం చేయండి. శరీరం వంచడం బహు కష్టం. రోజూ చేస్తే పూర్తిగా కాళ్ళకి నుదురు ఆనచగలరు. 


2.5వెన్నుపై పడుకోండి.కనులు మూసుకోండి. ఊపిరి నెమ్మదిగా తీయండి,నెమ్మదిగా వదలండి.చేతులు పక్కగా పెట్టండి. ఇదే యోగనిద్ర. ఊపిరులు ఎంత తగ్గితే ఆయువు అంత పెరుగుతుంది. మనిషి నిమిషానికి ఏడు ఊపిరులు తీస్తాడు, నిమిషానికి మూడు ఊపిరులు తీసే తాబేలు మూడువందల సంవత్సరాలు బతుకుతుంది. ఇదే శవాసనం. 

2.6వెన్నుపై పడుకోండి ఒక కాలు పైకెత్తండి. కాలు తిన్నగా లంబంగా రాదు. ఒక తువ్వాలు తీసుకోండి. తువ్వాలు అరికాలు మీంచి వేసి రెడు చేతులతో పట్టుకుని కాలు ముందుకు లాగండి. మోకాలు వంచద్దు. ఇలాగే రెండు కాళ్ళు చేయండి.


2.7వెన్నుపై పడుకోండి.కాలుపైకాలు అడ్డంగా వేసి చాచినకాలు ముడవండి నెమ్మదిగా, రెండు చేతులతో చాచిన కాలును దగ్గరకు లాక్కోండి. తల లేస్తుంది,ఎంత లేపగలిగితే అంత మంచిది. ఇలాగే రెండో కాలూ చేయండి. 


2.8 కాళ్ళు ముడుచుకు గోడ దగ్గరగా కూచోండి. నెమ్మదిగా వెన్ను వాల్చి గోడకి సమాంతరంగా దగ్గరగా పడుకోండి. కాళ్ళు చాపండి. చాపినకాళ్ళు నెమ్మదిగా గోడపైకి చేరుస్తూ శరీరం గోడకి లంబంగా చేయండి. ముడ్డి గోడకి చేరుతుంది. కాళ్ళు గోడపైనా చాచండీ,మోకాళ్ళు వంచకండి ఇది విపరీత కరణి  అనే ఆసనం. ఇదొక ముద్ర కూడా. ఇలా ఎంతసేపైనా ఉండచ్చు. . వెన్నుకు చాలా హాయిగా ఉంటుంది.  ఊపిరి  నెమ్మదిగా తీసుకు వదులుతుండండి.

2.9 వెన్నుపై పడుకోండి,కాళ్ళు చాచండి. చాచిన కాళ్ళు దగ్గరికి ముడుచుకోండి. మడిచిన రెండు కాళ్ళనూ రెండు చేతులతో బంధించండి,తలపైకెత్తండి,వీలున్నంత. వెన్ను కొద్దిగా విల్లులా వంగుతుంది. నెమ్మదిగా వెన్నుమీద ఊగండి,ఉయ్యాలా ఊపినట్టు. వెన్నుకు మర్దనా చేసినంత శమనగా ఉంటుంది,వెన్ను నొప్పికి  మంచిది. మరోమాట పాతకాలం స్త్రీలు పిల్లలను ఆ ముడిచిన కాళ్ళపై పడుకోబెట్టుకుని ఉయ్యాలా ఊగినట్టు ఊగేవారు. దాదం దక్కచ్చి అయ్యవారక్కొచ్చి అని చిన్నగా పాడుతూ. ఇది వెన్నునొప్పికి మంచిమందంటే నమ్మలేరు.


పడుకుని కూచుని వేసే ఆసనాలన్నీ 30 సెకండ్లు వేయాలి,అనగా ముఫై అంకెలు లెక్కపెడితేచాలు. కాళ్ళతో చెప్పినం ఆసనాలు ఒకవైపొకసారి మరోవైపొకసారిగా మూడు సార్లు చేయాలి.


ఇలా చాలా ఆసనాలున్నాయి, కొన్ని చేస్తే చాలు నెమ్మదిగా వెన్నునొప్పి పారిపోతుంది. మందుల బెడదుండదు. నేను ఈ మధ్య కొంత అశ్రద్ధ చేసాను, మళ్ళీ మూడు రోజులనుంచి చేస్తుండగా చెలికత్తె నెమ్మది నెమ్మదిగా లాడీ,బేడి సద్దుకుంటోంది,పారిపోడానికి.


నిజంగా కష్టమే పడ్డాను,ఓ మనవరాలు అడగటంతో ఇదంతా రాయాల్సివచ్చింది, 4 రోజులు కూచుని చెలికత్తెతో పోరాడుతూ రాసాను. చెలికత్తె పారిపోడానికి సిద్ధంగానే ఉంది.

ఇన్ని అవస్థలు ఎవరు పడతారు, అంగుళం మాత్రలు మింగితే సరిపాయె అనుకుంటే తమ చిత్తం.

Saturday, 19 October 2024

1840 నాటి లాకర్

 1840 నాటి లాకర్


నాటికి,నేటికి టెక్నాలజీ పెరిగిందా? 

Friday, 18 October 2024

😊ఊహల ఊయలలో 😊

😊 ఊహల ఊయలలో 😊



ఆడామగా తేడాలేదు,పిన్నా,పెద్దా భేదంలేదు,ముసలి ముతక మాటేకాదు. అంతా ఊహా ప్రపంచంలో తేలియాడుతున్నట్టుంది. నిజ ప్రపంచాన్నెదురుకోలేక జనాలు ఊహా ప్రపంచంలో తేలియాడుతున్నారా?  ఇల్లు,ఒళ్ళు తెలియటం లేదు. ఆనందం ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నారు,పక్కవారిని పట్టించుకునేదే లేదు, అసలు తమ ఒంటి మీద తమకే స్పృహ ఉంటున్నట్టు లేదు. పల్లె,పట్నం తేడా లేదు, పేద,సాదా మాటే కాదు. సెల్ ఫోన్ లో ములిగి పోయారు. అంతా ఇలా ఐపోయారు,  సమాజానికేమయింది?

Thursday, 17 October 2024

పూర్ణశుంఠలు

 

పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి.



శ్రీ క్రోధినామవంత్సర ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ

అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !! (52)

ఓ నారసింహా ! ఈ లోకమదేమిటో కాని అతి విచిత్రంగా మారుతోంది. బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. ఏమాత్రం చదువు రాని శుంఠలు సభాపూజ్యులై సన్మానాలు పొందుతున్నారు. నిజం చెప్పేవారి మాట లోకవిరోధమౌతోంది. అబద్దాలాడేవారికి సమాజం లో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ధర్మబుద్ధిగలవారు దారిద్య్రాన్ని అనుభవిస్తుంటే పిసినారులు ధనవంతులై కులుకు తున్నారు.పుణ్యాత్ములు రోగగ్రస్థులై పీడించబడుతుంటే పాపాత్ములు పల్లకీలలో ఊరేగుతున్నారు. ఓ గరుడవాహనా ! మావంటి యాచకులకు ఎటువంటి పోషణలేదు నీవే మాకు దిక్కు.

Courtesy: Owner


నృసింహ శతకంలో పద్యం చదువుకుంటున్నాం కదూ! మొన్న మొదటి పాదం చదివేంగా. ఇప్పుడు రెండో పాదం, అవధరించండి. 




మొదటిపాదంలో అధిక విద్యావంతులు అప్రయోజకులౌతున్నారన్నారు. అప్రయోజకులంటే పనికిరానివారని అర్ధం. ఈ శుంఠ శబ్దానికి అదే అర్ధం చెబుతోంది ఆంధ్రభారతి. తేడా ఏంటీ? 


పండిత పుత్ర పరమ శుంఠ అన్నది పెద్దలమాట.ఈ మాటలోని పరమ శుంఠ పదాన్ని కవిగారు పూర్ణ  శుంఠ అన్నారనుకుంటా! పైవాళ్ళు అర్ధ శుంఠలైతే వీరు పూర్ణశుంఠలట. పూర్ణశుంఠ అనడం లో అవసరమూ ఉన్నది సుమా! పై పాదంలో పనికిరానివారు అన్నవారు పూర్ణశుంఠలు కారు. కొంత సానబడితే వారు పనికిరావచ్చు గాని ఈ పూర్ణశుంఠలు మాత్రం పుటమేసినా పనికిరారని చెప్పడానికే పూర్ణశుంఠ అన్నారనుకుంటా. 


పండిత పుత్రులు పరమశుంఠలు ఎలా అవుతారు? అలా పరమ శుంఠలైనవారు సభాపూజ్యులెలా అవుతారు అన్నదే అనుమానం.పండితునికి తన పాండిత్యం ద్వారా కలిగే వ్యవహారాలమీద తప్పించి సంతానం ఎలా ఉన్నదో పట్టించుకునే తీరిక ఉండదు. మరి వీరిని చూసేవారెటువంటివారుంటారు? వీరు సమయం గడుపుకోవాలనే స్వార్ధపరులై ఉంటారు.ఇతరులను పొగడ్తలలో ముంచి పబ్బం గడుపుకునేవారవుతారు. వీరు ఆ పండితుని పొగిడి అవసరం గడుపుకునేవారు కావడంతో పిల్లలికి చెడ్డ బుద్ధులే అబ్బుతాయి, వీరి చదివు సంధ్యలు వెనకబడతాయి. వీరిని సరి దిద్దేవారుండరు, ఎత్తుచేతివారి బిడ్డలు కదా!.పిల్లలను కూడా పండితుని కంటే గొప్పవారని పొడ్తలలో ముంచి పబ్బం గడుపుకుంటూ, పండితుని పిల్లలను పరమ శుంఠలుగా తయారు చేస్తారు.    పూర్ణశుంఠలు నిండుచంద్రుడిలా కనపడతారు.   పూర్ణశుంఠలు నిండుచంద్రుడిలా కనపడతారు. పొట్టకోస్తే అక్షరం ముక్కరాదు,తెలివీ  లోకజ్ఞానమూ అంతే! ఆ తరవాత వారు కూడా ఈ పండితుని గౌరవంలో కాలం గడిపేస్తారు. పిచ్చి ప్రజలు పండితుని ప్రజ్ఞ పాటవాలు వీరిలో కూడా ఉన్నాయనుకుంటారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడమైపోతుంది. కాలం గడుస్తుంది, చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు పుడతాయి. అప్పటి దాకా ఈ పరమ శుంఠలు సభాపూజితం పొందుతూనే ఉంటారు. 
(4.8.2019) స్వల్ప మార్పులతో పునః ప్రచురణ.

Wednesday, 16 October 2024

కొత్తకారు,కొత్తపెళ్ళాం 😁

 కొత్తకారు,కొత్తపెళ్ళాం😁


"కొత్తకారు,కొత్తపెళ్ళాం కొత్తలో ఇబ్బంది పెడతాయి తమ్ముడూ! నెట్టు,నెట్టూ" అన్నాడు మా ఎన్టీవోడు, గుండమ్మకతలోనేమో!!.


కొత్తకారా! బలేటోరే!! జీవితంలో కారెక్కిందే ఏ రెండు మూడు సార్లో,"సేవలందుటెకాని సేవించుటెరుగని" జీవితం కాదు, "సేవించుటేగాని సేవలందుటెరుగని" జీవితం, ఇలా కానిద్దురూ! ఆముచ్చటెందుకులేండి,ఇప్పుడు. 


కొత్తపెళ్ళాం ముచ్చటా! అప్పడాలూ లేదు, వడియాలూ లేదు. అప్పడాలు ఏభైయారేళ్ళు నేనుగనక నీతో కాపరంజేసేను, మరొకతైతే మూడో నిద్దరరోజే,  నెత్తిన చేటగొట్టి

  వదిలేసి పోయేదనుకుందో  ఏమోగాని,ఆరేళ్ళకితం దేవుడిదగ్గరకెళ్ళిపోయింది.  వడియాలా బలే! బలే!! ఒకప్పుడు సైన్యంలో పనిచేసేవారికి పిల్లనిచ్చేవారు కాదు. ఆతరవాతది పూజారులకూ, పురోహితలకూ పాకింది, నేడు టెకీలకీ పిల్లనిచ్చేవాడు కనపట్టం లేదు, నాకెక్కడబాబూ! ఐనా వడియాలుతో వేగే ఓపికలేదండోయ్! ఎవరూ కష్టపడి సంబంధం చూడద్దు సుమా!!!!


మరి ఈ ముచ్చట, ఇప్పుడెందుకనికదా కొచ్చను?

ఇరవైఏళ్ళకితం తప్పిపోతానని ఒక పంపురాయి జేబులో పడేసేరు, అలామొదలయింది,నాఫోన్ జీవితం. దాంతో ఒక ఐదేళ్ళు నడిపేను. ఓ రోజు పుట్టినరోజని మరో కొత్తఫోన్ చేతిలోపెట్టేరు, పదేళ్ళకితం, చిన్నబ్బాయి,కోడలు, దాంతో గడుస్తోంది కాలం. మొన్న విజయదశమి రోజు మరో కొత్తఫోన్ తెచ్చి పుట్టినరోజు బహుమతని, చిన్నకోడలూ,అబ్బాయి ఫోన్ చేతిలో పెట్టి పాతది తీసేసేరు,  ఇది స్లో ఐపోయింది, కొత్తదిబాగుంటుందని.   ఎప్పుడో మరచిపోయిన రెండో పుట్టినరోజును గుర్తుచేస్తూ!


  మూడునిద్దరలయినా కొత్తగానే ఉంది,కొత్తఫోన్ తో. సంసారంలో ఏదెక్కడందో కొత్తే,ప్రతిసారి వెతుక్కోడమే!  ప్రతిసారి పిల్లలని అడిగితే చిరాకు పడతారేమోనని భయం. ఏది నొక్కితే ఏమవుతుందోననీ భయమే! అంతేకాదు, ఇబ్బందుంటే పిల్లలకి చెబితే ఏమంటారో? మరో భయం. చెప్పింది గుర్తుండి చావటం లేదు, ఎలా? నాటిరోజులకి సెల్ ఫోన్ వాడుకలోకి రాలేదు గనక మా ఎన్టీవోడు దాన్ని చెప్పుండడు, లేకపోతే దీన్నీ చెప్పీవోడేనేమో. కొత్తఫోన్ కు అలవాటు పడ్డానికి సమయం పట్టుద్దా!లొంగుబాటుకొస్తదా? కొచ్చను? 


సెల్ తోనే వేగలేకుంటే డెస్క్ టాప్ మార్చేసేరు, విండోస్ ఎప్పటిదో ఉంది అంటూ, ఎలాబాబూ అలవాటు పడ్డం. ఇదీ కొచ్చనే? అంతా కొత్తబాబూ, కొత్త,కొత్త,కొత్త.........