ఒక్కమెతుకు-అన్నప్రసాదం
సముద్రలో స్నానం చేయాలంటే దిగాలి,అలలకు వెరవక, జీవితమూ అంతే. శరీరబాధలు ఇలాగే ఉంటాయి,ఇకతగ్గవు,ఒక్కసారి సూర్యనారాయణుడి దర్శనం చేసుకొద్దామని బయలుదేరా,కుటుంబం,బంధువులతో కలసి,రెండు ఆటోల్లో. కార్తీకమాసం చొరబడ్డ మొదటి ఆదివారం. ఆటో నడుస్తోంది సాఫీగా, ఏమని చూస్తే రోడ్డు బాగుచేస్తున్నారు అన్నాడు, అబ్బాయి.
కొంతదూరం పోయే సరికి గోతులు మామూలయ్యాయి. పడుతూ లేస్తూ బిక్కవోలు చేరాం,ముందుగా గణపతిని దర్శించాం. సమయం చూస్తే ఏడు దాటింది అంతే. వినాయుకుడి ఆలయం చిన్నది. ప్రదక్షిణం, దర్శనం తరవాత అక్కడే కూచున్నా.
|
Bikkavolu |
ఈలోగా ఒకమ్మాయి, చంకలో బేగ్ వగైరా కొన్ని వస్తువులు అక్కడ పెట్టి, దర్శనానికి వెళ్ళాలని ప్రయత్నంలో, సామాన్లు ఇక్కడ కొంచం చూడండని ఇద్దరు ముగ్గుర్ని అడిగింది, కాదు పొమ్మన్నారు. బిక్కమొహంతో నిలబడింది,ఏం చేయాలని. నాకు జాలేసింది. ఆ సామాన్లు అక్కడ పెట్టమ్మా, నొవ్వొచ్చీదాకా నేను ఇక్కడే వుంటా అని చెబితే ఆనందంగా దర్శనానికి వెళ్ళింది. కొంచం సేపట్లో ఒకాయన సామాన్లు తీయాలని చూశాడు, ఒకమ్మాయి అక్కడ పెట్టుకెళ్ళింది తీయకు, అన్నా,కర్రతో బెదిరిస్తూ. అతను ఇవి మావేనండి అన్నాడు. మీవో ఎవరివో నాకనవసరం, ఆ అమ్మాయి వచ్చేదాకా నువ్వు చెయ్యి వెయ్యడానికీ వీల్లేదని, అటకాయించా. ఈ లోగా అమ్మాయొచ్చేసింది, నవ్వుతూ, ఈయన మా ఆయనండి అంది. నువ్వు చెప్పలేదు కదమ్మా! నేను చూడలేదు కదా అన్నా! నవ్వుతో సామాన్లు పట్టుకువెళ్ళిపోయింది. ఎంతజూసినా ఏడున్నర దాటింది.
Star tortoise
ఎటుగాని టైము సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకుని టిఫిన్ చేదామని ముందుకు కదిలాం. గోలింగేశ్వరుణ్ణి దర్శించాం. కార్తీకమాసం జనం ఉంటారనుకున్నా. మేము తప్పించి ఏవరూ లేరు,వస్తారేమో. ప్రదక్షిణం దర్శనం చేసుకున్నాం తృప్తిగా. అక్కడే పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యుని దర్శించి బయటికొచ్చాం. టిఫిన్ కి వెళదామంటే వెనక్కి వెళ్ళాలంటే ముందుకే కదులుదామని ముందుకు కదిలి మామిడాడ చేరాం.దర్శనం తర్వాత టిఫిన్ చేద్దామని అనుకున్నాం. స్వామి ప్రదక్షణం చేసాను. జనమే జనం, దర్శనం చేసాను.
ఉషా,ఛాయా,పద్మిని,సౌఙా సమేత సూర్యనారాయణుడు.
కిందటి సారి వెళ్ళినపుడు తీసినది. అప్పుడు ఆగస్ట్ నెల జనం లేరు,తీరుబడిగా దర్శనం చేసినప్పుడు తీసుకున్న ఫోటో.
ప్రదక్షణ సమయంలో ఒక బోర్డ్ చూసాను. క్షీరాభిషేకం చేయించుకున్నవారికి అన్న ప్రసాదం, అని. అనుమానం తీరక అమ్మకి చూపించా, మనకు కాదు అనేసింది. దర్శనం తరవాత కూచుని, అన్నప్రసాదం అందరికి కాకపోవచ్చు, నేను వెళ్ళి ఒక్కమెతుకు అన్న ప్రసాదం పెట్టమని అడిగి తీసుకుని వస్తానని బయలుదేరా. అమ్మ, అబ్బాయి కూడా వచ్చారు. అందరూ బయలుదేరారు, ఏం జరుగుతుందో చూదామని. అన్నప్రసాద వితరణ చోటికెళ్ళి అక్కడున్న ఒక పెద్దాయనతో నామాట చెప్పుకున్నా! ఆయన నాకేసి చిత్రంగా చూసి వెళ్ళి కూచోండి అన్నారు. మహా ప్రసాదమని చెప్పి అప్పటికే అక్కడ కూచున్నవాళ్ళ వరసలో కూచున్నా. నా కూడా వచ్చిన మిగిలినవారు నిలబడ్డారు. ఇది చూసిన ఆ పెద్దాయన అందరూ వరసలో కూచోండి ప్రసాద వితరణ జరుగుతుందంటే ఆనంద పడ్డాం. భోజనం అవుతుండగా ఒకరు ఎలావుందని అడిగారు. ఈ రోజు నా జీవితం లో మరువలేనిది. ఒక్క మెతుకు అన్న ప్రసాదం కోసం వచ్చినవాడిని,స్వామిదయతో పూర్తిగా ఆహారం స్వీకరించా, చాలా బాగుందని చెప్పా. . ప్రసాదం అద్భుతంగా ఉంది, ఒక్క మెతుకు వదలలేదు. ఆకునాకి తిన్నాను, వేసిన, ఎక్కువగానే వున్న తీపి ప్రసాదంతో సహా! సుగర్ అమాంతం పెరుగుతుందని, తెలిసి కూడా తీనేసేను. చిత్రం మందులు కూడా తెచ్చుకోలేదు,మరచా!. కానున్నది కాకమానదు, చూదాo స్వామి దయ అనుకున్నా. అన్నప్రసాదం తీసుకున్నాం. వస్తుంటే చెప్పేరు, ప్రతి ఆదివారం అందరికి అన్నప్రసాదం ఉంటుందని. కొంతమంది విరాళాలివ్వడమూ చూసి,విరాళమిచ్చాను.ఆ పెద్దాయన నా సంగతి చూసి ప్రసాదం పొట్లం కట్టించి ఇస్తా పట్టుకెళ్ళమన్నారు. వద్దండి అన్నా! అప్పుడు గుర్తొచ్చి, ప్రసాదం ఒకసారి తిరస్కరించినది, నిలబడ్డా. ఈ లోగా వారు రెండు పొట్లాలు కట్టించి,తీపి ప్రసాదం,పులిహోర కూడా ఇచ్చారు. వారికి ధన్యదాలు చెప్పి,స్వామికి మరొకసారి అక్కడనుంచే నమస్కారం చేసుకుని వచ్చాం. నా కూడా ఉన్నవారికి ఇదంతా చిత్రం గానే తోచి ఉండచ్చు.
ఇంతా చేస్తే సమయం పది, నిజంగా అది టిఫిన్ టైమూ కాదు భోజనం టైమూ కాదు. ఆ తరవాత రామాలయంలో రాముని దర్శించి వెనక్కి బయలుదేరాం. సమయం పదకొండు లోపు. వచ్చేటపుడు ఆటో సాఫీగా పరుగెట్టింది, ఏమంటే మరో దారిని వెనక్కి వెళుతున్నామని. అన్నీ నేను తిరిగిన దారులే మార్పు వచ్చింది,నాకు మరపూ వచ్చింది.
ఇంటికి చేరేం. సమయం పదకొండున్నర. అన్న ప్రసాదం తీసుకుని రెండు గంటలయింది కదా సుగర్ ఎలా ఉందో చూదామని చూస్తే 235 ఉంది. మాత్రలు మరచాం కదా అని అప్పుడే వేసుకున్నా! మరునాటి ఉదయానికి మామూలుగానే ఉంది. రొటీన్ లో పడింది. ఆహారంకాని, వ్యాయామం కాని, మందులుగాని ఏమీ మారలేదు. ఎందుకీ సొద?
కిందటి సారి సూర్యనారాయణున్ని దర్శించి వస్తుంటే ఒక పెద్దాయన నా దగ్గరకొచ్చి అన్నప్రసాదం తీసుకువెళ్ళండి, అని చెప్పేరు,ప్రత్యేకంగా. నేను మాది అనపర్తే దగ్గరకదా వెళ్ళిపోతామని వచ్చేసాను. దర్శనానికి వెళ్ళాలనుకున్నపుడు అది గుర్తుకొచ్చి ఒక్కమెతుకైనా, అన్న ప్రసాదం తీసుకు రావాలని అనుకున్నా!
ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ తరవాత నుంచి చెలికత్తెల ప్రాభవం పెరిగింది. తప్పదని మందులు మింగి భరించా, ఇంతకాలమున్నూ. మందులు మింగినా చెలికత్తెల ప్రాభవం తగ్గలేదు, ఏరోజూ.
కొస మెరుపు:- వారమయింది. దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని వచ్చి. అదే ఆహారం,అవే మందులు,అదే వ్యాయామం. ఏదీ మార్పు లేదు. రోజూ దిన చర్యలో మార్పు లేదు, చెలికత్తెల బాధలు తగ్గుముఖం పట్టాయి,చెప్పుకోతగినంతగా! రెండేళ్ళు పైగా రాని మార్పు ఇప్పుడే ఎందుకొచ్చింది? మరి చెలికత్తెల ప్రాభవం ఒక్క వారంలో ఎందుకు తగ్గింది? అర్ధం కాని, సమాధానం లేని ప్రశ్న.
ప్రసాదం మహిమకి చెలి కత్తులు పారి పోయి వుంటారు :)
ReplyDeleteమహిమ తగ్గగానే మళ్లీ వస్తారు గాబరాపడకండేం.
Zilebi10 November 2024 at 16:50
Deleteస్వానుభవంలా ఉందే! ఏదీ తిన్నగా చెప్పవు కాదు కాదు! తిన్నగా చెప్పలేవు అది నీ డి.ఎన్.ఎ లోపం. :)
చెలికత్తెలు కత్తులతో వచ్చినా మరెలా వచ్చినా సిద్ధమేగా "ఉట్టికి నాలుగుచేర్లూ తెంచుకు కూచున్నవాణ్ణి" కదా! భయమెందుకు? వస్తావా! తోడొస్తావా? కలసిపోదాం. :)
అబ్బే! ఎవరి రాచమార్గము వారిదే!
Deleteతోడొచ్చేదెవరూ యేదీ లేదని ఆ మధ్య ఓ తాతగారు బ్లాగ్లోకంలో ఓ పెద్ద టపా రాసేరండి కాబట్టి తోడూస్ గీడూస్ లు కుదరవు :)
మేమూ మీతో పాటే
ReplyDeleteదేముని దర్శించి , తీపి తినినట్లె , బుధా !
ధీ మహిమముతో వెన్కనె
పో మాడ్కి భ్రమించె మనసు , పుణ్య ప్రదాతా !
వెంకట రాజారావు . లక్కాకుల10 November 2024 at 18:52
Deleteఆనందం.
ధన్యవాదాలు.
చాలా బాగుంది శర్మ గారు మీ ఆలయాల టూర్ 🙏.
ReplyDeleteమామిడాడ అంటే గొల్లల మామిడాడే కదా ? ఈ గుళ్ళో సూర్యనారాయణుడు విగ్రహరూపంలోనే ఉంటాడా (సూర్యుడు కదా, అందువల్ల అడుగుతున్నానన్నమాట 🙂) ? ఆ ఊరి పేరు వినడమే గానీ నేనెప్పుడూ చూడలేదు లెండి.
పైన మీరు పెట్టిన ఫొటోల్లోని తాబేళ్ళు ఏ గుడి ప్రాంగణంలోనివి?
తిరుగు ప్రయాణంలో సాఫీగా ఉన్న రోడ్డు మీద తీసుకొచ్చిన ఆటోవాలా మీ ఊరి నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు కూడా ఆ మార్గాన్నే వెళ్ళుండచ్చు కదా గతుకుల రోడ్డు మీద వెళ్ళే బదులు ?
డిటెక్టివ్ హోమ్స్ :)
DeleteElementary, “Zilebi గారు” 🙂.
Delete
Deleteవిన్నకోట నరసింహా రావు11 November 2024 at 19:38
గొల్లల మామిడాడే నండి.
సూర్యనారాయణుడు విగ్రహరూపంలో బొద్దు మీసాలతో ఉషా,ఛాయా,పద్మిని,సౌఙా సమేత సూర్యనారాయణుడు పెద్దపెద్ద కళ్ళతో లోకాన్ని చూస్తున్నాడండి. అప్పటి చిత్రం జోడించా ఈటపాలో చూడండి. చూడవలసిన గుడి వీలుంటే, దగ్గరలో బిక్కవోలు గుడి చాళుక్య భీముని కాలం నాటిది అందుకే కుమార సుబ్రహ్మణ్యుడు అంటారు.
ఈ స్టార్ తాబేళ్ళు బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్యుని గుడిలోనూ గొల్లల మామిడాడ సూర్యనారాయణుని గుడిలోనూ ఉన్నాయండి. ఐతే బిక్కవోలు గుడిలో ఆవరణ మొత్తం తిరుగుతున్నాయి. మామిడాడ గుడిలో,గుడి వెనక మాత్రమే ఉన్నాయండి. కిందటి సారి వెళ్ళినప్పటికి లేవు.
గతుకులో రోడ్డులో వెళితే బలభద్రపురం సాయిబాబా గుడి చూడచ్చని మావాళ్ళలో కొందరు అలా ముందుకు నడిపారు. వచ్చేటప్పుడు మరే ఇబ్బందులు లేక నున్నటి రోడ్ పై పందలపాక మీదుగా కాలవగట్టు, పంటపొలాల మధ్యనుంచి వచ్చేసాం,ఆనందంగా. అదండి సంగతి.
ఇక అన్న ప్రసాదం ఒక సంఘం వారు నిర్వహిస్తున్నారు,దేవస్థానం కాదు. దేవస్థానం ఏ ప్రసాదమూ ఇవ్వదు.
ఓహో, బలభద్రపురం మీద నుంచి వెళ్ళారా. సాయిబాబా గుడే కాక అక్కడెక్కడో అయ్యప్ప గుడి కూడా ఉందనుకుంటాను.
Deleteమామిడాడ సూర్యనారాయణుడి చిత్రం మీరిప్పుడు పెట్టినది చూసాను. బాగుంది 🙏. అవునూ, మిమ్మల్ని గర్భగుడిలో ఫొటో తియ్యనిచ్చారా గుడివాళ్ళు ? ఆశ్చర్యమేనే ! దాదాపు ప్రతి గుడి దగ్గరా photography, videography not allowed అంటూ బోర్డు పెట్టుకు కూర్చుంటారుగా. అసలు గుడి ప్రాంగణంలోనే ఫొటోలు తియ్యనివ్వరుగా.
విన్నకోట నరసింహా రావు12 November 2024 at 10:40
Deleteఅవునండి అయ్యప్ప దేవాలయం మా వూరిదే! ఆ తరవాత బలభద్రపురం,ఆపై బిక్కవోలు,లోపలికెళితే గొల్లమామిడాడ.
కితం సారి వెళ్ళినది ఆగస్టు నెల, ఆరోజు వర్షం కూడా ఉంది. భక్తులు బహు పల్చగా ఉన్నారు. అంతేగాక ఆ రోజు నేను దర్శనానికి వెళ్ళినపుడు అర్చక స్వామి అక్కడ లేరు, సమయం కలిసొచ్చి ఇలాఫోటో తీసానండి. బిక్కవోలు వినాయకుని గుడిలో ఫోటో తీయనివ్వలేదు క్రిత్మ్ సారి,ఈ సారి దూరం నుంచే తీసేను. బోర్డులు మామూలేనండి.
అసలు భండారు వారి బ్లాగులో మనం మనం కామెంట్లు పెట్టుకోవడం, జవాబులిచ్చుకోవడం, పరస్పరం ఛలోక్తులు విసురుకోవడం ….. అవసరమా ? వారొక మౌనముని కదా, మరి మన బోంట్లకెందుకీ బ్లాగుశోష ?
ReplyDeleteఎందుకంటే ఏమి చెప్పను
ReplyDeleteఎందుకంటే ఎలా చెప్పను :)