Tuesday, 12 November 2024

బుర్రలో గుంజుంటే

బుర్రలో గుంజుంటే

బతకడానికి,  బతికించడానికి,ఉపాధి కల్పించడానికి, పెద్ద చదువే అక్కరలేదు.   శేషప్ప కవిగారు ఎప్పుడో చెప్పేరు 'అధిక విద్యావంతులప్రయోజకులైరి ' అని. సామాన్య చదువు చాలు గాని, కావలసినది  బుర్రలో గుంజు, బతకాలి, పదిమందిని బతికించాలనే తపనుండాలి,స్వార్ధం కాదు.  

బుర్రలో గుంజుంటే బూడిదమ్ముకు బతకొచ్చని చాలాకాలం కితమే చెప్పేను. ప్రపంచంలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్నవారు,అధిక ధనవంతులు అందరూ ఎక్కువ చదువులేనివారే!  పెద్దచదువులు చదివినవారు తమ తల తాకట్టులో పెట్టుకుంటారు. స్వతంత్రంగా ఆలోచనలు పుట్టవు. బానిస బతుకులు వెళ్ళదీస్తుంటారు. 

పెద్ద చదువులేదని బాధపడద్దు. డబ్బు సంపాదించడానికి గాడిదలు కాయచ్చు. బూడిదమ్ముకు  బతకొచ్చు. ఆకులు కూడా అమ్ముకు బతకొచ్చు. పదిమందికి ఉపాధి కల్పించచ్చు. ఆకులా? ఈసడించకండి. అవును ఆకులే. ములగచెట్లు పెంచండి. ములాగకు అమ్ముకు బతకొచ్చు. ములగాకుకి విదేశాల్లో కావలసినంత డిమాండు,  అలాగే కరివేపాకు కూడా. ఇవి రెండూ నిత్య డాలర్ల పంట. 

మీరే  చెయ్యచ్చుగా, చచ్చు కొచ్చను ఒక మేధావినుంచి.   నా జీవితం గడచిపోయింది.నాకిక డబ్బూ అవసరం లేదు. మరొకరికోసం డబ్బు సంపాదించను. సంపాదించే ఓపికాలేదు. సంతృప్తి చెందాను. 

 ఒకప్పుడు నిశాని, అంటే చదువులేనివాడు,వేలిముద్ర తప్ప తన సంతకం చేయలేనివాడు, ఒక నిరుపేద మొక్కలు అమ్ముకుని బతకడం ప్రారంభించాడు,కడియం లో, ఊరూర కావిడిలో మొక్కలు పెట్టుకుని అమ్ముకునేవాడు, ఆ తరవాత లారీలకొద్దీ మొక్కలు ఎగుమతి చేసే స్థితికి ఎదిగాడు, ఆ తరవాత వేగన్లకొద్దీ మొక్కలు ఎగుమతి చేసేవాడు. ఎంతో మందికి ఉపాధి కల్పించాడు.అంతేనా ఇతన్ని చూసి మరికొంతమంది మొక్కలు పెంచడం అమ్మడం మొదలెట్టేరు. ఇప్పుడా వ్యాపారం ఒక 1000 చదరపు కిలో మీటర్ల పైగా విస్తీర్ణానికి చేరుకుంది. వేలకొద్దీ జనాలకి ఉపాధి సంవత్సరం పొడుగునా దొరికింది. తరవాత తరాల్లో పిల్లలు బోటనీ మైన్ గా విద్య అభ్యసించి ఆ వ్యాపారాన్ని మరికొంత పెంచారు, ఇప్పుడక్కడ బోన్సాయి నుంచి,విదేశాల మొక్కలు కూడా పెంచే స్థాయికి,డ్రాగన్ ఫ్రూట్ ఉత్పత్తికి ఉపయోగపడుతున్నారంటే. ఒక చదువురాని నిశాని ఒక మంచి వ్యాపారం అభివృద్ధి చేసి చూపించి కాలం చేసేడు.    ఇప్పుడు కడియం మొక్కలకు ప్రసిద్ధి. కావల్సింది బుర్రలో గుంజు. దానితో కొన్ని తరాలని, వేలమందిని  బతికించే ఒక పరిశ్రమనే స్థాపించి పోయాడు.  అదీ కావలసింది. కట్,పేస్టు, కాపీ,పేస్టు  పి.హెచ్.డి ల మేధావులు సమాజం లో ఒకరిపై మరొకరిని రెచ్చగొట్టి ద్వేషం పెంచడం తప్పించి మరెందుకు పనికిరారు, ఎందుకూ పనికిరారు.

4 comments:

  1. కాపీ,పేస్టు పి.హెచ్.డి ల మేధావులు..

    బోనగిరి గారి గురించి ఇలా అనడం సబబు కాదేమోనండీ ?

    ReplyDelete
    Replies
    1. మధ్యలో బోనగిరి గారిని లాగి మీరో సమిధ వెయ్యడం మాత్రం సబబా?

      Delete

    2. Zilebi12 November 2024 at 10:19
      ఈ సందర్భం లో బోనగిరి గారిని ప్రస్తావించడం ఒక అప్రస్థుత అధిక ప్రసంగం. నువ్వు కట్,పేస్ట్ పి.హెచ్.డి మేధావివిగాని,ప్రొఫెసర్ వి గాని ఐ ఉంటావు. అంతేగాదు నీకు బుర్రలో గుంజు ఎప్పుడో ఎండిపోయింది, ఆ తరవాత దృష్టి కూడా పోయినట్టుంది, పోకేం జేస్తుందిలే, పాడుపనులు చేస్తే కళ్ళుపోతాయని పెద్దలు ఊరికే చెప్పేరా? నీలాటివాళ్ళని ఎంతమందిని చూసి చెప్పుంటారో!

      Delete

    3. విన్నకోట నరసింహా రావు12 November 2024 at 10:46
      పాడు పనులు చేయడం జిలేబి కి కొత్తకాదుగదు సార్! అప్రస్థుత, అధిక, అపహాస్య ప్రసంగి కదా! జిలేబి డి.ఎన్.ఎ యే అంత. తన అపహాస్యంతో ఎవరినైనా ఏమైనా అనగలదు.

      Delete