Friday, 27 December 2024

జరిగితే

జరిగితే జ్వరమంత సుఖం లేదు.


జరిగితే జ్వరమంత సుఖం లేదు.

విషం పని చేసినంత తొందరగా మందు పని చెయ్యదు.

గోచీకన్న దరిద్రం ప్రాణం పోవడం కంటే కష్టం లేవు.

సృష్టిలో మూడు జీవులే ఆహారాన్ని చేతితో తీసుకుని నోట్లో పెట్టుకుంటాయి. అవి మానవుడు,కోతి,ఏనుగు మాత్రమే.

పడిశం పదిరోగాల పెట్టు.


స్వగతం:- చలి,రొంప,దగ్గు, పులకరం,జ్వరం కాదు,నాలుగురోజులుగా బాధపెట్టేస్తున్నాయి జమిలిగా. ఇది జ్వరప్రేలాపన కాదు. 😊

4 comments:

  1. -
    చలి రొంప దగ్గు జ్వరమా
    పులకరము పిలవక నే గబుక్కున వచ్చాయ్
    కలవరమూ ప్రేలాపన
    తలపై నెక్కుచు సవారి తాజేసెనయో!


    త్వరగా కోలుకోండి
    ( ప్రేలాపనలు తగ్గుటకు)


    ReplyDelete
    Replies
    1. చలి రొంప దగ్గు జ్వరములు
      పులఖండ మధుర రసాల పోలి రమించున్
      తలపు పరమాత్మ పరమయి
      మెలగిన విబుధులకు , కష్టమేమి హరి దరిన్ .

      Delete
  2. రామ నామ జపము నేమమై మనసార
    ప్రాణ యామ మగుచు పరిఢవిల్ల
    రుజల భాద లెల్ల రూపు మాసి చనును
    వేద విదులు తమకు వివర మేల ?

    ReplyDelete
  3. అసలే మీది తుపాను బాధిత ప్రాంతం.
    జరిగితే జ్వరమంత సుఖం లేదు (🙂) అనుకుంటూ అలక్ష్యం చెయ్యక తగు జాగ్రత్లలు, మందులు, విశ్రాంతి తీసుకుంటుంటే త్వరగా కోలుకుంటారు లెండి. Wish you speedy recovery 👍.

    ReplyDelete